demonetisation

రూ.కోటి విలువైన రద్దైన నోట్లు సీజ్..

Updated By ManamMon, 09/03/2018 - 14:02
Police arrested four men with demonetised notes with the face value of Rs 1 crore

చెన్నై : పెద్ద నోట్లు రద్దు చేసి ఏడాదిన్నర పూర్తి కావస్తున్నా... ఇంకా ఆ నోట్లు పెద్ద ఎత్తున వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా తమిళనాడు మధురైలో రూ.కోటి విలువైన పెద్ద నోట్లను నిన్న పోలీసులు సీజ్ చేశారు. ఇందుకు సంబంధించిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఓ కారులో ఈ నగదును తరలిస్తుండగా... వాహనాల తనిఖీల్లో భాగంగా ఈ నోట్లు బయటపడ్డాయి. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.బడా బాబుల కోసమే మోదీ నోట్ల రద్దు

Updated By ManamThu, 08/30/2018 - 17:44
Rahul Gandhi

న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. డీమానిటైజేషన్ కష్టాలు ఇంకా దేశ ప్రజలను వెంటాడుతున్నాయని ఆయన అన్నారు. న్యూఢిల్లీలోని ఐఏసీసీ ప్రధాన కార్యాలయంలో గురువారం రాహుల్ గాంధీ ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు.

నోట్ల రద్దుతో నష్టపోయిన వ్యాపారులు, యువతకు మోదీ సమాధానం చెప్పాలన్నారు. నోట్ల రద్దుతో ఒరిగిందేమీ లేదని, దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. బడా బాబుల కోసమే ప్రధాని పెద్దనోట్లను రద్దు చేశారన్నారు. దేశంలోని 15మంది పారాశ్రామికవేత్తల కోసమే నోట్ల రద్దు నిర్ణయమని విమర్శించారు.

రాఫెల్ యుద్ధ విమానాల కుంభకోణంలో రిలయన్స్  అనీల్ అంబాని ఎన్ని పరువు నష్టం దావాలు వేసుకోవచ్చని రాహుల్ సవాల్ విసిరారు. అలాగే రాఫెల్ స్కామ్‌పై జేపీసీ వేయమంటే కేంద్రం భయపడుతోందని అన్నారు. పన్నులు కట్టలేదు సరికదా.. జవాబూ లేదు

Updated By ManamMon, 01/22/2018 - 14:55
 • 2 లక్షల మందికి నోటీసులు.. అయినా ఒక్కరైనా స్పందిస్తేనా

 • నోటీసుల మీద నోటీసులు పంపినా చీమ కుట్టినట్టైన లేని ఎగవేతదారులు

2 lakh people Under lens for Over 20 lakh depositsన్యూఢిల్లీ: నోట్ల రద్దు సమయంలో రూ.20 లక్షలకు పైబడిన పాత 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన 2 లక్షల మందికి ప్రభుత్వం పన్ను నోటీసులను పంపింది. అయితే, ఏ ఒక్కరూ పన్నులు కట్టలేదు సరికదా.. ఆ నోటీసులకు కనీసం సమాధానం కూడా ఇవ్వలేదు. ‘‘వారికి మేం చాలా ఎక్కువ సమయం ఇచ్చాం. వార్షిక రిటర్న్స్‌లో భాగంగా నోటీసులు అందుకున్న వారు ముందుకు వచ్చి పన్నులు కడతారని భావించాం. కానీ, వాళ్లు మా నోటీసులను పట్టించుకోనైనా పట్టించుకోలేదు. ఎన్నిసార్లు వారికి నోటీసుల మీద నోటీసులు పంపినా వారి నుంచి స్పందన శూన్యం’’ అని ఓ సీనియర్ ఆదాయ పన్ను అధికారి నిట్టూర్చారు.

