russia

ఆరు నెలల్లో 4లక్షలకు పైగా సైబర్ దాడులు 

Updated By ManamMon, 11/12/2018 - 09:50

 Cyber Attacksన్యూఢిల్లీ: పెరుగుతున్న టెక్నాలజీతో పాటు సైబర్ దాడులు క్రమంగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి-జూన్ మధ్య కాలంలో భారత దేశంపై 4.36లక్షల సైబర్ దాడులు జరిగినట్లు సైబర్ సెక్యూరిటీ సంస్థ ఎఫ్ సెక్యూర్ తెలిపింది. రష్యా, అమెరికా, చైనా, నెదర్లాండ్స్ దేశాల నుంచి ఎక్కవ మంది సైబర్ నేరగాళ్లు భారత్‌పై దాడి చేసినట్లు ఆ సంస్థ వెల్లడించింది. రష్యా నుంచి అత్యధికంగా 2,55,589.. అమెరికా నుంచి 1,03,458, చైనా నుంచి 42,544, నెదర్లాండ్స్ నుంచి 19,169.. జర్మనీ నుంచి 15,330 మంది సైబర్ దాడి చేసినట్లు ఆ సంస్థ పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా ఈ దాడులను ఎదుర్కొంటున్న జాబితాలో భారత్‌ 21వ స్థానంలో ఉందని.. భారత నెటిజన్లను 6,95,396మంది హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నారని వెల్లడించింది. ఇక దాడులు చేస్తున్న జాబితాలో భారత్ 13వస్థానంలో ఉందని.. మొత్తం 73,482మంది హ్యాకర్లు ఇక్కడి నుంచి దాడులు చేస్తున్నారని ఎఫ్ సెక్యూర్ తెలిపింది.సర్కస్ షోలో 4ఏళ్ల బాలికపై సింహం దాడి

Updated By ManamTue, 10/30/2018 - 14:27
  • బాలిక ముఖంపై పంజా విసిరిన సింహం

  • చిన్నారికి తీవ్రగాయాలు.. ఆస్పత్రికి తరలించి చికిత్స 

Circus lion, pounces on girl, Russia, slashes her faceమాస్కో: సర్కస్‌లో విన్యాసాలు చేయాల్సిన సింహం నాలుగేళ్ల చిన్నారిపై దాడి చేసింది. దాంతో అప్పటివరకు ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. ఈ ఘటన దక్షిణ రష్యాలోని క్రాస్‌నోడార్‌లో ఆదివారం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. సర్కస్‌లో ట్రెయినర్ సింహంతో జంప్ చేయిస్తుండగా ఆకస్మాత్తుగా నెట్‌కు దగ్గరలో ఉన్న చిన్నారిపై సింహం పంజా విసిరి దాడి చేసింది. దాంతో బాలిక ముఖంపై తీవ్రగాయాలయ్యాయి. బాధిత బాలికను చికిత్స నిమిత్తం పిల్లల ఆస్పత్రికి తరలించారు. దాడిచేసిన సింహం చిన్నారిని తినలేదని, కానీ, బాలికపై పంజా విసిరిందని ఆర్ఐఏ న్యూస్ ఏజెన్సీ నివేదించింది.

సర్కస్ షోకు వచ్చే వీక్షకుల భద్రత పట్ల నిర్లక్ష్యం వహిస్తూ షో నిర్వహించినందుకు సింహం ట్రయినర్, మాస్కో బిగ్ సర్కస్ డైరెక్టర్ ఎడ్వార్డ్ జపాస్నిని విధుల నుంచి తొలగించారు. రష్యాలో సర్కస్ షోల్లో జంతువులు దాడులు చేయడం సర్వసాధారణమే. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా జంతువులతో షోలు నిర్వహించడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని విమర్శలు వెల్లువెత్తున్నాయి. 2016లో సైబేరియాలో జరుగుతున్న సర్కస్ షోలో చిరుతపులి బోన్‌ను విరగొట్టి ఒక్కసారిగా విన్యాసాలను వీక్షిస్తున్న మహిళపై దాడి చేసింది. పెనుప్రమాదం తప్పింది

