Mithali Raj

చివరి వన్డేలో లంక విజయం

Updated By ManamMon, 09/17/2018 - 07:03
  • మిథాలీ అజేయ శతకం వృథా

  • ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్

imageకటునాయకే: ఐసీసీ మిహ ళల చాంపియన్‌షిప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో శ్రీలంక జట్టు చివరి మ్యాచ్లో 3 వికెట్లతో టీమిండియాపై విజయం సాధించింది. ఆదివారమి క్కడ జరిగిన చివరి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. భారత్ బ్యాటిం గ్‌లో కెప్టెన్ మిథాలీ రాజ్ (125 నాటౌట్) అజేయ శతకంతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా, ఓపెనర్ స్మృతి మంధన అర్ధ శతకంతో రాణించింది. దీంతో భారత్ జట్టు 50 ఓవర్లలో 253 పరగులు చేయగలిగింది. అనంతరం 254 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు 49.5 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని చేధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో చివరికి  లంక జట్టుకే విజయం వరించింది. లంక బ్యాటింగ్‌లో ఓపెనర్ జయన్‌గని (115) శతకంతో అదరగొట్టగా, మరో ఓపెనర్ హసిని పెరీరా (45) పరుగులతో ఫర్వాలేదనిపింది. భారత్ బౌలింగ్‌లో గోస్వామి, జోషీ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ జట్టు 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. ఇక ఇరు జట్ల మధ్య జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ బుధవారం ప్రారంభంకానుంది.రికార్డు సృష్టించిన మిథాలీ రాజ్

Updated By ManamWed, 09/12/2018 - 11:55

Mithali Rajభారత మహిళా క్రికెట్ టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ రికార్డు సృష్టించారు. అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో అత్యధిక వన్డేలకు నాయకత్వం వహించిన కెప్టెన్‌గా మిథాలీ నిలిచారు. మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో మిథాలీ ఈ మైలురాయిని అందుకున్నారు. కాగా ఇప్పటివరకు 195 వన్డేలను ఆడిన మిథాలీ 118 వన్డేలను కెప్టెన్‌గా వ్యవహరించారు. దీని ద్వారా ఇంగ్లండ్ మాజీ మహిళా క్రికెటర్ చార్లెస్ ఎడ్వర్ట్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశారు.మిథాలీ రాజ్‌కు పగ్గాలు

Updated By ManamFri, 08/24/2018 - 02:47
  • మాన్సికి జట్టులో చోటు.. శ్రీలంక పర్యటనకు భారత మహిళల జట్ల ఎంపిక

MithaliRajన్యూఢిల్లీ: శ్రీలంక పర్యటనకు త్వరలో వెళ్లనున్న భారత మహిళల క్రికెట్ వన్డే, టీ20 జట్లను గురువారం ఎంపిక చేశారు. పేసర్ మాన్సి జోషికి మళ్లీ చోటు దక్కింది. గతేడాది ఐసీసీ మహిళల వరల్డ్ కప్‌లో చివరిసారి పాల్గొన్న మాన్సి మోకాలి గాయంతో దాదాపు ఏడాది కాలం క్రికెట్‌కు దూరమైంది. ఇటవల మహిళల చాలెంజ్ ట్రోఫీలో మళ్లీ ఆమె మైదానంలోకి అడుగుపెట్టింది. శ్రీలంకలో జరిగిన ఐసీసీ వుమెన్స్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళల జట్టు 3 వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడుతుంది. వన్డే మ్యాచ్‌లో సెప్టెంబర్ 11, 13, 16వ తేదీల్లో గాలే, కతునాయకే వేదికల్లో జరగనుండగా.. 19, 21, 22, 24, 25 తేదీల్లో టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి. 

ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్‌కు భారత జట్లు
వన్డే జట్టు: మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్‌ప్రీత్ కౌర్ (వైస్ కెప్టెన్), స్మృతి మంధన, పూనమ్ రౌత్, దీప్తీ శర్మ, డి. హేమలత, జెమీమా రొడ్రిగ్వెస్, వేద కృష్టమూర్తి, తన్య భాటియా (వికెట్ కీపర్), ఎక్తా బిస్ట్, పూనమ్ యాదవ్, రాజేశ్వరీ గైక్వాడ్, ఝులన్ గోస్వామి, మన్సి జోషి, శిఖ పాండేజ. టీ20 జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధన (వైస్ కెప్టెన్), మిథాలీ రాజ్, వేద కృష్టమూర్తి, జెమీమా రోడ్రిగ్వెస్, డి. హేమలత, దీప్తి శర్మ, అనుజ పాటిల్, తన్య భాటియా (వికెట్ కీపర్), పూనమ్ యాదవ్, ఎక్తా బిస్ట్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, శిఖ పాండే, మాన్సి జోషి. ధ్యైర్యాన్ని కూడగట్టుకోవాలి

Updated By ManamSat, 07/21/2018 - 22:47
  • సహచరులకు మిథాలీ సూచన .. త్వరలో శ్రీలంక టూర్  

న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టు కోచ్ తుషార్ అరొథె తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో జట్టు mithaliసభ్యులందరూ వీలైనంత త్వరగా ధ్యైర్యాన్ని కూడగట్టుకోవాలని మిథాలీ రాజ్ సూచించింది. ఆసియా కప్‌లో పేలవ ప్రదర్శన, సీనియర్ సభ్యులతో సత్సంబంధాలు లేకపోవడం వంటి కారణాలతో తుషార్ రాజీనామా చేశారు. ‘వారం రోజుల్లో మేమందరం క్యాంప్‌లో కలవబోతున్నాం.

