jr ntr

హిట్.. ఫ్లాప్.. పెద్దగా పట్టించుకోను

Updated By ManamWed, 10/10/2018 - 01:14

‘‘రైటర్, డైరెక్టర్ అని నన్ను నేను రెండుగా విభజించి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకటే సినిమాల్లోలాగా నేను ఇద్దరిని కాదు. ఒక సినిమాను డైరెక్ట్ చేసినప్పుడు అందులో నేను డైలాగులు బాగా రాశాననే అంటే.. అంత మాత్రాన దాన్ని నెగటివ్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగనిదాన్ని కిరీటంగా భావించాల్సిన పనిలేదు’’ అంటున్నారు మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన దర్శకత్వంలో వచ్చిన
 ‘అరవింద సవేుత’ విడుదల సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఇంటర్వ్యూ...


ఆయనే ఫోన్ చేశారు...
image- సినిమా రిలీజ్ డేట్ ఆగస్ట్ 29న అనుకున్నాం. ఆ తర్వాత సినిమాను సమ్మర్‌లోనే రిలీజ్ చేయాలని నేను, నిర్మాత చినబాబుగారు అనుకున్నాం. జనవరిలో వేరే సినిమాలు ఉండటం వల్ల మార్చిలో సినిమాను విడుదల చేయాలనేది మా ఆలోచన. ఎన్టీఆర్ కుటుంబంలో విషాదం జరిగిన రోజు ఆయనతోనే ఉన్నాం. రెండో రోజు రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో ఎన్టీఆర్‌గారే ఫోన్ చేశారు. ‘ఎట్టి పరిస్థితుల్లో మనం అక్టోబర్ 11కే వస్తున్నాం. ఈ విషయాన్ని చినబాబుగారికి కూడా చెప్పండి’ అని అన్నారు. ‘ఇప్పుడేం పరావాలేదు.. పదిరోజుల తర్వాత మాట్లాడుకుందాం’ అని నేను అంటే ‘పదిరోజులా! అంత లేదు.. ఇప్పటికే షూటింగ్ ఆలస్యమైంది.. పూజా కూడా ఇక్కడే స్టే చేస్తుంది. మూడు రోజుల వరకు నేను బయటకు రాకూడదు’ అన్నారు. నాలుగో రోజు ఆయన సెట్‌కు వచ్చేశారు.  

అదే కొత్త కోణం అనిపించింది..
- నిజానికి ముందు ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేద్దామని అనుకోలేదు. రెండు మూడు ఐడియాలు వచ్చాయి. ఆ సమయంలో వచ్చిన ఆలోచన ఇది. ఒక గొడవ జరిగే ముందు.. గొడవ జరిగే సమయంలో విషయాలు గురించే ఎక్కువగా మాట్లాడుకుంటాం. ఘటన జరగడానికి ముందు.. తర్వాత యాక్షన్ మిక్స్ అవడంతో ఎమోషన్స్‌కు మనం కనెక్ట్ అవుతాం. ఇంతకు ముందు సక్సెస్ అయిన ఫ్యాక్షన్ సినిమాలను గమనిస్తే మనకు ఆ విషయం అర్థమవుతుంది. పోయినవాళ్ల ఫ్యామిలీలు.. ఉన్నవాళ్ల ఫ్యామిలీల గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది.. కచ్చితంగా కొత్త కోణం అవుతుందనిపించింది. ఆసక్తికరంగా ఉంటుందనిపించింది. గొడవల్లో ఇప్పటి వరకు ఆడవాళ్లను ఎవరూ ఇన్‌వాల్వ్ చేయలేదు. ఎందుకనో మనం ఇంట్లో ఆడవాళ్లను పెద్దగా పట్టించుకోం. అలా కాకుండా వాళ్లని కన్‌సిడర్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనను కథగా రాసుకుని ఎన్టీఆర్‌కు చెప్పాను. తనకు బేసిక్‌గా నా ఆలోచన నచ్చింది. 

