పోలవరం ఓ చరిత్ర: లోకేశ్

Updated By ManamWed, 09/12/2018 - 16:02

Polavaram Project, Lokesh Babu, Project prices, పశ్చిమగోదావరి: పోలవరం ప్రాజెక్టు ఓ చరిత్రని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ప్రాజెక్టులు కట్టాలంటే తరాలు మారిపోవడం ఆనవాయితీని, కానీ, పోలవరాన్ని నాలుగేళ్లలో ఓ రూపునకు తెచ్చామన్నారు. కేంద్రం వేసే కొర్రీలన్నింటికీ సమాధానం చెబుతున్నామని లోకేశ్ తెలిపారు. నిర్మాణ జాప్యంతో ప్రాజెక్టు ధరలు పెరుగుతాయని లోకేశ్ చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ పొత్తుపై అసదుద్దీన్ ఫైర్..

Updated By ManamSat, 09/08/2018 - 20:01

MIM President Asasduddin Owasi, Congress, TDP alliance, KCR, హైదరాబాద్: కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ ఆ పార్టీతో ఎలా పొత్తు పెట్టుకుంటుందో చెప్పాలని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం ఎక్కడ పోయిందని ఆయన ప్రశ్నించారు. శనివారం అసదుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, టీడీపీ పొత్తును రాష్ట్ర ప్రజలు తిప్పికొడతారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ పూర్తి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. మరోసారి కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిపారు. తమకు పదవులపై ఎప్పుడూ ఆశ లేదని ఓవైసీ స్పష్టం చేశారు. మైనార్టీలు, బలహీనవర్గాల కోసం తమ పార్టీ ఎల్లప్పుడూ పాటుపడుతుందనే ఉంటుందని చెప్పారు.

ఎంతో విశ్వాసం ఉండడం వల్లే టీఆర్‌ఎస్ పదవీకాలం ఉన్నా ఎన్నికలకు సిద్ధమైందని కొనియాడారు. ఈ విషయంలో ఇతర రాజకీయ పార్టీలయితే ఒక్క రోజు కూడా తమ పదవిని వదులుకునేందుకు ఇష్టపడరని అన్నారు. కేసీఆర్‌కు రాష్ట్రంలో పాపులారిటీ చాలా ఎక్కువగా ఉందని ప్రశంసించారు. టీఆర్‌ఎస్, ఎంఐఎంను ఒంటరిగా ఢీకొనే దమ్ములేక పొత్తుల కోసం టీడీపీ, కాంగ్రెస్ పాకులాడుతున్నాయని అసదుద్దీన్ విమర్శించారు. ఒక్కరోజు రైతుగా సీఎం..

Updated By ManamSat, 08/11/2018 - 21:27
  • రైతులతో పాటు పొలంలో వరినాట్లు వేసిన కుమారస్వామి

  • మండ్యం జిల్లాలో పర్యటించిన కర్ణాటక ముఖ్యమంత్రి 

CM HD Kumaraswamy, participates in paddy sowing program, బెంగళూరు: కర్ణాటక సీఎం కుమారస్వామి ఒక్కరోజు రైతుగా అవతరమెత్తారు. రైతులతో పాటు పొలంలో దిగి వరినాట్లు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు రైతుల పక్షం నిలబడుతుందనే సందేశం ఇచ్చేందుకు సీఎం రైతులతో మమేకమయ్యారు. మండ్య జిల్లాలో శనివారం పర్యటించిన ఆయన సీతాపుర గ్రామంలోని రైతులతో కలిసి పంట పొలానికి వెళ్లారు. అక్కడి రైతుకూలీలతో కలిసి వరినాట్లు వేశారు. తరువాత రైతులతో కలిసి ఆయన భోజనం చేశారు. ఈ సందర్భంగా పంట రుణాలు, వర్షాలు, గిట్టుబాటు ధరల గురించి రైతన్నలను ఆరా తీశారు. సీఎం కుమారస్వామితో పాటు జేడీయూ కార్యకర్తలు, 150 మంది రైతులు ఉన్నారు.

రైతులకు అవసరమైన సహాయం చేసేందుకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటానని సీఎం హామి ఇచ్చారు.  ‘నేను ఓ రైతునే. మా నాన్న దేవె‌గౌడ కూడా పేద రైతు. రైతుల సమస్యలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. నేను యువకుడిగా ఉన్న సమయంలో వ్యవసాయం చేశాను. 25 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఒక రైతుగా పొలంలో అడుగుపెట్టాను. చాలా సంతోషంగా ఉంది’ అని సీఎం కుమారస్వామి చెప్పారు. భార్య బాధితులుగా...

