jr ntr

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్..

Updated By ManamThu, 08/09/2018 - 20:44

Jr NTR, Director Trivikram, Aravindha Sametha,  Young tiger, first look of Jr NTR, New Teaser releaseయంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’ త్వరలో ఓ టీజర్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్ర బృందం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘చివరకు మీరంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్త. యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ ‘అరవిందసమేత’ టీజర్‌ను ఆగస్టు 15న విడుదల చేయనున్నాం. సమయాన్ని త్వరలోనే వెల్లడిస్తాం’’ అని చిత్ర నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్‌ పేర్కొంది. ఈ చిత్రంలో తారక్‌ సరసన అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. రామోజీ ఫిలిం సిటీలో ఈ చిత్రానికి సంబంధించి కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. 

15 రోజులకు పైగా ఈ చిత్రం షెడ్యూల్‌ షూటింగ్ ఇక్కడే సాగనుంది. అనంతరం పొలాచ్చిలో తదుపరి చిత్ర షూటింగ్ జరగనున్నట్లు సమాచారం. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అదే యాసలో తారక్‌ డైలాగ్‌లు ఉండనున్నాయి. రాయలసీమ యాసలో తారక్ చెప్పే డైలాగ్‌లు అభిమానులు సహా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటాయని చిత్ర యూనిట్ అభిప్రాయపడుతోంది. వెండితెరపై మరోసారి తారక్.. తన సిక్స్‌ ప్యాక్‌తో మెరవనున్నారు. ఈ చిత్రం కోసం తారక్.. చాలా రోజుల నుంచి నిపుణుల సమక్షంలో శిక్షణ తీసుకుంటున్న విషయం తెలిసిందే. దసరా పండుగ సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకోచ్చే యోచనలో చిత్రబృందం ఉంది. ‘సెలెక్ట్’ అంబాసడర్ జూనియర్ ఎన్టీఆర్

Updated By ManamSat, 07/14/2018 - 00:04

imageహైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సరికొత్త మొబైల్ రిటైల్ గొలుసుకట్టు దుకాణాల సముదాయం సెలెక్ట్‌కు నటుడు జూనియర్ ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసడర్‌గా వ్యవహరించనున్నారు. కంపెనీ లోగోను శుక్రవారంనాడు హైదరాబాద్‌లో ఆయన ఆవిష్కరించారు. సెలెక్ట్‌తో కలిసి పని చేయనుండటం చాలా సంతోషంగా ఉందని ఎన్టీఆర్ అన్నారు. సెలెక్ట్ మొబైల్ దుకాణాలు అద్వితీయమైన కొనుగోలు అనుభూతిని అందిస్తాయని ఆయన చెప్పారు. సెలెక్ట్ మొదటి మూడు స్టోర్‌లను తిరుపతిలో ఈ ఏడాది మే 2న ప్రారంభించింది. దేశం మొత్తం మీద 500 స్టోర్‌లను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ సంస్థ తెలిపింది. మొదటి దశలో 200 స్టోర్‌లను ప్రారంభించనున్నట్లు సెలెక్ట్ వెల్లడించింది. ఈ నెల 20న హైదరాబాద్‌లో మొత్తం 30 స్టోర్‌లను ప్రారంభించనున్నట్లు అది పేర్కొంది.  ఆ విషయంలో అభయ్‌ని కాపాడలేం: ఎన్టీఆర్

Updated By ManamSat, 06/09/2018 - 17:26

jr NTR, son Abhay, Vennala Kishore, Social media, drinking milk టాలీవుడ్ యువ హీరోలంతా అభిమానులతో టచ్‌లో ఉండేందుకు సోషల్ మీడియానే వేదికగా ఎంచుకున్నారు. అభిమానులతో ఎప్పటికప్పుడూ తమ కుటుంబ విషయాలను పంచుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. అభిమాన హీరో కుటుంబ విషయాలను తెలుసుకోవాలన్న ఆసక్తి.. సగటు అభిమాని కంటే వీరాభిమానులకే ఎక్కువగా ఉంటుంది. సోషల్ మీడియాలో అల్లుఅర్జున్, రామ్ చరణ్, ఉపాసన, సమంత ఇలా ప్రతిఒక్కరూ తమ సినిమా విషయాలను మాత్రమే కాకుండా తమ కుటుంబ విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా తన కుమారుడు అభయ్‌కు సంబంధించిన పలు విషయాలను ఎప్పటికప్పుడూ అభిమానులతో పంచుకుంటున్నారు.

