mission impossible-fallout

'మిష‌న్ ఇంపాజిబుల్ - ఫాల్ అవుట్' ఫ‌స్ట్ పోస్ట‌ర్‌

Updated By ManamThu, 02/01/2018 - 20:48

mission impossible-fall outహాలీవుడ్ మూవీ 'మిష‌న్ ఇంపాజిబుల్‌' ఫ్రాంచైజీలో వ‌స్తున్న ఆరో చిత్రం 'మిష‌న్ ఇంపాజిబుల్ - ఫాల్ అవుట్'.  టామ్ క్రూజ్, రెబెక్కా ఫెర్‌గ్యూస‌న్, సిమోన్ పెగ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రానికి  క్రిస్టోఫర్ మెక్‌క్వారీ ద‌ర్శ‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. జూలై 27న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఫ‌స్ట్ పోస్ట‌ర్‌ను టామ్ క్రూజ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో తాజాగా విడుద‌ల చేశారు. పోస్ట‌ర్ డిజైనింగ్ చూస్తుంటే..  'మిష‌న్ ఇంపాజిబుల్' సినిమా అభిమానుల‌కి ఈ సీక్వెల్‌ మ‌రో సారి క‌నువిందు చేయ‌డం ఖాయ‌మ‌నిపిస్తోంది. 1996లో మొద‌లైన 'మిష‌న్ ఇంపాజిబుల్‌' సీరీస్‌లో.. 2000, 2006, 2011, 2015 సంవ‌త్స‌రాల్లో మ‌రో నాలుగు చిత్రాలు సంద‌డి చేశాయి. ఈ చిత్ర క‌థానాయ‌కుడు టామ్ క్రూజే.. ఈ సీరీస్‌లోని ప్ర‌తి చిత్రానికి కూడా నిర్మాత‌ల‌లో ఒక‌రిగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం విశేషం.
 మ‌రో ఐదు రోజుల్లో 'మిష‌న్ ఇంపాజిబుల్ 6' ట్రైల‌ర్‌

Updated By ManamTue, 01/30/2018 - 21:52

missionహాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ పేరు చెబితే గుర్తొచ్చే సినిమాల్లో 'మిష‌న్ ఇంపాజిబుల్' సీరీస్ త‌ప్ప‌క ఉంటాయి. 1996లో మొద‌లైన ఈ సీరీస్‌.. ఇప్పుడు ఆరో సీక్వెల్‌తో ప‌ల‌క‌రించ‌బోతోంది. 1996, 2000, 2006, 2011, 2015 సంవ‌త్స‌రాల్లో 'మిష‌న్ ఇంపాజిబుల్‌'కి సంబంధించిన ఐదు సినిమాలు వ‌రుస‌గా విడుద‌ల‌య్యాయి. అంత‌కుముందు మినిమ‌మ్ నాలుగేళ్ళ గ్యాప్ అయినా ఉండేలా వ‌చ్చే ఈ సీరీస్‌లో.. ఆరో చిత్రం (మిష‌న్ ఇంపాజిబుల్ - పాల్ అవుట్‌) మాత్రం మూడేళ్ళ గ్యాప్‌లోనే తెర‌పైకి రానుంది. ఎప్ప‌టిలాగే ఈ చిత్రానికి ఒక‌వైపు నిర్మాత‌గానే వ్య‌వ‌హ‌రిస్తూనే క‌థానాయ‌కుడిగానూ త‌న వంతు పాత్ర పోషించారు టామ్ క్రూజ్‌. ఇక ఐదో భాగానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ క్రిస్టోప‌ర్ మెక్‌క్వారీ ఈ చిత్రానికి కూడా ద‌ర్శ‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. జులై 27న ఈ సినిమా విడుద‌ల కానున్న సంద‌ర్భంలో..  ట్రైల‌ర్‌తో ఈ సినిమా ఎలా ఉండ‌బోతోందో చిత్ర యూనిట్ చెప్ప‌బోతోంది. మ‌రో ఐదు రోజుల్లో ఈ ట్రైల‌ర్.. 'మిష‌న్‌ ఇంపాజిబుల్' అభిమానుల ముందుకు రాబోతోంద‌ని టామ్ క్రూజ్ పేర్కొన్నారు. రెబెక్కా పెర్‌గ్యూస‌న్, సిమోన్ పెగ్ త‌దిత‌రులు ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లు పోషించారు.

Related News