suresh raina

పృథ్వీ షా సెహ్వాగ్‌ని గుర్తు చేశాడు

Updated By ManamSat, 10/06/2018 - 00:16
  • భారత క్రికెటర్ సురేష్ రైనా

SureshRainaకోల్‌కతా: అరంగేట్ర టెస్టులోనే శతకం సాధించి ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్న పృథ్వీ షాను టీమిండియా క్రికెటర్ సురేష్ రైనా డాషింగ్ ప్లేయర్ వీరెంద్ర సెహ్వాగ్‌తో పోల్చాడు. ‘ పృథ్వీ షా అద్భుతంగా ఆడాడు. కష్టపడే వ్యక్తిత్వం పృథ్వీది. అతని చురుకైన ఆట ఎటువంటి భయం లేకుండా పరుగులు చేయడంలో షా నాకు సెహ్వాగ్‌ను గుర్తు చేశాడు’ అని సురేష్ రైనా తెలిపాడు. అరంగేట్ర టెస్టులోనే సెంచరీ సాధించిన రెండో భారత యువ క్రికెటర్‌గా పృథ్వీ షా నిలిచిన సంగతి తెలిసిందే. ‘ పృథ్వీ షా షాట్లు ఆడే విధానం బాగుంది. షాకు మంచి భవిష్యత్త్ ఉంది’ అని రైనా చెప్పాడు. అరంగేట్ర టెస్టులోనే శతకం సాధించిన వారిలో సురేష్ రైనా కూడా ఉన్నాడు. ఇప్పుడు కేవలం వన్డే ఫార్మాట్‌కు మాత్రమే పరిమితమైన రైనా 2010లో కోలంబోలో శ్రీలంకతో జరిగిన టెస్టులో రైనా 120 పరుగులు సాధించి అరంగేట్ర టెస్టులోనే శతకం చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. పృథ్వీ షా అండర్-19 వరల్డ్ కప్ గెలవటంలో కీలకపాత్ర పోషించాడు. ఫైనల్ మ్యాచ్లో 19 ఫోర్లు బాది కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆడిన తొలి టెస్టులోనే శతకాలు సాధించిన మహ్మాద్ అజారుద్దీన్, అమర్‌నాథ్, సౌరవ్ గంగూలీ, శిఖర్ ధావన్, సురేష్ రైనా, వీరెంద్ర సెహ్వాగ్ సరసన షా నిలిచాడు. ‘ సెలక్టర్లు జట్టు ఎంపికపై నేను కామెంట్ చేయదలచుకోలేదు’ అని రైనా అన్నాడు. ఇటీవల భారత జట్టు ఎంపికపై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, మురళీ విజయ్, కరుణ్ నాయర్ సెలక్టర్లను విమర్శించిన విషయం తెలిసిందే.రైనాకు గాయం, తదుపరి మ్యాచ్ డౌట్..?

Updated By ManamThu, 04/12/2018 - 17:02

Suresh దాదాపు రెండు సంవత్సరాల తరువాత రీఎంట్రీ ఇచ్చి.. రెండు వరుస విజయాలతో మంచి జోరుమీదున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌కు తాజాగా షాక్ తగిలింది. ఆ జట్టులో టాప్ ఆర్డర్ ఆటగాడైన సురేష్ రైనా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడు. వైద్యుల సూచనతో ప్రస్తుతం విశ్రాంతిని తీసుకుంటున్న రైనా.. తదుపరి మ్యాచ్‌కు ఉండడం లేదని తెలుస్తోంది. దీంతో రైనా స్థానంలో ఎవరిని తీసుకోవాలా? అని జట్టు ఆలోచనలో పడినట్లు సమాచారం. అయితే తొలి మ్యాచ్ తరువాత గాయపడిన కేదార్ జాదవ్ టోర్నీ మొత్తానికి దూరమైన సంగతి తెలిసిందే. టీ20 సిరీస్‌లో ఉనద్కత్‌, రైనాకు చోటు

Updated By ManamSun, 01/28/2018 - 18:23

Suresh Raina, back, Indian cricket team, T20 series, South Africa Teamముంబయి: దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు భారత జట్టు ఎంపికైంది. చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలో సమావేశమైన సెలక్షన్‌ కమిటీ ఈ మేరకు 16 సభ్యుల టీమిండియా జట్టును ప్రకటించింది. దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్న సురేశ్ రైనా సఫారీలతో జరగనున్న టీ20సిరీస్‌లో చోటు దక్కించుకున్నాడు. గత ఏడాది 2017 ఫిబ్రవరిలో బెంగళూరులో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఆడాడు.  ఏడాదిపాటు భారత జట్టులో చోటు దక్కని సురేశ్ రైనా.. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. అజింక్యా రహానెకు మాత్రం జట్టులో చోటు దక్కలేదు. 

