aamir khan

రాజమౌళి విడుదల చేసిన ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ ట్రైలర్‌

Updated By ManamThu, 09/27/2018 - 12:26

Thugs Of Hindostanఅమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్, ఫాతిమా సనా షేక్, కత్రినా కైఫ్ తదితరులు ముఖ్య పాత్రలలో నటించిన చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందోస్థాన్’. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌ను దర్శకధీరుడు రాజమౌళి విడుదల చేశాడు. భారీ యాక్షన్ సన్నివేశాలతో వచ్చిన ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రముఖ రచయిత ఫిలిప్ మీడోస్ టేలర్ రచించిన కన్ఫెషన్స్‌ ఆఫ్ ద థగ్ అనే నవల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహించారు. ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ చిత్రానికి అజయ్-అతుల్ సంగీతం అందించారు. తెలుగు, తమిళం, హిందీలో దీపావళి కానుకగా నవంబర్ 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.శత్రువులు, మాజీలు అందరూ ఒకే ఫొటోలో

Updated By ManamThu, 09/27/2018 - 10:45
Bollywood Stars

మామూలుగా శత్రువులు, మాజీ లవర్లు ఒకరికొకరు ఎదురుపడితే పలకరించుకోవడమే కష్టమే. కానీ ఇక్కడ మాత్రం అందరూ కలిసిపోయారు. అంతేకాదు హుషారుగా ఎంజాయ్ చేస్తూ ఫొటోలకు పోజ్‌లు ఇచ్చారు. బాలీవుడ్ హీరోలు షారూక్ ఖాన్, ఆమిర్ ఖాన్, రణ్‌బీర్ కపూర్, రణ్‌వీర్ సింగ్, హీరోయిన్లు అలియా భట్, దీపికా దర్శకనిర్మాత కరణ్ జోహార్ వీరందరూ ఒకే చోట కలిశారు. ఇంకేముంది అల్లరి అల్లరి చేస్తూ ఫొటోలు తీసుకున్నారు. ఇలా వీరందరూ కలిసి ఉన్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుండగా.. అందరినీ ఆకట్టుకుంటోంది.

కాగా షారూక్ ఖాన్, ఆమిర్ ఖాన్‌ల మధ్య ఒకప్పుడు విబేధాలు ఉండేవి. ఈ ఇద్దరు ఒకరి గురించి మరొకరు మాట్లడటానికి కూడా ఇష్టపడేవారు కాదు. అలాంటిది రెండు సంవత్సరాల క్రితం దుబాయ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కలిసిపోయి, తమ ఫ్రెండ్‌షిప్‌ను చాటుకున్నారు. అంతేకాదు ఆ తరువాత కూడా ఒకరికి మరొకరు మద్దతును తెలుపుకుంటూ కలిసిపోయారు. ఇక రణ్‌వీర్ సింగ్‌తో ప్రేమలో పడకముందు దీపికా పదుకునే రణ్‌బీర్ కపూర్‌తో ప్రేమాయణం కొనసాగించిన విషయం తెలిసిందే. అయితే విబేధాల కారణంగా రణ్‌బీర్‌తో విడిపోయినప్పటికీ.. ఇటీవల ఈ ఇద్దరు ఓ చారిటీ కోసం కలిసి ర్యాంప్ వాక్ చేశారు. అంతేకాదు ఫొటోగ్రఫీ డే రోజు రణ్‌బీర్‌తో ఉన్న ఫొటోను షేర్ చేసిన దీపికా.. తాము మంచి స్నేహితులమని చెప్పకనే చెప్పింది.తెలుగులో ‘థగ్స్ ఆఫ్ హిందోస్థాన్’.. ప్రోమో విడుదల

Updated By ManamWed, 09/26/2018 - 12:42

Thugs Of Hindostanబాలీవుడ్ టాప్ హీరోలు అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్ మొదటిసారి కలిసి నటిస్తున్న చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందోస్థాన్’. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహించగా.. యశ్‌రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్యచోప్రా నిర్మించారు. కత్రినా కైఫ్, దంగల్ బ్యూటీ ఫాతిమా సనా షేక్ హీరోయిన్లుగా నటించారు. కాగా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. హిందీతో పాటు దక్షిణాది భాషలైన తెలుగు, తమిళంలో విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ ప్రోమోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అందులో అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్ తెలుగులో తమను పరిచయం చేసుకొని సినిమా చూడంటి అంటూ పిలుపునిచ్చారు. కాగా ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌లు అందరినీ ఆకట్టుకున్న ఈ చిత్ర ట్రైలర్ గురువారం ఈ మూవీ ట్రైలర్ రానున్న విషయం తెలిసిందే. 