పన్ను ఎగవేత దారులు పన్నులు ఎగ్గొట్టి దర్జాగా రోడ్లమీద తిరగకుండా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ).. దేశవ్యాప్తంగా పన్ను రికవరీ చర్యలను ప్రారంభించింది. ఎగవేతదారులపై ఓ కన్నేసి ఉంచి పన్ను వసూళ్లకు వారి చుట్టూ తిరగాల్సిందిగా పలువురు అధికారులను సీబీడీటీ చైర్మన్ సుశీల్ చంద్ర ఆదేశించినట్టు ఆదాయ పన్ను శాఖ వర్గాలు చెబుతున్నాయి. తద్వారా నిజాయతీగా పన్ను చెల్లించే వారికి రివార్డులిచ్చేందుకు నిర్ణయించారని అంటున్నాయి. కాగా, పన్ను ఎగ్గొడుతున్న వారి వివరాలను పూర్తిగా సేకరించాక.. 2016 నోట్ల రద్దు సమయంలో రూ.5 లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ మొత్తాలతో బ్యాంకుల్లో జమ అయిన 18 లక్షల అనుమానిత డిపాజిట్లను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.

అందులో 12 లక్షల డిపాజిట్లను ఆదాయ పన్ను శాఖ పోర్టల్ ద్వారా వెరిఫై చేశారు. ఆ వెరిఫైలో దాదాపు రూ.2.9 లక్షల కోట్ల అనుమానిత డిపాజిట్లు దాఖలైనట్టు తేలింది. మొత్తంగా ఐదు లక్షల డిపాజిట్లపై ఎవరూ వెరిఫికేషన్ కోసం రాలేదని తేలింది. దీంతో వారిని పక్కనపెట్టేసిన ప్రభుత్వం.. ముందు రూ.50 లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ డిపాజిట్ చేసిన 70 వేల మంది వెనక పడింది. ఇప్పుడు అందులో భాగంగానే 20 లక్షలకు పైబడి డిపాజిట్లు చేసిన వారికి తాఖీదులిచ్చినా ఒక్కరూ కూడా స్పందించలేదు. ఆ తాఖీదులకు స్పందించని వారికి వ్యవస్థలపై ఉన్న నమ్మకం ఏపాటిదో ఈ ఉదంతమే ఉదహరిస్తుంది. నోట్ల రద్దు.. అన్నీ లోపాలే

Updated By ManamSun, 11/19/2017 - 12:48
 • నిర్ణయం సరైనదే అయినా అమలు సరిగ్గా లేదు.. 2000 నోటుతో ప్రధాన ఉద్దేశం దెబ్బతిన్నది

 • పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆ నోటు ఎందుకు.. అమెరికా ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత రిచర్డ్ థాలర్

US Economist Nobel Laureate Richard Thalerన్యూఢిల్లీ, నవంబరు 19: భారత ప్రభుత్వ నోట్ల రద్దు నిర్ణయం ‘సరైనదే’ అయినా, దాని అమలులో మాత్రం అడుగడుగునా ‘లోపాలే’ ఉన్నాయని అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత రిచర్డ్ థాలర్ అభిప్రాయపడ్డారు. పెద్ద నోట్లను రద్దు చేశాక 2000 నోటును అసలు ఎందుకు ప్రవేశపెట్టారో అర్థం కాని విషయమని, నగదు రహిత సమాజం కోసం, అవినీతి నిర్మూలన కోసం పెద్ద నోట్లను రద్దు చేశాక కూడా మరో పెద్ద నోటును తీసుకొచ్చి  నోట్ల రద్దు ప్రధాన ఉద్దేశాన్ని తుంగలో తొక్కేశారని ఆయన అన్నారు. నోట్ల రద్దుపై అభిప్రాయాలను చెప్పాల్సిందిగా షికాగో యూనివర్సిటీ ప్రొఫెసర్‌ విద్యార్థి అయిన స్వరాజ్ కుమార్ అనే వ్యక్తి ఆయన్ను సంప్రదించడంతో థాలర్ ఈ విధంగా స్పందించారు. ఈ మెయిల్స్ ద్వారా వారిద్దరి మధ్య జరిగిన సంభాషణను కుమార్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అనంతరం ఆ ట్వీట్‌ను థాలర్ రీట్వీట్ చేశారు. వాస్తవానికి గత ఏడాది నవంబరు 8 నుంచి రూ.500, రూ.1000 నోట్లు చెల్లబోవంటూ నరేంద్ర మోదీ చేసిన ప్రకటనను థాలర్ సమర్థించారు. ఈ విధానాన్నే అమలు చేయాలని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని, నగదు రహిత సమాజం కోసం, అవినీతి నిర్మూలన కోసం అదో మంచి నిర్ణయం అని ఆయన ఆనాడే మోదీ నిర్ణయానికి మద్దతు తెలిపారు. తాజాగా నిర్ణయం మంచిదే అయినా అమలు మాత్రం బాగాలేదని వ్యాఖ్యానించారు. 'నోట్ల రద్దు దేశ ఆర్థిక వ్యవస్థలో తిరోగమనం'

