shruthi hasan

హలో సగా అంటున్న శ్రుతి

Updated By ManamTue, 10/23/2018 - 06:25

సంగీత దర్శకురాలిగా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రుతిహాసన్ తర్వాత హీరోయిన్‌గా మారి బాలీవుడ్, దక్షిణాదిన స్టార్ హీరోయిన్‌గా రాణించింది. అయితే ఈ మధ్య కాలంలో ఈమె ఎందుకనో సినిమా రంగానికి చాలా దూరంగా ఉంటున్నారు. ‘శభాష్ నాయుడు’ సినిమా ఆగిపోయిన తర్వాత కొన్ని రోజులకు ప్రియుడు మైకేల్‌ను పెళ్లి చేసుకుంటుందని .. అందుకనే సినిమాలేవీ ఒప్పుకోవడం లేదని వార్తలు వినిపించాయి కూడా. అయితే అలాంటిదేమీ లేదని.. వాంటెడ్‌గానే గ్యాప్ తీసుకున్నానని శ్రుతి హాసన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

image


ప్రస్తుతం మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తుందంతే. అయితే త్వరలోనే శ్రుతి త్వరలోనే బుల్లి తెరపై సందడి చేయనుంది. ఇప్పుడు హీరోలు సినిమాలతో పాటు టీవీ ప్రోగ్రామ్స్‌పై కూడా ఆసక్తి చూపిస్తున్నారు. కోలీవుడ్‌ను గమనిస్తే రీసెంట్ టైమ్స్‌లో విశాల్, వరలక్ష్మి శరత్‌కుమార్ బుల్లి తెరపై స్పెషల్ ప్రోగ్రామ్స్‌తో సందడి చేయడం మొదలు పెట్టారు. ఇప్పుడు శ్రుతి హాసన్ కూడా వీరి లిస్టులో చేరింది. సన్ టీవీలో ‘హలో సగా!’ అనే ప్రోగ్రామ్‌ను శ్రుతి హాసన్ హోస్ట్ చేయనుంది. మరీ అంత పిరికిదాన్ని కాదు

Updated By ManamWed, 06/06/2018 - 22:25

imageప్రస్తుతం మనకున్న హీరోయిన్లలో ఎక్కువ ప్రత్యేకతలు ఉన్నది శ్రుతిహాసన్‌కి మాత్రమే. ఎందుకంటే ఆమె నటించగలదు, పాడగలదు, మ్యూజిక్ కంపోజ్ చెయ్యగలదు. అంతేకాదు అనర్గళంగా ఎనిమిది భాషలు మాట్లాడగలదు. అంతేకాదు రాయగలదు కూడా. నటనను తండ్రి కమల్ హాసన్ నుంచి వారసత్వంగా తీసుకున్న శ్రుతి దక్షిణాదిలోనే కాదు బాలీవుడ్‌లోనూ తనను తాను ప్రూవ్ చేసుకుంది. అయితే ఇప్పుడామెకు అవకాశాలు ఆశించినంతగా రావడం లేదు. దీనికి కారణం వయసు 30 దాటిపోవడమేనా?

ఇదే విషయాన్ని ఆమె దగ్గర ప్రస్తావించినపుడు ‘‘నటనకు వయసు అనేది ప్రధానం కాదు. నలభై సంవత్సరాలు దాటిపోయిన హీరోలు కూడా పుస్తకాలు పట్టుకొని స్టూడెంట్‌లా నటిస్తుంటే ఆ సినిమాలు ప్రేక్షకులు చూస్తున్నారు, ఆదరిస్తున్నారు. అలాగే 50 సంవత్సరాలు పైబడినవారు హీరోలుగా ఛలామణి అవుతున్నారు. హీరోయిన్ల విషయానికి వచ్చేసరికి అందరి ఆలోచన ఎందుకలా మారిపోతుందో అర్థం కాదు. నటన ఎవరికైనా ఒకటే. నచ్చకపోతే కుర్ర హీరోయిన్లనైనా తిప్పి కొడతారు ప్రేక్షకులు. నా విషయానికి వస్తే వయసు పెరిగింది కాబట్టి అవకాశాలు రావడం లేదన్నది కరెక్ట్ కాదు. అవకాశాలు రాకపోతే భయపడిపోయేంత పిరికిదాన్ని కాదు నేను. ప్రస్తుతం తెలుగులో ఒకటి, హిందీలో ఒక సినిమా చేస్తున్నాను. మరికొన్ని సినిమాలు కమిట్ అవ్వాల్సి ఉంది’’ అని చెప్తోంది శ్రుతి.సెవెన్త్ వండ‌ర్స్ ( స్పెష‌ల్ ఆర్టిక‌ల్‌)