అందరికీ నచ్చిన కాన్స్‌ప్ట్
- కోబలి సినిమా రీసెర్చ్ సమయంలో నేను కొంతమంది రాయలసీమ కవులను కలిశాను. తిరుమల రామచంద్రగారి imageసాహిత్యంతో పరిచయం ఏర్పడింది. నాకు భరణిగారు హంపి నుంచి హరప్పా దాకా ఉందని ఇచ్చారు. అక్కడ లాంగ్వేజ్, పడికట్టు ఏది తెలియాలన్నా ఇది చదివితే చాలని చెప్పారు. నేను అప్పటికే నామిని సాహిత్యానికి పెద్ద ఫ్యాన్‌ని. కాకపోతే ఆయన తాలూకు చిత్తూరు జిల్లా భాగం.  అక్కడ కరువు ప్రాంతం. అక్కడ ఫ్యాక్షన్, కక్షలు, కార్పణ్యాలు లేవు.  నాకు కడప, అనంతపూరు ఏరియాల్లో.. ఫ్యాక్షన్ ఉంది. ఇక్కడున్న కరువు ఫోర్స్‌డ్ కరువు. పెనిమిటి పాట కూడా ఈ ప్రాసెస్‌లోనే కుదిరింది.  అందరి ఆడవాళ్లకీ హీరో మదర్‌ని సింబలైజ్ చేశాం. నేను చెప్పగానే అందరికీ నచ్చిన కాన్సెప్ట్ ఇది. 

ఫ్యాన్స్ సినిమాకే..
బిగినింగ్‌లో కొంత కామెడీ ఉంటుంది. ఎక్కడా బలవంతంగా ఉన్నట్లు అనిపించదు. ఇంతకు ముందు బ్రహ్మానందంగారి లాంటి వారిని పట్టుకొచ్చి ఒక ఐటెమ్ చేసేవాళ్లం కదా.. అలా చేయదలచుకోలేదు. కొంచెం స్ట్రిక్ట్‌గా కథ ఏం చెబుతుందో అదే విందామని అనుకున్నా. సినిమాకు ఫ్యాన్స్ ఉంటారు గానీ, మనకుంటారని నేననుకోను. 

12 ఏళ్ల అనుబంధం...
imageఎన్టీఆర్‌తో 12 ఏళ్ల అనుబంధం.‘నాన్నకు ప్రేమతో’ నుంచి మొదలైంది... ఆయనేమో ఆ సినిమా చేస్తున్నారు. నేనేమో ‘అ..ఆ’ చేస్తున్నా. అప్పటి నుంచి ఇద్దరం కలిసి సినిమా చేయాలనే ఆలోచిన సీరియస్‌గా అనిపించింది. నాతో ఉన్న సమస్య అంటే రాత్రి నాకు ఏదో ఒక ఐడియా వస్తుంది.. లేచి కూర్చుని సూపర్ అని రాసుకుంటా. నిద్రలేచి చూస్తే నాకే సిగ్గుగా ఉంటుంది. ఈ ఐడియా ఎందుకు రాశానా? అని. అఫ్‌కోర్స్ నేను తీసిన సినిమాలు చాలా చూసినప్పుడు కూడా అనిపిస్తుంది కానీ.. ఇప్పుడు కూడా అనిపించింది. 

పెద్దగా పట్టించుకోను...
జయాపజయాలను పెద్ద పట్టించుకోను. నాకు ఏదైనా కొత్తగా చూసినప్పుడు, చదివినప్పుడు మాత్రమే  కిక్ వస్తుంది. హిట్, ఫ్లాప్‌లు పట్టించుకోనంటే అబద్ధమే. పట్టించుకుంటా. కానీ ఓ.. పిసికేసుకోను. నాకు ‘అత్తారింటికి దారేది’ వచ్చినప్పుడు  అలాగే ఉంటా. ‘అజ్ఞాతవాసి’ వచ్చినప్పు డూ అలాగే ఉంటా. ఫ్లాప్ అయినప్పుడు బాధపడతా. కాకపోతే ఓ రెండు, మూడు రోజులు.. అంతే. అయిపోయిన తప్పులు మనకు తెలుస్తాయి. చూడకూడదనుకుంటే ఎప్పటికీ చూడం. తెలుసుకోవాలనుకుంటే మాత్రం వెంటనే తెలుస్తుంది. దానికి ఎక్కువ సమయం పట్టదు. డస్ట్ బిన్ మెళ్లో వేసుకుని తిరగడం దేనికి.. ఫ్లవర్ బొకే అయితే తిరుగుతాం. సినిమా నచ్చడానికి లక్ష కారణాలుంటాయి. నచ్చకపోవడానికి లక్ష కారణాలుంటాయి. దాని గురించి మనం ఏమీ మాట్లాడలేం. మాట్లాడేకొద్దీ మనం వీక్ అవుతామే తప్ప, ఇంకేమీ జరగదు. 

