congress

అయితే పాకిస్థాన్ వెళ్లి ఇమ్రాన్ కేబినెట్‌లో చేరు

Updated By ManamMon, 10/15/2018 - 09:16

Navjot Singhదక్షిణాది రాష్ట్రాలకు వెళ్లడం కంటే పాకిస్థాన్‌కు వెళ్లడం మేలంటూ కాంగ్రెస్ నేత సిద్ధూ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు కొనసాగుతున్నాయి. సిద్ధూ తన వ్యాఖ్యలతో ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల ప్రజల మధ్య విబేధాలు సృష్టిస్తున్నారంటూ బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధూ మాటల్లో కుట్ర దాగి ఉందని.. నిజంగా అతడికి పాకిస్థాన్‌పై అంత ప్రేమ ఉంటే ఆ దేశంకు వెళ్లి ఇమ్రాన్ కేబినెట్‌లో చేరాలని సూచించారు.

మరోవైపు దక్షిణ భారతదేశాన్ని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సిద్ధూతో పాటు, ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. ఇక ఈ వ్యాఖ్యలపై అన్నాడీఎంకే అధికార ప్రతినిధి మురళీధరన్ శివలింగం స్పందిస్తూ.. అతడో కమెడియన్‌ అని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు.కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ

Updated By ManamSat, 10/13/2018 - 15:10
 • ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు పార్టీకి షాక్

 • బీజేపీలో చేరిన పార్టీ సీనియర్ నేత రాందేయ్ ఉకి

Chhattisgarh congress Senior Leader Ramdey Uike Joins BJP

బిలాస్‌పూర్ : మరో నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ రాష్ట్ర స్టేట్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రాందేయ్ ఉకి శనివారం కాషాయ కండువా కప్పుకున్నారు. బిలాస్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం రమణ్ సింగ్ ఆధ్వర్యంలో బీజేపీ జాతీయధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఉకి బీజేపీలో చేరారు. ఆయన పాలి నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ప్రజా ప్రతినిధిగా ఎన్నిక అయ్యారు.

ఉకి బీజేపీలో చేరికపై ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ అధ్యక్షుడు భూపేష్ భగాలే మాట్లాడుతూ... కొద్దిరోజుల క్రితం తాము కలిశామని, అయితే ఉకి పార్టీ మారే విషయంపై ఏమీ మాట్లాడలేదన్నారు. అయితే ఎన్నికల వేళ  రాజకీయ నాయకులు ఇలా పార్టీలు మారడం సరకాదని అన్నారు. మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ఖరారు చేశారు. మరో రెండు రోజుల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది.అసంతృప్తులకు గాలం

Updated By ManamSat, 10/13/2018 - 02:19
 • టీఆర్‌ఎస్ ఆశావహులను ఆకర్షించడానికి కాంగ్రెస్ యుక్తులు