Updated By ManamThu, 05/03/2018 - 18:38

7th'రంగ‌స్థ‌లం'.. తెలుగు నాట వ‌సూళ్ళ వ‌ర్షం కురిపిస్తున్న తాజా చిత్రం పేరిది. 1980ల నాటి గ్రామీణ వాతావ‌ర‌ణంతో.. అక్క‌డి రాజ‌కీయాల నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమా.. ద‌ర్శ‌కుడిగా సుకుమార్ ప్ర‌తిభ‌ని మ‌రోసారి చాటింది. అంతేగాకుండా.. ఆయ‌న కెరీర్ బెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా.. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన 7వ చిత్రం. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. గ‌తంలో ప‌లువురు సినీ ప్ర‌ముఖుల ఏడో చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఇలానే సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా.. కెరీర్ బెస్ట్ హిట్‌గా నిల‌వ‌డ‌మో.. ట‌ర్నింగ్ పాయింట్‌గా నిల‌వ‌డ‌మో జ‌రిగిన సంద‌ర్భాలున్నాయి. అలాగే వారి కెరీర్‌లో మంచి విజ‌యాలు అందించ‌డ‌మో జ‌రిగింది.  ఓ సారి ఆ ప్ర‌ముఖుల 7వ సినిమాల‌ వైపు దృష్టి పెడితే..

నంద‌మూరి తార‌క రామారావు
న‌ట సార్వ‌భౌముడు ఎన్టీఆర్ సినీ ప్ర‌స్థానంలోనే కాదు, తెలుగు సినిమా చరిత్ర‌లోనూ 'పాతాళ భైర‌వి'ది చెర‌గ‌ని స్థానం. ఈ సినిమాలో తోట రాముడు పాత్ర‌లో ఆయ‌న చేసిన సంద‌డి అంతా ఇంతా కాదు. కె.వి.రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం అప్ప‌ట్లో సంచ‌ల‌న విజ‌యం సాధించింది. న‌టుడిగా ఈ సినిమా.. ఎన్టీఆర్‌కు ఏడ‌వ చిత్రం.

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు
మ‌హాన‌టుడు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు కెరీర్‌లో 'బాల‌రాజు' చిత్రం ప్ర‌త్యేకం. ఈ సినిమాతో న‌టుడిగా ఏఎన్నార్ స్థాయి మ‌రింత పెరిగింది.  విజ‌య‌వాడ‌లో ఏడాది పాటు ఆడిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వ‌ద్ద ప‌లు రికార్డుల్ని సృష్టించింది. ఈ సినిమా.. త‌న‌ కెరీర్‌లో ఏడ‌వ చిత్రం కావ‌డం విశేషం.

ప‌వ‌న్ క‌ల్యాణ్‌
ప‌వ‌న్ క‌ల్యాణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రాల‌లో 'ఖుషి' ఒక‌టి. ఆడియో ప‌రంగానూ.. సినిమా ప‌రంగానూ అనేక సంచ‌ల‌నాల‌కు కేంద్ర బిందువుగా నిలిచిన ఈ చిత్రం.. ప‌వ‌న్ ఇమేజ్‌ను అమాంతం ఎన్నో రెట్లు పెంచింది.  అలాంటి 'ఖుషి'.. ప‌వ‌న్ కెరీర్‌లో ఏడ‌వ సినిమా కావ‌డం విశేషం.

మ‌హేశ్ బాబు, భూమిక‌, గుణ‌శేఖ‌ర్‌
'ఒక్క‌డు'.. మ‌హేశ్ బాబు కెరీర్‌లో ట‌ర్నింగ్ పాయింట్‌లా నిలిచిన చిత్రం పేరిది. అప్ప‌టివ‌ర‌కు మ‌హేశ్‌కున్న ఇమేజ్‌ను పూర్తిగా మార్చివేయ‌డ‌మే కాకుండా.. రికార్డు స్థాయి వ‌సూళ్ళ‌ను మూట‌గ‌ట్టుకుంది. మ‌హేశ్‌కు స్టార్ డ‌మ్ తీసుకువ‌చ్చిన ఈ సినిమా.. ఆయ‌న కెరీర్‌లో ఏడ‌వ చిత్రం. అలాగే క‌థానాయిక భూమిక‌, ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ కెరీర్‌లోనూ ఇది ఏడో చిత్రం కావ‌డం విశేషం.

