isro

దూసుకుపోయిన ఇస్రో మార్క్-3 డీ2

Updated By ManamThu, 11/15/2018 - 07:47
 • రోదసిలోకి 3,700 కిలోల ఉపగ్రహం

 • అత్యుత్తమ సమాచార వ్యవస్థ

 • పదేళ్లపాటు ఉపగ్రహం సేవలు

 • శాస్త్రవేత్తలను అభినందించిన రాష్ట్రపతి, ప్రధాని

 • జీఎస్‌ఎల్‌వీ మార్క్- 3 డీ2ప్రయోగం విజయవంతం

Indian Space Research Organizationసూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) తలపెట్టిన  జీఎస్‌ఎల్‌వీ మార్క్ - 3 -డీ2 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఇస్రో బాహుబలిగా భావించి తలపెట్టిన ఈ ప్రయోగం నిర్ణీత సమయానికి కక్ష్యలోకి చేరుకుంది. బుధవారం సాయంత్రం 5.08 గంటలకు షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి నిప్పులు చెరుగుతూ జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3 డీ2 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. సమాచార వ్యవస్థకు ఉతమిచ్చే జీశాట్ 29 భారీ ఉపగ్రహాన్ని జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3 డీ2 రాకెట్ రోదసిలోకి తీసుకెళ్లింది. ఇస్రో ఇప్పటివరకు చేపట్టిన అన్ని ప్రయోగాల్లో ఇది అత్యంత భారీ రాకెట్ కావడం విశేషం. ఈ రాకెట్ బరువు 640 టన్నులు కాగా, ఉపగ్రహం బరువు 3,423 కిలోలు. రాకెట్ 16.43 నిమిషాలలో భూమికి 207 కి.మీ. ఎత్తుకుచేరుకుని జీశాట్ - 29 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దీంతో ఈ ప్రయోగం విజయవంతమైందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ ఉపగ్రహం జమ్మూ కశ్మీర్, ఉత్తర, ఈశాన్య భారత భూభాగాలలో సేవలు అందించనుంది. కశ్మీర్ లోయలో ఇంటర్నెట్ సేవలకు ఊతమిస్తుంది. ఉపగ్రహం జీవితకాలం పదేళ్లు ఉంటుంది. బెంగళూరులోని ఇస్రో శాటిలైట్ సెంటర్, అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఈ ఉపగ్రహాన్ని రూపొందించాయి. 

తిరుగులేని ఇస్రో
పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలలో తిరుగులేని శక్తిగా ఉన్న ఇస్రో ఇపుడు జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల్లో కూడా సత్తా చాటుతోంది. ఒకప్పుడు ఏఎస్‌ఎల్‌వీ, పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలకే పరిమితమైన ఇస్రో గత ఐదేళ్లుగా జియోసింక్రనైజ్డ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (జీఎస్‌ఎల్‌వీ) ప్రయోగాల్లో సైతం తనకు తిరుగులేదని నిరూపించుకుంటోంది. ఇప్పటి వరకు ఐదు ప్రయోగాలు విజయవంతం కాగా, బుధవారం ప్రయోగించిన జీఎస్‌ఎల్‌వీ మార్క్3 - డీ2 ప్రయోగం 6వది. ఇది తీసుకెళ్లిన ఉపగ్రహం సమాచార రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న విప్లవాత్మకమైన మార్పులను దేశవాళికి అందించేందుకు ఉపయోగపడుతుంది. సమాచార ఉపగ్రహాలు (కమ్యూనికేషన్ శాటిలైట్స్) కనీసం 1800 కిలోల నుంచి 4,500 కిలోల వరకు బరువు ఉంటాయి. ఇంత భారీ  ఉపగ్రహాలను రోదసిలోకి మోసుకెళ్లాలంటే జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3 లాంటి రాకెట్లను అభివృద్ధి చేసుకోవాలని ఇస్రో సంకల్పించింది. పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను నాలుగు దశల్లో  ప్రయోగిస్తే జీఎస్‌ఎల్‌వీని మూడు దశల్లోనే ప్రయోగాన్ని పూర్తి చేసేలా రూపొందించారు. 