 • అధికారం దక్కించుకోవడానికి అనూహ్య తంత్రాలు

 • ఢిల్లీ పెద్దల డైరెక్షన్‌లో పకడ్బందీగా వ్యూహం అమలు

 • పద్మినీరెడ్డి ఘర్‌వాపసీతో బీజేపీకి షాకివ్వడం దీనిలో భాగమే

 • నియోజకవర్గాల్లో స్థానిక నేతల ద్వారా మంతనాలు

congressహైదరాబాద్: టీఆర్‌ఎస్ అసంతృప్తులకు, ఆశావహులకు కాంగ్రెస్ గాలం వేస్తోంది. సీటు ఎర వేసి ఆకర్షిస్తోంది. ఈసారి ఎన్నికల్లో ఆరునూరైనా నూరు ఆరైనా గెలవాలనే లక్ష్యంతో  అధిష్టానం డైరెక్షన్‌లో సరికొత్త వ్యూహాలను అమలు చేస్తోంది. గురువారం ఉదయం బీజేపీలో చేరిన పద్మినీ రెడ్డిని, సాయంత్రానికి పార్టీలోకి రప్పించడమూ దీనిలో భాగంగానే జరిగిందని సమాచారం.  దానితో తమకు షాకివ్వాలనుకున్న బీజేపీ దిమ్మదిరిగేలా చేసినట్లు కాంగ్రెస్ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. ఈ తరహాలోనే.. ఎవరూ ఊహించని రీతిలో ఎత్తులు, పై ఎత్తులు వేయడానికి అవసరమైన కసరత్తు జరిగిందంటున్నారు. బీజేపీని దెబ్బకొట్టినట్టుగానే టీఆర్‌ఎస్‌ను కూడా అనూహ్యంగా గట్టి దెబ్బతీయడానికి నిశ్చయంగా ముందుకు కదులుతున్నట్లు సమాచారం.  దీనితో అధికార పార్టీకి మతిపోయేలా చేయాలన్న ప్రయత్నంలో ఉంది. జిల్లాల వారీగా అధినాయకత్వ వైఖరి పట్ల తీవ్ర నిరాశతో ఉన్న టీఆర్‌ఎస్ సీనియర్ల సమాచారాన్ని సేకరించింది. తమ పార్టీలోని స్థానిక నాయకుల ద్వారా వారితో మంతనాలు జరుపుతుంది.  కొందరు బడా నాయకుల విషయం కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకుపోయి వారి సూచనల మేరకు పెద్ద నాయకులను పార్టీలోకి రప్పించే పని చేయనుంది. కొండా సురేఖ దంపతుల మాదిరిగా మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొనే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. శుక్రవారం మధుయాష్కీ దగ్గరుండి ప్రజాయుద్ధనౌక గద్దర్‌ను సతీసవేుతంగా ఢిల్లీకి తోడ్కొనిపోయి రాహుల్, సోనియా గాంధీలతో కల్పించడాన్ని ఈ స్ట్రాటజీలో భాగంగానే అమలు జరిపినట్లు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం వెల్లడిస్తోంది. తెరాసలో టికెట్లను ఆశించి భంగపడ్డవారి విషయంలో కాంగ్రెస్ నేతలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు, స్దానికంగా కాంగ్రెస్ శ్రేణుల నుంచి వ్యతిరేకత రాకుండా జాగ్రత్త  పడుతున్నారు. స్దానిక నాయకుల అంగీకారంతోనే పార్టీలో చేర్చుకొనడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని భావిస్తున్నారు.

కొన్ని నియోజక వర్గాల్లో టికెట్ ఆశించిన తెరాస నాయకునిగా ఎదిగిన వారు సిట్టింగ్‌లకు సీట్లివ్వడంలో భంగపడ్డారు. అలాంటి వారిలో మెదక్ జిల్లాకు చెందిన కొందరు నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వరంగల్ జిల్లాలో కొండా సురేఖ దంపతులు కూడా భంగపాటుకు గురయిన వారేనని అంటున్నారు, నిజామాబాద్ జిల్లాకు చెందిన రాష్ట్ర స్దాయి సీనియర్‌నేత డి.శ్రీనివాస్ త్వరలోనే కాంగ్రెస్ కండువాను కప్పుకోబోతున్నారు. ఉత్తర తెలంగాణలో తెరాసకు గట్టి పట్టుందని భావిస్తున్న నియోజక వర్గాలపైనే కాంగ్రెస్ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిందని కాంగ్రెస్ వర్గాలు తెలియచేశాయి. పలువురు మాజీ మంత్రులు, గతంలో కాంగ్రెస్‌లో ఉండి తెరాసలోకి వెళ్లి భంగపడ్డవారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉండి. తెరాస ఆదరణకు నోచుకోని వారు అత్యధికులు కాంగ్రెస కండువా కప్పుకొనబోతున్నారని తెలియచేశారు. కొందరు సీనియర్లు, ప్రజాబలం ఉన్నవారు. సిట్టింగ్‌ల పై తీవ్ర అసంతృప్తితో ఉన్న వారు కాంగ్రెస్‌లో చేరడానికి ముందుకొస్తున్నప్పటికీ అందరికి టికెట్లు ఇస్తామనే హామీ మాత్రం ఇవ్వడం లేదని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. కేసీఆర్ పాలన కొనసాగడానికి ఇష్టపడని వర్గాలు అనేకం కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నాయని పేర్కొంటున్నారు. అలాంటి వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో, పార్టీలో సముచిత గౌరవం  ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ నుండి తెరాసకు వెళ్లేవారెవరూ లేరంటున్నారు. పార్టీలో ఇప్పటికే అన్ని స్దాయిల నాయకత్వం పై చర్చ జరిగిందని తెలిపారు. ఆశావాహులందరూ  ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఏ పార్టీలోనూ సాధ్యం కాదని,  కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అభ్యర్దుల విషయంతో తుది నిర్ణయానికి వచ్చిందని అంటున్నారు. తెరాస నుండి వలసలను ప్రోత్సహించాల్సిన  అవసరం కాంగ్రెస్‌కు లేనప్పటికీ, తెరాసను బలహీన పర్చడం, పార్టీ బలాన్ని పెంచుకోవడం, అన్ని వర్గాలను ఆదరించడం, ఓటు బ్యాంకును పెంచుకోవడం లక్ష్యంగా కొన్ని రాజకీయ వ్యూహాలు తప్పవంటున్నారు.నేను ఏ పార్టీలో చేరను: గద్దర్