 ‘ఫిరంగి’గా ఆమిర్.. ఫస్ట్‌లుక్ విడుదల

Updated By ManamMon, 09/24/2018 - 11:18
Firangi

బాలీవుడ్‌లో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందోస్థాన్’. అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా ఖాన్ ఇందులో ముఖ్యపాత్రలలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో అమితాబ్ ఖుదాభక్ష్‌గా, కత్రినా సురైయ్యగా, ఫాతిమా జఫీరాగా అందరినీ మెప్పించగా.. తాజాగా ఆమిర్ మొదటి లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అందులో ఫిరంగి అనే పాత్రలో ఆమిర్ ఖాన్ నటిస్తుండగా.. గుర్రం మీద జోకర్‌గా అందరినీ ఆకట్టుకుంటున్నాడు.

ఇక కన్‌ఫెషన్స్ ఆఫ్ ఎ థగ్ అనే నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్నాడు. 19వ శతాబ్ధంలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఆజాద్ అనబడే తెగ గురించి ఈ చిత్రంలో చూపించనున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో మొదటిసారిగా అమితాబ్, ఆమిర్ కలిసి నటిస్తున్నారు. యశ్‌రాజ్ ఫిలింస్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజయ్- అతుల్ సంగీతం అందిస్తుండగా.. దీపావళి కానుకగా నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.మత్తెక్కిస్తున్న కత్రినా ఫస్ట్‌లుక్

Updated By ManamFri, 09/21/2018 - 14:24
Katrina Kaif

బాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందోస్థాన్’. అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ ప్రధానపాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి తాజాగా కత్రినా కైఫ్ లుక్‌ను విడుదల చేశారు. సురైయ్యా అనే పాత్రలో కత్రినా కైఫ్ కనిపిస్తుండగా.. నర్తకిగా నిషా కళ్లతో పిచ్చెక్కిస్తోంది. ఇక ఈ చిత్రానికి విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తుండగా.. అజయ్, అతుల్ సంగీతం అందిస్తున్నారు. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్ అడ్వంచరస్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

 ‘యుద్ధనారి’గా ‘దంగల్’ బ్యూటీ.. వావ్ అనిపిస్తున్న ఫస్ట్‌లుక్

Updated By ManamWed, 09/19/2018 - 13:03
Fatima

అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ ప్రథాన పాత్రలలో విజయ్ కృష్ణ ఆచార్య తెరకెక్కిస్తున్న చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందోస్థాన్’. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై బాలీవుడ్‌లో చాలా అంచనాలే ఉన్నాయి. యాక్షన్ అడ్వేంచర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుండటం.. మొదటిసారి ఇందులో అమితాబ్, ఆమిర్ కలిసి నటిస్తుండటంతో అటు అభిమానులతో పాటు ఇటు విమర్శకులు కూడా సినిమాపై అంచనాలను పెట్టుకుంటున్నారు.

కాగా ఈ చిత్రంలో అమితాబ్‌కు సంబంధించిన లుక్ మంగళవారం విడుదల చేయగా.. తాజాగా ఫాతిమా సనా షేక్ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అందులో జఫీరాగా యుద్ధనారి లుక్‌లో దర్శనమిచ్చిన ఫాతిమా వాహ్వా అనిపిస్తోంది. ఇక ఈ చిత్రంలో ఆమె అమితాబ్ కుమార్తెగా నటించనుంది. కాగా యశ్‌చోప్రా బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.‘ఖుదాబక్ష్‌’గా మెగాస్టార్.. ఫస్ట్‌లుక్ రిలీజ్

Updated By ManamTue, 09/18/2018 - 12:01
Amitabh Bachchan

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ప్రధానపాత్రలలో నటిస్తున్న చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందోస్థాన్’. 1839లో ఫిలిప్ మేడోస్ టేలర్ రచించిన ‘కన్‌ఫెషన్స్ ఆఫ్ ఎ థగ్’ అనే నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విజయ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి తాజాగా అమితాబ్ ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఖుదాబక్ష అనే కమాండర్ పాత్రలో బిగ్ బీ కనిపిస్తుండగా.. ఆయన ఆహార్యం కొత్తగా అందరినీ మెప్పిస్తోంది. ఇక కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్, రోనిత్ రాయ్ తదితరులు ముఖ్యపాత్రలలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా నిర్మిస్తుండగా.. దీపావళి కానుకగా నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.థగ్స్ ఆఫ్ హిందోస్థాన్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్