అనుకూలించిన వాతావరణం
గత మూడు రోజులుగా బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం శాస్త్రవేత్తలను కలవరపెడుతూ వచ్చింది. కౌంట్‌డౌన్ మొదలు పెట్టినప్పటి నుంచి తుపాను తీరం దాటుతుందేమోనని, దానివల్ల వాతావరణం అనుకూలిస్తుందో.. లేదోనని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతూనే ఉన్నారు. అదృష్టవశాత్తు వాయుగుండం కడలేరు వైపు మరలడం, ఇంకా తీరం దాటకపోవడంతో శాస్త్రవేత్తలు ఊపిరిపీల్చుకుని కౌంట్‌డౌన్‌ను కొనసాగించారు. ఎట్టకేలకు నిర్ణీత సమయానికి జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3 డీ2ను విజయవంతంగా ప్రయోగించారు. 

శాస్త్రవేత్తలకు అభినందనలు
ఇస్రో చేపట్టిన జీఎస్‌ఎల్‌వీ ప్రయోగం విజయవంతం కావడంతో రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఇస్రో చైర్మన్ శివన్‌కు వారు ఫోన్‌చేసి అభినందనలు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు.ఈ కథ నా గురించి కాదు

Updated By ManamWed, 10/31/2018 - 12:00

Rocketryప్రముఖ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘రాకెట్రీ- ద నంబీ ఎఫెక్ట్’. కోలీవుడ్ హీరో మాధవన్ ఇందులో నంబి నారాయణన్ పాత్రలో కనిపించనున్నాడు. అనంత్ మహాదేవన్, మాధవన్ సంయుక్తంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. ట్రై కలర్ ఫిలింస్, వర్గేస్ మూలన్ పిక్చర్స్, సఫ్రోన్ గణేషా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను మాధవన్ విడుదల చేశారు. అందులో ‘‘నేను రాకెట్రీలో 35సంవత్సరాలు, జైలులో 50రోజులు గడిపాను. ఆ 30రోజుల్లో నా దేశం నాకు ఏదైతే మూల్యం చెల్లించిందో దాని గురించే ఈ కథ నా గురించి కాదు’’ అంటూ సినిమా నేపథ్యాన్ని చెప్పుకొచ్చారు. ఇక తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్‌ భాషలలో ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల కానుంది.

కాగా భారత అంతరిక్ష కేంద్రం ఇస్రోలో  శాస్త్రవేత్తగా పనిచేస్తున్న సమయంలో 1994లో ఆయనపై ఓ అబద్ధపు కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో నంబి నారాయణన్ 50రోజులు జైలు శిక్షను అనుభవించారు. అయితే ఈ కేసులో నంబి నారాయణన్ పాత్ర ఏమీ లేదంటూ 1996లో సీబీఐ తేల్చేయడంతో సుప్రీం కోర్టు నంబి నారాయణన్‌పై కేసును కొట్టివేసిన విషయం తెలిసిందే.ఇస్రో సత్తా

Updated By ManamTue, 09/18/2018 - 04:27

అపజయాలను విజయాలుగా మలచుకోవడంలో ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్)కు మంచి అనుభవం ఉందని మరోసారి రుజువైంది. జిఎస్‌ఎల్‌వి-ఎఫ్08 రాకెట్ ద్వారా అత్యాధునిక కమ్యూనికేషన్ జిశాట్-6ఏ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో నిలపడంలో ఇటీవల విఫలమైన ఇస్రో వరుసగా పీఎస్‌ఎల్వీ (పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్) -41, 42 ప్రయోగాలను విజయవంతంగా ప్రయోగించింది. పిఎస్‌ఎల్‌వి-సి41 రాకెట్ ద్వారా ఐఆర్ ఎన్‌ఎస్‌ఎస్-1ఐ భారత ఎనిమిదవ నేవిగేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన తర్వాత పిఎస్‌ఎల్‌వి-సి42 రాకెట్ ద్వారా బ్రిటన్‌కు చెందిన రెండు ఉపగ్రహాలను ఆదివారం విజయవంతంగా కక్ష్యల్లోకి ప్రవేశపెట్టి ఇస్రో మరోసారి తన సత్తా చాటింది. ఆంధ్రప్రదేశ్‌లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (ఎస్‌డీఎస్‌సీ) శ్రీహరికోట హై ఆల్టిట్యూట్ రేంజ్ (షార్) సెంటర్ నుంచి 889 కిలోల బరువున్న భూ పర్యవేక్షక ఉపగ్రహాలైన నోవా ఎస్‌ఏఆర్, ఎస్1-4లను బ్రిటన్ కంపెనీ సర్రే శాటిలైట్ టెక్నాలజీ సూచన మేరకు రాత్రి సమయంలో ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఇస్రో 7వ వాణిజ్య ప్రయోగమైన సీ42 ప్రయోగంతో 243 విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించి నట్లవుతుంది. ఈ ప్రయోగం వల్ల భారత్‌కు రూ.200 కోట్లు ఆదాయం లభించనుంది.