Updated By ManamFri, 10/12/2018 - 14:27
gaddar met rahul gandhi

న్యూఢిల్లీ : రాజకీయ పార్టీలు, ప్రజలు కోరితే తాను జరగబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌పై గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ప్రజా గాయకుడు గద్దర్ తెలిపారు. అయితే తాను ఏ పార్టీలో చేరడం లేదని, తాను ఏ పార్టీ సభ్యుడిని కాదని ఆయన స్పష్టం చేశారు.  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో గద్దర్ శుక్రవారం భేటీ అయ్యారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ... అందరూ కోరుకుంటే కేసీఆర్‌పై పోటీ చేస్తానని అన్నారు. ప్యూడలిజానికి వ్యతిరేకంగా తాను పోటీ చేస్తానని, త్వరలో అన్ని రాజకీయ పార్టీలను కలుస్తానని చెప్పారు. నా జీవితం అంతా ప్రజల పక్షమే అని అన్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మధుయాష్కీ ఆధ్వర్యంలో గద్దరు కుటుంబీకులు ఇవాళ రాహుల్‌ను కలిశారు. అలాగే ఈరోజు సాయంత్రం సోనియాగాంధీతో కూడా భేటీ కానున్నారు. కాగా గద్దర్ కుమారుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.పద్మినీరెడ్డి యూ టర్న్, బీజేపీకి  ఉల్టా షాక్

Updated By ManamFri, 10/12/2018 - 12:50
padmini Reddy

హైదరాబాద్: కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి మధ్యాహ్నం  భాజపాలో చేరిన పద్మినీరెడ్డి రాత్రి 9 గంటల సమయంలో  బిజెపికి ఉల్టాషాక్ ఇచ్చి కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని ప్రకటించింది. తెలంగాణ కాంగ్రెస్ మెనిఫెస్టో కమిటీ ఛైర్మన్ దామోదర రాజనర్సింహ సతీమణి పద్మినీరెడ్డి పార్టీ మారడం కాంగ్రెస్‌లో కలకలం రేపింది. దీంతో ఆమె మనసు మార్చుకున్నారు. కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని ప్రకటించారు. తన భర్త రాజనర్సింహ సమక్షంలొ మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.  

తాను బిజెపిలో చేరిన విషయం వాస్తవమేనని, ప్రస్తుతం మనసు మార్చుకున్నానని, ఇప్పుడు కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని ప్రకటించారు. పద్మినీరెడ్డి నిర్ణయం మెదక్ జిల్లా రాజకీయాలను కుదిపివేసింది. భాజపాలో చేరి సంగారెడ్డి నివాసానికి చేరుకున్నప్పటి నుండి కాంగ్రెస్ శ్రేణుల నుండి ఊహించని విధంగా తీవ్ర వ్యతిరేకతను చవిచూడవలసి వచ్చింది. పార్టీలోనే కొనసాగాలని, భాజపాని వీడాలని పట్టుబట్టారు. 