ఈ క్రమంలో రైనా దేశవాళీ క్రికెట్‌లో సాధించిన స్కోరు ఆధారంగానే సెలక్టర్లు అతన్ని ఎంపిక చేశారు. దక్షిణాఫ్రికాతో జరుగునున్న టీ20 మ్యాచ్‌లు ఫిబ్రవరి 18, 21, 24 తేదీల్లో జరగనున్నాయి. ఫిబ్రవర్‌ 1 నుంచి ఇరు జట్ల మధ్య 6 వన్డేల సిరీస్‌ ప్రారంభం కానుంది. దీనికోసం ఇప్పటికే భారత వన్డే జట్టు ఇప్పటికే దక్షిణాఫ్రికా చేరుకుంది. ఆరు వన్డేల అనంతరం మూడు టీ20ల సిరీస్‌కు జోహెన్నెస్‌బర్గ్ వేదికగా ప్రోటీస్ జట్టు ఆతిథ్యం ఇవ్వనుంది. కాగా, శ్రీలంకతో టీ20 మ్యాచ్‌లో భారత జట్టులో చోటు దక్కని ఆరుగురు ఆటగాళ్లకు సురేశ్ రైనాతో పాటు ఈ ఏడాదిలో తొలిసారి ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

భారత జట్టు: విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌శర్మ(వైస్‌ కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, సురేశ్‌ రైనా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), దినేశ్‌ కార్తీక్‌, హార్దిక్‌ పాండ్యా, మనీష్‌ పాండే, అక్షర్‌ పటేల్‌, యజువేంద్ర చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, జయదేవ్‌ ఉనద్కత్‌, శార్దుల్‌ థాకూర్‌.
 ఈడెన్‌లో రెచ్చిపోయిన రైనా

Updated By ManamMon, 01/22/2018 - 20:46
Suresh Raina

కొల్‌కత్తా: ఇటీవల కాలంలో పేలవమైన ఆటతీరును ప్రదర్శిస్తున్న సురేశ్ రైనా బ్యాట్‌తో అదరగొట్టాడు. సయ్యిద్ ముస్తఖ్ అలీ ట్రోఫీ (ట్వంటీ20 ఫార్మెట్) లో భాగంగా కొల్‌కత్తాలోని ఈడెన్ గార్జెన్‌లో సోమవారం మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో రైనా రెచ్చిపోయాడు. ఉత్తరప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యంవహించిన రైనా...కేవలం 59 బంతుల్లో 126 పరుగులు బాదాడు. 13 బౌండరీలు, 7 సిక్సర్లతో విజృంభించాడు. ట్వంటీ20 క్రికెట్‌లో ఓ భారత ఆటగాడు సాధించిన రెండో అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం. 2010లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన మురళి విజయ్ 127 పరుగులు సాధించడమే ఇప్పటి వరకు అత్యధిక స్కోరుగా ఉంటోంది. ఈడెన్ గార్డన్‌లో రైనా వీరవిన్యాసాలను మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ కూడా నేరుగా ఆస్వాధించాడు. 

అలాగే విరాట్ కోహ్లీ తర్వాత ట్వంటీ20లో 7 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న రెండో భారత ఆటగాడిగా, 9వ అంతర్జాతీయ ఆటగాడిగా కూడా రైనా రికార్డు సృష్టించాడు. 226 మ్యాచ్‌లలో కోహ్లీ 7,068 పరుగులు సాధించాడు. ట్వంటీ20 ఫార్మెట్‌లో 10 వేల పరుగుల మైలురాయిని అధిగమించిన ఏకైకా ప్రపంచ ఆటగాడిగా వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ రికార్డు సృష్టించాడు. బ్రెండన్ మిక్‌కల్లమ్ 8,769 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. 