తాజాగా కుమారుడు అభయ్‌కు సంబంధించి ఎన్టీఆర్ ఓ ఆస్తకికరమైన ట్వీట్‌ చేశారు. ‘‘వాడు రోజు తాగాల్సిన పాల కోటా విషయంలో వాళ్ల అమ్మ నుంచి అభయ్‌ను కాపాడలేం’’ అంటూ సరదాగా ట్వీట్ చేశారు. వాళ్ల అమ్మ పాలు తాగమనడంతో.. అభయ్ భయంతో సైలెంట్‌గా కూర్చొని గ్లాసులో పాలు తాగుతున్న ఫొటోను కూడా ఎన్టీఆర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఎన్టీఆర్ ట్వీట్‌పై స్పందించిన హాస్యనటుడు వెన్నెల కిషోర్.. ‘‘క్యూట్‌నెస్ ఓవర్‌లోడేడ్’’ అంటూ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ప్రస్తుతం ఎన్టీఆర్‌ త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ‘అరవింద సమేతా..’ సినిమాలో నటిస్తుండగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇక  సంగీత దర్శకుడు తమన్‌ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. తారక్, మహేశ్ నోట ఒకే మాట.. (ఫుల్ స్పీచ్)

Updated By ManamSat, 04/07/2018 - 23:17

 

mahesh and jr ntr full speech

‘భరత్ అనే నేను’ ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు వేలాది మంది అభిమానులు, వందలాది మంది ఆర్టిస్ట్‌లు తరలివచ్చారు. ఈ వేడుకకు హీరో జూనియర్ ఎన్టీఆర్ అతిథి అనే విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా తారక్ " నందమూరి తారక రామారావు మనువడి అయిన నేను" అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. " ఒక్కోసారి స్టేజ్ మీద ఏం మాట్లాడాలో తెలియదు.. ప్రస్తుతం నేను ఇదే పరిస్థితిలో ఉన్నాను. మీ అందరికీ నన్ను, మహేశ్ అన్నను చూసి కొత్తగా ఉందేమో గానీ మాకేం కొత్తకాదు. మీ (అభిమానులు) ఆయన్ను ప్రిన్స్, సూపర్ స్టార్ అంటారు. నేను మాత్రం ఆయన్ను ‘మహేశ్ అన్న’ అంటాను. మహేశ్ అన్న ఆడియో ఫంక్షన్‌కు నేను ముఖ్య అతిథిగా వచ్చానని అంటున్నారు. కానీ ఒక్క కుటుంబ సభ్యుడిగా మాత్రమే వచ్చాను. ఈ చిత్రం ఒక అద్భుతమైన విజయం సాధించాలని కోరుకుంటున్నాను. మీ (అభిమానులు) భాషల్లో రికార్డులు తిరగరాయాలని ఒక కుటుంబ సభ్యుడిగా నేను కోరుకుంటున్నాను" అని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. 

మహేశ్ అన్న చాలా అందంగా ఉంటారు.. అరుదైన మొక్క!
మహేశ్ అన్న గురించి ఎక్కువగా మాట్లాడను. ఆయన స్థాయి గురించి ఒక నటుడిగా.. ఆయన స్టామినాను ఒక నటుడిగా.. మహేశ్ అన్న చాలా అందంగా ఉంటారు. ఆ విషయంపై ఇంతకు మించి మాట్లాడను (నవ్వుతూ). ఒక కమర్షియల్ హీరో, స్టార్ అయిండి ఆయన చేసిన ప్రయోగాలు ఇంకెవరూ చేయలేదు. రిజల్ట్‌తో సంబంధం లేకుండా అదే బాటలో.. అదే మాట మీద ఆయన చేసినటువంటి ప్రయోగాలు మేం ఎవరూ చేయలేదు. ఒక విధంగా ఇప్పుడిప్పుడు మేం మొదలుపెడుతున్నాం.. దానికి ఇన్సిపిరేషన్ ఆయనే. ‘జనతా గ్యారేజ్’ సినిమాలో చాలా అరుదైన మొక్క అని ఒక డైలాగ్ రాశారు కొరటాల శివ. అదే విధంగా (మహేశ్ వైపు చూపిస్తూ) ఈయన కూడా చాలా అరుదైన రకం.. ఆయన్ను అలానే ఉండనిద్దాం. ఇదంతా చెబుతుంటే నాకు ఏదోలా ఉంది. నిజంగా అన్నయ్యా హ్యాట్సాప్. భరత్ అనే నేను మీ కెరీర్‌లో ఒక మైలు రాయిలాగా మిగిలిపోవాలిని ఆ దేవుడ్ని మనసారా కోరుకుంటున్నాను" అని ఎన్టీఆర్ ఆకాంక్షించారు. 