Updated By ManamWed, 11/08/2017 - 11:02
 • విపక్ష నేత షబ్బీర్ అలీ విమర్శ

Shabbir Ali, Telangana assembly sessions, demonetisation (857), Adjournments of Motions (2174)హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు నేటితో ఏడాది కావడంతో తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో విపక్ష సభ్యులు చర్చ జరపాలని డిమాండ్ చేశారు. నోట్ల రద్దుపై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తీర్మానాన్ని మొదటగా చర్చించి సభ నడపాలని సభ్యులు పట్టుబట్టారు. కానీ, కాంగ్రెస్ ఇచ్చిన తీర్మానాన్ని మండలి చైర్మన్ స్వామిగౌడ్ తిరస్కరించడంతో సభ నుంచి వారు వాకౌట్ చేశారు. అనంతరం మండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ... నోట్ల రద్దు కారణంగా 102 మంది వరకు మరణించారని విమర్శించారు. ఇంతటి ముఖ్యమైన సమస్య పై ముందే చర్చ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.

నోట్ల రద్దు దేశ ఆర్థిక వ్యవస్థలో తిరోగమనంగా అభివర్ణించవచ్చునని అన్నారు. అంతకుముందు సభ మొదలవగానే స్పీకర్ మధుసూదనాచారి ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అలాగే వివిధ అంశాలపై విపక్షాలు వాయిదా తీర్మానాన్ని ఇచ్చాయి. పారదర్శక వ్యవసాయం, సమగ్ర నీటి ప్రణాళికల రూపకల్పనపై టీ.టీడీపీ, నోట్ల రద్దు తర్వాత పరిణామాలు, భారత ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావంపై కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చాయి.జీఎస్టీని సమూలంగా మార్చేస్తాం

Updated By ManamTue, 11/07/2017 - 13:47
 • 2019లో అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఊరటనిస్తాం.. అవినీతి అనే ఒక్క అంశాన్నే మోదీ పట్టుకున్నారు

 • హిమాచల్‌లో అవినీతి తక్కువని నీతి ఆయోగ్ చెప్పింది.. గుజరాత్‌తో పోలిస్తే అన్ని అంశాల్లోనూ మెరుగే

 • మోదీ.. మీ ఉపాధి కల్పన హామీ ఎటుపోయింది?.. వ్యాపం, లలిత్ మోదీ కుంభకోణాలపై మాట్లాడరా?