image


అటవీ మ్యాప్‌ల రూపకల్పన, మంచు పర్వతాలు, విపత్తులు, నౌకల రాకపోకల పరిశీలనకు నోవా ఎస్‌ఏఆర్ ఉపయోగపడుతుండగా, సర్వే వన రులు, పర్యావరణ పర్యవేక్షణ, పట్టణాల నిర్వహణకు ప్రణాళికల తయారీ, విపత్తులను గుర్తించడానికి ఎస్1-4 ఉపకరించనుంది. వచ్చే అక్టోబర్‌లో మరో 30 విదేశీ ఉపగ్రహ ప్రయోగ వాణిజ్యంతో ఇస్రో అనుబంధ సంస్థ ఆంట్రిక్స్ అంతరిక్ష వాణిజ్యంలో దూసుకుపోతోంది. రాబోయే రోజుల్లో జీఎస్ ఎల్‌వీ మార్గ్-డి1 ద్వారా జీశాట్-19 ఉపగ్రహాన్ని, జీఎస్‌ఎల్‌వీ మార్గ్-డి2 ద్వారా జీశాట్ -29 ఉపగ్రహాన్ని, జీఎస్‌ఎల్‌వీ మార్గ్-2 ద్వారా జీశాట్-20 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపుతున్నట్లు ఇస్రో ప్రకటించింది. వాటితో పాటు ఏరియన్ రాకెట్ ద్వారా జీశాట్ -11ను ప్రయోగించడంతో ఈ నాలుగు భారీ ఉపగ్రహాల ద్వారా దేశంలో కనెక్టివిటీ పెరిగి, సమాచార రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అదే సమయంలో 2019 జనవరి 3-16లోపు చంద్రయాన్-2 ప్రయోగం కోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. నాలుగేళ్ళ క్రితం అంగారక గ్రహానికి పంపిన ల్యాండర్- రోవర్ ప్రయోగం విజయవంతం కావడానికి ఉపకరించిన జిఎస్‌ఎల్‌వి రాకెట్ సాంకేతికత అభివృద్ధిపై ఆధారపడి  భారత అంతరిక్ష వాణిజ్యం ఉంటుంది. ద్రవ ఇంధనం, క్రయోజెనిక్ సాంకేతికతలను  వినియోగించే  జిఎస్‌ఎల్‌వి రాకెట్ల ఆధారంగా భారీ ఉపగ్రహాలను, సుదూర గ్రహాంతర లక్ష్యాలకు  చేర్చవలసి ఉంటుంది.
రోదసీ ప్రయోగాల్లో కీలకమైన క్రయోజెనిక్ ఇంజన్ రంగంలో కీలకంగా, అగ్రగామిగా పనిచేస్తున్న ప్రముఖ రాకెట్‌మ్యాన్ నంబి నారాయణన్, శివకుమార్ అనే శాస్త్రవేత్తలు 1994లో ఇస్రో గూఢచర్య కేసులో అరెస్టయిన నాటి నుంచి ఆ రంగంలో శాస్త్ర పరిశోధన, స్థానిక సాంకేతికాభివృద్ధి స్థంభించి పోయి, రష్యా క్రయోజెనిక్స్ సహకారంపై ఆధారపడవలసిన దుస్థితి ఇప్పటికీ కొనసాగుతోంది. క్రయోజెనిక్స్ ఇంజన్ విషయంలో మంగళయాన్-2 ప్రయో గం సందర్భంగా వివాదం తలెత్తిన విషయం విచారకరం. 1994లో మాల్దీ వుల దేశస్తురాలు మరియం రషీదాను అరెస్ట్ చేసిన పోలీసు అధికారి భారత్ అంతరిక్ష రంగంలో పురోగతిని దెబ్బతీసేందుకు కుట్ర పన్నిన అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ మార్గదర్శకత్వంలో క్రయోజెనిక్స్ రంగంలో పని చేస్తున్న నంబియార్ అతని సహచరుడు శివకుమార్‌ను ‘గూఢచర్యం’ కేసులో ఇరికించారు. అతి చౌకగా ప్రయోగాలు నిర్వహించే అంతరిక్ష వాణిజ్యంలో భారత్ దూకుడును అడ్డుకునేందుకు అమెరికా కుట్రపన్ని ‘ఇస్రో రాకెట్ ఇంజ న్లకు సంబంధించిన రహస్య డ్రాయింగ్‌లను మరియం ద్వారా పాకిస్థాన్‌కు విక్రయిస్తున్నట్లు’ కేసులో ఇరికించడంతో ఇస్రో క్రయోజెనిక్ ఇంజన్ల తయారీ కార్యక్రమం పూర్తిగా కుంటుపడింది. 1994 నాటి ఇస్రో గూఢచర్యం కేసులో నారాయణన్‌ను అనవసంరంగా ఇరికించి, ఆయనను శారీరకంగా, మానసి కంగా హింసకు గురిచేసారని సుప్రీంకోర్టు పేర్కొని, కేరళ ప్రభుత్వం ఆయ నకు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించడం సంచలనం సృష్టించింది. 24 ఏళ్ళ పాటు నడిచి చివరికి తప్పుడు కేసుగా తేలినందువల్ల నంబి నారాయణన్ వ్యక్తిగత కెరీర్‌ను, జీవితాన్ని నష్టపోయిన మాట నిజమే, అంతకంటే అధికంగా భారత జాతికి అన్యాయం జరిగింది. ఈ గూఢచర్యం కేసు వల్ల భారత క్రయోజెనిక్ ఇంజిన్ అభివృద్ధి కనీసం 15 ఏళ్ళ మేర స్థంభించిపోయింది. ఈ నేపథ్యంలో ఇందుకు బాధ్యులైన ఆనాటి రాజకీయ నాయకులు, అమెరికా గూఢచారి సంస్థ సీఐఏతో అంటకాగిన ఆ పోలీసు అధికారులను జాతిద్రోహులుగా ప్రకటించి, దేశద్రోహానికి పాల్పడినందుకు కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సమగ్ర దర్యాప్తు జరిపి నిగ్గు తేల్చవలసిన అవసరం ఉంది. ఘన ఇంధన ప్రయోగాలు చేసే సమయంలో ప్రమాదానికి గురైన ప్రముఖ శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను ఆ ప్రమాదం నుంచి రక్షించడంలో అత్యాధునిక ద్రవ ఇంధన ప్రయోగ శాస్త్రవేత్త నంబి నారాయణన్ కీలక పాత్ర పోషించారు. కలాం ప్రమాద ఉదంతంతో సహా పలు ఉదంతాలను, ఇస్రో గూఢచర్య కేసులో కుట్ర కోణాలను ‘రెడీ టు ఫైర్‌ఃహౌ ఇండియా అండ్ ఐ సర్వైవ్డ్ ద ఇస్రో స్పై కేస్’ అనే పుస్తకంలో నారాయణన్ వెలువరించారు. సాటి శాస్త్ర వేత్తగా నారాయణన్ చేస్తున్న న్యాయ పోరాటానికి సహకరించవలసిన కలాం ‘ఈ పోరాటాన్ని నిలిపి వేయండి. శిక్షార్హులైన వారికి దేవుని కోర్టులో తప్పక శిక్ష పడుతుందని’ అనగా ‘దేవుని కోర్టులో నా తరఫున వాదించే వారెవరూ’ అని నారాయణన్ సమాధానం ఇచ్చారు. జాతి ప్రయోజనాలు కాపాడడంలో మన పాలకుల వైఖరికి ఈ సంభాషణ అద్దం పడుతుంది. ఉత్పత్తి రంగానికి సమాంతరంగా శాస్త్ర సాంకేతిక పరిశోధన రంగం అభివృద్ధి కావడమన్నది ఆర్థిక వ్యవస్థ పురోగతికి కీలక షరతుగా ఉంటుంది. అలాంటి మన శాస్త్ర వేత్తలకు ప్రోత్సాహం అందించడంలో విఫలమవడమే కాకుండా, వారిని రాజ కీయ, జాతీయ, అంతర్జాతీయ కుట్రల్లో ఇరుక్కోకుండా కాపాడుకోవలసిన బాధ్యత ప్రభుత్వాలది.