Updated By ManamSun, 09/02/2018 - 00:23

రష్యాలోని నల్లసముద్రం తీరంలో ఉన్న సోచి అంతర్జాతీయ విమానాశ్రయంలో పెనుప్రమాదం తప్పింది. రన్‌వేపై దిగుతుండగా అదుపుతప్పిన విమానం సముద్రం అంచుల్లోకి జారిపోయింది. ఈ  సమయంలో విమానంలో 164 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. కానీ..అత్యవసరవిభాగానికి చెందిన ఓ ఉద్యోగి మృతి చెందారు.
 

image

 14 ఏళ్ల‌లోపు వారిపై సోష‌ల్ నెట్‌వ‌ర్క్ ఆంక్ష‌లు

Updated By ManamMon, 08/13/2018 - 20:23

Russia Imposes New Fines on Internet Providers
రష్యా:
14 ఏళ్ల‌లోపు బాల‌ల్లో సామాజిక మాధ్య‌మాల దుష్ప్ర‌భావాన్ని త‌గ్గించేందుకు ర‌ష్యా ప్ర‌భుత్వం ప‌లు ఆంక్ష‌ల‌ను అమ‌లు చేస్తోంది. ఈ నిబంధ‌న‌ల‌ను అధిగ‌మించే ఇంట‌ర్నెట్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల‌పైనా భారీగా జ‌రిమానా విధిస్తోంది. అవ‌తలి వ్య‌క్తి ఎవ‌రో ఏమిటో తెలియ‌కుండా మాధ్య‌మాల్లో ఎవ‌రికి ప‌డితే వారికి ఖాతాల‌ను క్రియేట్ చేసుకునే అవ‌కాశం క‌ల్పించే నెట్ ప్రొవైడ‌ర్ల‌కు 3ల‌క్ష‌ల రూబుళ్ల వ‌ర‌కు ఫైన్ జ‌రిమానా విధిస్తోంది. సోష‌ల్ నెట్‌వ‌ర్క్‌లో ప్ర‌తి ఒక్క‌రూ ఒకే ఒక్క ఖాతాను అదీ కూడా త‌మ సొంత పేరు లేదా ఇంటి పేరుతో మాత్ర‌మే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. 

అలా చేయ‌ని ప‌క్షంలో.. ఆ సైట్ య‌జ‌మానికి 3 ల‌క్ష‌ల రూబుళ్ల వ‌ర‌కు ఫైన్ వేస్తారు. వినియోగ‌దారుడికి కూడా 5వేల రూబుళ్ల జ‌రిమానా ఉంటుంది. 18 ఏళ్ల‌లోపు వారికైతే నిషేధిత సమాచారం పంచుకునే గ్రూపులో స‌భ్యుడిగా చేరే అవ‌కాశం లేదు. ఒక వేళ చేరితే అందుకు త‌గిన శిక్ష‌లుంటాయి. వారు 2వేల రూబుళ్లు స‌మ‌ర్పించుకోవాల్సి ఉంటుంది. మైన‌ర్ల‌కు వ‌స్తువులు అమ్మే సోష‌ల్ నెట్ వ‌ర్క్‌ల‌కు కూడా జ‌రిమానాలుంటాయి. దీంతోపాటు ధూమ‌పానం వంటి ప్ర‌క‌న‌ట‌ల‌ను కూడా వారికి చూపించ‌రాదు. ప‌నిలో ప‌నిగా ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను కూడా ఈ నిషేధ జాబితాలో చేర్చింది ర‌ష్యా ప్ర‌భుత్వం. ఆఫీసు వేళ‌ల్లో సోష‌ల్ నెట్‌వ‌ర్క్‌ల‌లో గ‌డప‌డ‌టాన్ని కూడా సీరియ‌స్‌గా తీసుకుంటుంది.చేతులు క‌లిపిన చైనా, ర‌ష్యా

Updated By ManamSat, 08/11/2018 - 15:29
china helps Russia thwart US bid to freeze bank’s assets

ఉత్త‌ర‌కొరియాపై మ‌ళ్లీ ఆంక్ష‌లు విధించేందుకు అమెరికా చేస్తున్న య‌త్నాన్ని చైనా, ర‌ష్యాలు అడ్డుకున్నాయి. ఆగ్రోసూయుజ్ క‌మ‌ర్షియ‌ల్ బ్యాంకు ఉత్త‌ర‌కొరియాకు సాయం చేస్తోంద‌ని అమెరికా ఆరోప‌ణ‌. దీంతో ఆ బ్యాంకుపై ఆంక్ష‌లు విధించాల‌ని గ‌త వారం ఐక్య‌రాజ్య‌స‌మితిని అమెరికా కోరింది.

