Na Peru Surya Na Illu India

హిందీలో దుమ్మురేపుతున్న బన్నీ మూవీ

Updated By ManamWed, 09/12/2018 - 10:23

Na Peru Surya Na Illu Indiaస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ తెరకెక్కించిన చిత్రం ‘నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా’. ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అనుకున్నంత మేర వారిని ఆకట్టుకోలేకపోయింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం హిందీలో దుమ్మురేపుతుంది.

బన్నీకి నార్త్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. అతడి డబ్బింగ్ చిత్రాలు యూట్యూబ్‌లో రికార్డు సృష్టించాయి. ఈ నేపథ్యంలో బన్నీ నా పేరు సూర్య చిత్రాన్ని డబ్బింగ్ చేసి గత వారం థియేటర్లలో రిలీజ్ చేశారు. విడుదలైన అన్ని చోట్ల ఈ చిత్రం మంచి కలెక్షన్లను సాధిస్తోంది. ఈ విషయాన్ని అక్షయ్ రతీ అనే క్రిటిక్ తెలిపాడు. కాగా 1983 వరల్డ్ కప్ ఆధారంగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ బయోపిక్‌లో ఓ పాత్ర కోసం బన్నీని సంప్రదించినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

 

 బాలీవుడ్ దర్శకుడితో బన్నీ మంతనాలు..?

Updated By ManamTue, 07/17/2018 - 13:21

Bunny ఈ ఏడాది వచ్చిన ‘నా పేరు సూర్య’తో పరాజయాన్ని చూసిన అల్లు అర్జున్ తన తదుపరి చిత్రంతోనైనా మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు. దీంతో ఇప్పటికీ పలువురు దర్శకుల నుంచి కథలు మాత్రం వింటున్న బన్నీ.. తన తదుపరి చిత్రంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా తాజా సమాచారం ప్రకారం బన్నీ ఓ బాలీవుడ్ దర్శకుడితో మంతనాలు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సౌత్‌లో బన్నీకి మంచి క్రేజ్ ఉంది. ఆయన చిత్రాలేవీ అక్కడ విడుదల కాకపోయినా.. బన్నీ డబ్బింగ్ చిత్రాలు యూట్యూబ్‌లో రికార్డులు సృష్టించాయి. ఈ క్రమంలో బాలీవుడ్‌పైన దృష్టి పెట్టిన బన్నీ, ఓ దర్శకుడితో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.ఆగ‌ష్టులో బ‌న్నీ చిత్రం

Updated By ManamTue, 07/03/2018 - 10:40

allu arjun`నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` సినిమా త‌ర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మ‌రో సినిమాను స్టార్ట్ చేయ‌లేదు. క‌థ విష‌యంలో కాస్త జాగ్ర‌త్త‌లో ప‌డ్డాడు. అయితే బ‌న్ని తదుప‌రి సినిమాపై చాలా ర‌కాలైన వార్త‌లు వినిపించాయి. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం బ‌న్ని వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో సినిమాలు చేసే ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌బోతున్నాడు. గీతాఆర్ట్స్‌పై ఈ సినిమా రూపొంద‌నుంది. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌బోతున్న ఈ సినిమాను ఆగ‌స్టు నుండి సెట్స్‌కు తీసుకెళ‌తార‌ట‌. హీరో అఖిల్‌తో `హ‌లో` త‌ర్వాత విక్ర‌మ్ కుమార్ అల్లు అర్జున్‌తో చేయ‌డానికి స‌మ‌యం తీసుకుని క‌థ‌ను సిద్ధం చేశాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని టాక్‌. బన్నీ ఫంక్షన్‌కు గెస్ట్‌ ఎవరంటే..?

Updated By ManamTue, 04/24/2018 - 10:50

Bunny, Cherry అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ తెరకెక్కించిన చిత్రం ‘నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా’. మే 4వ తేది ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈ నెల 29న జరగనుంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్న ఈ ఫంక్షన్‌కు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా రానున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలలో ఒకరైన బన్నీ వాసు అధికారికంగా ప్రకటించారు.

