chirutha

మ‌రోసారి పూరీ, చెర్రీ కాంబినేష‌న్‌?

Updated By ManamTue, 01/30/2018 - 20:17

puriమెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్.. త‌న తొలి చిత్ర ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్‌తో రెండోసారి సినిమా చేయ‌బోతున్నారా? అవున‌నే అంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవితో ప‌లు హిట్ చిత్రాల‌ను నిర్మించిన ప్ర‌ముఖ నిర్మాత కె.ఎస్‌.రామారావు.. చిరు త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లోనూ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టికే పూరీ చెప్పిన పాయింట్ న‌చ్చ‌డంతో.. 'చిరుత' కాంబినేష‌న్‌లో మూవీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నార‌ట‌. ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ 'రంగ‌స్థ‌లం' పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు. ఆ తరువాత బోయ‌పాటి చిత్రాన్ని చేయ‌నున్నారు. వీటి త‌ర్వాతే పూరీతో సినిమా చేసే అవ‌కాశ‌ముంద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్‌ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఈ లోపు పూరీ కూడా త‌న కొడుకు ఆకాశ్‌తో చేస్తున్న 'మెహ‌బూబా'ని పూర్తి చేసి.. చెర్రీ కోసం పూర్తి స్క్రిప్ట్‌ని త‌యారు చేసుకుంటార‌ని స‌మాచారం.నెహ్రు జూ పార్క్‌లో కోలుకుంటున్న చిరుత

Updated By ManamWed, 01/10/2018 - 18:10
chirutha

నిజామాబాద్ జిల్లా సిర్నా పల్లి అటవీ ప్రాంతంలో నిన్న గాయపడిన చిరుత ప్రస్తుతం కొలుకుంటోందని అటవీశాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ నెహ్రు జూ పార్క్ లో చిరుతకు అవసరమైన వైద్యం అందిస్తూ,  పరిశీలనలో ఉంచినట్లు జూ పార్క్ అధికారులు తెలిపారు. చిరుత వయస్సు 3 నుంచి నాలుగేళ్లు ఉంటుందని, ఇవాళ ఆహారం కూడా తీసుకుందన్నారు. తోక తెగటంతో పాటు, కాలికి కూడా గాయం అయిందని, చికిత్స అందిస్తున్నామని అధికారులు అన్నారు. లేచి నిలబడేందుకు చిరుత ఇబ్బంది పడుతోందని, ఎక్సరే తీసి పరిశీలిస్తామన్నారు. అటవీ ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో జంతువులు సంచారం ఉంటుందని, ఆ మార్గాల గుండా ప్రయాణించే వారు కొంత జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు.రామ్‌చ‌ర‌ణ్ తొలి చిత్రం 'చిరుత‌'కి ప‌దేళ్లు

Updated By ManamThu, 09/28/2017 - 11:48

మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడుగా భారీ అంచ‌నాల మ‌ధ్య 'చిరుత' చిత్రంతో తెరంగేట్రం చేశాడు రామ్‌చ‌ర‌ణ్‌. తొలి చిత్ర‌మే అయినా.. ఎక్క‌డా ఆ ఫీలింగ్‌ని మెగాభిమానుల‌కే కాకుండా ప్రేక్ష‌కుల‌కు కూడా క‌లిగించ‌లేదు చ‌ర‌ణ్‌.  అంత‌గా.. ఆ చిత్రంలో ఈజ్ చూపించాడు. ముఖ్యంగా పాట‌ల్లో చిరుని గుర్తుకు తెచ్చేలా డాన్స్‌ల‌తో మెప్పించాడు.  తొలి చిత్రం విష‌యంలో చ‌ర‌ణ్‌కి ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ నుంచి కూడా మంచి స‌పోర్ట్ ల‌భించింది. అభిమానులు చిరు త‌న‌యుడిని ఎలా చూడాల‌నుకుంటున్నారో అలా తెర‌పై చూపించ‌డంలో పూరీ నూటికి నూరు శాతం స‌క్సెస‌య్యాడు. చ‌ర‌ణ్‌ తెర‌పై తొలిసారిగా క‌నిపించే దృశ్యం నుంచి చివ‌రి స‌న్నివేశం వ‌ర‌కు సాధ్య‌మైనంత వ‌ర‌కు మెగాభిమానుల‌ను మెప్పించే ప్ర‌య‌త్నం చేశాడు పూరీ.  బాబాయ్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన‌ 'బ‌ద్రి'  ద్వారా పూరీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైతే.. ఆ పూరీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన 'చిరుత' చిత్రం ద్వారా త‌ను క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం అవ‌డం రామ్‌చ‌ర‌ణ్‌కి స‌మ్‌థింగ్ స్పెష‌లే.

ఇక  చిరంజీవి న‌టించిన ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌కు సంగీత‌మందించిన‌ మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ  ఈ చిత్రంలో అదిరిపోయే పాట‌లు ఇచ్చాడు. చిరుతో 'జ‌గ‌దేక‌వీరుడు అతిలోక‌సుంద‌రి', 'చూడాల‌ని ఉంది', 'ఇంద్ర' వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌ను నిర్మించిన సి.అశ్వ‌నీద‌త్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నేహాశ‌ర్మ హీరోయిన్ గా ప‌రిచ‌య‌మైన ఈ చిత్రం  2007లో ఇదే సెప్టెంబ‌ర్ 28 (ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ పుట్టిన‌రోజు కూడా  కావ‌డం విశేషం)న విడుద‌లైంది. అంటే.. ఇవాళ్టితో రామ్‌చ‌ర‌ణ్ న‌ట ప్ర‌స్థానానికి ప‌దేళ్లు పూర్త‌వుతున్నాయ‌న్న‌మాట‌.

Related News