Updated By ManamMon, 09/17/2018 - 15:09

Thugs Of hindostanఅమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్ ప్రథానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందోస్థాన్’. యాక్షన్ అండ్వేంచర్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ చిత్రానికి విడుదల తేదిని తాజాగా వెల్లడించింది చిత్ర యూనిట్. దీపావళి కానుకగా నవంబర్ 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది. ఇక కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్, రోనిత్ రాయ్ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి అజయ్- అతుల్ సంగీతం అందిస్తుండగా.. యశ్‌రాజ్ ఫిలింస్‌ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నాడు.జాతీయ అవార్డు గ్రహీత ప్రాణం కాపాడిన ఆమిర్

Updated By ManamMon, 09/10/2018 - 13:00

Aamir Khanతన సినిమా కోసం పనిచేసిన జాతీయ అవార్డు గ్రహీత ప్రాణాన్ని బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్‌ కాపాడారు. దీంతో సోషల్ మీడియాలో ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. కాగా ఆమిర్ నటించిన ‘దంగల్‌’ చిత్రానికి పనిచేసిన సౌండ్ డిజైనర్ సాజిత్ కోయేరి తీవ్ర అస్వస్థతకు గురై గురువారం ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. అయితే అక్కడున్న డాక్టర్లు కనీసం ట్రీట్‌మెంట్ ఇవ్వకుండా అతడిని అలానే వదిలేశారు. దీంతో అతడి పరిస్థితి క్షీణిస్తుండటంతో ఏమీ చేయాలో పాలుపోని సాజిత్ కుటుంబసభ్యులు ఆమిర్‌ను ఆశ్రయించారు.

విషయం తెలుసుకున్న ఆమిర్ వెంటనే సాజిత్‌ను కొకిలాబెన్ ఆసుపత్రికి మార్పించడమే కాకుండా.. అనిల్ అంబానీతో మాట్లాడి అత్యవసర చికిత్స అందేలా చర్యలు తీసుకున్నాడు. దీంతో కోలుకున్న సాజిత్.. పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆమిర్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కాగా ‘బర్ఫీ’, ‘హైదర్’, ‘ఓంకార’, ‘దంగల్’ వంటి హిట్ చిత్రాలకు సాజిత్ పనిచేశాడు. ఓంకార చిత్రానికి గానూ ఆయనకు జాతీయ అవార్డు కూడా లభించింది.ఆమిర్ చేతిలో ‘మహాభారతం’.. నెక్ట్స్ ప్రాజెక్ట్ అదేనా..?

Updated By ManamMon, 08/06/2018 - 12:56

Aamir Khanమహాభారతం.. భారతదేశంలోని చాలా మంది నటీనటులు, దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. అందులో రాజమౌళి, ఆమిర్ ఖాన్, మోహన్‌లాల్ తదితరులు ఉన్నారు. ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించాలని రాజమౌళి ఒకసారి తెలపగా.. ఏదో ఒకరోజు మహాభారతం చేయాలనుందని ఆమిర్ కూడా పేర్కొన్నారు. అంతేకాదు ఈ ఇద్దరి కాంబినేషన్లోనే ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుందని వార్తలు కూడా వచ్చాయి. అయితే దానికి సంబంధించిన పనులు మాత్రం ఇప్పటికీ ప్రారంభం కాలేదు. కానీ తాజాగా ఆమిర్‌ను చూస్తుంటే ఆ ప్రాజెక్ట్‌ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లేలా ఉంది. 

వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఆమిర్‌ఖాన్ ఓ బుక్ పట్టుకొని కనిపించారు. దానిమీద ‘కండెన్స్‌డ్ మహాభారత ఆఫ్ వ్యాస’ అని రాసి ఉంది. దీంతో ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించేందుకు ఆమిర్ ఖాన్ సిద్ధమయ్యాడని పలువురు బాలీవుడ్ ప్రముఖులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే మహాభారతాన్ని తెరకెక్కిస్తే అందుకు వెయ్యి కోట్లు ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే.

Related News