కొరటాల చాలా బాధ్యత గల వ్యక్తి..
"డైరెక్టర్ కొరటాల శివ.. సమాజం పట్ల ఒక బాధ్యత కలిగిన వ్యక్తి. సినిమాను సినిమాలాగే కాకుండా ఒక పౌరుడిగా ఆయన వంతు బాధ్యతను కూడా చిత్రాల ద్వారా కమర్షియల్‌కు ఎక్కడా తగ్గకుండా అభిమానులకు కావాల్సిన మసాలను గట్టింగా దట్టించి ఒక పౌరుడిగా ఆయనివ్వాల్సిన సందేశాన్ని మాతో చిత్రాలు చేసి ఇచ్చారు. ఆయనలా చేయడం వల్ల సమాజంలో మాకూ ఔన్నత్వం కలుగుతోంది. ఐ విష్ యూ ఆల్ దీ బెస్ట్  కొరటాల శివగారూ. ఎప్పటికీ మీ ప్రయాణాన్ని ఆపొద్దు. సమాజం పట్ల మీ బాధ్యతను, మీ ఇష్టాన్ని మీమీ చిత్రాల ద్వారా తెలియజేస్తారని మనసారా కోరుకుంటూ.. భరత్ అనే నేను కూడా మీకు ఎ వెరీ వెరీ డియర్ ఫిల్మ్ టు యూ" అని జూనియర్ చెప్పుకొచ్చారు. 

సూపర్ స్టార్ మహేశ్ బాబు మాట్లాడుతూ....!!


సేమ్ టూ సేమ్ జూనియర్ లాగే.. సూపర్‌స్టార్ క్రిష్ణ గారి అబ్బాయి అని నేను.. అంటూ తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు. " ఈ మాటలన్నీ తమ్ముడు తారక్ దగ్గర్నుంచి నేర్చుకున్నాను. ఈ అభిమానుల సందడి చూస్తుంటే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వచ్చినట్లు లేదు.. వందరోజుల ఫంక్షన్‌కు వచ్చినట్లుంది. మిమ్మల్నందర్నీ (అభిమానులను) చూస్తుంటే చాలా ఆనందంగా.. సంతోషంగా ఉంది.  సినిమా గురించి డైరెక్టర్ అంతా చెప్పేశారు.. ఇక నేను చెప్పేదేమీ లేదు. ఆయనెప్పుడూ సినిమా గ్రాండ్ గా ఉండా గ్రాండ్ గా ఉండాలి అంటుంటారు. చాలా గ్రాండ్‌గానే ఉంటుంది సార్(కొరటాల వైపు చూస్తూ)" అని మహేశ్ చెప్పారు. 

అందరికీ ధన్యవాదాలు..
"ముఖ్యంగా.. ఎప్పుడూ మాతో పాటు ఉండి.. మాకు సపోర్టు ఇచ్చిన దానయ్య గారికి ధన్యవాదాలు. నేను మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్‌కు బిగ్ ఫ్యాన్ చాలా సార్లు చెప్పాను. తను చేసే వర్క్ చాలా బాగుంటుంది. ఒకే సారి ‘రంగస్థలం’.. ‘భరత్ అనే నేను’ సినిమాలకు ఒకదానికొకటి సంబంధమే లేకుండా ఎలా మ్యూజిక్ చేస్తున్నారో ఆశ్చర్యంగా ఉంటుంది" అని మహేశ్ అన్నారు.

నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్స్..
" ‘భరత్ అనే నేను.. ’ అనే థీమ్ సాంగ్.. ‘వచ్చాడయ్యో’  ఈ రెండు సాంగ్‌లు నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్స్ అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్యూ దేవీ. అలాగే రామజోగయ్య గారు మీరు మళ్లీ అవార్డు కొట్టాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. (మహేశ్ ఈ మాట అంటుండగా చేతులెత్తి దండం పెట్టిన రామజోగయ్య)" అని మహేశ్ ఆకాంక్షించారు.


సీఎం అనగానే వణుకొచ్చింది..
‘‘
తిప్పి కొడితే ఏడాదికి ఒక్కొక్క సినిమా మాత్రమే చేస్తాం. అందరి సినిమాలు ఆడితే ఇంకా బాగుంటుంది. మేమూ, మేము బాగానే ఉంటాం. మీరూ, మీరే ఇంకా బాగుండాలి. ఈ సినిమాలో క్యారెక్టర్ గురించి కొరటాల శివ చెప్పినప్పుడు భయం అనిపించింది. ఎందుకంటే రాజకీయాలకూ, నాకు సంబంధంలేదు. వాటికి దూరంగా ఉంటా, పట్టించుకోను. సడెన్‌గా సీఎం అనగానే చిన్న వణుకు వచ్చింది. ఈ సినిమా ద్వారా చాలా నేర్చుకున్నా. శ్రీమంతుడు నా కెరీర్‌లో టర్నింగ్ పాయింట్. మళ్లీ అదే టర్నింగ్ పాయింట్ వచ్చింది. మళ్లీ ‘భరత్ అనే నేను’ రాబోతోంది. అది కూడా శివనే ఇచ్చారు’’ అని అన్నారు.

20 తారీఖునే రిలీజ్ ఎందుకంటే..
" ఏప్రిల్ 20 మా అమ్మ ఇందిరమ్మగారు పుట్టిన రోజు. ఈ విషయం ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. అమ్మ ఆశీస్సులు, దీవెనల కంటే మించినది మరోటి ఉండదు అంటారు. ఆరోజు సినిమా రిలీజ్ చేస్తుండటం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. మీ (అభిమానులు) ఆశీస్సులు, అభిమానం ఎప్పుడూ నాతో ఉండాలి థ్యాంక్యూ సో మచ్ అందరికీ" అని మహేశ్ చెప్పుకొచ్చారు.

ఇప్పుడు అసలు విషయానికొస్తే.. అసలు మహేశ్, జూనియర్ నోట ఎక్కడ సేమ్ టూ సేమ్ ఒకే మాట వచ్చిందనే విషయం ఇప్పటికే మీకు క్లారిటీగా అర్థమై ఉంటుంది.

Mahesh & Jr Ntr Full Speech At Bharath Ane nenuనా కొడుక్కి వారసత్వంగా క్రికెట్ నేర్పిస్తా: ఎన్టీఆర్

Updated By ManamTue, 04/03/2018 - 17:54

Jr NTR, IPL 2018, Telugu Brand ambassador, Sachin Tendulkar, Star TVహైదరాబాద్: ఈ ఏడాది ఐపీఎల్ -11 సీజన్‌ మెగా టోర్నీ ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఐపీఎల్ తెలుగు బ్రాండ్ అంబాసిడర్‌గా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నియమితులయ్యారు. మంగళవారం హైదరాబాద్‌లోని పార్క్‌హయత్ హోటల్‌లో జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రికెట్ మన రక్తం, నరనరాల్లో జీర్ణించుకొని పోయిందని అన్నారు. క్రికెట్‌ను ఆస్తిలా పెద్దలు పిల్లలకు వారసత్వంగా ఇస్తున్నారని, క్రీడలు భాషల్లా కూడా పనికొస్తాయని చెప్పారు. క్రికెట్‌కు సరిహద్దులు లేవని, క్రీడల ద్వారానే ఎలాంటి గందరగోళ పరిస్థితి లేకుండా ఒకరినొకరు అర్థమయ్యేలా మాట్లాడుకోగలుగుతున్నారని తెలిపారు.