 • ప్రస్తుత జీఎస్టీ కాంగ్రెస్ రూపొందించింది కాదు.. కాంగ్రెస్ రూపొందించిన జీఎస్టీ విధివిధానాలు వేరే

 • నోట్ల రద్దుతో పేదల సొమ్మును దోచుకున్నారు.. డిపాజిట్ అయిన నల్లధనమంతా ఏమైందో మోదీ చెప్పాలి

 • మోదీ గొప్పలు చెప్పడంలో దిట్ట.. పనిలో తక్కువ.. కేంద్ర ప్రభుత్వం, మోదీపై రాహుల్ గాంధీ మండిపాటు 

Rahul Gandhi speaks in Himachal Pradesh Election Rallyనహన్ (హిమాచల్‌ప్రదేశ్), నవంబరు 7: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. సోమవారం హిమాచల్ ప్రదేశ్‌లోని పౌంతా సాహిబ్, చంబ, నగ్రోతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీలపై విమర్శల వర్షం కురిపించారు. 2019లో అధికారంలోకి వచ్చాక వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ)ని సమూలంగా మార్చేసి వినియోగదారులు, పలు వర్గాల వ్యాపారులకు ఊరట కలిగిస్తామని ఆయన అన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి మారుపేరుగా మారిందన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపైనా ఆయన మండిప్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే హిమాచల్ ప్రదేశ్‌లోనే అవినీతి చాలా తక్కువగా ఉందని నీతి ఆయోగ్ నివేదికలోనే తేటతెల్లమైందని ఆయన అన్నారు. బీజేపీ పాలిత గుజరాత్‌తో పోలిస్తే కాంగ్రెస్ పాలిత హిమాచల్ ప్రదేశ్‌లో పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని, అన్ని రంగాల్లోనూ అభివృద్ధిలో దూసుకుపోతోందని నీతి ఆయోగ్ నివేదికను ఉటంకిస్తూ మోదీపై విమర్శలు కురిపించారు. అవినీతి అనే ఒక్క అంశాన్నే పట్టుకుని మోదీ మాట్లాడుతున్నారని, బీజేపీ హామీ ఇచ్చిన ఉద్యోగ కల్పన ఎటు పోయిందని ఆయన ప్రశ్నించారు.

కాంగ్రెస్ విమర్శిస్తున్న జీఎస్టీని రూపొందించిందే ఆ పార్టీ అని బీజేపీ నేతల వ్యాఖ్యలపైనా ఆయన స్పందించారు. ప్రస్తుతం మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్టీని రూపొందించింది కాంగ్రెస్ కాదని, కాంగ్రెస్ రూపొందించిన జీఎస్టీ వేరని ఆయన చెప్పారు. 28 శాతం పన్నుపోటుతో కేంద్రం జీఎస్టీని అమలు చేస్తోందని, అదీ గాక పన్ను దాఖలుకు సంబంధించి అది చాలా క్లిష్టతరమైన విధానమని, తద్వారా చాలా మంది వ్యాపారాలు నష్టాలను చవిచూస్తున్నాయని మండిపడ్డారు. నోట్ల రద్దు వార్షికోత్సవం సందర్భంగా నవంబరు 8న ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని, అందులో ప్రధానంగా నోట్ల రద్దు వల్ల చిరు వ్యాపారులు, యువత, మహిళలు, రైతులు ఎదుర్కొన్న సమస్యలనే ఎత్తిచూపుతామని ఆయన అన్నారు. మోదీ ఊ.. అంటే అవినీతి గురించే మాట్లాడుతున్నారని, అలాంటప్పుడు వ్యాపం కుంభకోణం గురించిగానీ, లలిత్ మోదీ చేసిన కుంభకోణం గురించి గానీ, బీజేపీ నేతలు ఇరుక్కున్న కుంభకోణాల గురించిగానీ మారు మాటైనా ఎందుకు మాట్లాడడం లేదని రాహుల్ ప్రశ్నించారు. జై షా పాల్పడిన అవినీతి గురించి ఒక్క మాటైనా మాట్లాడలేదని ఆరోపించారు.

