U-19

ద్రవిడ్‌‌ సలహాకు తలొగ్గిన బీసీసీఐ 

Updated By ManamMon, 02/26/2018 - 10:06

Dravidముంబై: అండర్‌-19 ప్రపంచకప్‌ను గెలిచినందకు ఆ టీం మొత్తానికి బీసీసీఐ నజరానా ప్రకటించింది. కోచ్‌ ద్రవిడ్‌కు రూ.50లక్షలు, మిగతా సహాయ సిబ్బందికి ఒక్కొక్కరికి రూ.20లక్షలను ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది. అయితే సహాయ సిబ్బందికి తనతో పోలిస్తే తక్కువ నజరానాలివ్వడంపై ద్రవిడ్‌ అభ్యంతరం లేవనెత్తారు. తనతో పాటు సహాయసిబ్బంది చాలా కష్టపడ్డారని ఆయన అన్నారు. దీంతో అందరికీ సమానంగా నజరానాలు ఇవ్వడానికి బోర్డు అంగీకరించింది. ఈ నేపథ్యంలో ద్రవిడ్‌తో పాటు అందరికీ ఒకే రకంగా రూ.25 లక్షల చొప్పున నజరానా ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రకటించింది.
 



"ఈ విజయం నా ఒక్కడిదే కాదు"

Updated By ManamSat, 02/03/2018 - 14:28

Dravidఐసీసీ U-19 వరల్డ్‌కప్‌లో భారత యువ క్రికెటర్లు ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా అందరూ టీం కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ విజయం ద్రవిడ్ వలనే సాధ్యమైందంటూ పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ మాటలపై స్పందించారు ద్రావిడ్. ఈ విజయంలో తానే ముఖ్య పాత్ర వహించినట్లు అందరూ చెప్తుంటే కాస్త ఇబ్బందిగా ఉందని.. కానీ ఇదంతా తన ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ సమిష్టి శ్రమ అని ఆయన అన్నారు. కాగా ఈ సిరీస్‌లో ఒక్క ఆటను కూడా ఓడిపోకుండా టీమిండియా కప్‌ను సంపాదించిన విషయం తెలిసిందే.



యువ క్రికెటర్లకు బీసీసీఐ భారీ నజరానా

Updated By ManamSat, 02/03/2018 - 14:03

Team Indiaఐసీసీ U-19 వరల్డ్‌కప్‌ ఫైనల్‌‌లో ఆస్ట్రేలియాపై భారీ విజయాన్ని సాధించిన యువ క్రికెట్ టీంకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. కోచ్ ద్రవిడ్‌కు రూ.50లక్షలు, ఆటగాళ్లకు రూ.20లక్షలు, సపోర్ట్ స్టాఫ్‌కు రూ.20లక్షల చొప్పున బహుమతులను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 

యంగ్ టీంపై పలువురి ప్రశంసలు
ప్రపంచకప్‌లో అద్భుత విజయాన్ని సాధించిన యువ క్రికెటర్లకు రాష్ట్రపతి రామ్ నాథ్, ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. అలాగే సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్, అనిల్ కుంబ్లే, జడేజా తదితర క్రికెటర్లకు కూడా యంగ్ టీంపై ప్రశంసలు కురిపించారు.



ఆస్ట్రేలియా అలౌట్.. భారత్ లక్ష్యం 217

Updated By ManamSat, 02/03/2018 - 10:02

U-19న్యూజిలాండ్: న్యూజిలాండ్‌లో జరుగుతున్న ఐసీసీ U-19 ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఆస్ర్టేలియన్ ఆటగాళ్ల ఆట ముగిసింది. 47.2ఓవర్లలో 216పరుగులు చేసి ఆస్ట్రేలియన్‌ ఆటగాళ్లు ఆలౌట్ అయ్యారు. ఆసీస్ క్రికెటర్లు మెర్లో 76, పరమ్ ఉప్పల్ 34, ఎడ్వర్డ్స్ 28, మ్యాక్స్ బ్రాంట్ 14, హోల్ట్ 13, సుదర్ లాండ్ 5 పరుగులు చేశారు. భారత బౌలింగ్‌లో పోరెల్, శివసింగ్, నాగర్ కోటి, రాయ్‌లు తలో 2 వికెట్లు తీశారు. ఇక 217పరుగుల లక్ష్యంతో భారత క్రికెటర్లు కాసేపట్లో బ్యాటింగ్‌ను చేపట్టనున్నారు.



అండర్‌19 వరల్డ్ కప్: ఫైనల్లోకి భారత్

Updated By ManamTue, 01/30/2018 - 09:25

Team Indiaఐసీసీ నిర్వహిస్తున్న అండర్ 19 ప్రపంచ కప్‌లో టీమిండియా ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీఫైనల్లో భాగంగా పాకిస్థాన్‌తో తలపడ్డ భారత్ 203 పరుగుల తేడాతో ఆ దేశాన్ని చిత్తు చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ 272 పరుగులు చేయగా.. పాకిస్థాన్ 69పరుగుల వద్దనే చితకలపడింది. దీంతో అండర్ 19 వరల్డ్ కప్‌లో ఆరోసారి ఫైనల్‌కు చేరింది భారత్. ఇక ఫైనల్లో ఫిబ్రవరి 3న ఆస్ట్రేలియాతో తలపడనుంది భారత్.



అండర్19: సెమీఫైనల్లోకి టీమిండియా

Updated By ManamFri, 01/26/2018 - 10:43

Team Indiaఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్‌తో ఢీ కొట్టిన టీమిండియా 131పరుగుల తేడాతో ఆ దేశంపై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌ను ఎంచుకున్న భారత్ 265పరుగులు చేయగా.. బంగ్లాదేశ్‌ టీం మాత్రం 134పరుగుల వద్దే చేతులెత్తేసింది. దీంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది టీమిండియా. ఇక సెమీ ఫైనల్‌లో భాగంగా ఈ నెల 30న చిరకాల ప్రత్యర్థి పాక్‌తో తలపడనుంది టీమిండియా. 





Related News