దీంతో ఆమె మనసు మార్చుకున్నారు.  రాత్రి 9 గంటల సమయంలో తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. నా నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నాను, కార్యకర్తల మనోవేదన చూసి నా నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నా, ఈ స్ధాయిలో స్పందన వస్తుందని  ఊహించలేదు అని మూడు ముక్కల్లో విలేకరుల సమావేశాన్ని ముగించారు. దీంతో పద్మినీరెడ్డి తిరిగి కాంగ్రెస్‌లో చేరిందని కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. పద్మినీరెడ్డి మనసు మార్చుకోవడంలో రాజకీయ దుమారం టీ కప్పులో తుఫాన్ గా చల్లారింది. బుధవారం పద్మినీరెడ్డి, రాజనర్సింహ మధ్య స్వల్ప  విబేధాలు చోటు చేసుకున్నాయని కార్యకర్తలు అంటున్నారు. 

అందుకోసమే ఆమె ఆకస్మాత్తుగా  పార్టీ మారాలని నిర్ణయించుకొని నేరుగా బిజేపి  కార్యాలయానికి వెళ్లి పార్టీలో చేరినట్టు పేర్కొంటున్నారు. తనకు టికెట్ విషయంలోనే అసంతృప్తితో పార్టీ మారాలనుకున్నట్లు ఆమె కాంగ్రెస్ కార్యకర్తలకు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఒకే కుటుంబానికి ఒకే సీటు అనే నిర్ణయం వల్లనే పార్టీ మారాలని భావించినట్లు తెలియచేశారు. చివరగా ఆమె యూ టర్న్ తీసుకోవడంలో ఆంతర్యమేమిటన్నది తెలియవలసి ఉంది. ఆమెకు కాంగ్రెస్ టికెట్ ఇస్తామన్నారా లేక భర్తకు తలనొప్పులు తేవద్దని భావించి తన నిర్ణయం మార్చుకున్నారా అనేది వెలుగులోకి రావలసి ఉంది.

ఇరకాటంలో దామోదర రాజనర్సింహ
కాంగ్రెస్ పార్టీలో అగ్రనాయకుడిగా ఎదిగిన దామోదర రాజనర్సిం హ్మ భార్య పద్మినీ రెడ్డి కాషాయ కండువా కప్పుకోవడంరాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భార్యాభర్తలు వేర్వేరు పార్టీలో ఉండటం ఏమిటని చర్చించుకుంటున్నారు. తన సతీమణి ప్రత్యర్ది పార్టీ లో చేరడం మున్ముందు దామోదరకు కొత్త సమస్యలు తలెత్తుతాయని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రత్యర్ది పార్టీల విమర్శలకు ఆయన ఏ సమాధానం చెబుతారో అనేది చూడాల్సి ఉంది. బీజేపీలో చేరేందుకు భర్త అనుమతి తీసుకుని చేరారా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది.కాంగ్రెస్‌లోకి గద్దర్

Updated By ManamFri, 10/12/2018 - 11:17

Gaddarన్యూఢిల్లీ: ప్రజాగాయకుడు గద్దర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు గద్దర్‌ను కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్‌ న్యూఢిల్లీకి తీసుకెళ్లగా.. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమయంలో ఆయన పార్టీ కండువా కప్పుకోనున్నారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థిగా గజ్వేల్ నుంచి కేసీఆర్‌పై పోటీ చేసేందుకు గద్దర్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.సంగారెడ్డి నుంచి పద్మినీరెడ్డి పోటీ?

Updated By ManamThu, 10/11/2018 - 13:50
 • జగ్గారెడ్డి వర్సెస్ పద్మినీరెడ్డి
Padmini Reddy to contest Sangareddy

హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ సతీమణి పద్మినీరెడ్డి సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే భార్య బీజేపీలో చేరినట్లు సమాచారం అందుకున్న దామోదర రాజనర్సింహ  గజ్వేల్‌లో తన ఎన్నికల ప్రచారాన్ని అర్ధాంతరంగా ముగించుకొని గురువారం మధ్యాహ్నం హుటాహుటీన హైదరాబాద్ బయల్దేరారు. 