ఎన్టీఆర్ ఇంకా ఏమన్నారంటే.. ‘సచిన్ టెండూల్కర్ కంటే నాకెంతో అభిమానం. నాకు తెలిసిన ఏకైక క్రికెట్ హీరో సచిన్ మాత్రమే. ఆట కూడా ఒక భాషే అని నా అభిప్రాయం. ఐపీఎల్ మ్యాచ్‌లు తెలుగులో ప్రసారమైతేనే అసలు మజా ఉంటుంది. మా నాన్న ఎంతో ఇష్టంగా క్రికెట్‌ను చూసేవారు. ఆయన క్రికెట్ చూడటం చూసి నేను కూడా క్రికెట్‌పై మక్కువ పెంచుకున్నాను. ఇప్పుడు మా అబ్బాయికి వారసత్వంగా క్రికెట్‌ను నేర్పిస్తాను. ప్రచార కర్తగా నాకు అవకాశం కల్పించిన స్టార్ యాజమాన్యానికి ధన్యవాదాలు’ అని పేర్కొన్నాడు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఎన్టీఆర్.. ‘క్రికెటర్ల జీవితాలు తెరపై రావడం చాలా ఆనందంగా ఉంది. క్రికెటర్ల బయోపిక్స్ చేయడానికి నేను సాహసించను. రాజమౌళి ఇంకా కథ చెప్పలేదు. సినిమాకు సిద్ధం కావాలని మాత్రం చెప్పారు’ అని స్పష్టం చేశారు.ఈ ఫొటో గురించి అసలు నిజం తెలిసింది!

Updated By ManamFri, 03/23/2018 - 17:06

fakeత్రివిక్రమ్ శ్రీనివాస్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ జిమ్‌లో బాగా చెమటోడ్చుతున్నాడు. కొన్నిరోజుల క్రితం ఎన్టీఆర్ పర్సనల్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ ఈ నందమూరి హీరోకి సంబంధించి ఓ ఫోటోను పోస్ట్ చేశాడు. ఆ ఫొటోను చూసిన అభిమానులు ఎంతో సంతోషపడ్డారు. అయితే తాజాగా ఎన్టీఆర్ ఫొటో అంటూ నెట్‌లో మరో ఫొటో హల్‌చల్ చేస్తోంది. వెనక్కి తిరిగి తన కండలను చూపిస్తున్నట్లుగా ఈ ఫొటో ఉంది. ఈ ఫొటో చూసిన వారంతా ఎన్టీఆర్‌ అనే భావించారు. అయితే అసలు ఆ ఫొటో ఎన్టీఆర్‌దే కాదని పర్సనల్ ట్రైనర్ స్టీవెన్స్ స్పష్టం చేశాడు. ఈ విషయాన్ని తెలుపుతూ ట్వీట్ చేశాడు. ‘దయచేసి అందరూ తెలుసుకోండి.. ఇది ఎవరో సృష్టించిన ఫేక్ ఫొటో. అయినా, వారి క్రియేటివిటీకి నా హ్యాట్సాఫ్’ అని స్టీవెన్స్ ట్వీట్ చేయడంతో ఆ ఫొటో ఫేక్ అని తేలిపోయింది. కానీ అచ్చం ఎన్టీఆర్‌లానే ఉన్నాడంటూ అభిమానులు అసలు అతను ఎవరో తెలుసుకోవడం మొదలుపెట్టారు.

 ఈ ముగ్గురి సినిమాపై వీడియో వచ్చేసింది! 

