Switzerland

స్విట్జర్లాండ్‌లో శ్రీదేవి విగ్రహం

Updated By ManamSun, 09/09/2018 - 13:44

Switzerland, Sridevi statue, Switzerland tourism industry, Indian film shot అతిలోక సుందరి శ్రీదేవి విగ్రహాన్ని స్విట్జర్లాండ్‌లో ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకులకు స్వర్గధామంగా నిలిచిన ఆ దేశం.. శ్రీదేవికి నివాళిగా ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆ దేశ రాయబారి అధికారి ఒకరు వెల్లడించారు. కాగా శ్రీదేవి విగ్రహానికి అక్కడ ప్రతిష్టించేందుకు కారణం కూడా ఉంది. ఆమె నటించిన పలు బాలీవుడ్‌ చిత్రాల్లో పాటలు చాలా వరకూ స్విట్జర్లాండ్‌లోనే చిత్రీకరించారట. 

అందుకే ఆమె విగ్రహాన్ని అక్కడ నెలకొల్పాలని ఆ దేశం భావిస్తోంది. అంతేకాకుండా శ్రీదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని స్విట్జర్లాండ్... ఓ హానర్‌గా భావిస్తోంది. అలాగే ఆమె కెరీర్‌లో బిగ్ హిట్‌‌గా నిలిచిన ‘చాందినీ’ చిత్రాన్ని చాలాభాగం ఇక్కడే చిత్రీకరించారు. శ్రీదేవికి నివాళిగా విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఆ దేశ పర్యాటక శాఖ నిర్ణయించింది.

ఇప్పటికే స్విట్జర్లాండ్‌ ప్రభుత్వం ప్రముఖ నిర్మాత యాష్ చోప్రా విగ్రహాన్ని 2016లో  ఇంటర్‌లేకెన్‌లో ఏర్పాటు చేశారు. కాగా యాష్ చోప్రా నిర్మించిన చిత్రాల్లో చాలా వరకూ ఇక్కడే షూటింగ్ జరుపుకున్నాయి. అలాగే చోప్రా పేరు మీద కొన్ని రైళ్లు కూడా ఉన్నాయి. బాలీవుడ్ సినిమాలను ఇక్కడ చిత్రీకరించిన తర్వాత ఆ దేశ టూరిజం విపరీతంగా అభివృద్ధి చెందింది. 



మోదీజీ.. బ్లాక్ మనీ ఎంత పట్టుకొచ్చారు!

Updated By ManamWed, 01/24/2018 - 19:42

black money back, Switzerland, Rahul Gandhi, PM Modiన్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై వ్యంగస్త్రాలు సంధించారు. ‘మోదీజీ.. స్విట్జర్లాండ్‌ నుంచి తిరిగి స్వాగతం. స్విస్‌లో దాచిన బ్లాక్ మనీని తిరిగి భారత్ రప్పిస్తానని మీరు ఇచ్చిన హామీని ఓసారి గుర్తుచేసుకోండి. స్విస్ నుంచి మీతోపాటు విమానంలో ఎంత బ్లాక్ మనీ పట్టుకుస్తున్నారోనని ఇక్కడ యువత ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది’ అంటూ ట్విట్టర్ వేదికగా రాహుల్ వ్యంగస్త్రాలు విసిరారు.

ప్రపంచ వార్షిక ఆర్థిక సదస్సుకు హాజరయ్యేందుకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు ఇటీవల ప్రధాని మోదీ వెళ్లిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మోదీ ప్రభుత్వం దేశంలో బ్లాక్ మనీని అరికట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. భారత్‌కు సంబంధించిన బడాబాబులు కూడబెట్టిన బ్లాక్ మనీ స్విస్ బ్యాంకులో మూలుగుతోందని.. ఆ నల్లడబ్బును ఎలాగైనా స్విస్ నుంచి భారత్‌కు రప్పిస్తానని మోదీ నొక్కివక్కానించిన సంగతి తెలిసిందే.

కాగా, 2016లో భారతీయుల స్విస్ బ్యాంకుల్లో ఖాతాలకు సంబంధించి సమాచార మార్పిడిపై భారత్, స్విట్జర్లాండ్ మధ్య ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఒప్పందం ప్రకారం.. సెప్టెంబర్ 2019 నుంచి స్విస్ బ్యాంకులు స్వయంచాలికంగా భారతీయుల బ్యాంకు ఖాతాల సమాచారాన్ని బహిర్గతం చేయనున్నాయి.





Related News