ఎవరూ తక్కువ వాళ్లు కారు...
మీతో ఎలా ఉన్నానో.. నా హీరోలతో కూడా అలాగే ఉంటాను. నేను తెలివితేటలు చూపిస్తే వాళ్లు ఇంకెన్ని తెలివిimage తేటలు చూపించాలి. నేను పనిచేసిన ఎవరూ కూడా తక్కువ వాళ్లు కాదు. సురేశ్‌బాబుగారు, స్రవంతి రవికిషోర్, అల్లు అరవింద్.. అందరూ ఎన్నో ఎత్తు పల్లాలను చూసినవాళ్లే. మనం వెళ్లి కూర్చుని మొదలుపెట్టగానే మన మైండ్‌లో ఏముందో.. స్క్రిప్ట్ సేల్ చేయడానికి వస్తున్నాడా..? కథ చెప్పడానికి వస్తున్నాడా? కూడా చెప్పేయగలరు. 
 

అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు
మామూలుగా సునీల్  గత రెండేళ్లుగా ‘నేను ఇందులో బంధీనైపోయాను. ఎలాగైనా బయటపడాలి. ఏదో ఒకటి చేయాలి అని..’ అంటూనే ఉన్నాడు. అప్పుడు నేనన్నా.. ‘అది నేచురల్‌గా జరుగుతుంది. నువ్వు పెద్దగా దాని గురించి ఆలో చించకు. నీ చేతిలో ఉన్న కమిట్‌మెంట్స్ అన్నీ ముందు పూర్తి చెయ్. ఆ తర్వాత హీరోగా కొత్తవేవీ ఒప్పుకోవద్దు. అప్పుడు నేచురల్‌గా ఎందుకు జరగదో చూద్దాం’ అని అన్నా. నేచురల్ గానే మా కన్నా ముందే ‘సిల్లీఫె లోస్’ మొదలైం ది. విడుదలైంది. ఎప్పుడైతే సునీల్ మెంటల్‌గా దాన్నుంచి బయటికి వచ్చాడో, అప్పుడే ఆటోమేటిక్‌గా అందరికీ తెలిసిపోయింది. అలాంటివి మనం చెప్పాల్సిన పనిలేదు. అందరికీ ఇట్టే తెలిసిపోతాయి. 

మన దగ్గర అంత తేలిక కాదు...
imageభీమవరం నుంచి వచ్చినప్పుడు నేను కూడా ఇంగ్లిష్ సినిమాలు చూసేవాడిని. అలాగే తీయాలనుకునేవాడిని. కానీ వాళ్లకు సింగిల్ జోన్రా ఉంటుంది. కానీ మనదగ్గర అలా కాదు. మనం ఒకే సినిమాలో అన్నిటనీ చూడ్డానికి అలవాటు పడిపోయాం. అందువల్ల మన దగ్గర అది అంత తేలిక కాదు. ఆ ప్యాట్రన్‌ని బద్ధలు కొట్టేవారు ఎవరో ఒకరు రావాలి. మాకు మాత్రం తీయాలని ఉండదా? అని ప్రతి ఒక్కరం చెబుతుంటాం. అందులో నేనేమీ అతీతుణి కాదు. కాకపోతే ప్యాట్రన్‌ని బద్ధలు కొట్టాలి. ‘లవకుశ’ కలర్‌లో విడుదలైన 12 సంవత్సరాల దాకా కూడా కలర్‌లో మనం తీయలేదు. అప్పటికి హిందీ, తమిళ్.. అన్నీ కలర్‌లోకి వెళ్లాయి. తమిళ్‌లో కొత్తవాళ్లతో తీసిన ‘కాదలిక్క నేరమిలై’్ల కలర్‌లో ఉంటుంది. తెలుగులో పెద్ద హీరోలతో తీసిన సినిమాలు కూడా బ్లాక్ అండ్ వైట్‌లో ఉంటాయి. అంటే అప్పటికి మనకు కలర్ అంటే భయం. ఆ ప్యాట్రన్ బ్రేక్ చేయడానికి భయం. కానీ ఇప్పుడు మనం ఆ భయాన్ని బ్రేక్ చేస్తున్నామని అనిపిస్తోంది. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఆ బ్రేక్ ఏదో రకంగా జరుగుతూనే ఉంటుంది.