కాగా కుటుంబంలో ఒకరికి మాత్రమే సీటు ఇవ్వాలన్న కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం వల్లే పద్మినీరెడ్డి బీజేపీలో చేరినట్లు సమాచారం. జరగబోయే ఎన్నికల్లో ఆమె సంగారెడ్డి నుంచి పోటీ చేసేందుకు అనుమతి ఇవ్వాలని హైకమాండ్‌ను కోరడం, అందుకు ఫ్యామిలీ నుంచి ఒక్కరికి మాత్రమే టికెట్ కేటాయిస్తామని చెప్పడంతో పద్మినీరెడ్డి కాషాయ కండువా కప్పుకున్నారు.

గత కొంతకాలంగా ఆమె సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఇక సంగారెడ్డిలో కాంగ్రెస్ తరఫున జగ్గారెడ్డి బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పద్మినీరెడ్డి బీజేపీ నుంచి పోటీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.  మరోవైపు దామోదర రాజనర్సింహ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆందోల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్‌కు షాక్...తెలంగాణలో కాంగ్రెస్‌కు షాక్

Updated By ManamThu, 10/11/2018 - 12:44
 • తెలంగాణ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్

 • బీజేపీలో చేరిన దామోదర సతీమణి

Padmini Reddy joins BJP

హైదరాబాద్ : ఎన్నికలు దగ్గరకొస్తున్న సమయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సతీమణి పద్మినీ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, పార్టీ సీనియర్ నేత మురళీధరరావు సమక్షంలో గురువారం ఆమె బీజేపీలో చేరారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల పద్మినీరెడ్డి నమ్మకాన్ని తాము స్వాగతిస్తున్నామని మురళీధరరావు అన్నారు.

padmini reddy

కాగా ప్రస్తుతం దామోదర రాజనర్సింహ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు. ఆయన నియోజకవర్గ పర్యటనలో ఉండగా పద్మినీరెడ్డి బీజేపీ కార్యాలయంలో ప్రత్యక్షం కావడంతో  కాంగ్రెస్ వర్గాలు నివ్వెరపోయాయి. కాగా పద్మినీరెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున సంగారెడ్డి టికెట్ ఆశించారు. అయితే ఆమెకు పార్టీ నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజా పరిణామం మాత్రం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. అయితే పద్మినీరెడ్డి బీజేపీలో చేరిన వ్యవహారంపై రాజనర్సింహ ఇంకా స్పందించలేదు. జనసేనలోకి నాదెండ్ల మనోహర్ 

Updated By ManamThu, 10/11/2018 - 12:06
 • కాంగ్రెస్‌కు హ్యాండిచ్చిన నాదెండ్ల మనోహర్

Nadendla Manohar to join Janasena

అమరావతి:  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆ పార్టీకి ‘హ్యాండ్’ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన గురువారం రాజీనామా చేశారు. నాదెండ్ల మనోహర్ త్వరలో జనసేన పార్టీలో చేరనున్నారు. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌ను ఆయన తిరుపతిలో కలవనున్నారు. పవన్ ఇవాళ సాయంత్రం తిరుపతి చేరుకోనున్నారు. పవన్‌తో భేటీ అయ్యేందుకు నాదెండ్ల మనోహర్... తిరుపతి బయల్దేరి వెళ్లారు.  ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.తెరాసను గెలిపిస్తే.. చిప్ప చేతికొస్తుంది

