donaldtrump

మెట్టుదిగిన ట్రంప్

Updated By ManamWed, 01/31/2018 - 19:40
  • వలసలపై కాస్త పట్టింపు.. కొంత సడలింపు

  • నాలుగు అంశాల కొత్త విధానం ప్రతిపాదన షరతులతో ‘డ్రీమర్ల’కు పౌరసత్వ మంజూరు

  • భారత సాంకేతిక నిపుణులకు అత్యధిక లబ్ధి! సరికొత్త వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటాం

  • సుభద్ర-సురక్షిత.. సగర్వ-సమర్థ దేశమే లక్ష్యం తొలిసారి ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్’ ప్రసంగం

donaldtrumpవాషింగ్టన్: అమెరికాలో అక్రమ వలసదారుల (డ్రీమర్ల) సమస్యపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ మెట్టు దిగారు. ఈ మేరకు నాలుగు అంశాలకు ప్రాధాన్యమిస్తూ ప్రతిభ ఆధారిత వలస విధానాన్ని ప్రతిపాదించారు. దీనివల్ల ప్రతిభావంతులైన విదేశీయులకు... ముఖ్యంగా భారత సాంకేతిక నిపుణుల వంటివారికి అమెరికా ప్రవేశం సులభతరమవుతుంది. మంగళవారం రాత్రి అమెరికన్ కాంగ్రెస్‌ను (ఉభయసభల సంయుక్త సమావేశం) ఉద్దేశించి దాదాపు 80 నిమిషాలపాటు తొలి ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్’ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా తన సహజ దుందుడుకు వైఖరి వీడి విపక్ష సహకారం అర్థిస్తూ సున్నిత స్వరంతో మాట్లాడటం విశేషం. ఇందులో భాగంగా వలస విధానంసహా విదేశీ వాణిజ్యం, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై పోరు, ఉత్తరకొరియాను నిలువరించడం తదితరాలపైనా మాట్లాడారు. చట్ట విరుద్ధంగా దేశంలో స్థిరపడిన డ్రీమర్లకు పౌరసత్వంపై పట్టుబట్టిన ప్రతిపక్ష డెమోక్రాట్ పార్టీ ఇటీవల ద్రవ్య వినిమయ బిల్లును అడ్డుకోగా ప్రభుత్వం స్తంభించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చిన ట్రంప్ ఫిబ్రవరి 8దాకా స్వల్పకాలిక నిధుల విడుదలకు ఆమోదం పొందగలిగారు. ఈ నేపథ్యంలో దేశ స్థితిగతులు, పరిపాలన, తన ప్రభుత్వం చేపట్టబోయే చర్యలను వివరించారు. ‘సుభద్ర, సురక్షిత, సమర్థ, సగర్వ అమెరికా’ను నిర్మించడంలో అధికార, విపక్షాలు ఏకాభిప్రాయంతో సహకరించాలని కోరారు. కాగా, అమెరికాలో నిరుడు దుండగుల కాల్పులకు బలైపోయిన తెలుగు ఇంజనీర్ కూచిభొట్ల శ్రీనివాస్ భార్య సునయన అధ్యక్షుడి ప్రసంగ కార్యక్రమానికి హాజరయ్యారు. కాంగ్రెస్ సభ్యుడు కెవిన్ యోడర్ ఆమెను తన అతిథిగా ఆహ్వానించి ఈ గౌరవం కల్పించడం విశేషం.

సరికొత్త వలస వ్యవస్థను రూపొందిస్తాం
అమెరికాలోగల 18 లక్షల మంది డ్రీమర్లుసహా కొత్తగా వలస వచ్చేవారికి పౌరసత్వంపై  నాలుగు స్తంభాల వ్యవస్థను ట్రంప్ ప్రతిపాదించారు. బాల్యదశలో తల్లిదండ్రుల వెంట వచ్చినవారికి పౌరసత్వంతోపాటు వీసా లాటరీ పద్ధతికి స్వస్తి, కుటుంబ ప్రాతిపదికన వలసలకు పరిమితి, సరిహద్దులలో భద్రతల ఆధారంగా వలసలపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ‘‘ప్రతిభ ఆధారిత వలస విధానంవైపు మళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ మేరకు నైపుణ్యం, పనిపై శ్రద్ధాసక్తులు, అమెరికాను గౌరవించి-ప్రేమించగలవారిని మాత్రమే అనుమతిద్దాం’’ అన్నారు. తన ప్రతిపాదనను సముచిత రాజీమార్గంగా పరిగణించి అధికార, విపక్ష పార్టీలు రెండూ సమర్థించాలని కోరారు. అంతేకాకుండా ‘‘అటు డెమోక్రాట్లు, ఇటు రిపబ్లికన్లతో చేయీచేయీ కలిపి నడవడానికి నేను సుముఖం. జాతి, రంగు, నేపథ్యాలతో నిమిత్తం లేకుండా మన పౌరులందరి ప్రయోజనాల పరిరక్షణ ధ్యేయంగా కలసి ముందుకు సాగుదాం’’ అని పిలుపునిచ్చారు.  ‘‘మా ప్రణాళిక ప్రకారం విద్య, ఉద్యోగ అవసరాలకు అనుగుణమైన అర్హతలున్నవారు, నైతికవర్తనులు పూర్తిస్థాయి అమెరికా పౌరులు కాగలరు’’ అని డ్రీమర్లకు పౌరసత్వ మార్గం గురించి ప్రకటించారు.