అయితే, ర‌ష్యాకు చెందిన ఆ బ్యాంకుపై చ‌ర్య‌లు తీసుకోవ‌డాన్ని చైనా శుక్ర‌వారం ఖండించింది. త‌మ బ్యాంకుపై మోపిన ఆరోప‌ణ‌ల‌పై ర‌ష్యా అనుమానం వ్య‌క్తం చేసింది. దీంతోపాటు ఉత్త‌రకొరియాకు చెందిన మ‌రో మూడు ఆర్థిక సంస్థ‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న డిమాండ్‌ను తోసిపుచ్చాయి.

అమెరికాతో చ‌ర్చ‌ల‌కు ఉత్త‌ర‌కొరియా ముందుకు వ‌చ్చినందున ఆ దేశంపై ఆంక్ష‌లు స‌డ‌లించాల‌ని కూడా కోరాయి. కాగా, ఉత్త‌ర కొరియాపై మ‌రిన్ని ఆంక్ష‌లు విధించేందుకు అమెరికా ప్ర‌య‌త్నించ‌డం మూడు వారాల్లో ఇది రెండోసారి.అమెరికా ‘స్పేస్ ఫోర్స్’

Updated By ManamSat, 08/11/2018 - 00:23
  • చైనా, రష్యాలను ఎదుర్కొనేందుకే..

  • 2020లోగా ఏర్పాటుకు ప్రణాళికలు

  • కాంగ్రెస్ ఎదుట ప్రతిపాదనలు


imageవాషింగ్టన్: పదాతి దళాన్ని చూశాం! నౌకా దళాన్ని, వాయు సేనను కూడా చూశాం! భవిష్యత్తులో ‘అంతరిక్ష దళం’ను కూడా చూడాల్సి రావొచ్చు! చైనా, రష్యా నుంచి తన ఆధిపత్యానికి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్న నేపథ్యంలో కొత్తగా ‘స్పేస్ ఫోర్స్’ ఏర్పాటు చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. ఈ మేరకు తన ప్రతిపాదనలను కాంగ్రెస్  ముందుంచారు. వాటికి ఆమోదం లభిస్తే త్వరలోనే ‘స్పేస్ ఫోర్స్’ కార్యరూపం దాల్చనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను కొద్దిరోజుల క్రితం ఆ దేశ రక్షణశాఖ మంత్రి మెక్ పెన్స్ చూచాయగా వెల్లడించారు.

‘‘రష్యా, చైనా అంతరిక్ష కార్యక్రమాలు సైనిక అవసరాలతో ముడిపడి ఉన్నాయి. అదే సమయంలో ఉత్తరకొరియా, ఇరాన్‌తోనూ ఇబ్బందులు ఉన్నాయి. ఆ హెచ్చరికలు చివరికి అంతరిక్షంలో ఘర్షణకు దారితీయొచ్చు. రష్యా కొద్ది రోజుల క్రితం యాంటీ శాటిలైట్ మిసైల్ సిస్టమ్ పీఎల్-19/నుడాల్‌ను పరరీక్షించింది. అలాగే చైనా కూడా ఇలాంటి పరీక్షలే నిర్వహించినట్లు తెలిసింది. ఎస్‌సీ-19 లేదా డీఎన్-3 పేరుతో అంతరిక్షంలోని శాటిలైట్లను పేల్చేసే పరిజ్ఞానాన్ని చైనా పరీక్షించింది.

image

వాటి వాలకాన్ని చూస్తుంటే అంతరిక్షంలో యుద్ధానికే సిద్దపడినట్లు అవగతమవుతోంది. మేం కూడా సిద్ధం కావాలని భావిస్తున్నాం. ప్రత్యేకంగా స్పేస్ ఫోర్స్ విభాగాన్ని ఏర్పాటుకు యోచిస్తున్నాం’’ అని పెన్స్ పేర్కొన్నారు.  ఇందుకు సంబంధించిన లోగోలను కూడా విడుదల చేశారు. ఓటింగ్ ద్వారా ఒక లోగోను ఎన్నుకోవాలని సూచించారు.  2020 నాటికి దీనికి కార్యరూపం ఇవ్వాలని భావిస్తున్నారు.రెండేళ్ల శ్ర‌మ అలా వృథా అయ్యింది!

Updated By ManamThu, 08/09/2018 - 15:26
  • రెండేళ్లుగా భారీ స్కెచ్... 