Updated By ManamSat, 08/11/2018 - 19:08

Varun tej, Victory Venkatesh, Dilraju, F2, Anil ravipudi, అగ్ర కథానాయకుడు వెంకటేశ్, యువ కథానాయుకుడు వరుణ్‌తేజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ ట్యాగ్ లైన్‌. అనిల్ రావిపూడి దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేుషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూర్తిస్థాయి ఎంట‌ర్‌టైనర్‌గా సినిమాను రూపొందిస్తామని దర్శక నిర్మాతలు ముందు నుండే చెబుతున్న సంగతి తెలిసిందే.

ఇందులో వెంకటేశ్, వరుణ్‌తేజ్ భార్యా బాధిత భర్తల పాత్రల్లో కనిపిస్తారు. భార్యల పెట్టే ఇబ్బందులతో ఫ్రస్ట్రేట్ అయిపోయి వీరిద్ద‌రూ బ్యాంకాక్ వెళతారు. అక్కడ వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయునేదే అసలు కథట. ఈ చిత్రంలో వెంకటేశ్ జోడిగా తమన్నా.. వరుణ్ తేజ్ జోడిగా మెహరీన్ నటిస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాదారులకు శుభవార్త

Updated By ManamMon, 08/06/2018 - 20:57

HDFC Bank, Revise Fixed Deposit, Interest Rates, న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాదారులకు శుభవార్త. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేశారా? అయితే మీ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంకు వడ్డీరేటును పెంచింది. ప్రస్తుతం ఉన్న దానిపై 0.6శాతం వడ్డీరేటును పెంచుతున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వెల్లడించింది. తద్వారా పెంచిన రేట్లును సోమవారం నుంచే అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది. తాజాగా పెంచిన వడ్డీరేట్లు ఆరు నెలల ఒకరోజు నుంచి 5 సంవత్సరాల డిపాజిట్లపై వర్తిస్తాయి. ఇకపై 6 నెలల నుంచి 9 నెలల వ్యవధి కలిగిన డిపాజిట్లపై 6.75శాతం వడ్డీరేటు లభించనుంది. 9 నెలల మూడు రోజుల నుంచి ఏడాది కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.25 శాతం వడ్డీ రేటును పొందవచ్చని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది.

రెండు సంవత్సరాల ఒక రోజు నుంచి 5ఏళ్ల కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై గతంతో పోలిస్తే 10 బేసిస్‌ పాయింట్లను పెంచింది. తద్వారా ఖాతాదారులు వడ్డీని కూడా పొందవచ్చు. కాగా, జులై 30 నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఆర్‌బీఐ సమీక్ష జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమీక్షలో ఆర్బీఐ పావు శాతం మేర (రెపో రేటు 6.5 శాతానికి, రివర్స్‌ రెపో రేటు 6.25 శాతం చేరాయి) రేట్ల పెంపునకు పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) నిర్ణయం తీసుకుంది. 
HDFC Bank, Revise Fixed Deposit, Interest Rates, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద హైఅలర్ట్

Updated By ManamSun, 08/05/2018 - 09:49

Sriram Sagar Project, Huge police deployed, Armour division 144 section, నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాల్కొండ, కోరుట్ల నియోజకవర్గాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ప్రాజెక్టుతో పాటు ఆయకట్టు గ్రామాల్లో రైతులు ఆందోళనకు దిగడంతో 20 గ్రామాల్లో రెండు వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు వద్ద బారికేడ్లను సైతం సిద్ధం చేశారు. ఎస్సార్‌ఎస్పీ పరిసర ప్రాంతాలను పూర్తిగా పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.

ప్రాజెక్ట్ వైపునకు రైతులు, పర్యాటకులను సైతం పోలీసులు అనుమతించడం లేదు. ఆర్మూర్ డివిజన్ పరిధిలో 144 సెక్షన్ అమలు చేశారు. శ్రీరాంసాగర్‌ నుంచి నీటి విడుదల లేదని ప్రజాప్రతినిధులు తేల్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నీటి నిల్వ తక్కువగా ఉన్నందున తాగునీటి అవసరాల నిమిత్తం వాడాలని, ప్రాజెక్టుకు వరద నీరు వస్తే విడుదల చేయాలని నిర్ణయించారు. దీంతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు వద్ద ఆందోళనకరంగా మారింది.   'వారిపై అనర్హత వేటు వేస్తేనే అసెంబ్లీకి వస్తాం'