ఇస్రోకు భిన్నంగా డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలెప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఒ) వ్యవహరిస్తోంది. దేశీయ, అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను రూపొందించే లక్ష్యంతో ప్రారంభమైన డిఆర్‌డిఒ నేడు అతికొద్ది ప్రాజెక్టులతోనే సరిపెడుతోంది. సాయుధ బలగాల ఆయుధ కొరత, హార్డ్‌వేర్ అవసరాలను తీర్చడంలో డిఆర్‌డిఒ సంస్థ బాగా వెనకబడింది. ఇస్రో అందుకు భిన్నంగా అంతరిక్ష వాణిజ్యంలో అంతర్జాతీయ కాంట్రాక్టులను సంపాదిస్తూ లాభాల బాటలో నడుస్తోంది. గత ఏడాది ఇస్రో ఒకేసారి వందకు పైగా ఉపగ్రహాలను ఒకే రాకెట్ ద్వారా ప్రయోగించి వివిధ కక్ష్యల్లోకి విజయవంతంగా ప్రవేశ పెట్టింది. దానికితోడు, ఆధునిక శాస్త్రసాంకేతిక పరిజ్ఞానమంతా ఉపగ్రహ ఆధారిత సేవలపైనే ఆధారపడి ఉంటుంది. అందువల్ల భవిష్యత్‌లో ఇస్రో దేశానికి అత్యంత విలువైన సేవలను అందించగలదు. అంతరిక్ష శాస్త్ర సాంకేతికత భవిష్యత్ గ్లోబల్ వాణిజ్య పోటీకి పునాదిగా ఉంటుంది. అంతర్జాతీయ అభివృద్ధి పోటీలో భారత్ అగ్రగామి దేశాల సరసన నిలిచేందుకు ఇస్రో విజయాలు అత్యంత కీలకమైనవి. మరో గ‘ఘన’ విజయం