  • లాస్ట్ మినిట్‌లో దొరికిపోయారు...

Crooks spend two years digging tunnel

ఆరుగురు మిత్రులు..మూడేళ్ల ప్లాన్‌.. రెండేళ్ల నిరంత‌ర శ్ర‌మ‌..ఆఖ‌రి నిమిషంలో విధి వెక్కిరించింది. వారిని క‌ట‌క‌టాల పాలు చేసింది. ఆ ప్రాంతానికి పెను విధ్వంసం త‌ప్పింది. ర‌ష్యాలోని సైబీరియా ప్రాంతం అంగ‌ర్స్క్ న‌గ‌రానికి చెందిన ఆరుగురు ముఠా స‌భ్యులకు చిన్నాచిత‌కా ప‌నులతో బోర్ కొట్టింది. ఒక్క‌సారిగా ధ‌న‌వంతులు కావాలంటే ఏం చేయాల‌నే దానిపై తీవ్రంగా ఆలోచించి భారీ స్కెచ్ వేశారు.

ఆ ప్రాంతం గుండా వెళ్లే పైపులైన్ వ‌ద్ద‌కు సొరంగం త‌వ్వి, పైపున‌కు రంధ్రం వేసి చ‌మురును కాజేయాల‌నేది వారి ప్లాన్‌. దాని ప్ర‌కారం 2016లో పైపులైన్ స‌మీపంలోని నిర్జ‌న‌ ప్ర‌దేశంలో త‌వ్వ‌కాలు మొద‌లుపెట్టారు. పెద్ద సామ‌గ్రితో ప‌నిలేకుండా కేవ‌లం పార‌ల‌తోనే గుట్టుచ‌ప్పుడు కాకుండా ప‌ని సాగించారు. దాదాపు 125 మీట‌ర్ల మేర సొరంగం త‌వ్వారు. అక్క‌డికి స‌మీపంలో ఉన్న‌పెద్ద పైపులైన్‌ను చేరాలంటే కేవ‌లం కొన్ని రోజులు మాత్రం ప‌నిచేస్తే స‌రిపోతుంది. పైపులైన్‌కు రంధ్రం చేసి చ‌మురును దొంగిలించి అమ్ముకోవ‌చ్చు. కానీ, వారి నిర్వాకాన్ని పైపులైన్ కాప‌లా  క‌నిపెట్టేశారు.

మ‌రో మూడు మీట‌ర్ల మేర ప‌ని మిగిలి ఉండ‌గా వారు దొరికిపోయారు. సామ‌గ్రి స‌హా అంద‌రినీ పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. చ‌మురు దొంగ‌త‌నం ఏమీ జ‌ర‌గ‌న‌ప్ప‌టికీ వారికి చ‌ట్ట ప్ర‌కారం ప‌దేళ్ల వ‌ర‌కు జైలు శిక్ష ప‌డుతుంద‌ని పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై పైపులైన్ య‌జమాని మాట్లాడుతూ.. ఈ కుట్ర బ‌య‌ట‌ప‌డ‌టంతో పెను ప్ర‌మాదం త‌ప్పిన‌ట్ల‌యింద‌న్నారు. భారీ ఒత్తిడితో పైపులైన్ల‌లో చమురు పంప్ అవుతుంటుంద‌నీ, దానికి రంధ్రం చేసి ఉంటే పెను ప్ర‌మాదం జ‌రిగి ఉండేద‌ని అన్నారు. రష్యాలో తెలంగాణ విద్యార్థి మృతి

Updated By ManamSun, 08/05/2018 - 10:38
  • స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన గుజ్జ నవీన్

  • ఓరన్‌బాగ్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్న నవీన్

  • ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మృతిచెందిన భువనగిరి వాసి

Russia, MBBS student, Bhuvanagiri resident, Gujja naveenభువనగిరి: రష్యాలో తెలంగాణ విద్యార్థి మృతిచెందాడు. యాదాద్రి భువనగిరికి చెందిన గుజ్జ నవీన్‌(22) అనే యువకుడు రష్యాలో ఓరన్‌బాగ్‌ మెడికల్‌ యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం చదువుతున్నాడు. భువనగిరిలోని ఆర్‌బీనగర్‌కు చెందిన గుజ్జు హేమలత, యాదగిరి దంపతులకు ఇద్దరు సంతానం. వీరిలో పెద్ద కుమారుడు గుజ్జ నవీన్‌. పుట్టిన రోజు జరుపుకుందామని స్నేహితులతో కలిసి విహార యాత్రకు వెళ్లిన సమయంలో డ్యాం వద్ద ఈత కొట్టేందుకు దిగి ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మృతిచెందాడు.