మోదీ ప్రభుత్వం ఉపాధి అవకాశాలను మృగ్యం చేసేసిందని ఆరోపించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న బీజేపీ హామీ ఏమైపోయిందని ప్రశ్నించారు. నోట్లరద్దు, జీఎస్టీ పుణ్యమా అని భారీ సంఖ్యలో ఉద్యోగాలు పోవడమే కాకుండా ఉద్యోగ కల్పన అన్నదే లేకుండా పోయిందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల నిరుద్యోగ యువతకు ఒరిగిందేమీ లేదని, బీజేపీ కార్పొరేట్ మిత్రులే ఆ విధానాల వల్ల లాభపడ్డారని ఆరోపించారు. ప్రధానమంత్రి ప్రధాన కర్తవ్యం యువతకు ఉపాధి కల్పించడమేనని, అలా చేయకుండా దేశ యువతను మోదీ మోసం చేశారని అన్నారు. నోట్ల రద్దు నిర్ణయంతో పేద ప్రజలు చెమటోడ్చి సంపాదించిన డబ్బును దోచుకున్నారన్నారు. నోట్లరద్దు సమయంలో బ్యాంకుల్లో డిపాజిట్ అయిన నల్లధనమంతా ఏమైందో దేశ ప్రజలకు ప్రధాని మోదీ చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. బీజేపీ అబద్ధపు హామీలు, నోట్ల రద్దు, జీఎస్టీ వంటి వాటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.

‘‘ఇక్కడ రెండు రకాల జనం ఉంటారు. ఒకటి కేవలం పనిని మాత్రమే నమ్మేవాళ్లు. రెండు.. పనిచేయకుండా గొప్పలు చెప్పుకొనేవారు’’ అని తన నానమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్ గాంధీలను ఉటంకిస్తూ మోదీపై రాహుల్ విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ గొప్పలు చెప్పుకోవడంలో దిట్ట అని, పని చేయడంలో మాత్రం శూన్యం అని రాహుల్ ఎద్దేవా చేశారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ భగవద్గీత సారాంశాలను అనుసరిస్తున్నారని, గీతలో చెప్పిన ‘పని చేయి ఫలితం గురించి ఆలోచించకు’ అన్న మాటలకు అనుగుణంగానే పనిచేస్తున్నారని రాహుల్ ప్రశంసలు కురిపించారు. కాగా, సిర్మూర్ జిల్లాలోని ట్రాన్స్-గిరి ప్రాంతానికి గిరిజన హోదా ఇచ్చేందుకు అనుకూలమేనని, కేంద్రం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లానని హిమాచల్ సీఎం వీరభద్ర సింగ్ తెలిపారు. బీజేపీ తప్పుడు ఆరోపణలకు బెదిరేది లేదని, రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌తోనే ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 80% పెరిగిన డిజిటల్ చెల్లింపులు

Updated By ManamSat, 11/04/2017 - 12:13
 • నోట్ల రద్దు వల్ల భారీగా తగ్గిన ద్రవ్య చలామణీ.. అక్టోబరు నాటికి వెయ్యి కోట్ల డిజిటల్ చెల్లింపులు

 • 2017-18 నాటికి 1800 కోట్లకు పెరిగే అవకాశం.. భీం-యూపీఐ ద్వారా 7,057 కోట్ల లావాదేవీలు

 • కేంద్ర సమాచార శాఖ గణాంకాల్లో వెల్లడి

digital payments representationalన్యూఢిల్లీ, నవంబరు 4: నోట్లరద్దు వల్ల కొంతకాలం పాటు సామాన్య జనం ఇబ్బందులు పడినా.. ‘ద్రవ్య’ చలామణీ చాలా వరకు తగ్గిందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. నోట్ల రద్దు పుణ్యమా అని డిజిటల్ లావాదేవీలు (కార్డు చెల్లింపులు) 80 శాతం పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. 2017-18 కాలానికి డిజిటల్ లావాదేవీల విలువ రూ.1,800 కోట్లు ఉండొచ్చని అంచనా. అంతేకాదు.. ఈ ఏడాది అక్టోబరు నాటికి డిజిటల్ రూపేణా రూ.వెయ్యి కోట్ల చెల్లింపులు జరిగినట్టు సమాచార సాంకేతిక శాఖ విడుదల చేసిన గణాంకాలు వివరిస్తున్నాయి. ఆ గణాంకాల ప్రకారం.. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో సగటున రూ.136 కోట్ల నుంచి రూ.138 కోట్ల డిజిటల్ చెల్లింపులు జరిగాయి. అయితే, మార్చి, ఏప్రిల్ నెలల్లో మాత్రం అత్యధికంగా రూ.156 కోట్లు (ఒక్కో నెలలో) డిజిటల్ చెల్లింపులు జరిగాయి. అప్పటికీ నోట్లరద్దు జరిగి ఐదు నెలలే కావడం, సరిపడా ద్రవ్య చలామణీ లేకపోవడమూ డిజిటల్ చెల్లింపులు పెరగడానికి దోహదపడిందని నిపుణులు అంటున్నారు. నోట్ల రద్దు ప్రకటన వెలువడిన గత ఏడాది నవంబరు నుంచే యూపీఐ-భీం, ఐఎంపీఎస్, ఎం-వాలెట్, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా లావాదేవీలు పెరిగాయని పార్లమెంట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ పేర్కొంది.