ఎన్టీఆర్‌
తాత‌య్య ఎన్టీఆర్‌కు ఏడ‌వ చిత్రం 'పాతాళ భైర‌వి' ఏ విధంగానైతే ట‌ర్నింగ్ పాయింట్‌లా నిలిచిందో.. అలాగే మ‌న‌వ‌డు ఎన్టీఆర్‌కు కూడా అత‌ని ఏడో చిత్రం మంచి బ్రేక్‌ను అందించిన సినిమా కావ‌డం యాదృచ్ఛిక‌మైనా ఓ విశేషంగానే చెప్పుకోవాలి. ఇంత‌కీ ఆ చిత్ర‌మేమిటంటే.. 'సింహాద్రి'. తార‌క్ ద‌శ‌ను, దిశ‌ను మార్చివేసిన ఈ సినిమా.. అప్ప‌ట్లో ఎన్నో సంచ‌ల‌నాల‌కు కేంద్ర బిందువుగా నిలిచింది.

రాజ‌మౌళి
'బాహుబ‌లి' సిరీస్‌తో ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ప్ర‌తిభాపాట‌వాలు ఖండాంత‌రాలు దాటినా.. ఆయ‌న కెరీర్‌ను కీల‌క మలుపు తిప్పిన సినిమా మాత్రం 'మ‌గ‌ధీర' అనే చెప్పాలి.  జాతీయ స్థాయిలో తెలుగు సినిమా కూడా విజువ‌ల్ ఎఫెక్ట్స్ ప‌రంగా ముందుందని చాటి చెప్పిన ఈ చిత్రం.. ద‌ర్శ‌కుడిగా రాజ‌మౌళి స్థాయిని అమాంతం పెంచింది. అలాంటి 'మ‌గ‌ధీర‌'.. రాజ‌మౌళి కెరీర్‌లో ఏడో చిత్రం కావ‌డం విశేషం.

శ్రియ‌
కేవ‌లం గ్లామ‌ర్ పాత్ర‌ల‌కే ప‌రిమితం కాకుండా.. ఆడ‌పాద‌డ‌పా అభిన‌యానికి పాత్ర‌ల్లోనూ క‌నిపించి మెప్పించిన క‌థానాయిక శ్రియ‌. 'సంతోషం'తో తొలి హిట్‌ను అందుకున్న శ్రియ‌.. బిగ్గెస్ట్ హిట్‌ను అందుకుంది మాత్రం చిరంజీవి హీరోగా న‌టించిన 'ఠాగూర్' సినిమాతోనే. న‌టిగా ఆమెకిది ఏడో చిత్రం కావ‌డం విశేషం.

స‌మంత‌
తొలి చిత్రం 'ఏమాయ చేసావె'తోనే విజ‌యం అందుకున్న స‌మంత‌కి.. క‌మ‌ర్షియ‌ల్ హీరోయిన్‌గా మంచి బ్రేక్ ఇచ్చిన చిత్రం మ‌హేశ్ బాబు హీరోగా న‌టించిన‌ 'దూకుడు'నే. తెలుగు, త‌మిళ భాష‌ల్లో అప్ప‌టికే ఆరు సినిమాల్లో న‌టించిన స‌మంత‌కు ఇది ఏడో సినిమా. మిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్‌లో సౌత్ క్వీన్‌గా నిలిచిన స‌మంత‌కు.. ఆ క్ల‌బ్‌లో తొలిసారిగా స్థాన‌మిచ్చిన చిత్రం కూడా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.

శ్రుతి హాస‌న్‌
లోక నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ త‌న‌య‌గా ప‌రిచ‌య‌మైన శ్రుతి హాస‌న్‌కు తెలుగు, హిందీ, త‌మిళ్‌.. ఇలా మూడు భాష‌ల్లో చేసిన మొద‌టి ఆరు సినిమాలు వ‌రుస‌గా ప‌రాజ‌యాల‌నే అందించాయి. ఇలాంటి స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ జోడీగా నటించిన 'గ‌బ్బ‌ర్ సింగ్' చిత్రం.. క‌థానాయిక‌గా ఆమె న‌టించిన ఏడో సినిమాగా విడుద‌లై ఆమెకు క‌మ‌ర్షియ‌ల్‌గా ఘ‌న‌విజ‌యాన్ని అందించింది. దీంతో.. 7 అనేది శ్రుతి ల‌క్కీ నెంబ‌ర్‌గా మారింది. ఇటీవ‌ల ట్విట్ట‌ర్‌లో త‌న ఫాలోవ‌ర్లు 7 మిలియ‌న్లకి చేరుకున్నాక‌.. 7 త‌న ల‌క్కీ నెంబ‌ర్ అంటూ మ‌రోసారి ప్ర‌స్తావించింది శ్రుతి.