నా నిర్మాతలు చెప్పరు..
నా నిర్మాతలు నా సినిమాలకు ఎంత బడ్జెట్ అయ్యిందనే విషయాన్ని నాకు చెప్పరు. అయితే దర్శకుడికి బడ్జెట్ ఎంత పెడుతున్నామనే దానిపై కొంచెంగా ఉండాలి. ఎక్కువగా ఉండకూడదు. ఎక్కువుంటే కథ రాసేటప్పుడే ఇటలీలో జరిగే కథ.. ఇండియా లోకి.. ఇంకెక్కడో జరిగేది ఇంట్లోకి.. ఇలా మెల్లగా మారిపో తుంది.

జర్నీ కూడా ముఖ్యమే...
రిజల్ట్ ముఖ్యంకాదు.. జర్నీ కూడా ముఖ్యమే కదా. ఏదో ఒక కాలమ్ రాశారనుకుందాం. అది సరిగా రానంత మాత్రాన మీరు పనికి రారంటే ఎలా? ఎన్ని చదువుకుని, ఎన్నో కలలతో ఊరి నుంచి రావడం, ఇక్కడ కలిసిన వ్యక్తులు... ఈ ప్రయాణం.. ఇదంతా చాలా ముఖ్యం కదా. అది 90 పర్సెంట్. ఫైనల్ టిప్ 10 శాతం. అదే రిజల్ట్.

ముందుగా ప్లాన్ చేసుకోను...
మహిళ ప్రాధాన్యత వచ్చేలా టైటిల్స్ పెట్టాలని నేను ఎప్పుడూ ప్లాన్ చేసుకోను. హీరోయిన్స్‌ను గ్లామర్‌గా చూపించమని డైరెక్టర్స్ అడిగినా నాకు తెలియదనే చెప్పేస్తాను. ఎందుకంటే నాకు అలా చూపెట్టడం తెలియదు. నేను ట్రై చేయలేదు.

అందులో మోహమాటం లేదు...
ఎన్టీఆర్ పక్కన నేను నిలబడ్డానని చెప్పడం ఆయన మంచితనం గానీ... నిజం చెప్పాలంటే ఎన్టీఆర్‌గారే మా పక్కనimage నిలబడి సినిమా పూర్తి చేశారు. అది నిజం! ఇందులో మోహమాటం ఏం లేదు. ఓపెన్‌గా చెబుతున్నా. హరికృష్ణగారి మరణం తరవాత ఎన్టీఆరే సెకండ్ డే ఫోన్ చేసి, ‘నేను వస్తాను. మీరేం వర్రీ అవకండి’ అని చెప్పారు. ‘మీరు కంగా రు పడకండి. బాధ పడకండి’ అని మేము చెప్పింది తక్కువే. ఎందుకం టే... మాటలతో చెబితే తగ్గే విషాదం ఏమీ కాదు. అందువల్లే, ప్రీ రిలీజ్ వేడుకలో నేను ఒక్క మాటే మాట్లాడాను. ‘అంత పెద్ద విషాదంనుంచి అంత త్వరగా బయటకు వచ్చారు’ అని. తన విషాదాన్ని తనకు మాత్రమే పరిమితం చేసుకున్నారు. మిగతా ఎవరికీ పంచి పెట్టలేదు.

రాజకీయాలు మాట్లాడుకోం..
పవన్‌కల్యాణ్‌గారు రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల ఇద్దరం మధ్య దూరం పెరగలేదు.  పదేళ్ళ నుంచి మేం అలాగే ఉన్నాం. మేమిద్దరం కలిస్తే అసలు సినిమాల గురించి మాట్లాడుకోం. ఇక ఆయనకు సలహాలిచ్చేంత సీన్ లేదు. ఎందుకంటే ఆయన ఏం చేసినా వాళ్ళ అన్నయ్యకు, వాళ్ళ అమ్మకు చెప్పడు. అందరూ తెల్లారిన తరవాత పేపర్‌లో చదువుకోవడమే.