అంతేగాకుండా ‘జనధన్-ఆధార్-మొబైల్’ ఖాతాలు కూడా భారీ సంఖ్యలో పెరిగాయని వివరించింది. ప్రభుత్వానికి వచ్చే చెల్లింపులుBHIM App కూడా అధికంగా ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నట్టు తేలింది. వస్తుసేవాపన్ను (జీఎస్టీ) కింద నమోదైన 72 లక్షల రిజిస్టర్డ్ సంస్థలు.. వంద శాతం ఆన్‌లైన్ ద్వారానే ఆదాయపు పన్ను రిటర్నులను సమర్పించాయని స్పష్టమైంది. 2015-16 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2016-17 కాలానికిగానూ 23 శాతం పెరిగినట్టు స్పష్టమైంది. ‘‘నవంబరు 2016 నుంచి ఆన్‌లైన్ లావాదేవీలు 221 శాతం పెరిగాయి. అదే పన్ను రహిత లావాదేవీలు 118 శాతం పెరిగాయి’’ అని ప్రభుత్వం ప్రకటించింది. అంతేగాకుండా ఈ-టోల్ చెల్లింపులు కూడా గణనీయంగా పెరిగినట్టు ప్రభుత్వ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 2016 జనవరి నాటికి రూ.88 కోట్లుగా ఉన్న ఆన్‌లైన్‌లో టోల్ చెల్లింపులు.. 2017 ఆగస్టు నాటికి రూ.275 కోట్లకు పెరిగాయని వెల్లడించింది. అయితే, 2017 సెప్టెంబరు నాటికి 6 లక్షల ట్యాగ్‌లు మాత్రమే నమోదైనట్టు వెల్లడించింది. భీం-యూపీఐ చెల్లింపుల్లో గణనీయమైన పెరుగుదలల నమోదైనట్టు లెక్కలు చెబుతున్నాయి. గత ఏడాది నవంబరు నాటికి రూ.101 కోట్లుగా ఉన్న యూపీఐ చెల్లింపులు.. ఈ ఏడాది అక్టోబరు నాటికి రూ.7,057 కోట్లకు పెరిగాయన్నది ప్రభుత్వ లెక్కల సారాంశం. సరైన సమయంలోనే సంస్కరణలు

Updated By ManamSun, 10/15/2017 - 15:36
 • దీర్ఘాకాలిక ప్రయోజనాల దృష్ట్యానే నోట్లరద్దు, జీఎస్టీ