Updated By ManamThu, 03/22/2018 - 18:56

rrrటాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్‌‌లో సినిమా రాబోతోంది. బాహుబలి మొదటి, రెండు భాగాలతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తాను చాటి చెప్పిన దర్శకుడు రాజమౌళి మరో పెద్ద ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాడు. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్‌లతో ఓ మల్టీస్టారర్‌ను రాజమౌళి ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో వీళ్లు ముగ్గురూ కలిసి దిగిన ఓ ఫొటో నెట్‌లో వైరల్ అయింది. ఈ స్టార్ హీరోలతో రాజమౌళి సినిమా చేయబోతున్నాడనే విషయం పాతదే అయినా తాజాగా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ సినీ నిర్మాణ సంస్థ అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఆర్‌ఆర్‌ఆర్ పేరుతో ఓ వీడియోను కూడా విడుదల చేసింది. అంటే రాజమౌళి, రామారావు(జూనియర్ ఎన్టీఆర్), రాంచరణ్. ఇలా ముగ్గురి పేర్లు కలిసొచ్చేలా వీడియోను విడుదల చేశారు. ఈ ముగ్గురి కాంబినేషన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్‌కు, రాంచరణ్‌కు అభిమానులు ఏ రేంజ్‌లో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి వీళ్లిద్దరితో సినిమా.. అది కూడా అగ్ర దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాజమౌళి చేస్తుంటే ఆ మాత్రం అంచనాలు ఉంటాయని సినీ జనాలు చర్చించుకుంటున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత మళ్లీ ఇద్దరు పెద్ద హీరోలు కలిసి చేస్తున్న చిత్రం ఇదే. టైటిల్ ఇంకా ప్రకటించకపోవడంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. టాలీవుడ్‌పై టీడీపీ ఎమ్మెల్సీ ఫైర్

Updated By ManamTue, 03/20/2018 - 14:33

TDP MLC Rajendra Prasad Fire On Tollywood Over AP Special Status

అమరావతి: టాలీవుడ్‌‌పై టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ఫైర్ అయ్యారు. ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతు ఎందుకు ఇవ్వరు? అంటూ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. తమిళ నటుల్ని చూసైనా బుద్ధి తెచ్చుకోవాలంటూ టాలీవుడ్‌పై నిప్పులు చెరిగారు. జల్లికట్టు ఉద్యమాన్ని నడిపింది తమిళ నటులే అన్న సంగతి మీకు తెలుసా? తెలియదా? అంటూ ఆయన సూటి ప్రశ్న సంధించారు. ఏసీ రూముల్లో ఉంటూ ప్రజల సమస్యలను పట్టించుకోరా? అంటూ మండిపడ్డారు ఎమ్మెల్సీ. మీరు హాలీవుడ్ స్థాయి నటులు కాదని.. హీరోయిన్ వెంటపడే క్యారెక్టర్లకే పనికొస్తారని రాజేంద్రప్రసాద్ దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు. ఏజ్ బార్ అయిన నటులూ.. మీకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

ఆయన మాటల్లోనే..
"టాలీవుడ్‌కు చెందినటువంటి ఆంధ్రా కళాకారులు రాష్ట్ర ప్రజల తరఫున ఎందుకు పాల్గొనడం లేదు. జల్లికట్టు ఉద్యమాన్ని నడిపింది తమిళ నటులు.. అగ్ర హీరోలు కాదా?.. మరి టాలీవుడ్ నటులకు ఏమైంది?. టాలీవుడ్ సినీ పరిశ్రమకు ఏమైంది..? ఏం మాయరోగం దాపరించింది?. చావ చచ్చిపోయిందా?. మేం టికెట్ల రూపంలో చెల్లించే వందల కోట్ల రూపాయిల కనక వర్షం మత్తులో మీరు మునిగిపోయారా? ఆ మత్తులో నుంచి మీరు బయటికి రారా?. చివరికి పక్కరాష్ట్రంలోని మన సోదర రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. కుటుంబం అంతా మద్దతు పలికారు. మీరు కూడా అదే తెలంగాణలోనే ఉన్నారు కదా.? అక్కడే బానిస బతుకులు బతుకుతున్నారు?" అని రాజేంద్రప్రసాద్ దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు.

తన్ని తరిమేస్తారని భయమా?
మా ఆంధ్రోళ్లకు మద్దతు పలికితే మీ ఆస్తులు లాక్కుని తన్ని తరిమేస్తారని మీకు భయమా? భయముందా?. సీఎం కేసీఆరే మద్దతి పలికారు కదా అలాంటప్పుడు మీకు ఆ భయమెందుకు?. మీ సినిమాల టికెట్లు కొనడానికి.. కోట్ల రూపాయిలు కురిపించడానికి.. అవార్డులివ్వడానికేనా?. ఎవరికైనా అవార్డులు రాకపోతే లొల్లి.. లొల్లిపెట్టేస్తారు అదేదో భూమి, ఆకాశం బద్ధలైపోయినట్లు ట్వీట్స్.. రిట్వీట్స్.. ఫేస్‌బుక్ పోస్ట్‌లు, ఇంటర్వ్యూలు.. తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లిబుచ్చితారే.. మన ఆంధ్రకు రివార్డులు, నిధులు రావట్లేదు అవన్నీ మీ చెవులకు ఎక్కట్లేదా?. మీ కళ్లకు కనపడట్లేదా?. మీరు ఏసీ రూముల్లో కులుకుతూ కూర్చుంటారా?. ఇంతకంటే ఇంకా కఠినంగా మాట్లాడగలను కాకపోతే సంస్కారం నాకు అడ్డొస్తోంది" అని తీవ్ర ప్రశ్నల వర్షం కురిపించారు.