మెక్సికో సరిహద్దులో మహాకుడ్యం
వలసలపై రెండో స్తంభంగా అమెరికా దక్షిణ భాగంలో మెక్సికో సరిహద్దున గోడ నిర్మాణం చేపట్టాల్సి ఉందని ట్రంప్ చెప్పారు. చట్టంలోని లొసుగుల ఆసరాతో నేరగాళ్లు, ఉగ్రవాదులు దేశంలో ప్రవేశించడాన్ని ఈ ప్రణాళికతో నివారించవచ్చునని పేర్కొన్నారు. తద్వారా ఇప్పటిదాకా సాగుతున్న ‘నిర్బంధం-విడుదల’ ఆటకు అడ్టుకట్ట పడుతుందని అభిప్రాయపడ్డారు. మూడో స్తంభంగా వీసాలకు లాటరీ పద్ధతికి స్వస్తి చెప్పాల్సి ఉందన్నారు. నైపుణ్యం, ప్రతిభ, అమెరికన్లకు భద్రత వంటివాటితో నిమిత్తం లేకుండా గ్రీన్ కార్డు (శాశ్వత పౌరసత్వం) ఇచ్చే ఈ విధానం ఇక వద్దన్నారు. ట్రంప్ కొత్త విధానాన్ని కచ్చితంగా అమలు చేస్తే గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న వేలాది భారత ఐటీ నిపుణులు అత్యధికంగా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. ఇక నాలుగో స్తంభంగా కుటుంబ ఆధారిత వరుస వలసల నిరోధం అవసరమన్నారు. ఆ మేరకు భార్య/భర్త, వారి పిల్లలకు పరిమితం చేస్తూ చిన్న కుటుంబాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ట్రంప్ ప్రతిపాదించారు. ప్రస్తుతం ఒక వ్యక్తి సుదూర బంధువులను కూడా తీసుకొస్తున్నందున దానికి స్వస్తి చెప్పాల్సి ఉందన్నారు. మొత్తంమీద కాలంచెల్లిన వలస నిబంధనలకు పాతరేసి, 21వ శతాబ్దపు వ్యవస్థను అమలులోకి తేవాల్సి ఉందన్నారు.

దేశంలో అంతా సంతృప్తికరం
   దేశంలో అన్నివిధాలా సంతృప్తికర వాతావరణం కనిపిస్తున్నదని ట్రంప్ చెప్పారు. నిరుద్యోగం 45 ఏళ్లనాటి కనిష్ఠ స్థాయికి తగ్గిందని పేర్కొన్నారు. అలాగే చిన్న వ్యాపారాల స్థాయి మునుపెన్నడూ లేనంత ఉచ్ఛస్థాయిలో ఉందన్నారు. స్టాక్ మార్కెట్ తన రికార్డులను తానే వరుసగా బద్దలు కొడుతున్నదని చెప్పారు. దేశంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం 1.5 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీకి ఆమోదముద్ర వేయాల్సిందిగా ప్రజా ప్రతినిధులను కోరారు. ప్రజారోగ్యం సంరక్షణ విషయంలో అత్యంత శ్రద్ధ చూపుతున్నట్లు పేర్కొన్నారు. కార్పొరేట్ పన్నును 35 శాతం నుంచి 21 శాతానికి తగ్గించినట్లు గుర్తుచేశారు. ఇక ఉత్తరకొరియా నిర్లక్ష్యపూరిత వైఖరికి అడ్డుకట్ట వేస్తామని హెచ్చరించారు. అమెరికా నగరాలను ధ్వంసం చేస్తామంటూ ఆ దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ విర్రవీగుతున్నాడని గుర్తుచేశారు. అయితే, అమెరికా మునుపటి పాలకులు చేసిన తప్పులు పునరావృతం కానివ్వబోమని ప్రతినబూనారు. అమెరికా ‘ఆర్థిక లొంగుబాటు’ ఇక ముగిసిందని ట్రంప్ ప్రకటించారు. ఆ మేరకు పారదర్శక, పరస్పర వాణిజ్య సమతూకం పాటించే దేశాలతో కొత్త వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటామని చెప్పారు. చైనా, రష్యా వంటి ‘ప్రత్యర్థి’ దేశాలతోపాటు కొన్నిదేశాల ధూర్త పాలకులు ఉగ్రవాదులు అమెరికా ప్రయోజనాలను, ఆర్థిక వ్యవస్థను, విలువలను సవాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, వీటన్నిటినీ అధిగమించి అమెరికాను దుర్నిరీక్ష్యంగా రూపొందిస్తామని ప్రకటించారు. స్వీయ రక్షణ దిశగా అణ్వాయుధాలను నవీకరించి, పునర్నిర్మించుకోవాల్సి ఉందని పేర్కొన్నారు.11 దేశాలపై నిషేధం ఎత్తివేత