 • వృద్ధి రేటు బాగున్నప్పుడే సంస్కరణలు తెచ్చాం

 • అంతకన్నా మంచి సమయం ఇంకేముంటుంది

 • ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయాక తెచ్చి ఏం లాభం

 • కాంగ్రెస్ చేయలేనిది ప్రస్తుతం బీజేపీ చేస్తోంది

 • నల్లధన నిర్మూలనపై కాంగ్రెస్‌కు ఆలోచనేలేదు

 • జీఎస్టీని ప్రతిపాదించి ఇప్పుడు వ్యతిరేకిస్తోంది

 • అవకాశవాదంతో విమర్శలు చేస్తోంది: జైట్లీ

వాషింగ్టన్, అక్టోబరు 15: సరైన సమయంలోనే నిర్మాణాత్మకమైన కీలక ఆర్థిక సంస్కరణలను భారత్ చేపట్టినట్టు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. అప్పటికి వృద్ధిరేటు కూడా పురోగమిస్తూనే ఉందన్నారు. రాబోయే రోజుల్లో ఆ సంస్కరణలు సత్ఫలితాలనిస్తాయన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే నోట్లరద్దు, జీఎస్టీ వంటి కీలక సంస్కరణలను తీసుకొచ్చినట్టు ఆయన వివరించారు. ఆ సంస్కరణల వల్లే భారత వృద్ధిరేటు పురోగమిస్తోందని అన్నారు. అమెరికాలోని వాషింగ్టన్‌లో భారత విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రపంచం రెండున్నర (2.5) శాతం వృద్ధిరేటుతో ముందుకెళుతున్న సందర్భంలోనే భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా వృద్ధి చెందుతోందన్నారు. మంచి సంస్కరణలు తీసుకురావడానికి అంత కన్నా మంచి తరుణం ఇంకేముంటుందని ప్రశ్నించారు. మరీ, ఆర్థిక వ్యవస్థ మరీ దిగజారిపోయాక అలాంటి సంస్కరణలను తెచ్చి ఏం లాభమన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను నోట్ల రద్దు సంస్కరణ ఛిన్నాభిన్నం చేసిందన్న విమర్శకుల వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ‘‘ఎప్పుడూ భారత్ నోట్ల చలామణీ ఆర్థిక వ్యవస్థగానే ఉండిపోవాలా? సమస్యలొస్తాయని చెప్పి, రెండు, మూడు త్రైమాసికాలపై ప్రభావం చూపుతుందన్న కారణం చూపి సంస్కరణలు మానుకోవాలా? నష్టం వస్తుందని చెప్పి జీఎస్టీ వంటి మంచి సంస్కరణను తీసుకురాకుండా ఉండాలా?’’ అని విమర్శకులను జైట్లీ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చేయలేనిది.. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చేస్తోందని అన్నారు. నల్లధన నిర్మూలన కాంగ్రెస్‌కు అవసరం లేదని, అది దాని ప్రాధాన్యం కాదని, అందుకే నోట్ల రద్దును వ్యతిరేకిస్తోందని విమర్శించారు. వాస్తవానికి జీఎస్టీని తెరపైకి తెచ్చిందే కాంగ్రెస్ అని, ఇప్పుడు బీజేపీ దానిని అమలు చేస్తే అవకాశవాదంతో వ్యతిరేకిస్తూ విమర్శలు గుప్పిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. జనాకర్షణ కోసం తామెప్పుడూ ప్రయత్నించలేదని, ప్రజలు ఆ పాత నోట్ల చలామణీ వ్యవస్థలోనే బతికేలా చేసి తద్వారా భారత్‌ను షాడో ఆర్థిక వ్యవస్థతోనే ముందుకు వెళ్లేలా తాము కూడా ప్రయత్నించాల్సిందని, కానీ, అలా చేయకుండా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే ఆలోచనగా సంస్కరణలను తీసుకొచ్చామని జైట్లీ వివరించారు. అదే సరైన ఆర్థిక విధానమని స్పష్టం చేశారు. ఆ సంస్కరణలపట్ల అంతర్జాతీయ నేతలు, సంస్థల అనుకూల స్పందనతో భారత్‌లో మరింత విశ్వాసం పెరిగిందన్నారు. భారత్ అన్ని విధాలా అభివృద్ధి చెందేందుకు పెరుగుతున్న ప్రపంచ వృద్ధి రేటు సాయపడుతుందన్నారు. ‘‘ఇప్పుడు ప్రపంచ వృద్ధి రేటు కూడా పెరుగుతోంది. ఈ ఏడాది ప్రపంచ వృద్ధి రేటు 3.6 శాతం, ఆ తర్వాత 3.7 శాతంగా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ చెబుతోంది. ఆ సానుకూల పవనాలే భారత వృద్ధికీ దోహదపడతాయి’’ అని జైట్లీ వివరించారు. గ్రామీణ ప్రాంతాలు, మౌలిక వసతుల్లో పెట్టుబడులపైనే ప్రభుత్వం ప్రస్తుతం దృష్టి సారించిందని జైట్లీ వివరించారు. రద్దు.. 2000