Updated By ManamSun, 09/16/2018 - 22:22
 • రోదసీలోకి పీఎస్‌ఎల్‌వీ సీ- 42

 • రాత్రి 10.08 గంటలకు ప్రయోగం

 • కక్ష్యలోకి రెండు ఇంగ్లండ్ ఉపగ్రహాలు

 • ఇస్రో ఆదాయం రూ.1,100 కోట్లు  

 • అగ్రదేశాలకు అంతరిక్ష పరిశోధన సేవలు

isroసూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పీఎస్‌ఎల్‌వీ సీ-42 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఆదివారం రాత్రి 10:08 గంటలకు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మొదటి ప్రయోగ వేదిక నుంచి గోధుమ వర్ణ నిప్పులు చెరుగుతూ పీఎస్‌ఎల్‌వీ సీ-42 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఇస్రో విజయాశ్వం పీఎస్‌ఎల్‌వీ శాస్త్రవేత్తల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చింది. అగ్రదేశాలకు అంతరిక్ష సేవలు అందించే దిశగా ఇస్రో ముందడుగు వేసింది. ప్రపంచ అగ్రదేశాల్లో ఒకటైన ఇంగ్లండ్‌కు చెందిన రెండు ఉపగ్రహాలను మోసుకెళుతూ పీఎస్‌ఎల్‌వీ రాకెట్ లక్ష్యాన్ని చేరుకుంది. సరిగ్గా భూమికి 583 కి.మీ ఎత్తులో ఇంగ్లండ్‌కు చెందిన 483 కిలోల నోవాసర్ ఎస్, 444 కిలోల ఎస్ 1-4 ఉపగ్రహాలను భూమధ్య రేఖకు 97.80 డిగ్రీల వాలులో, 140 డిగ్రీల దిగాంశంపై సూర్య సమస్థితి కక్ష్యలో నిర్ణీత 17.44 నిమిషాలకు కక్ష్యలోకి విజయవంతంగా చేర్చింది. ఇస్రో చరిత్రలో ఇప్పటి వరకు 43 పీఎస్‌ఎల్‌వీ రాకెట్లను ప్రయోగించగా 41 ప్రయోగాలు విజయవంతం కావడం విశేషం. కేవలం రెండు పీఎస్‌ఎల్‌వీ రాకెట్లు మాత్రమే విఫలమైయ్యాయి. మొదటి ప్రయోగ వేదిక నుంచి 33 ప్రయోగాలు విజయవంతం కావడం ఇస్రో చరిత్రలో మరో మైలురాయి. 