Updated By ManamSun, 03/04/2018 - 11:44

YSRCP, AP speaker, Vijayasai reddy, విజయవాడ: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీ అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తేనే ఎల్లుండి అసెంబ్లీకి వస్తామని వైసీపీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విజయసాయి రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ.. రెండు విషయాలపై రెండోసారి వినతిపత్రమిచ్చామని చెప్పారు. 22మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరామన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటే  ఈ నెల 6న అసెంబ్లీకి హాజరవుతామని తేల్చి చెప్పారు. రెండేళ్లకు పైగా శిక్ష పడ్డ చింతమనేని ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా పేర్కొన్నారు. చింతమనేని స్థానాన్ని ఖాళీగా పేర్కొంటూ స్పీకర్ నోటిఫై చేయాలని విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు. సుప్రీం ఉత్తర్వుల ప్రకారం స్పీకర్ వ్యహరించాలన్నారు. మూడో కూటమిపై కేసీఆర్ స్పష్టంగా మాట్లాడలేదని విమర్శించారు. అవిశ్వాసం చీప్ ట్రిక్స్ అని కేసీఆర్ అనడంపై పవన్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 21న అవిశ్వాసం సరికాదంటున్న పవన్ ఎప్పుడు పెట్టాలో చెప్పాలని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.సోషల్ మీడియాకు అనసూయ స్వస్తి?

Updated By ManamWed, 02/07/2018 - 18:12

Anchor Anasuya, Anasuya Social media accounts, TV anchor Anasuya, హైదరాబాద్: ప్రముఖ టీవీ యాంకర్ అనసూయ సోషల్ మీడియాకు ఇక స్వస్తి పలికినట్టు కనిపిస్తోంది. తనతో ఫోటో తీసుకోవడానికి ప్రయత్నించిన ఓ బాలుడి ఫోన్‌ను పగలగొట్టారంటూ అనసూయపై అతడి తల్లి కేసు పెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై ట్విట్టర్ వేదికగా అనసూయ వివరణ ఇచ్చుకున్నప్పటికీ.. ఈ ఘటనకు సంబంధించి పలువురు నెటిజన్ల నుంచి కామెంట్లు కుప్పలుతెప్పలుగా వచ్చిపడుతున్నాయి. విపరీతంగా కామెంట్లు వస్తుండటంతో విసుగుచెందిన అనసూయ సోషల్ మీడియా నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు సోషల్ మీడియాలో కనిపించడం లేదు. గతంలో కూడా కొందరు సోషల్ మీడియాలో తనపై అసభ్యకరమైన కామెంట్లు చేస్తున్నారని అనసూయ వాపోయిన సంగతి విదితమే. 
(..అనసూయ గలీజు మాటలు మాట్లాడింది..)
(..యాంకర్ అనసూయపై పోలీసు కేసు..)
(..ఫోన్ పగలగొట్టిన ఘటనపై అనసూయ స్పందన..)'పవన్‌ పర్యటనను అడ్డుకుంటాం'

Updated By ManamSun, 01/21/2018 - 20:24

Pawan kalyan, Ponnam Prabhakar, Pawan telangana tour, Kondagattu temple visit, కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రంలో రేపటి (సోమవారం) నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పర్యటన ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కొండగట్టు పర్యటనను అడ్డుకుంటామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పవన్ మాట్లాడిన మాటలు ఉపసంహరించుకున్న తర్వాతే కొండగట్టులో అడుగుపెట్టాలని డిమాండ్‌ చేశారు.  కొండగట్టులో మొక్కు తీర్చుకునేందుకు పవన్ వస్తే తమకు అభ్యంతరం లేదు కానీ, రాజకీయ మనుగడ కోసం వస్తే ఊరుకోమని హెచ్చరించారు. మేడారం జాతర సందర్భంగా కొండగట్టు రద్దీ పెరిగిన నేపథ్యంలో పవన్ పర్యటనకి ఎలా పర్మిషన్ ఇచ్చారని ప్రశ్నించారు.  

కేసీఆర్- పవన్ మధ్య కుదుర్చుకున్న చీకటి ఒప్పందాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ వ్యతిరేక ఓటుని చీల్చడానికే పవన్ కొండగట్టు వస్తున్నాడని విమర్శించారు. తెలంగాణాని వ్యతిరేకించిన పవన్ వస్తే రెడ్ కార్పేట్ పరుస్తారా అంటూ పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొ. కోదండరాం పర్యటనకు పర్మిషన్ ఇవ్వరు, కానీ, పవన్ పర్యటన చేస్తానంటే ఎలా పర్మిషన్‌ ఇస్తారని పొన్నం ప్రభాకర్ నిప్పులు చెరిగారు. కాగా, పవన్ కల్యాణ్ తన యాత్ర పర్యటన వివరాలను కొండగట్టులో సోమవారం ప్రకటిస్తానని చెప్పిన సంగతి విదితమే. 

Related News