Vishnu Kumar Raju

రేపు ఏ పార్టీలో ఉంటానో తెలీదు: విష్ణు కుమార్ రాజు

Updated By ManamWed, 09/12/2018 - 09:58

Vishnu Kumar Rajuఅమరావతి: రేపు ఏ పార్టీలో ఉంటానో తెలీదంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీలో ఉన్నా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతానని తేల్చి చెప్పారు. ఏపీకి బీజేపీ ఇచ్చిన నిధుల విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తుండగా, టీడీపీ నేతలు కల్పించుకుని వాస్తవాలు మాట్లాడాలని సూచించారు. దీంతో స్పందించిన విష్ణుకుమార్ రాజు తాను ఏ పార్టీలో ఉన్నా వాస్తవాలే మాట్లాడతానని, ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం తన నైజమని అన్నారు.

గుజరాత్‌లో పటేల్ విగ్రహానికి కేంద్రం రూ.2,500 కోట్లు ఇచ్చిందని ఆరోపిస్తున్నారని, నిజానికి ఆ విగ్రహం కోసం ఇచ్చింది రూ.300 కోట్లేనని విష్ణుకుమార్ రాజు స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వాల్సి ఉందన్న ఆయన, అందుకోసం తాను కూడా పోరాడతానని పేర్కొన్నారు.క్రెడిట్ కోసమే టీడీపీ డ్రామాలు

Updated By ManamFri, 06/29/2018 - 11:01

vishnu kumar raju అమరావతి: కేంద్రం ఏదైనా ఇవ్వబోతుందని తెలిస్తే దానిమీదే టీడీపీ దీక్షలు చేస్తుందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. క్రెడిట్ కోసమే టీడీపీ డ్రామాలు చేస్తుందని ఆయన ఆరోపించారు. కడప స్టీల్ ప్లాంట్‌పై ఆందోళనలు అనవసరమని, స్టీల్ ప్లాంట్‌ కచ్చితంగా వస్తుందని ఆయన అన్నారు. కడప స్టీల్ ప్లాంట్‌ను గాలి జనార్ధన్‌రెడ్డికి ఇస్తారనేది గాలి వార్త అని ఈ సందర్భంగా విష్ణు కుమార్ రాజు చెప్పారు. అలాగే విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ కూడా వస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఏపీలో జరిగే అవినీతిపై ఉద్యమాలు, దీక్షలు చేయాలి అంటూ ఆయన సూచించారు. ఇక బీజేపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణపై దాడికి ముఖ్యమంత్రి చంద్రబాబునే జవాబు చెప్పాలని విష్ణు కుమార్ రాజు పేర్కొన్నారు.'దీక్షల పేరుతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు'

Updated By ManamSun, 05/20/2018 - 15:23

AP CM chandrababu naidu, Vishnu kumar raju, Dharma porata deeksha, BJP leaderవిజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై బీజేపీ శాసనసభపక్ష నేత విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. చంద్రబాబు చేపట్టే ధర్మపోరాట దీక్ష పూర్తిగా అధర్మమైనదని ఆయన విమర్శించారు. ఆదివారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి కేంద్రం ఏమి అన్యాయం చేసిందని దీక్షల పేరుతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారంటూ చంద్రబాబును ఆయన సూటిగా ప్రశ్నించారు. విశాఖలో చంద్రబాబు చేపట్టనున్న ‘ధర్మపోరాట దీక్ష’ ఈనెల 22న జరగనున్న జరుగనున్న సంగతి తెలిసిందే.

ఈ దీక్షల కోసం ప్రభుత్వ పథకాల లబ్దిదారుల్ని బలవంతంగా చంద్రబాబు తరలిస్తున్నారని విష్ణుకుమార్ ఆరోపించారు. దీక్ష సభల్లో అక్కడ సీఎం చంద్రబాబు కొత్త విషయాలేమీ చెప్పడం లేదని, పాడిన పాత పాటే మళ్లీ పాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. విశాఖ భూకుంభకోణంపై సిట్ సమర్పించిన విచారణ నివేదికను దీక్షా వేదికపై వెల్లడించే ధైర్యం చంద్రబాబుకు ఉందా? అని విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు.జగన్ ఏం చెప్తే బాబు అది చేస్తున్నారు

Updated By ManamWed, 05/02/2018 - 10:57

vishnu kumar raju అమరావతి: జగన్ ఏం చెబితే చంద్రబాబు అదే చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఎద్దేవా చేశారు. చంద్రబాబు గ్రాఫ్ రోజురోజుకు పడిపోతోందని, కానీ వైసీపీ గ్రాఫ్ పెరుగుతుందని ఆయన అన్నారు. గతంలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీచేస్తే.. వైసీపీ కంటే 5లక్షల ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయని చెప్పిన ఆయన 2019 పొత్తుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. విడిగా పోటీచేస్తే మాత్రం టీడీపీ పతనం ఖాయం అంటూ ఆయన జోస్యం చెప్పారు. ఇక చంద్రబాబు చేస్తున్నది ధర్మ పోరాటం కాదని, అధర్మ పోరాటం అంటూ విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు.