ఆ స్థితి రాకుండా ఉంటే చాలు...
జీవితంలో నేను ఒక్కసారి ఎవరికైనా ఫ్రెండ్ అయితే ఫ్రెండే. నా భీమవరం ఫ్రెండ్స్ ఇప్పటికీ వాళ్లే నా ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చాక ఎవరు ఫ్రెండ్స్ అయితే వాళ్లే ఫ్రెండ్స్. అందరితో నేను బావుంటాను. మహేశ్‌బాబు, ఎన్టీఆర్, పవన్‌కల్యాణ్... ఒక్కసారి నా జర్నీ స్టార్ట్ అయితే చచ్చేవరకూ ఆగదు. నేను ఏది నమ్ముతాను అంటే.. భార్య ఇచ్చే సలహాలు భర్త ఎన్ని వింటాడు. అలాగని, భార్యను ఎందుకు వదలడు? ఆ రిలేషన్‌షిప్‌లో ఒక సెన్స్ ఆఫ్ కంఫర్ట్ ఉంటుంది. స్నేహితులుకు  గానీ... కుటుంబం గానీ... సలహాలు ఇవ్వాలనో, ఎడ్యుకేట్ చేయాలనో కాదు. ఇట్స్ సెన్స్ ఆఫ్ కంఫర్ట్. స్నేహితుడు సలహాలు ఇవ్వాల్సిన పని లేదు. మనల్ని జడ్జ్ చేయకుండా మన భావాల్ని పంచుకోవాలి. పవన్, మహేశ్, ఎన్టీఆర్... ఈ స్థాయికి వచ్చిన వ్యక్తులకు సలహాలు ఏం ఇస్తాం. మనం ఏం సలహాలు ఇవ్వాలి. వాళ్లు మనకు సలహాలు ఇచ్చే స్థితికి రాకుండా ఉంటే చాలు.
 

image

 అక్టోబర్ 11న అరవింద సమేత..

Updated By ManamThu, 09/27/2018 - 18:31
Aravinda Sametha Veera Raghava

యంగ్ టైగర్ ఎన్టీఆర్, పూజ హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ‘అరవింత సమేత’ విడుదల తేదీ ఖరారు అయింది. విజయదశమి పర్వదినం సందర్భంగా అక్టోబర్ 11న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడిస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేసింది. రాయలసీమ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడు.

Aravinda Sametha Veera Raghava

 నేరుగా మార్కెట్లోకే..

Updated By ManamTue, 09/18/2018 - 03:20

imageఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘అరవింద సమేత’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా ఆడియో ఈనెల 20 విడుదల కానుంది. అయితే ఎప్పటిలా ఫంక్షన్ చేయ కుండా నేరుగా ఆన్‌లైన్‌లో ఈ పాటలను విడుద ల చేయాలని నిర్ణయించారు.

ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ‘‘అరవింద సమేత’ ఆడియోను సెప్టెంబర్ 20న నేరుగా మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాం. ఆ తర్వాత ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించడం జరుగుతుంది’’ అని తెలిపింది. జగపతిబాబు, సునీల్, నాగబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విజయదశమి సందర్భంగా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
 అరవింద సమేత..చవితి శుభాకాంక్షలు

Updated By ManamWed, 09/12/2018 - 18:03
 • 20న అరవింద సమేత ఆడియో విడుదల

Aravinda sametha audio function on september 20

హారికా, హాసిని ప్రొడక్షన్స్‌లో దర్శకుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ఆడియో ఈ నెల 20న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నహాలు చేస్తోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే కథనాయికగా నటిస్తుంది. ఈ పోస్టర్‌లో ఎన్టీఆర్ నవ్వుతూ... స్టైలిష్‌గా కనువిందు చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

ఇక అరవింద సమేత’. ‘వీర రాఘవ’ అనేది ట్యాగ్ లైన్‌తో వస్తున్న ఆ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 11న అంటే సరిగ్గా నెల రోజుల తర్వాత  ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.సీతయ్య రెడీ!

Updated By ManamSun, 09/02/2018 - 12:31
nandamuri Harikrishna

ఏలూరు : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, సినీ నటుడు నందమూరి హరికృష్ణ జయంతి సందర్భంగా ఆయన విగ్రహం తయారైంది. రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ ఆకస్మిక మరణంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా తన పుట్టినరోజుకు ఎలాంటి హంగూ, ఆర్భాటాలు చేయవద్దని, ఆ డబ్బును కేరళ వరద బాధితులకు పంపాలంటూ హరికృష్ణ బతికుండగానే ...అభిమానులకు లేఖ రాశారు కూడా.