ఇస్రోకు రూ.1100 కోట్ల వాణిజ్య ఆదాయం
పీఎస్‌ఎల్‌వీ సీ-42 రాకెట్ విజయవంతం కావడంతో ఇస్రోకు రూ.1100 కోట్లు ఆదాయం లభించినట్లు అయింది. దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చిన్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపుతూ వర్శిటీ ప్రయోగ పరిశోధనలకు ఇస్రో ఉపయుక్తమైన సేవలు అందిస్తూ వచ్చింది. మంగళయాన్, చంద్రయాన్, విజయాల తరువాత ప్రపంచ దేశాలు గర్వించే స్థాయికి ఇస్రో ఎదిగింది. అంతేకాకుండా ఒకే రాకెట్ ద్వారా 103 ఉపగ్రహాలను రోదసీలోకి పంపి అంతరిక్ష ప్రయోగాల్లో భారతదేశానికి తిరుగే లేదని ఇస్రో కీర్తిబావుటాను ఎగురవేసింది. చంద్రయాన్, మంగళయాన్ లాంటి గ్రహాంతర ప్రయోగాలే కాకుండా దేశ దిక్సూచి వ్యవస్థకు మెరుగైన సేవలు అందించే దిశగా ఇస్రో కృషి చేసింది. ఒకే సిరీస్ లో ఏడు ప్రయోగాలు నిర్వహించి దేశ దిక్సూచి వ్యవస్థకు పటిష్టమైన పునా దులు ఏర్పాటు చేసింది. నావిగేషన్ విధానంలో ప్రపంచ దేశాలకు దీటుగా ఇస్రో వ్యవహరించింది. 16 నిమిషాల్లో అంతరిక్షంలోకి.. 

Updated By ManamTue, 08/28/2018 - 23:03
 • దేశ తొలి మానవ సహిత ఉపగ్రహం

 • అడుగుపెట్టనున్న ముగ్గురు భారతీయులు

 • 2022 నాటికి గగన్‌యాన్ ప్రారంభం

 • ప్రాజెక్టుపై ఇస్రో చైర్మన్ శివన్ ప్రజెంటేషన్ 

imageన్యూఢిల్లీ: అంతరిక్ష ప్రయోగాల్లో ఎన్నో విజయాలు సాధిస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సిద్ధమవుతోంది. దేశ తొలి మానవ సహిత అంతరిక్ష ఉపగ్రహాన్ని శ్రీహరికోటలో ప్రయోగించిన తర్వాత కేవలం 16 నిమిషాల్లో అందులో ఉన్న ముగ్గురు భారతీయులు అంతరిక్షానికి చేరుకుంటారు. వారు అంతరిక్షంలో ఐదు నుంచి ఏడు రోజుల పాటు పరిశోధనలు చేయనున్నారు. తరువాత గుజరాత్ తీరంలోని అరేబియా సముద్రంపై ల్యాండ్ కానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నిర్దేశించిన గడువు 2022 నాటికి ‘గగన్‌యాన్’ను ఇస్రో ప్రారంభించనుంది. ఢిల్లీలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఇస్రో చైర్మన్ కె.శివన్ ఈ విషయాలను వెల్లడించారు. ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో మోదీ.. 2022 నాటికి గగన్‌యాన్ చేపడుతున్నట్టు పేర్కొన్నారు. మోదీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నట్టు ఇస్రో చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర అంతరిక్ష, అణు ఇంధన శాఖ మంత్రి జితేందర్ సింగ్ పాల్గొన్నారు.

కేంద్ర మంత్రి సమక్షంలో దేశ తొలి మానవ సహిత అంతరిక్ష ప్రయోగంపై శివన్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇందులో ముగ్గురు భారతీయులు అంతరిక్షానికి వెళతారని తెలిపారు. శ్రీహరికోటలో ఉపగ్రహాన్ని ప్రయోగించిన తర్వాత 16 నిమిషాల్లో అంతరిక్షంలోకి చేరుకుంటారని, అక్కడ భారత శాస్త్రవేత్తలు పలు ప్రయోగాలు చేస్తారని వెల్లడించారు. అంతరిక్షం నుంచి తిరుగు ప్రయాణానికి 36 నిమిషాలు సమయం పడుతుందని వెల్లడించారు. ల్యాండ్ అయ్యే సమయంలో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే ప్రత్నామ్నాయ ఏర్పాట్లను సిద్ధం చేసుంటామని శివన్ తెలిపారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టుకు 10 వేల కోట్ల రూపాయల లోపు వ్యయం అవుతుందని అంచనా వేసినట్టు తెలిపారు. 2022లోగా 30 నెలల కాలవ్యవధిలో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని వెల్లడించారు. మానవ సహిత ఉపగ్రహాన్ని ప్రయోగించిన నాలుగో దేశంగా భారత్ ఘనత సాధించనుందని తెలిపారు. మిత్ర దేశాల్లోని అంతరిక్ష సంస్థల సహకారాన్ని ఇస్రో తీసుకుంటుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.చంద్రయాన్-2 మరోసారి వాయిదా