చివరకు గత ఏడాది జనవరిలో టీమిండియా తరఫున ఆడిన సురేశ్ రైనా...జట్టులో తిరిగి చోటు సాధించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. ఫిట్‌నెస్ లేకపోవడంతో జట్టుకు దూరమైన రైనా...తిరిగి జట్టు చోటు ఆశిస్తున్నట్లు ఇటీవలే తన ఆకాంక్షను వెలిబుచ్చాడు. మళ్లీ గొంతు సవరించిన రైనా.. వీడియో వైరల్

Updated By ManamWed, 01/10/2018 - 17:25

Suresh Rainaముంబై: బ్యాట్‌తో మైదానంలో రెచ్చిపోయే టీమిండియా క్రికెటర్ సురేష్ రైనా మంచి గాయకుడన్న విషయం తెలిసిందే. 2015లో వచ్చిన 'మీరుతియా గ్యాంగ్‌స్టర్' అనే చిత్రం కోసం 'తు మిలీ సబ్ మిలా' అనే పాటను పాడారు రైనా. ఆ పాటతో సింగర్‌గా అందరినీ మెప్పించిన రైనా.. తాజాగా తన భార్య ప్రియాంక రైనా కోసం మళ్లీ గాత్రాన్ని సవరించారు.

ఓ ఎఫ్‌ఎమ్‌లో ప్రియాంక రైనా 'ది ప్రియాంక రైనా షో' అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా.. దాని కోసం 'బితియా రాణి' అనే పాటను పాడారు రైనా. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో సురేష్ రైనాతో పాటు అతడి భార్య ప్రియాంక, కుమార్తె గ్రేషియా కూడా ఉన్నారు.'వణక్కమ్ చెన్నై', 'విజిల్ పొడు'

Updated By ManamFri, 01/05/2018 - 09:57

CSKరెండేళ్ల నిషేధం తరువాత ఈ సంవత్సరం ఐపీఎల్‌లో పునరాగమనం చేస్తుంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. ఈ నేపథ్యంలో దిగ్గజ ఆటగాళ్లైన మహేంద్ర సింగ్ ధోని, సురేశ్ రైనా, రవీంద్ర జడేజాలను రీటెయిన్‌ చేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. ఈ సందర్భంగా సురేశ్ రైనా, రవీంద్ర జడేజా సంతోషాన్ని వ్యక్తం చేశారు. 'వణక్కమ్ చెన్నై', 'విజిల్ పొడు' అంటూ తమ ఆనందాన్ని తెలుపుతూ వీడియో సందేశాన్ని ఇచ్చారు.

అందులో "వణక్కమ్ చెన్నై. చెన్నై సూపర్ కింగ్స్ రీ ఎంట్రీ సంతోషంగా ఉంది. గత రెండేళ్లుగా కోల్పోయిన ఆటను మీ ముందు ఆటడానికి ఉవ్విళ్లూరుతున్నాను. చెపాక్ స్టేడియంలో మిమ్మిల్ని కలవడానికి ఉత్సాహంగా ఉన్నాను" అంటూ సురేశ్ రైనా తెలపగా.. "నేను సీఎస్‌కేలో మళ్లీ భాగమైనందుకు చాలా సంతోషంగా ఉన్నాను. మా ఆటను మీరు ఆస్వాదిస్తారని ఆశిస్తున్నా. మ్యాచ్ గెలిచేందుకు ప్రయత్నిస్తాం. విజిల్ పొడు" అంటూ జడేజా సందేశాన్ని ఇచ్చారు. అయితే ధోని నాయకత్వంలో సీఎస్‌కే రెండు సార్లు ఐపీఎల్‌ చాంపియన్స్‌గా నిలిచిన విషయం తెలిసిందే. 
 సురేష్ రైనాకు తప్పిన ప్రమాదం

Updated By ManamTue, 09/12/2017 - 18:53

ఎత్వా: భారత క్రికెటర్ సురేష్ రైనాకు త్రుటిలో ప్రమాదం తప్పింది. దులీప్ ట్రోఫీలో తన టీం తరపున ఆడేందుకు ఘజియాబాద్ నుంచి కాన్పూర్‌కు వెళుతుండగా రైనా ప్రయాణిస్తున్న రేంజ్ రోవర్ కార్ టైర్ పేలింది. కారు తక్కువ వేగంతో వెళుతుండటంతో పక్కకు ఆగింది. అదే అతి వేగంగా వెళ్లినట్లయితే భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చేదని పోలీసులు తెలిపారు. మంగళవారం రాత్రి 2.00 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రాత్రి సమయంలో ఘటన జరగడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. కారులో మరో టైర్ లేకపోవడంతో స్థానిక యువకులు పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు రైనాను వేరే కారులో అక్కడ నుంచి పంపించేశారు.

Related News