ఇప్పటికైనా బయటికి రండి..
"ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు.. బయటికి వచ్చి ఆంధ్రా ప్రజల తరఫున మీ గళం విప్పండి. మీరు మాట్లాడకపోతే మా ఐదు కోట్ల ఆంధ్రా ప్రజలు మీ సినీ పరిశ్రమ కళాకారుల్ని వెలివేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఇందులో నో డౌట్!." అని ఆయన చెప్పుకొచ్చారు.తెలంగాణలో ఎన్టీఆర్ సైకిల్ ఎక్కాల్సిందేనా?

Updated By ManamThu, 03/01/2018 - 17:45

jr ntrతెలుగు రాష్ట్రాల్లో దాదాపు 35ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన పార్టీ. పల్లెల నుంచి పట్టణాల వరకూ పటిష్టమైన క్యాడర్ కలిగిన పార్టీ. తెలుగు వాడి ఆత్మగౌరవం నినాదంతో విజయదుందుభి మోగించిన పార్టీ నేడు తెలంగాణలో ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నించాల్సిన గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటోంది. నాయకత్వ లేమితో ముందుండి నడిపించే నాయకుడి కోసం వేయికళ్లతో ఎదురుచూస్తోంది. తెలుగు రాష్ట్రం విడిపోయాక తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలహీనపడిందనేది జగమెరిగిన సత్యం. బలమైన క్యాడర్ ఉన్నా వారందరికీ భరోసానిచ్చే స్థాయి నేత పార్టీలో కనిపించడం లేదు. పైగా టీడీపీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలనే కొత్త డిమాండ్‌ను మోత్కుపల్లి వంటి సీనియర్ నేతలు తెరపైకి తెస్తున్నారు. మరోపక్క.. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీఎం చంద్రబాబు రాజధాని, రాష్ట్ర సమస్యల పరిష్కారం పేరుతో తెలంగాణలో పార్టీ పరిస్థితిని పూర్తి స్థాయిలో చక్కబెట్టలేకపోతున్నారు. ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పూర్వవైభవంతో మనగలగాలంటే సమర్థవంతమైన నాయకత్వం కావాలి. ఎవరా నాయకుడు? ఎవరంతటి సమర్థుడు? చంద్రబాబు ఈ విషయంలో ఏం ఆలోచిస్తున్నారు? ఇవే ప్రశ్నలు తెలంగాణ తెలుగు తమ్ముళ్ల మదిలో మెదులుతున్నాయి. 

తాజాగా తెలంగాణలో పార్టీ బలోపేతంపై ఎన్టీఆర్ ట్రస్ట్‌ భవన్‌లో చంద్రబాబు నేతృత్వంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో.. మోత్కుపల్లి చెప్పినట్లు తెలుగుదేశాన్ని టీఆర్‌ఎస్‌లో చేస్తే ఆత్మహత్యలేనన్న సంకేతాన్ని కార్యకర్తలు పార్టీ అధినేతకు బలంగా వినిపించారు. ఇదే సమావేశంలో తెలంగాణలో పార్టీ బాధ్యతలను జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగించాలనే వాదన కార్యకర్తల నుంచి బలంగా వినిపిస్తోంది. ఈ సమావేశంలో పాల్గొన్న కొందరైతే ఏకంగా జూనియర్ ఎన్టీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పజెప్పాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఇటీవల లోకేశ్ అమెరికా పర్యటనకు వెళ్లిన సందర్భంలో ఓ కార్యకర్త కూడా తెలంగాణలో జూనియర్ ఎన్టీఆర్‌ ముందుండి నడిపించాలని లోకేశ్ ముందే తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. ఇలా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించాలన్న అభిప్రాయం కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. లోకేశ్‌కు తెలంగాణ టీడీపీ బాధ్యతలు అప్పగించాలనే వారూ లేకపోలేదు.

