prithvisha

పృథ్వీ షాకు బీసీసీఐ నగదు పురస్కారం

Updated By ManamTue, 01/30/2018 - 18:30

pruthvisenaముంబై: అద్భుత ప్రతిభతో అండర్-19 వరల్డ్ కప్‌లో భారత్‌ను ఫైనల్‌కు చేర్చిన కెప్టెన్ పృథ్వీ షాకు నగదు పురస్కారాలు ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. అంతేకాకుండా యువ క్రికెటర్లను సన్మానిస్తామని కూడా బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా స్పష్టం చేశారు. సెమీఫైనల్లో పాకిస్థాన్‌ను చితగ్గొట్టిన పృథ్వీ సేనను ఖన్నా అభినందించారు. ‘‘అద్భుత ప్రతిభ కనబరిచిన యావత్ జట్టును, కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను అభినందిస్తున్నాను. భావి తరాలకు రాహుల్ చేస్తున్న సేవలు అద్భుతం. ఆయన వల్లే మనకు ప్రతిభావంతులైన అండర్-19 క్రికెటర్లు దొరికారు. త్వరలోనే ఈ యువ క్రికెటర్లకు నగదు పురస్కారాలను ప్రకటిస్తాం. అంతేకాకుండా పృథ్వీ సేనను సత్కరిస్తాం’’ అని ఖన్నా అన్నారు. 

Related News