Updated By ManamMon, 08/06/2018 - 02:18

imageన్యూఢిల్లీ: చంద్రుడిపైకి మానవ సహిత ప్రయోగం జరపడమే ఉద్దేశంగా ప్రారంభించిన చంద్రయాన్-2 ప్రయోం మరోసారి వాయిదా పడింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ చంద్రయాన్-2ను ప్రయోగించాలని ఇస్రో భావించినా.. వివిధ సాంకేతిక కారణాలతో ఈ ఏడాది అక్టోబరుకు వాయిదా పడింది. అయితే.. ఇస్రో ప్రయోగించిన జీశాట్-6ఏ, జీశాట్-11 ఉపగ్రహాల ప్రయోగం విఫలం కావడంతో చంద్రయాన్-2 ప్రయోగాన్ని వాయిదా వేయాలని, వచ్చే ఏడాది జనవరిలో ప్రయోగించాలనే భావనలో ఇస్రో ఉన్నట్లు తెలుస్తోంది.ఇస్రో మరో సరికొత్త ప్రయోగం..

Updated By ManamThu, 07/05/2018 - 17:17
 • వ్యోమగాముల రక్షణకు మరో ప్రయోగం

 • క్రూ ఎస్కేప్ సిస్టంను పరీక్షించిన ఇస్రో

ISRO

న్యూఢిల్లీ: అంతరిక్ష ప్రయోగాలలో వ్యోమగాముల భద్రత కోసం ఇస్రో మరో సరికొత్త ప్రయోగాన్ని  గురువారం  నిర్వహించింది. అనుకోని ప్రమాదాలు ఎదురైనపుడు రాకెట్‌లోని వ్యోమగాములు తమను తాము రక్షించుకునేందుకు ‘క్రూ ఎస్కేప్ సిస్టం’ను పరీక్షించింది. మానవ సహిత ప్రయోగాలలో ఈ సాంకేతికత అత్యంత కీలకమైందని ఇస్రో వెల్లడించింది. గురువారం నాడు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించారు. 

ప్యాడ్ అబార్ట్ టెస్ట్ పేరుతో నిర్వహించిన ఈ ప్రయోగంలో భాగంగా వ్యోమనౌకలో సిబ్బంది ఉండే భాగాన్ని విడదీసే ప్రక్రియ సాఫీగా జరిగిపోయింది. భవిష్యత్తులో రోదసీలోకి మానవ సహిత ప్రయోగాలు చేయాలని ఇస్రో యోచిస్తున్న నేపథ్యంలో ఈ క్రూ ఎస్కేప్ సిస్టం అత్యంత కీలకంగా మారనుంది. ల్యాంచ్ ప్యాడ్లో ఏదైనా ప్రమాదం జరిగితే, ఆ సమయంలో వ్యోమగాములు సురక్షితంగా బయటపడే ప్రక్రియను క్రూ ఎస్కేప్ సిస్టమ్ ద్వారా పరీక్షించారు.

ప్రయోగ కేంద్రంలో ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పరీక్షలో భాగంగా తొలుత క్రూ ఎస్కేప్ సిస్టం మాడ్యుల్ ప్రయోగానికి ఐదు గంటల కౌంట్ డౌన్ నిర్వహించారు. అనంతరం 12.6 టన్నుల బరువున్న ఈ మాడ్యుల్ గాలిలోకి ఎగిరింది. బంగాళాఖాతం సముద్ర ఉపరితలంపై ఈ మాడ్యూల్ నుంచి ప్యారాచూట్లు వేరుపడి సముద్రంలో పడ్డాయి. మాడ్యుల్ కూడా సముద్రంలో కూలిపోయింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని సెన్సార్ల ద్వారా రికార్డింగ్ చేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.ఇస్రో కేంద్రంలో అగ్నిప్రమాదం