 బాలకృష్ణపై బీజేపీ నేతల ఫిర్యాదు

Updated By ManamSat, 04/21/2018 - 11:05

Balakrishna హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణపై చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్ నరసింహన్‌కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం మాట్లాడిన విష్ణు కుమార్ రాజు.. ‘‘బాలకృష్ణపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ని కోరాం. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లాం. బాలకృష్ణను అరెస్ట్ చేయాలని తాము క్రిమినల్ కంప్లైంట్స్ దాఖలు చేసిన విషయాన్నీఆయనకు చెప్పాం. బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండించకుండా మౌనంగా అంగీకరించిన చంద్రబాబుపైనా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరాం’’ అని అన్నారు.

అలాగే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను చెప్పేందుకు కూడా తమకు నోరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన విష్ణు కుమార్ రాజు.. గతంలో సామాజిక మాధ్యమాల్లో నారా లోకేశ్‌పై మెసేజ్‌లు, వార్తలు వస్తే.. అవి రాసిన వారిని జైలుకు పంపించారని, మరి, మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుది నోరా..? అరిగిపోయిన టేప్ రికార్డరా..?

Updated By ManamSun, 04/15/2018 - 11:36

Vishnu Kumar Raju, Chandrababu Naidu అమరావతి: ‘‘చంద్రబాబుది నోరా.. అరిగిపోయిన టేప్ రికార్డరా’’ అంటూ ఏపీ సీఎంపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఘాటు విమర్శలు చేశారు. కేంద్రం చేసిన సాయంపై చంద్రబాబు అసెంబ్లీలో అన్ని అబద్దాలే చెప్పారని ఆయన విమర్శించారు. ఏరు దాటాక.. తెప్ప తగలేసే రకం టీడీపీదని పేర్కొన్నారు. 2019లో చక్రం తిప్పేది తామేనంటూ చంద్రబాబు అంటున్నారని.. అయితే ఆ చక్రం తిప్పడానికి టీడీపీకి వేలు ఉండాలి కదా అంటూ కామెంట్ చేశారు.

కేవలం ఓట్లు, రాజకీయం కోసమే చంద్రబాబు దీక్ష చేస్తున్నారని.. మోదీ దీక్ష చేశారనే బాబు దీక్ష చేస్తున్నారని విమర్శించారు. అందరినీ ఫాలో అవ్వడం, కాపీ కొట్టడమే చంద్రబాబు పని అని.. హోదా విషయంలో జగన్‌ను, దీక్ష విషయంలో మోదీని కాపీ కొట్టారని ఎద్దేవా చేశారు. ఇక ఫొటో షూట్ కోసమే బాబు పార్లమెంట్ మెట్లకు మొక్కారని పేర్కొన్నారు.రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబే ఆటంకం: విష్ణు కుమార్ రాజు

Updated By ManamSat, 04/07/2018 - 12:44

Vishnu Kumar Raju అమరావతి: స్వలాభం కోసమే చంద్రబాబు అఖిలపక్ష భేటీ నిర్వహిస్తున్నారని, అందుకే ఆ సమావేశానికి వెళ్లడం లేదని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఈ మేరకు ఆయన చంద్రబాబుకు లేఖను రాశారు. ఏపీకి కేంద్రం, మోదీ అన్యాయం చేశారనడం రాజకీయమేనని ఆయన అన్నారు. 