మొట్టమొదటి అంశమేంటంటే.. మేమందరం మళ్లీ ధ్యైర్యాన్ని కూడగట్టుకోవాలి. ఇటువంటి విషయాలు క్రీడాకారుల జీవితాల్లో మామూలే. కానీ ఎవరికి వారు ప్రాధాన్యతలను గుర్తించాలి. త్వరలోనే శ్రీలంక పర్యటనకు వెళ్లనున్నాం. అంతేకాకుండా వరల్డ్ కప్‌కు కూడా సిద్ధపడాలి. కోచ్ వంటి విషయాలపై ఎక్కువగా దృష్టి పెట్టకూడదు’ అని మిథాలీ చెప్పింది. ఉన్నఫళంగా కోచ్‌ను తొలగించడం ఇదేమీ కొత్త కాదు. 2017లో ఐసీసీ వరల్డ్ కప్‌కు రెండు నెలల ముందు కోచ్ పూర్ణిమా రావ్‌ను కోచ్ పదవి నుంచి తొలగించారు. ఈ టోర్నీ ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఇండియా ఓటమిపాలైంది. ‘నేను ఎక్కువగా చెప్పలేను. మేనేజ్‌మెంట్ నిర్ణయాల్లో బీసీసీఐదే ఏకైక అధికారం. అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో వాళ్లు మాత్రమే చెప్పగలరు. బోర్డ్ రూమ్‌లో జరిగిన ఆ సమావేశంలో ఏం జరిగిందో నేను చెప్పలేను. కానీ ఒక సీనియర్ ప్లేయర్‌గా కోచ్‌గా ఎవరున్నా అతనికి గానీ, ఆమెకు గానీ వ్యతిరేకిని మాత్రం కాదు. ఒక ప్లేయర్‌గా కోచ్ జట్టుకు సహాయపడాలని కోరుకుంటాను.

 అమ్మాయిలందరూ క్యాంప్‌కు వచ్చినప్పుడు ఒక అనుభవజ్ఞురాలిగా వాళ్లందరికీ దిశా నిర్దేశం చేస్తాను. అటువంటి సంఘటనలు కొన్నిసార్లు జట్టు మానసిక స్థితిపై ప్రభావం చూపుతాయి. ఎవ్వరూ వార్తా పత్రికలు చదవడం లేదని గానీ, ఎటువంటి ప్రశ్నలూ వేయడం లేదని గానీ చెప్పలేను. ఇది అన్ని చోట్లా ఉన్నదే. కానీ ఉన్నత స్థాయిలో పోటీ చేసేటప్పుడు మనకున్న వనరులలో ఉత్తమమైనదాన్ని ఉపయోగించుకోవాలి. మాది బలమైన జట్టే. కానీ ఉత్తమ వ్యూహాలు రచించుకోవాలి. ఎందుకంటే టీ20 అనేది చాలా ఫాస్ట్‌గా ఆడాల్సి వుంటుంది’ అని మిథాలీ వివరించింది.

 తదుపరి భారత మహిళల జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. అంతకుముందు బెంగళూరులో 10 ప్రాక్టీస్ క్యాంప్‌లో పాల్గొననుంది. ‘శ్రీలంక పర్యటన మాకు చాలా ముఖ్యమైంది. వన్డేల ద్వారా పాయింట్లు వస్తాయి కాబట్టి ఈ పర్యటనలో గెలవడం కూడా చాలా ముఖ్యం. ఆసియా కప్‌లో ఓటమి తర్వాత కాస్త నిరుత్సాహాం చెందాం. కానీ ఐదు మ్యాచ్‌ల టీ20లో విజయం మాలో విశ్వాసాన్ని నింపింది. శ్రీలంక వన్డే సిరీస్‌లో గెలవడం ద్వారా వరల్డ్ కప్‌లో విశ్వాసంతో అడుగుపెడతాం’ అని మిథాలీ పేర్కొంది.మిథాలీపై త్వరలో సినిమా

Updated By ManamWed, 09/27/2017 - 19:27
  • నిర్మాణ హక్కులు పొందిన వయాకామ్18 సంస్థ

న్యూఢిల్లీ: సైనా నెహ్వాల్, కపిల్ దేవ్‌ల తర్వాత ఇప్పుడు భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌పై సినిమా రానున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా నిర్మాణ హక్కులను పొందినట్టు వయాకామ్18 మోషన్ పిక్చర్స్ సంస్థ తెలిపింది. ఇంగ్లండ్‌లో ఈ ఏడాది జరిగిన ఐసీసీ మహిళల వరల్డ్ కప్‌లో టీమిండియాను ఫైనల్ వరకు తీసుకెళ్లడంతో మిథాలీ రాజ్ అందరి ప్రశంసలు అందుకుంది. కానీ ఫైనల్లో ఆతిథ్య జట్టు చేతిలో మిథాలీ సేన ఓటమిపాలైనప్పటికీ ఆమె బ్యాటింగ్ పోరాటం అందరినీ ఆకట్టుకుంది. తనపై తీస్తున్న ఈ సినిమా చాలా మందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్న ఆశాభావాన్ని మిథాలీ వ్యక్తం చేసింది. 

Related News