Updated By ManamThu, 10/11/2018 - 07:23
 • మహబూబ్‌నగర్ రోడ్‌షోలో విజయశాంతి

 • అధికారం చేపట్టి సత్తా చాటుతాం: భట్టి

 • సోనియా పుణ్యమే తెలంగాణ: డీకే అరుణ 

congressమహబూబ్‌నగర్: తెరాసా మరో సారి అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజలకు చిప్పచేతికి వస్తుందని, ఓటుతో కాంగ్రెస్‌ను ఆశీర్వదిస్తే తెలంగాణను అభివృద్ధి చేసి చూపిస్తామని మాజీ ఎంపీ, కాంగ్రెస్ ప్రచార కమిటీ సభ్యురాలు విజయశాంతి అన్నారు. బుధవారం  కొత్తకోట, మక్తల్, నారాయణపేటలో రోడ్‌షోలు నిర్వహించగా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ రోడ్‌షోలో ప్రచార కమిటీ అధ్యక్షుడు భట్టి విక్రమార్క , గద్వాల తాజామాజీ ఎమ్మెల్యే డి.కే. అరుణ, ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు ఒబేదుల్లాకొత్వాల్‌లు పాల్గొనగా దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జీ డోకూర్ పవన్‌కుమార్ సభ అధ్యక్షత వహించారు. కేసిఆర్ దగ్గర చాల డబ్బులు ఉన్నాయి. ఎన్నికల్లో పంచుతే తీసుకొని కాంగ్రెస్‌కు ఓటు వేసి అధికారం అప్పజెప్పాలని విజయశాంతి వ్యంగ్యంగా విమర్శించారు. సోనియా తెలంగాణ ఇచ్చింది బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసమే కాని కేసిఆర్ కోసం, కేసిఆర్ కుటుంబం బాగుపడటానికి కాదని ఆమె అన్నారు. కేసీఆర్ పాలనలో ఐదు వేల ప్రభుత్వ పాఠశాలలు  మూతపడ్డాయని ఆమె మండిపడ్డారు. తెలంగాణ వస్తే బంగారు తెలంగాణగా మారుస్తామని హామీలను నెరవేర్చుతామని చెప్పిన కేసిఆర్ ఏ ఒక్క హామీనెరవేర్చలేదని, ఓటుతో దిమ్మతిరిగేలా కేిసీఆర్‌కు బుద్ది చెప్పాలని విజయశాంతి పిలుపునిచ్చారు. మోడీ, అమిత్‌షా కుట్రతో తెలంగాణలో కాంగ్రెస్‌కు చెందిన 20 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని ఆమె ఆరోపించారు. మోదీ కేిసీఆర్‌తో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని ముందుకు వెళ్తున్నారని ముస్లిం మైనార్టీలు ఇది పసిగట్టి మేలుకోవాలని ఆమె అన్నారు.  పెట్రోల్, డిజిల్, గ్యాస్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని మోదీ కేసీఆర్ ప్రభుత్వాలకు ప్రజలు తగిన గుణపాఠం నెర్పాలని ఆమె చెప్పారు. విద్యార్థులు ప్రాణత్యాగం చేస్తే కేసీఆర్ స్వార్థం కోసం నలుగురి కుటుంబ సభ్యుల బాగోగుల కోసం తెలంగాణను ఉపయోగించుకున్నారని, తెలంగాణ ప్రజల బతుకులు మాత్రం బాగుపడలేదని విజయశాంతి మండిపడ్డారు. పలు సందర్భాల్లో కేసిఆర్‌ను అన్న .. అంటూ ఘాటైన విమర్శలతో విజయశాంతి విరుచుకొనిపడ్డారు. 