చంద్రబాబుకు మోదీ కన్నా సోనియా, రాహుల్ ముద్దుగా కనిపిస్తున్నారని.. అతడి ద్వంద్వ వైఖరిని ఎండగడతామని విష్ణు కుమార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక చంద్రబాబు నాటకం ఆడుతూ అందరినీ విమర్శిస్తున్నారని, రాష్ట్రాభివ‌ద్ధికి చంద్రబాబే ఆటంకం అని విష్ణు కుమార్ రాజు తెలిపారు.మంత్రి లోకేష్, విష్ణు మధ్య ఆసక్తికర చర్చ

Updated By ManamWed, 03/07/2018 - 11:07

మంత్రి లోకేష్, విష్ణు మధ్య ఆసక్తికర చర్చఅమరావతి: గత కొద్దిరోజులుగా మిత్రపక్షమైన బీజేపీ-టీడీపీ ఉప్పు నిప్పులా తయారైన సంగతి తెలిసిందే. ఇటు అసెంబ్లీ సమావేశాలు, అటు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవ్వడంతో ఈ రెండు పార్టీల నేతల మధ్య వివాదం మరింత ముదిరినట్లైంది. ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకుంటూ దుమారం రేపుతున్నారు.  

ఇదిలా ఉంటే బుధవారం ఉదయం అసెంబ్లీ లాబీల్లో మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ మధ్య ఆసక్తికర చర్చ సాగింది. శాసనమండలికి వెళ్తున్న మంత్రిని ఆపిన విష్ణు నేరుగా బీజేపీ ఎల్పీ ఆఫీసుకెళ్లారు. బీజేపీ ఎల్పీ ఆఫీసు వాస్తు బాగోలేదని విష్ణు.. మంత్రికి వివరించారు. అయితే తన కార్యాలయాన్ని మీరు వాడుకోండి.. తాను మీ కార్యాలయాన్ని వాడుకుంటానని లోకేష్ బదులిచ్చారు. వద్దు సార్.. మీరు మంత్రులు మా ఆఫీసులో ఎలా ఉంటారని విష్ణు.. లోకేష్‌‌కు వివరించారు. వీరిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం.. అసెంబ్లీ లాబ్లీ నుంచి బీజేపీ ఎల్పీ కార్యాలయానికి వెళ్లడం ఇదంతా అసెంబ్లీ ఆవరణలో హాట్ టాపిక్‌గా మారింది.టీడీపీపై బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణ

Updated By ManamTue, 03/06/2018 - 10:25

టీడీపీపై బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణ అమరావతి: టీడీపీపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాలకు వెళ్లే ముందు మీడియాతో మాట్లాడిన విష్ణు.. గుండాలను, రౌడీలను అద్దెకు తీసుకుని టీడీపీ ధర్నాలు చేస్తోందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు వెంటనే ఎమ్మెల్యే వాసుపల్లిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మోడీ మెడలు వంచుతామంటూ విశాఖలో ఎమ్మెల్యే వాసుపల్లి ధర్నా చేశారని విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిత్రధర్మంలో ఉన్నాం కాబట్టి సంయమనం పాటిస్తున్నామని ఆయన పరోక్షంగా హెచ్చరించినట్లు మాట్లాడారు. సీఎం ఇంత జరుగుతున్నా ఇంకా మౌనంగా ఉంటే ఆయన ప్రోత్సాహం ఉందని భావించాల్సి ఉంటుందన్నారు.

కాగా విభజన హామీల అమలు కోసం ఢిల్లీలో ఏపీ ఎంపీలు సోమవారం ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. మంగళవారం కూడా ఆందోళన చేపట్టో యోచనలో వైసీపీ ఎంపీలు, వామపక్షాలు ఉన్నాయి. సభను అడ్డుకునేందుకు వైసీపీ, టీడీపీ ఎంపీలు సిద్ధమవుతున్నారు.అది నా వ్యక్తిగత అభిప్రాయం

Updated By ManamSun, 01/28/2018 - 16:01

Vishnu Kumar Rajuఅమరావతి: తాను వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో చేసిన వ్యాఖ్యలు కాకతాళీయమని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఆ సమయంలో పీఏసీ సభ్యుడిగా రాజకీయాలకు అతీతంగా మాట్లాడానని ఆయన చెప్పారు. పార్టీ ఫిరాయించిన వారికి మంత్రి పదవులివ్వడం తప్పేనని తాను చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తన వ్యక్తిగత అభిప్రాయమని, వాటిని రాజకీయ కోణంలో చూడొద్దంటూ పేర్కొన్నారు. ఆ రోజు సమీపంలో వైఎస్సార్‌సీపీ కార్యాలయం ఉంది కాబట్టి అక్కడ మాట్లాడానని అన్నారు. అలాగే తాను సంకీర్ణధర్మాన్ని పాటిస్తామని, పొత్తుల గురించి మాట్లాడే స్థాయి తనది కాదని, ఆ విషయం అధిష్టానం చూసుకుంటుందన్నారు.

Related News