pakisthancomp

పాకిస్థాన్‌లో ఉగ్రవాద శిబిరాలు

Updated By ManamTue, 01/30/2018 - 21:49

చర్యల కోసం ‘సమితి’కి అఫ్ఘాన్ విన్నపం

pakisthancompవాషింగ్టన్: పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాల ఉనికిపై ఐక్యరాజ్య సమితి భద్రత మండలి సభ్యులకు స్పష్టత ఉందని, వాటిపై చర్యలు తీసుకోవాలని అఫ్ఘానిస్థాన్ రాయుబారి మహ్మద్ సైకల్ కోరారు. తమ ప్రాంతంలో ఓ దేశం భద్రత మండలి తీర్మానాన్ని ఉల్లంఘించిందని, దీనికి సంబంధించిన ఆధారాలను అందజేశామని పరోక్షంగా పాకిస్థాన్‌ను ఉద్దేశిస్తూ చెప్పారు. ఆ దేశంపై చర్యలు తీసుకోవాలని భద్రత మండలిపై ఒత్తిడి తీసుకువస్తున్నట్టు వెల్లడించారు. పాక్‌లో ఉగ్రవాద స్థావరాల ఉనికి విషయంలో భద్రత మండలి సభ్యుల్లో ఏకాభిప్రాయం, స్పష్టత ఉందని తెలిపారు. కాబూల్‌కు వచ్చిన దౌత్యాధికారి స్థాయి 15 మంది సభ్యులతో కూడిన భద్రత మండలి బృందానికి నివేదిక సవుర్పించినట్టు సైకల్ వెల్లడించారు. పాక్‌లో ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయన్న విషయం తప్పనికాని, వాస్తవం లేదనికాని బృందంలో ఎవరూ ఖండించలేదని చెప్పారు. ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవడంలో పాక్ విఫలైమెందని ఆరోపించారు. ‘‘ఉగ్రవాదులకు పాక్ స్వర్గధామం. ఆ దేశంలోనే ఒసామా బిన్ లాడెన్‌ను కనుగొని హతమార్చారు. కరాచీ ఆస్పత్రిలో ముల్లా ఒమర్ మరణించాడు. బెలుచిస్థాన్‌లో ముల్లా అక్తర్‌ను హతమార్చారు. ఇప్పుడు కూడా పాక్‌లో తాలిబన్ అగ్రనేతలు ఉన్నారు. ఇది అందరికీ తెలిసిన విషయువేు’’ అని సైకల్ పేర్కొన్నారు. ఉగ్రవాద దాడులకు భారీ మూల్యం చెల్లిస్తున్నామని, చర్యలు తీసుకోవాల్సిందిగా భద్రత మండలికి విన్నవించామని చెప్పారు. 

ఉగ్రవాదికి ఐఎస్‌ఐ శిక్షణ (బాక్స్)
కాబూల్ హోటల్‌పై దాడి పాక్ కుట్రే

కాబుల్‌లో విలాసవంతైమెన ఇంటర్‌కాంటినెంటల్ హోటల్‌పై దాడి చేసిన ఉగ్రవాదుల్లో ఒకడికి పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐ శిక్షణ ఇచ్చిందని ఐక్యరాజ్య సమితిలో అఫ్ఘానిస్థాన్ రాయుబారి మహ్మద్ సైకల్ ఆరోపించారు. ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో విదేశీయులు సహా 20 మంది మరణించిన సంగతి తెలిసిందే. అఫ్ఘాన్ భద్రత బలగాలు 12 గంటలకు పైగా పోరాడి ముష్కరులను మట్టుబెట్టాయి. ఈ దాడిలో పాల్గొన్న ఓ ఉగ్రవాది తండ్రి అబ్దుల్ ఖహర్.. పాకిస్థాన్‌లోని బెలూచిస్థాన్‌లో తన కుమారుడికి ఐఎస్‌ఐ శిక్షణ ఇచ్చినట్టు వెల్లడించాడని సైకల్ ట్వీట్ చేశారు. ఇదిలావుండగా కాబూల్ హోటల్‌పై దాడి వెనుక పాకిస్థాన్ కుట్ర ఉందని ఐక్యరాజ్య సమితిలో మరో అఫ్ఘాన్ దౌత్యవేత్త ఆరోపించారు. పాక్ గడ్డపైనే పథకం పన్నారని, దాడి చేసిన ఉగ్రవాది తండ్రి ఖహర్ ప్రత్యక్ష సాక్షి అని పేర్కొన్నారు. 





Related News