Updated By ManamWed, 09/27/2017 - 13:12
 • 2000 నోట్లను రద్దు చేసేయాలి

 • అప్పుడంటే అవసరం కాబట్టి తెచ్చారు

 • ఇక మీదట ఆ పెద్ద నోట్ల అవసరం లేదు

 • వాటి వల్ల అవినీతి ఇంకా ఎక్కువవుతుంది

 • కేంద్రం రద్దు దిశగా చర్యలు తీసుకోవాలి

 • డిజిటల్ కరెన్సీ తీసుకొస్తేబాగు: చంద్రబాబు


న్యూఢిల్లీ, సెప్టెంబరు 27: నోట్ల రద్దు వల్ల పెద్ద..పెద్ద వ్యాపారుల సంగతేమో గానీ, మధ్యతరగతి వాళ్లు, పేదలే ఎక్కువగా బాధపడ్డారు. సమయానికి డబ్బులందక ఇక్కట్లు పడ్డారు. మరి, మళ్లీ నోట్ల రద్దు జరిగితే.. నోట్ల రద్దు 2.0ను తీసుకొస్తే... వామ్మో ఇంకేమైనా ఉందా..? కంగారు పడాల్సిన అవసరం లేదు కానీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం నోట్ల రద్దు 2.0 జరగాల్సిందేనంటున్నారు. అవును, 2 వేల రూపాయల నోట్లను రద్దు చేయాలని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. నోట్ల రద్దుపై ప్రధాని వేసిన కమిటీకి ఆనాడు చంద్రబాబు చైర్మన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో మంగళవారం ఢిల్లీకి వెళ్లిన ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అక్కడ ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడిన ఏపీ సీఎం.. ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘ఏ సంస్కరణ చేపట్టినా సత్ఫలితాలు రావడం కొంత ఆలస్యమవుతుంది. సహజంగానే పెద్ద నోట్లు సమస్యలను సృష్టిస్తాయనేది నా ప్రగాఢ నమ్మకం. ఆ నోట్ల వల్ల అవినీతి ఎక్కువగానే జరుగుతుంది. రాజకీయ కోణంలోనూ ఇప్పుడున్న 2 వేల నోట్లు సమస్యలను సృష్టిస్తాయి. అసలు కరెన్సీ నోట్ల స్థానంలో డిజిటల్ కరెన్సీని తీసుకొస్తే బాగుంటుంది. అది తక్కువ ఖర్చుతో కూడుకున్నపనే. అందునా త్వరితగతిన సంస్కరణలను సులువుగా చేయవచ్చు’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 2 వేల నోట్లను తీసుకురావడం ప్రధాని మోదీ చేసిన పెద్ద తప్పంటారా అని ప్రశ్నించగా.. నోట్ల రద్దు వల్ల భారీ మొత్తంలో నగదు వ్యవస్థ నుంచి వెళ్లిపోయింది కాబట్టి ఆ సమయంలో 2 వేల నోట్లను విడుదల చేయాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. కానీ, ఇప్పుడు వాటి అవసరం లేదని, వాటిని రద్దు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కాగా, జీఎస్టీ వల్ల కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై అరుణ్ జైట్లీతో మాట్లాడినట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాజెక్టులు, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని జీఎస్టీ నుంచి మినహాయించాల్సిందిగా కోరామని చెప్పారు. 

Related News