ఇక ఆర్మీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బన్నీ సరసన అను ఇమ్మాన్యుల్ నటించగా.. అర్జున్, శరత్ బాబు, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. విశాల్-శేఖర్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రాన్ని నాగబాబు, లగడపాటి శ్రీధర్, బన్నీ వాసు సంయుక్తంగా నిర్మించారు.

 

29th gachibowlii function who is the guest ? MEGA POWER STAR RAM CHARAN GARU MEGA FANS INKA KUMANDIIII

Posted by Bunny Vas on Monday, April 23, 2018

 ‘నా పేరు సూర్య’ షూటింగ్ పూర్తి

Updated By ManamThu, 04/19/2018 - 10:26

NSNIఅల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ తెరకెక్కించిన చిత్రం ‘నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా’. గతేడాది సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్ర షూటింగ్ తాజాగా పూర్తైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించాడు హీరో అల్లు అర్జున్. ‘‘నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా షూటింగ్ పూర్తైంది. లవ్‌లీ యూనిట్. లవ్‌లీ టీం. ఈ చిత్రంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అంటూ కామెంట్ పెట్టాడు బన్నీ.

ఇక యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన అను ఇమ్మాన్యుల్ నటించగా.. శరత్ కుమార్, అర్జున్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. నాగబాబు, లగడపాటి శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాలీవుడ్ ద్వయం విశాల్-శేఖర్ సంగీతాన్ని అందించారు. మేలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


 'ఇంటర్నేషనల్ మేగజైన్‌' కవర్ పేజ్‌పై బన్నీ

Updated By ManamThu, 02/08/2018 - 14:25

Allu Arjunప్రతి సినిమాలో స్టైల్‌కు అధిక ప్రాధాన్యమిస్తూ స్టైలిష్ స్టార్‌గా బిరుదును సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. ఈ నేపథ్యంలో తాజాగా ఓ అంతర్జాతీయ మేగజైన్ కవర్ పేజీపై తన స్టైలిష్ లుక్‌తో అదరగొట్టాడు ఈ హీరో. 'మ్యాగ్జిమ్ స్టీడ్' ఫిబ్రవరి ఎడిషన్ గానూ కవర్ పేజీపై అల్లు అర్జున్ ఫొటోను వేయగా.. అందులో 'నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా' కోసం తాను చేయించుకున్న డిఫరెంట్ మేకోవర్‌తో వాహ్వా అనిపిస్తున్నాడు.

ఇదిలా ఉంటే మరోవైపు నా పేరు సూర్య మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇందులో బన్నీ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. అనుఇమ్మాన్యుల్, రావు రమేష్, అర్జున్, శరత్ కుమార్ తదితరులు ముఖ్యపాత్రలలో కనిపించనున్నారు. లగడపాటి శ్రీధర్, నాగబాబు సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఏప్రిల్‌లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.అదరగొడుతున్న 'సైనికా' సాంగ్

Updated By ManamFri, 01/26/2018 - 09:22

Allu Arjunఅల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ తెరకెక్కిస్తున్న చిత్రం 'నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా'. రిపబ్లిక్‌ డేను పురస్కరించుకుని ఈ సినిమాలో ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. 'సైనికా' అంటూ సాగే ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ వారి గొప్పదనాన్ని తెలుపుతున్నాయి. విశాల్ శేఖర్ ద్వయం అందించిన సంగీతం దానికితోడు విశాల్ దద్లానీ వాయిస్ ఈ సాంగ్‌కు ప్లస్‌గా నిలిచాయి.

ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన అను ఇమ్మాన్యుల్ నటిస్తుండగా.. అర్జున్, శరత్ కుమార్, రావు రమేశ్ తదితరులు ముఖ్యపాత్రలలో కనిపించనున్నారు. నాగబాబు, లగడపాటి శ్రీధర్, బన్నీ వాసు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News