tdp

మా సోదరి విజయం సాధించాలని కోరుకుంటున్నాం

Updated By ManamSat, 11/17/2018 - 10:20
NTR, Kalyan Ram, Suhasini

హైదరాబాద్: ప్రతిష్టాత్మక కూకట్‌పల్లి బరిలో నందమూరి కుటుంబం నుంచి దివంగత హరికృష్ణ తనయ నందమూరి సుహాసిని టీడీపీ పార్టీ నుంచి పోటీ చేస్తోంది. ఈ సందర్భంగా ఆమెకు అభినందనలు తెలుపుతూ సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ ఓ లేఖను విడుదల చేశారు. 

అందులో.. ‘‘ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అనే సిద్ధాంతంతో తాతగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ మాకు ఎంతో పవిత్రమైనది. మా నాన్నగారు స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారు సేవలందించిన తెలుగు దేశం పార్టీ తరఫున ఇప్పుడు మా సోదరి సుహాసిని గారు కూకట్‌పల్లి నియోజకత్వం నుంచి పోటీ చేస్తున్న సంగతి మీకు తెలిసిందే. స్ర్తీలు సమాజంలో ఉన్నతమైన పాత్రను పోషించాలి అనే నమ్మే కుటుంబం మాది. ఇదే స్ఫూర్తితో ప్రజా సేవకు సిద్ధపడుతోన్న మా సోదరి సుహాసిని గారికి విజయం వరించాలని ఆకాంక్షిస్తూ..జై ఎన్టీఆర్, జోహార్ హరికృష్ణ.. మీ నందమూరి కల్యాణ్ రామ్, నందమూరి తారకరామారావు’’ అంటూ పేర్కొన్నారు. కాగా సుహాసిని కోసం బాలకృష్ణ, ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లు ప్రచారం చేయనున్నట్లు బాలయ్య తెలిపిన విషయం తెలిసిందే.

 ఎన్టీఆర్ ప్రచారం చేస్తాడు: బాలయ్య

Updated By ManamSat, 11/17/2018 - 08:56

Balakrishna, SUhasiniహైదరాబాద్: టీడీపీ పార్టీ తరఫున కూకట్‌పల్లిలో బరిలో దిగనున్న దివంగత హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని ఇవాళ తన నామినేషన్ వేయనున్నారు. ఈ సందర్భంగా ఈ ఉదయం బాబాయి బాలయ్యతో కలిసి ఆమె ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లారు. అక్కడ ఎన్టీఆర్‌కు వారిద్దరు నివాళులర్పించారు. ఈ సందర్భంగా నందమూరి కుటుంబసభ్యులు, కార్యకర్తలు కూడా వారి వెంట వెళ్లారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. తెలంగాణలో మహాకూటమిదే విజయం అని, సుహాసిని భారీ మెజారిటీ గెలిపించాలని అన్నారు. ఇక సమయాన్ని బట్టి, షెడ్యూల్ ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తారని బాలకృష్ణ చెప్పారు. తాను ఈ నెల 26 నుంచి తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం చేస్తానని, కాంగ్రెస్ అభ్యర్థులకూ ప్రచారం చేస్తానని బాలకృష్ణ స్పష్టం చేశారు. మరో టీడీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. సుహాసిని విజయం కోసం శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తానని, లక్ష మెజారిటీతో సుహాసినిని గెలిపించాలని కోరారు.టీడీపీకి 3 పదవులు.. నాకు మంత్రి పదవి!

Updated By ManamFri, 11/16/2018 - 20:29
  • టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్ రెడ్డి వ్యాఖ్య

TDP, 3 posts, minister post, Revuri prakash reddy, TRS, TDP ticket, Chandrababu naidu, KCR, Telangana assembly electionsవరంగల్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి విజయం సాధిస్తే టీడీపీకి 3 మంత్రి పదవులు దక్కనున్నాయనీ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి చెప్పారు. అలా జరిగితే తాను మంత్రి కావడం తథ్యమని ఆయన అన్నారు. శుక్రవారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ గోబెల్స్‌ ప్రచారం చేస్తోందని విమర్శించారు. నాలుగేళ్లు అధికారంలో ఉండి టీఆర్‌ఎస్‌ చేసిన అభివృద్ధి ఏ పాటిదో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

వరంగల్‌ పశ్చిమ నుంచి పోటీ చేసేందుకు రేవూరికి టీడీపీ టికెట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో చేసిన పనులను చెప్పుకునే దమ్ములేక చంద్రబాబును టార్గెట్‌ చేస్తున్నారని ఆయన నిప్పులు చెరిగారు. చంద్రబాబును విమర్శించకుండా టీఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. నియోజకవర్గాల వారిగా కూటమి తరపున సమన్వయ కమిటీలు పనిచేస్తాయని రేవూరి తెలిపారు. ‘ఆ సీటు’ కేసీఆర్‌కు గిఫ్ట్‌గా ఇస్తాం: కవిత