కాగా పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట మండలం పెనుగొండ శివారు గరువులో అచ్చం హరికృష్ణను మరిపించేలా విగ్రహాన్ని సిద్ధం చేశారు. ఈ విగ్రహాన్ని హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు అందచేయనున్నారు.  హరికృష్ణలో ఉట్టిపడే రాజసం విగ్రహంలో కనబడేలా తయారు చేసినట్లు వారు తెలిపారు.

మరోవైపు హరికృష్ణ జయంతి సందర్భంగా ఆయనను ఏపీ సీఎం చంద్రబాబు స్మరించుకున్నారు. చైతన్య రథసారథి, తన ఆత్మీయుడైన హరికృష్ణ ఇక లేరన్న నిజాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నట్లు ఆయన ట్విట్ చేశారు. ఇక రాజకీయం..

Updated By ManamSun, 09/02/2018 - 06:00
 • త్వరలో ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ!.. పొలిట్‌బ్యూరో సభ్యత్వం ఇచ్చే చాన్స్

 • నందమూరి వారసుడిగా ఆరంగేట్రం.. ఎన్టీఆర్ క్రేజ్ కోసం టీడీపీ ప్రయత్నం

 • తారక్ జోరుతో పవన్‌కు చెక్ పడేనా.. ఆసక్తిగా మారనున్న జూనియర్ నిర్ణయం

అమరావతి: నందమూరి హరికృష్ణ మరణంతో ఖాళీ అయిన టీడీపీ పొలిట్‌బ్యూరో పదవిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరికిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. హరికృష్ణ వారసుల్లో కల్యాణ్‌రామ్‌కు లేదా జూనియర్ ఎన్‌టీఆర్‌లలో ఒకరికి ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. పెద్ద కొడుకు కల్యాణ్‌రామ్‌కు పొలిట్‌బ్యూరో పదవి ఇవ్వడం సమంజసమే అయినా.. జనంలో బాగా క్రేజ్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్‌కు ఇస్తే ప్రయోజనంగా ఉంటుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. బావ, బావమరుదులైన చంద్రబాబు, హరికృష్ణ మధ్య అవినాభావ సంబంధం ఉందని అటు పార్టీలోనూ, ఇటు వారి కుటుంబాల్లోనూ చెప్పుకుంటారు.

image


చంద్రబాబుకు ముందు నుంచి వెన్నుదన్నుగా హరికృష్ణ నిలబడ్డారు. మొదటిసారి చంద్రబాబు సీఎం అవ్వడానికి హరికృష్ణ బాగా సహకరించారు. ఈ క్రమంలోనే హరికృష్ణకు బాబు పలు పదవులు కట్టబెట్టారు. పార్టీలో హరికృష్ణ లేని లోటును ఎన్టీఆర్‌తో పూడ్చాలని చూస్తున్నారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉమ్మడి రాష్ట్రంలో ప్రచారం చేశారు. ప్రచారం మధ్యలో ఉండగా ఆయన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభావం, దానికితోడు ప్రజారాజ్యం కూడా బరిలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి.. కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చింది. వైఎస్సార్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడిగా హరికృష్ణ పార్లమెంట్‌లో సమైక్యవాణి గట్టిగా వినిపించారు. విభజనను వ్యతిరేకిస్తూ ఆ పదవికి రాజీనామా కూడా చేశారు. టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడిగానే మరణించారు. 

హరికృష్ణ అంత్యక్రియల్లోనూ భౌతికకాయంపై చంద్రబాబు నాయుడు పార్టీ జెండాను కప్పి పార్టీ వ్యక్తిగానే వీడ్కోలు పలికారు. అదే స్ఫూర్తితో హరికృష్ణ వారసుడ్ని పార్టీలోకి క్రీయాశీలకంగా ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. 2019లో జరిగే ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికలలో ఎన్‌టీఆర్ సేవలు పార్టీకి ఎంతో లాభిస్తాయి. గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చిన పవన్‌కల్యాణ్ ఇప్పుడు పార్టీకి వ్యతిరేకంగా మారారు. రానున్న ఎన్నికల్లో సినీ హీరో పవన్‌ను తట్టుకోవడానికి తమ పార్టీలోనూ హీరో ఉంటే బాగుంటుందని టీడీపీ భావిస్తున్నది. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయినా హరికృష్ణ కుటుంబం నుంచి కూడా వారసుడ్ని తీసుకువస్తే నందమూరి కుటంబమంతా టీడీపీకి అండగా ఉందనే సంకేతాలు కూడా ప్రజల్లోకి వెళతాయి.