వీరితో పాటు.. వెంక‌టేశ్ (శ్రీ‌నివాస క‌ళ్యాణం), రామ్ చ‌ర‌ణ్ (ఎవ‌డు), నాగ‌చైత‌న్య (మ‌నం), అనుష్క (ల‌క్ష్యం), కృష్ణ‌వంశీ (మురారి), పూరీ జ‌గ‌న్నాథ్ (అమ్మ‌ నాన్న ఓ త‌మిళ‌మ్మాయి), వి.వి.వినాయ‌క్ (లక్ష్మీ), ఎ.క‌రుణాక‌ర‌న్ (డార్లింగ్‌), దిల్ రాజు (కొత్త బంగారు లోకం), త్రివిక్ర‌మ్ (స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి) వంటి సినీ ప్ర‌ముఖుల‌కు కూడా వారి వారి ఏడో చిత్రాలు మంచి విజ‌యాలు అందించ‌డం విశేషం. ఏదేమైనా.. మ‌న సినీ ప్ర‌ముఖుల్లో చాలా మందికి ఏడో సినిమాలు 'సెవెన్త్ వండ‌ర్‌'గా నిల‌వ‌డం ప్ర‌త్యేక‌మైన విష‌యంగానే చెప్పుకోవాలి.                                                                                    -మ‌ల్లిక్ పైడిపెళ్లి ఇప్పుడే కాదు! -శ్రుతి హాసన్

Updated By ManamSat, 04/28/2018 - 21:07

shruthiకమల్ గారాల తనయ శ్రుతి హాసన్ ఇప్పుడు సినిమాలేవీ చేయడం లేదు. అదీగాక తన బాయ్‌ఫ్రెండ్ వైుఖెల్‌తో ఈ అమ్మడు కెవెురాలకు చిక్కడంతో... ఇద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నార‌ని వార్తలు వినపడ్డాయి. అందువల్లనే ఈమె సినిమాలను ఒప్పుకోవడం లేదని కూడా అన్నారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేసిన శ్రుతి హాసన్.. తన పెళ్లిపై వస్తున్న వార్తలకు సమాధానం ఇచ్చింది. తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పేసింది. అంతే గాకుండా.. మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రంతో బిజీ  కానున్నాన‌ని.. ఇందులో విద్యుత్ జమ్వాల్‌తో కలిసి న‌టించ‌నుండ‌డం ఆనందంగా ఉంద‌ని శ్రుతి తెలిపారు. శ్రుతి హాస‌న్‌.. 'డబుల్ ధ‌మ‌కా' ఫొటోషూట్

Updated By ManamSun, 01/28/2018 - 19:40

sruthi hasanన‌ట‌న‌కి ప‌ర్యాయ‌ప‌దంలా నిలిచారు లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్‌. అలాంటి క‌మల్‌కు న‌ట‌వార‌సురాలిగా తెరంగేట్రం చేసింది శ్రుతి హాస‌న్‌. క‌థానాయిక‌గా కేవ‌లం గ్లామ‌ర్ పాత్ర‌ల‌కే ప‌రిమితం కాకుండా.. అభిన‌యానికి ఆస్కార‌మున్న పాత్ర‌ల్లోనూ మెప్పించింది. అయితే, ఈ మ‌ధ్య సినిమాల విష‌యంలో కాస్త జోరు త‌గ్గించి.. ఆచితూచి అడుగులు వేస్తోంది ఈ ముద్దుగుమ్మ‌.

sruthiఇదిలా ఉంటే.. ఈ రోజు (ఆదివారం) త‌న 32వ పుట్టిన రోజు జరుపుకుంటోంది ఈ అందాల తార‌. ఈ సంద‌ర్భంగా ఓ క్యాలెండ‌ర్ ఫొటోషూట్‌ కోసం శ్రుతి దిగిన ఫొటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు సినిమాల్లో డ్యూయెల్ రోల్ చేసే అవ‌కాశం అందుకోలేక‌పోయినా.. ఇలా ఈ క్యాలెండ‌ర్ ఫొటోషూట్ ద్వారా ఆ ముచ్చ‌టా తీర్చుకుంది శ్రుతి. మొత్తానికి.. ఈ ఫోటోషూట్‌తో మ‌రోసారి త‌న అభిమానుల‌ను ఫిదా చేసేసింది శ్రుతి.

sruthi hasan

 

Related News