నవీన్ మృతిచెందిన విషయాన్ని తోటి స్నేహితులు, ఫోన్‌ ద్వారా అతని తల్లిదండ్రులకు తెలియజేశారు. కుమారుడి మరణవార్త విన్న అతని కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. రెండు, మూడు రోజుల్లో నవీన్‌కుమార్ మృతదేహం భువనగిరికి వచ్చే అవకాశం ఉంది.భారత ఎన్నికల్లో జోక్యం చేసుకోనున్న రష్యా..!

Updated By ManamFri, 08/03/2018 - 10:34

elections 2016లో జరిగిన అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందనే ఆరోపణలు అప్పట్లో సంచలనం కాగా.. 2017లో అమెరికా ఇంటిలిజెన్స్‌ అధికారి వీటికి సంబంధించిన ఆధారాలను బయటపెట్టారు.కాగా త్వరలో జరగనున్న భారత్‌, బ్రెజిల్‌ దేశాల ఎన్నికల్లోనూ ఆ దేశం జోక్యం చేసుకోనుందనే రిపోర్టు ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. 

ఇరు దేశాల్లోని మీడియాను టార్గెట్‌ చేయడం ద్వారా ఈ ఎన్నికలను రష్యా ప్రభావితం చేయబోతోందని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నిపుణుడు ఫిలిప్‌ ఎన్‌. హోవర్డ్‌ అమెరికా చట్టసభలకు వెల్లడించారు. భారత్‌, బ్రెజిల్‌లలో మీడియా ప్రొఫెషనల్‌గా ఉండదని, దీని వల్ల రష్యా వారిపై ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఫిలిప్‌ వ్యాఖ్యానించారు. ఇందుకు హంగేరి మీడియా ఉదంతాన్ని ఉదహరించారు.రష్యాకు అంత బంగారం అందుకేనా!

Updated By ManamMon, 07/30/2018 - 12:47
Russia Triples Gold

అగ్ర‌రాజ్యం ర‌ష్యా బంగారం, క‌రెన్సీ నిల్వ‌ల‌ను భారీగా పెంచుకునే ప‌నిలో ప‌డింది. అమెరికా ప్ర‌భుత్వం ఏ క్ష‌ణంలో ఎటువంటి ఆంక్ష‌లు, ఆర్థికంగా ఇబ్బందులు పెట్టినా త‌ట్టుకునేందుకు ఈ ముందు జాగ్ర‌త్త తీసుకుంటోంది. ఇప్పుడు ఆ దేశం వ‌ద్ద దాదాపు 2000 ట‌న్నుల బంగారం నిల్వ‌లున్నాయి. ఇది ప్ర‌పంచ బంగారం నిల్వ‌ల్లో 18 శాతం. దీంతో ఆ దేశం ప్ర‌పంచంలో అత్య‌ధిక బంగారం నిల్వ ఉన్న ఐదు దేశాల్లో ఒక‌టిగా మారింది. 

\అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో జోక్యం, యూకేలో మాజీ గూఢ‌చారిపై హ‌త్యాయ‌త్నం, ఉక్రెయిన్‌తో యుద్ధం, సిరియాలో వేలు పెడుతుండ‌డం వంటి విష‌యాల్లో అమెరికా ట్రంప్ ప్ర‌భుత్వం ర‌ష్యాపై గుర్రుగా ఉంది. ప‌లు ఆంక్షలు విధించింది. ఈ నేప‌థ్యంలో ఆ దేశం ముందస్తు చ‌ర్య‌లు పాటిస్తోంది. బంగారం నిల్వ చేసుకుంటే అమెరికానే ఏదేశం ఎలాంటి ఆంక్ష‌లు పెట్టినా సుల‌భంగా నెగ్గుకు రావ‌చ్చ‌నేది పుతిన్ యంత్రాంగం యోచ‌న‌. ఒక వేళ అమెరికా డాల‌ర్ విలువ ప‌డిపోయినా బంగారంతో ప‌నులు చ‌క్క‌బెట్టుకోవ‌చ్చ‌ని భావిస్తోంది.
 

Related News