నందమూరి వారసులను చంద్రబాబు దూరంగా పెడుతున్నారనే కొంతమంది అపోహలు సమసిపోయే అవకాశం ఉంది. ఎన్టీఆర్ క్రేజ్ కూడా పార్టీ గెలుపునకు తోడవుతుంది. అయితే ఈ అంశంపై జూనియర్ ఎన్టీఆర్ ఆలోచన, నిర్ణయం ఎలా ఉంటాయనేది తెలియాల్సి ఉంది. పదేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎన్టీఆర్ ప్రచారం చేసినా.. ఆ తర్వాత మహానాడు, తదితర పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం, అమరావతి శంకుస్థాపనకు కూడా ఎన్టీఆర్ హాజరుకాలేదు. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పొలిట్‌బ్యూరో పదవి పొందేందుకు ఎన్టీఆర్ సమ్మతి తెలుపుతారని పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే అప్పుడే రాజకీయాలపై ఆసక్తి లేదు. కొన్నేళ్లు సినీరంగంలోనే ఉండాలనే ఆశ కూడా జూనియర్‌కు ఉన్నట్లు సమాచారం. మొత్తానికి ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీకి ఆయన నిర్ణయమే కీలకం కానున్నది. నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు పూర్తి

Updated By ManamThu, 08/30/2018 - 16:13
 • తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు

 • తండ్రి చితికి నిప్పంటించిన కుమారుడు కల్యాణ్ రామ్

 • అశ్రు నయనాలతో తుడి వీడ్కోలు...

Harikrishna funeral హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో గురువారం పూర్తయ్యాయి. కుటుంబసభ్యులు, అభిమానులు, సన్నిహితుల కన్నీటి వీడ్కోలు మధ్య  హైదరాబాద్ జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు ముగిశాయి. కుమారుడు కల్యాణ్ రామ్ తండ్రి చితికి నిప్పంటించారు.  అంతకు ముందు పోలీసులు గౌరవ సూచికంగా తుపాకీలతో మూడు రౌండ్లు గాలిలోకి పేల్చారు.

నందమూరి కుటుంబసభ్యులు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బాలకృష్ణ, లోకేష్,  టీడీపీ నేతలు, టాలీవుడ్ ప్రముఖులు, ఎన్టీఆర్ అభిమానులు హరికృష్ణకు కడసారి నివాళులు అర్పించి, తుది వీడ్కోలు పలికారు. మరోవైపు మోహదీపట్నం నుంచి జూబ్లీహిల్స్ వరకూ సాగిన అంతిమయాత్రలో హరికృష్ణ అమర్ రహే నినాదాలతో మార్మోగింది.మహాప్రస్థానంలో హరికృష్ణ అంత్యక్రియలు

Updated By ManamWed, 08/29/2018 - 16:33
 • కుటుంబసభ్యులు కోరినచోట అంత్యక్రియలు: తలసాని

Nandamuri Harikrishna death-kcr

హైదరాబాద్ : నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు ఆయన కుటుంబసభ్యుల అభీష్టం మేరకే జరుగుతాయని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కాగా హరికృష్ణ అంత్యక్రియలు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి.  నందమూరి హరికృష్ణ అంత్యక్రియల సందర్భంగా  ఆయన సందర్శనార్థం వచ్చే అభిమానులకు  ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని  ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. 