అధికారం చేపట్టి సత్తా చాటుతాం: భట్టు 
తెలంగాణ రాష్ట్రం కేసిఆర్ అబ్బది కాదు .. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టి తమ సత్తా చాటుతామని రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణకు లక్షా యాభై వేల కోట్ల బడ్జెట్ ఉంటే మరో లక్ష కోట్ల రూపాయలు అప్పు చేసి కేసీఆర్ తెలంగాణను దోచుకున్నారని ఆరోపించారు. ఈ డబ్బుల గురించి లెక్క అడుగుతే కాంగ్రెస్‌పై కక్షగట్టి తప్పించుకొని పారిపోయారని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాలంటూ అధికారంలోకి వచ్చిన కేసిఆర్ ఏ ఒక్క రోజు ఆ అంశాలపై ఆలోచించలేదని ఆ దిశగా పరిపాలన చేయలేదని ఆయన అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాను అందరు దేవతగా భావిస్తే కేసిఆర్ బొమ్మ అంటూ విమర్శిస్తారని బాషా మార్చుకోకపోతే తగిన గుణపాఠం తప్పదని ఆయన అన్నారు. ఆ నాడు రాజశేఖర్‌రెడ్డి ముస్లీం రిజర్వేషన్ ప్రకటించి ముస్లింలకు సామాజికంగా, విద్యాపరంగా , ఆర్ధికంగా ఎదిగే విధంగా కృషి చేశారని చెప్పారు. తెలంగాణలో గడిల పాలన .. దొరల పాలన కొనసాగి అదోగతిపాలైందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఒకే సారి 2 లక్షల రుణమాఫి చేసి రూ. 3వేల నిరుద్యోగ బృతి అందజేస్తామని , పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ బిల్లు అందజేసి లబ్దిదారులకు ఆదుకుంటామని, ప్లాట్ ఉన్న ప్రతి ఒకక్రు రూ. 5 లక్షలు అందజేస్తారని, ఇందిరమ్మ ఇళ్లు ఉన్న లబ్దిదారుకు మరో ఒక రూం నిర్మించి ఇస్తామని అన్నారు.  ప్రస్తుతం కొనసాగుతున్న  1000 ఉన్న పించన్‌ను రూ. 2000 ఇస్తామని తెలిపారు. వికలాంగులకు రూ. 1500 ఉంటే రూ. 3వేలకు పెంచుతామని చెప్పారు. ఉద్యోగులకు పాత పించన్ విధాన్ని అమలు చేస్తామని , ఐఆర్ ప్రకటిస్తామని చెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీనిచ్చారు.

సోనియా పుణ్యమే రాష్ట్రం: డీకే అరుణ
సోనియా పుణ్యమే తెలంగాణ అని, కేసీఆర్ కూర్చీ కోసమే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించాడని, నాలుగున్నర సంవత్సరాల పాలనలో తెలంగాణను అధొగతి పాలు చేసి ప్రజలను మభ్యపెట్టినాడని ప్రచార కమిటీ సభ్యురాలు , మాజీ ఎమ్మెల్యే డి.కె. అరుణ అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ గల్లంతైన సోనియా తెలంగాణను ఇచ్చి రుణం తీర్చుకున్నారని, ఆ రుణాన్ని ప్రస్తుత ఎన్నికల్లో ఓటు ద్వారా తీర్చుకోవాలని డి.కె. అరుణ పిలుపునిచ్చారు. చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వకపోతే కేిసీఆర్ కూర్చీ కోసం తెలంగాణ ఉద్యమం ప్రారంభించారని , తీరా దొంగ నిరహార దీక్ష , దొంగ జపంతో ప్రజలను అయోమయం చేసి అధికారంలోకి వచ్చారని డి.కె. అరుణ విమర్శించారు. తెలంగాణ కోసం 1250 మంది బలిదానం చేసుకుంటే సోనియాగాంధీ చలించి తెలంగాణ ప్రకటించారని కేసిఆర్ దాన్ని అసరగా చేసుకొని కాంగ్రెస్‌కు మోసం చేసి అధికారంలోకి వచ్చాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే డబుల్‌బెడ్‌రూం, మహిళలకు లక్ష గ్రాంట్ ఇచ్చి పది లక్షల వడ్డిలేని రుణాలు అందజేస్తామని  చెప్పారు. మహిళలకు అభయహస్తం, ప్రమాద బీమా అమలు చేసి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 7 కిలోల సన్న బియ్యం ఇచ్చి 9 రకాల నిత్యవసర వస్తువులను అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో జీఎంఆర్ , కాటం ప్రదీప్‌కుమార్, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి పి. విశ్వేశ్వర్, వనపర్తి జిల్లా అధ్యక్షుడు శంకర్ ప్రసాద్, కొత్తకోట జడ్పీటీసీ డా. పీజే బాబు, దేవరకద్ర జడ్పీటీసీ లక్ష్మీకాంత్‌రెడ్డి, రాష్ట్ర మహిళ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బాలమణెమ్మ నాయకులు పాల్గొన్నారు.

Related News