జూనియర్ ఎన్టీఆర్, లోకేష్‌లలో ఎవరు మేలు అనే అంశంపై చర్చ జరుగుతుండగానే చంద్రబాబు ఈ అంశంపై తన అభిప్రాయాన్ని చెప్పేశారు. తమ రెండు కుటుంబాలకు చెందిన వారెవరికీ పార్టీ పగ్గాలు అప్పగించేది లేదని కార్యకర్తలకు స్పష్టం చేసినట్లు సమాచారం. తెలంగాణకు చెందిన నేతలతోనే పార్టీ బలోపేతం కావాలని, పార్టీని కాపాడుకునేందుకు పొత్తు అనివార్యం అని కూడా చెప్పినట్లు తెలుస్తోంది. అయితే పార్టీ బాధ్యతలు అప్పగించే విషయంలో చంద్రబాబు ఈ మాటకు కట్టుబడి ఉంటారా లేక పునరాలోచిస్తారా అన్న చర్చ జరుగుతోంది. చంద్రబాబు నమ్మకం పెట్టుకున్న తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, దేవెందర్ గౌడ్ వంటి సీనియర్ నేతలు పార్టీని ఏ మేరకు బలోపేతం చేస్తారో వేచిచూడాలి.తెలుగుదేశంలోకి పురంధేశ్వరి కొడుకు..?

Updated By ManamMon, 02/12/2018 - 20:55

 daggubati purandeswariతన తండ్రి ఎన్టీఆర్ స్టాపించిన తెలుగుదేశం పార్టీలో తమకు చోటు లేకపోవడం దగ్గుబాటి పురంధేశ్వరి పలు సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు పార్టీని, అధికారాన్ని చేజిక్కించుకున్నారనే అక్కసుతో తనభర్తతో కలిసి పార్టీ నుంచి బయటకు వచ్చారు పురంధేశ్వరీ. కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీగా, కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన పురంధేశ్వరి.. రాష్ట్ర విభజన తర్వాత భర్తతో కలిసి తిరిగి టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నించారు.. అయితే వీరి రాకను చంద్రబాబు అడ్డుకున్నారన్న ప్రచారం జరిగింది. అయితే తనకు దక్కని అదృష్టాన్ని తన కుమారుడికి దక్కేలా చేయాలని పురంధేశ్వరీ పావులు కదుపుతున్నారట.

తమ కుటుంబానికి పట్టున్న పర్చూరు నుంచి తనయుడు చెంచురామ్‌ను అసెంబ్లీకి పోటీ చేయించాలని ఆమె భావిస్తున్నారట. సోదరుడు బాలకృష్ణ ద్వారా పురంధేశ్వరీ తెర వెనుక నుంచి ఈ వ్యవహారం చక్కబెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పనితీరుపై ప్రజల్లో వ్యతిరేకత ఉండటం.. తమ కుటుంబానికి నియోజకవర్గంలో ఉన్న పట్టు తదితర అంశాలు చంద్రబాబుకు తెలియజేయాల్సిందిగా పురంధేశ్వరి.. బాలయ్యతో చెప్పినట్లు పొలిటికల్ టాక్.. ఈ అంశాన్ని బావ.. అల్లుడు లోకేశ్ వద్ద బాలయ్య ప్రస్తావించినట్లు పచ్చ కండువాలు గుసగుసలాడుకుంటున్నాయి.

చెంచురామ్‌కి టికెట్ ఇవ్వడం ద్వారా దశాబ్దాలుగా ఉన్న మనస్పర్థలు తొలగడంతో పాటు నందమూరి, దగ్గుబాటి కుటుంబాల అండ తెలుగుదేశానికి దక్కుతుందని చంద్రబాబు కూడా భావిస్తున్నారట. కుటుంబపరంగానూ.. రాజకీయం గానూ తనకు లబ్ధి చేకూర్చే ఈ అవకాశాన్ని చంద్రబాబు వంటి రాజకీయ మేధావి వదులుకోరని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రచారంలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

Related News