గురువారం సాయంత్రం నాలుగు గంటల నుంచి హరికృష్ణ అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది. ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అయితే అంతకు ముందు హరికృష్ణ అంత్యక్రియలు ... మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో నిర్వహిస్తారనే వార్తలు వెలువడ్డాయి. చివరికి మహాప్రస్థానంలోనే అంత్యక్రియలు చేయనున్నట్లు తెలుస్తోంది. రేపు నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు

Updated By ManamWed, 08/29/2018 - 12:55
 • మోహదీపట్నంలోని నివాసానికి హరికృష్ణ భౌతికకాయం

 • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

Nandamuri Harikrishna death: Telangana government orders state funeral

హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు గురువారం నిర్వహించనున్నారు. మొయినాబాద్‌ మండలం ముర్తజగూడలో ఫామ్‌హౌస్‌లో అంత్యక్రియలు జరపనున్నారు. గతంలో  పెద్ద కుమారుడు జానకిరాం అంత్యక్రియలు జరిగిన చోటే హరికృష్ణకు కుటుంబసభ్యులు అంత్యక్రియలు చేయనున్నారు.

కాగా హరికృష్ణ మృతదేహానికి కామినేని ఆస్పత్రిలో ప్రభుత్వ వైద్యులు పోస్టుమార్టం పూర్తిచేశారు. అనంతరం అంబులెన్స్‌లో హరికృష్ణ పార్ధీవదేహాన్ని రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. మోహదీపట్నంలోని నివాసానికి భౌతికకాయాన్ని తీసుకు వెళుతున్నారు. అంబులెన్స్‌లో హరికృష్ణ పార్థీవదేహం పక్కన ఆయన సోదరుడు రామకృష్ణ, ముందు వాహనంలో తనయులు కళ్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్‌తోపాటు దర్శకుడు త్రివిక్రమ్ ఉండగా మరో వాహనంలో ఏపీ సీఎం చంద్రబాబు,  బాలకృష్ణ, లోకేశ్ తదితరులు వస్తున్నారు.

ప్రభుత్వ అధికార లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు
మరోవైపు హరికృష్ణ అంత్యక్రియలు రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో జరగనున్నాయి. ఆయన కుటుంబసభ్యులతో మాట్లాడి ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారవం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు.కేరళకు సినీప్రముఖుల విరాళాలు..

Updated By ManamSun, 08/19/2018 - 13:52
 • తమిళ నటుడు విజయ్ రూ. 14 కోట్లు విరాళం..

Tollywood actors, donate relief fund, Kerala state, Jr NTR, akkineni nagarjuna (472), Vikram, Tamil actor Vijayతిరువనంతపురం: వరద బీభత్సంతో తీవ్రంగా నష్టపోయిన కేరళకు విరాళాల వెల్లువ కొనసాగుతోంది. కేరళను ఆదుకునేందుకు పలు రాష్ట్రాలు ముందుకొచ్చి విరాళాలను ప్రకటించగా, సినీ ప్రముఖలు, క్రీడాకారులు సైతం తమవంతు సాయాన్ని అందించేందుకు ముందుకొస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ మా మూవీ అసోసియేషన్ రూ. 10లక్షల వరకు కేరళకు వరద సాయాన్ని ప్రకటించగా తెలుగు సినీ అగ్రహీరోలు సైతం తమ వంతు సాయాన్ని అందించారు. తాజాగా అక్కినేని నాగార్జున, ప్రభాస్‌, తారక్‌, కల్యాణ్‌ రామ్‌, మహేశ్‌బాబు కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు ప్రకటించారు. నాగార్జున, అమల రూ.28 లక్షలు, ప్రభాస్‌ రూ.25 లక్షలు, ఎన్టీఆర్‌ రూ.25 లక్షలు, కల్యాణ్‌ రామ్‌ రూ.10 లక్షలు, విక్రమ్‌ రూ.35 లక్షలు, మహేశ్‌బాబు రూ.25 లక్షలు విరాళాలు అందించారు.

ప్రముఖ తమిళ నటుడు విజయ్ ఏకంగా రూ.14 కోట్లు విరాళంగా ప్రకటించినట్లు సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై విజయ్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అలాగే కేరళ బాధితుల కోసం సామాన్య పౌరులు కూడా తమకు తోచినంత సాయం అందిస్తున్నారు. కాగా, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కేరళ రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతున్నారు. వరదలు ఉధృతి కారణంగా కొండ చరియలు విరిగిపడటం వంటి పలు ప్రమాదాల్లో ఇప్పటివరకు 300 మందికిపైగా మృత్యువాతపడ్డారు.

Related News