Updated By ManamThu, 05/03/2018 - 22:05
 • 20 అగ్నిమాపక వాహనాల మోహరింపు

isroఅహ్మదాబాద్: అహ్మదాబాద్‌లో ఇస్రోకు చెందిన స్పేస్ అప్లికేషన్ సెంటర్‌లో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్)కు చెందిన ఓ జవాను గాయపడ్డారు. మంటలను అదుపుచేయడానికి 20కి  పైగా అగ్నిమాపక వాహనాలను మోహరించాల్సి వచ్చింది. మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో ఎవరైనా గాయపడే ప్రమాదం ఉందని.. ముందుజాగ్రత్తగా 10 అంబులెన్సులను కూడా అక్కడకు తరలించారు. భారీ యంత్ర సామగ్రి ఉండే 37వ నెంబరు భవనంలో ముందుగా మంటలు చెలరేగినట్లు చెబుతున్నారు. షార్ట్ సర్క్యూటే ఈ ప్రమాదానికి కారణం కావచ్చని ప్రాథమిక అంచనా. అహ్మదాబాద్ జిల్లా కలెక్టర్ కూడా హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు.చరిత్ర ఎరుగని ప్రయోగానికి ఇస్రో సిద్ధం

Updated By ManamSun, 02/04/2018 - 11:56
 • చంద్రయాన్-2తో చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్‌కు సన్నద్ధం

ISRO On For Landing On Moon's South Poleముంబై: రెండోసారి చంద్రుడిపైన అడుగు పెట్టేందుకు భారత్ సిద్ధమవుతోంది. అంతేకాదు, చరిత్ర కనీవినీ ఎరుగని సవాల్‌ను స్వీకరించేందుకు సన్నద్ధమవుతోంది. చందమామ దక్షిణ ధ్రువంపై తనదైన ముద్ర వేసేందుకు చంద్రయాన్-2 కోసంతయారవుతోంది. అనేక సవాళ్లతో కూడుకున్న ఈ ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సంకల్పించింది. చంద్రుడి దక్షిణ ధ్రువంలో రెండు ప్రదేశాలను గుర్తించామని, అందులో ఏదో ఒక దానిని ఎంపిక చేసుకుంటామని, ఆయా ప్రదేశాల్లో ప్రయోగం చేసేందుకు ఇప్పటి వరకు ఏ దేశం కూడా ప్రయత్నించలేదని, తొలిసారిగా భారత్ అందుకు సంకల్పించిందని ఇస్రో మాజీ చైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ తెలిపారు. దానికి సంబంధించి చంద్రయాన్-2 హార్డ్‌వేర్ సిద్ధమవుతోందని ఆయన చెప్పారు. 2018 ప్రథమార్ధం లేదంటే ద్వితీయార్ధంలో ఈ ప్రయోగాన్ని నిర్వహించే అవకాశాలున్నాయని చెప్పారు. జీఎస్ఎల్వీ మార్క్-2 ద్వారా ఈ ప్రయోగాన్ని నిర్వహించబోతున్నట్టు తెలిపారు. ఆ ప్రయోగ సన్నద్ధ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే తమిళనాడుల మహేంద్రగిరిలోని ఇస్రో లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టం సెంటర్‌లో ల్యాండింగ్ సిమ్యులేషన్ (కృత్రిమ వాతావరణాన్ని సృష్టించి ప్రయోగాన్ని చేపట్టడం)ను చేస్తోంది ఇస్రో. అందులో భాగంగా 70-80 మీటర్ల ఎత్తు నుంచి చంద్రుడి వాతావరణానికి అనుగుణంగా ల్యాండింగ్ ప్రక్రియపై ప్రయోగాలు చేస్తోంది. కార్టోశాట్-2 పంపిన తొలి ఫొటో ఇదే

Updated By ManamTue, 01/16/2018 - 21:12
isro

శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి ఇస్రో శుక్రవారం ప్రయోగించిన స్వదేశీ ఉపగ్రహం కార్టోశాట్-2 సిరీస్ పని మొదలుపెట్టింది. గగనతలం నుంచి ఈ ఉపగ్రహం తొలి ఫొటోను ఇస్రో కంట్రోల్ రూంకు పంపింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో ఓ ప్రాంతాన్ని ఫొటో తీసి పంపింది. ఈ ఫొటో మధ్యలో హోల్కర్ క్రికెట్ స్టేడియం ఉంది. 

2018లో ఇస్రో విజయవంతంగా చేపట్టిన తొలి ప్రయోగం ఇది. పీఎస్ఎల్వీ-సీ40 ప్రాజెక్టులో భాగంగా ఒకేసారి రోదసిలోకి పంపిన 31 ఉపగ్రహాల్లో కార్టోశాట్-2 సిరీస్ ఉపగ్రహం ఒకటి. ఈ ప్రయోగంలో పంపిన మిగిలిన శాటిలైట్లను కూడా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.  

Related News