Trouble

పోర్న్ మూవీకి ఓంకారం సంగీతమా?

Updated By ManamTue, 02/20/2018 - 20:38

Music Director MM Keeravani To Get Into Trouble Over GST Movie Controversyసంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ (జీఎస్టీ) చిత్రంపై రిలీజ్‌‌కు ముందు నుంచి నేటి వరకూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే తనపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారని సామాజిక కార్యకర్త దేవీ ఆర్జీవీపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీఎస్ పోలీసులు ఆయన్ను విచారించిన సంగతి తెలిసిందే. సుమారు నాలుగన్నర గంటలపాటు అతన్ని విచారించి పలు ప్రశ్నలు సంధించగా కొన్నింటికి సమాధానం చెప్పిన ఆయన.. మిగతావాటికి జవాబు చెప్పలేదు. జీఎస్టీ చిత్రానికి సంగీతం అందించిన దర్శకుడు ఎం.ఎం కీరవాణికి కూడా సైబర్ క్రైమ్‌ పోలీసులు నోటీసులు ఇవ్వడానికి రంగం సిద్ధం చేసినట్లు విశ్వసనీయ వర్గాలసమాచారం.

ఇక అసలు విషయానికొస్తే.. తాజాగా ఈ జీఎస్టీపై సైబర్‌క్రైమ్‌ పోలీసులకు మరో ఫిర్యాదు అందింది. ఈ చిత్రానికి సంగీతం అందించిన ప్రముఖ దర్శకుడు కీరవాణిపై చర్యలు తీసుకోవాలని సర్కార్-3 దర్శకుడు జై ఫిర్యాదు చేశాడు. పోర్న్ మూవీకి ఓంకారాన్ని సంగీతంగా సమకూర్చారని ఆరోపిస్తూ జై ఫిర్యాదు చేశాడు. అయితే కీరవాణి విషయంలో పోలీసులు ఏవిధంగా ముందుకెళ్తారనేది వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి కో-డైరెక్టర్లుగా పనిచేసిన వారందరికీ కూడా నోటీసులిచ్చి పోలీసులు విచారిస్తారని తెలుస్తోంది. కాగా ఇప్పటికే వర్మ ల్యాప్‌‌టాప్ తీసుకున్న పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించారని మళ్లీ ఆయన్ను విచారణ పిలిచి అనంతరం అరెస్ట్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.ఆర్జీవీపై హెచ్చార్సీలో ఫిర్యాదు

Updated By ManamWed, 01/31/2018 - 07:47

Case File On RGVహైదరాబాద్: సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ (జీఎస్టీ) మూవీ లేనిపోని చిక్కులు తెచ్చిపెడుతోంది. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ కాకమునుపు  మహిళా సంఘాలు, బీజేపీ మహిళా నేతలు, సామాజిక కార్యకర్తలు ఆర్జీవీపై కేసులు పెట్టి, పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆఖరికి తెలంగాణ పోలీసులు నోటీసులు కూడా ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే తాజాగా కేసులు, నోటీసులు అవన్నీ పక్కనపెట్టి ఏకంగా ఈసారి హెచ్చార్సీలో ఫిర్యాదు చేయడం జరిగింది. సోషల్ మీడియా, టీవీ చానెల్స్ వేదికగా మహిళలపై వర్మ చేసిన వివాదస్పద వ్యాఖ్యలు, ఆయన ప్రసంగాలు హెచ్చార్సీ దాకా వెళ్లాయి.

               భారతీయ మహిళల గురించి చులకనగా మాట్లాడుతూ, యువతను పక్కదారి పట్టించేలా సెక్స్ ప్రసంగాలు చేస్తున్నఆర్జీవీపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత ప్రజా తంత్ర మహిళా సంఘం (ఐద్వా) సభ్యురాలు పి.మణి మంగళవారం సాయంత్రం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌(హెచ్చార్సీ)లో ఫిర్యాదు చేశారు. గత మూడు నెలలుగా టీవీ చానెల్స్ ఇంటర్వ్యూలకు హాజరైన ఆర్జీవీ దేశ సంప్రదాయాలు, కట్టుబాట్లకు విరుద్ధంగా యువతను రెచ్చ గొట్టే విధంగా మాట్లాడుతున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.  స్త్రీ జాతిని అవమాన పర్చేలా వ్యాఖ్యలు చేసిన రాంగోపాల్‌వర్మపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. 
       
    అయితే ఇప్పటికే వర్మపై నమోదైన పలుకేసులు నమోదవ్వగా వాటన్నింటినీ ఏ మాత్రం లెక్కచేయకుండా తన పంథాలో తాను నడుచుకుంటున్నాడు. అయితే ఈ సారి ఏకంగా తన వ్యవహారం హెచ్చార్సీ దాకా వెళ్లిందంటే ఈ విషయంపై ఎలా స్పందిస్తారో. కాగా ఇప్పటికే సామాజిక కార్యకర్త దేవి తనను అసభ్య పదజాలంతో దూషించాడని కేసు పెట్టారు. కాగా తన మూవీ రిలీజ్ అయిన అనంతరం ఆమెకు కౌంటరిస్తూ చూశారా.. దేవీగారు! జీఎస్టీ ఎంతమంది చూశారో అంటూ చిన్నపాటి మ్యాప్‌‌ను పెట్టి సోషల్ మీడియాలో హడావుడి చేసిన విషయం తెలిసిందే. ఐద్వా సభ్యురాలు పి.మణి విషయంలో వర్మ ఏవిధంగా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే.

Related News