Updated By ManamTue, 01/30/2018 - 22:02
  • శరణార్థులకు అవెురికా తీపి కబురు

  • సమగ్ర పరిశీలన తర్వాత అనువుతి

donaldtrumpవాషింగ్టన్: డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక శరణార్థులు, వలసలపై కఠినంగా వ్యవహరిస్తున్న అవెురికా.. అత్యంత ప్రమాదం పొంచివున్న 11 దేశాల ప్రజలకు తీపి కబురు ప్రకటించింది. ఈ దేశాలకు చెందిన శరణార్థుల రాకపై అమల్లో ఉన్న నిషేధాన్ని తొలగించింది. కాగా ఆయా దేశాల పౌరులు అవెురికాలోకి రావాలని కోరుకుంటే గతంలో కంటే పూర్తిగా వివరాలు పరిశీలించిన మీదటే అనువుతిస్తామని స్పష్టం చేసింది. 11 దేశాల పేర్లను అవెురికా వెల్లడించలేదు. ఈ జాబితాలో 10 ముస్లిం మెజార్టీ దేశాలు సహా ఉత్తర కొరియా ఉన్నట్టు తెలుస్తోంది. అవెురికా అంతర్గత భద్రత శాఖ మంత్రి కిర్‌స్టెన్ నీల్సన్ మాట్లాడుతూ.. ‘‘దేశంలోకి ఎవరెవరు వస్తున్నారో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మా శరణార్థుల వలస విధానంలో దుష్టశక్తులు దేశంలోకి చొరబడకుండా అదనపు భద్రత ప్రవుణాలు చేపట్టాం. అవెురికా అంతర్గత భద్రత కోసం కఠిన నిబంధనలు విధించాం’’ అని చెప్పారు. గత అక్టోబరులో శరణార్థుల వలసల విధానాన్ని సమీక్షించిన ట్రంప్ సర్కార్ ఈ 11 దేశాలపై నిషేధం విధించింది. కాగా అధికారికంగా ఆ దేశాల పేర్లను ప్రకటించలేదు. శరణార్థుల సంఘాలు మాత్రం ఈ జాబితాలో ఈజిప్టు, ఇరాన్, ఇరాక్, లిబియా, మాలి, ఉత్తర కొరియా, సోమాలియా, దక్షిణ సూడాన్, సూడాన్, సిరియా, యెమెన్ ఉన్నాయని పేర్కొన్నాయి. కాగా మతాన్ని (ముస్లింలు) లక్ష్యంగా చేసుకుని ఈ దేశాలపై నిషేధం విధించలేదని ఓ సీనియర్ అధికారి వివరించారు. అవెురికా అంతర్గత ముప్పును పరిగణనలోకి తీసుకునే ఆంక్షలు విధించినట్టు స్పష్టం చేశారు. కాగా బరాక్ ఒబామా పాలనలో 2017 ఏడాదికి గాను 1.10 లక్షల మంది శరణార్థులకు అవెురికాకు రావటానికి అనుమతి ఇవ్వగా.. ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక ఈ సంఖ్యను 53 వేలకు తగ్గించింది. ఇక 2018 ఏడాదికిగాను ట్రంప్ సర్కార్ మరోసారి ఈ సంఖ్యను తగ్గిస్తూ 45 వేలమందికి పరిమితం చేసింది. 

Related News