Updated By ManamFri, 11/16/2018 - 13:14
we will give  jagtial gift to kcr, say MP kavitha

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి 100కి పైగా సీట్లు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని ఆ పార్టీ ఎంపీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. ఆమె శుక్రవారమిక్కడ మీడియాతో చిట్ చాట్ చేశారు. ‘టీఆర్ఎస్ కుటుంబ పార్టీ అని ఉత్తమ్ అన్నారు. మరి...ఆయన తన భార్య పద్మావతికి టికెట్ ఎలా తీసుకుంటారు?. ఉత్తమ్ కుమార్ రెడ్డి తన భార్య పద్మావతి నామినేషన్ ఉపసంహరించుకుంటే గౌరవంగా ఉంటుంది. కోదాడలో టీఆర్ఎస్ గెలుస్తుంది. 

తెలంగాణ కాంగ్రెస్‌కు సడన్‌గా సెటిలర్లపై ప్రేమ పుట్టుకు వచ్చింది. కమ్మ సామాజికవర్గానికి అన్యాయం జరిగిందని ఆ పార్టీ ఎంపీ రేణుకా చౌదరి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. కొత్తగా కుసుమకుమార్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు. తెలంగాణలో టీడీపీ అభ్యర్థిని కాదు... ఆ పార్టీని తిరస్కరిస్తారు. నిజామాబాద్ జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ సీట్లు గెలుస్తాం. ఇక జగిత్యాల సీటు గెలిచి కేసీఆర్‌కు బహుమతిగా ఇస్తాం.  రూరల్, అర్బన్ అనే తేడాలేదు... అందరూ టీఆర్ఎస్ వైపే’ అని కవిత ధీమా వ్యక్తం చేశారు.నేడు టీడీపీ తుది జాబితా

Updated By ManamFri, 11/16/2018 - 01:16
  • కూకట్‌పల్లి నుంచి సుహాసిని!

  • విశాఖలో బాబుతో భేటీ.. పోటీపై చర్చ

tdpహైదరాబాద్: టీడీపీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కూకట్‌పల్లి అభ్యర్థి ఎంపిక దాదాపు పూర్తయింది. నిన్న మొన్నటిదాకా ఆ స్థానం పెద్దిరెడ్డికి కేటాయిస్తారని అందరూ భావించినా, తాజాగా తెరపైకి వచ్చిన నందమూరి సుహాసినికే ఆ సీటు ఖరారైనట్టు సమాచారం. గురువారం, విశాఖలో ఆమె చంద్రబాబుతో భేటీ అవడంతో ఈ వాదనకు మరింత బలం చేకూరుతోంది. కూకట్‌పల్లిలో పోటీపై చర్చించేందుకే ఆమె బాబుతో భేటీ అయినట్లు సమాచారం. ఆమె రాకను తన సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ స్వాగతిస్తారా లేదా అన్నది రాజకీయవర్గాల్లో చర్చ నీయాంశంగా మారింది. కూకట్‌పల్లి స్థానంతోపాటు, మరో రెండు స్థానాలకు టీడీపీ నేడు అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది.

తెలంగాణలో బాలయ్య ప్రచారం!
సినీ హీరో, ఏపీకి చెందిన టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ టీడీపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు. ఎన్టీఆర్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న బాలయ్య, విరామం తీసుకున్నట్లు సమాచారం. ప్రజాకూటమి టికెట్లు దక్కించుకున్న టీడీపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకే ఆయన షూటింగుకు విరామం పెట్టారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. ఇది వరకే, ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియో జకవర్గం నుంచి టీడీపీ టికెట్‌పై పోటీజేస్తున్న సత్తుపల్లి వెంకట వీరయ్య తరపున బాలయ్య ప్రచారం నిర్వహించారు. సత్తుపల్లిలో ఆయన నిర్వహించిన రోడ్డు షోకు భారీ స్పందన రావడంతో, మిగతా నియోజ కవర్గాల్లోనూ ఈ నెల 24 నుంచి బాలయ్య రంగంలోకి దిగనున్నారు. ముఖ్యంగా శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి సహా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని టీడీపీ స్థానాల్లో ఆయన ఎక్కువగా ప్రచారం చేసే అవకాశముంది.కూకట్‌పల్లి టికెట్ సుహాసినికే!

Updated By ManamThu, 11/15/2018 - 15:42
Nandamuri suhasini meets chandrababu naidu in visakha

విశాఖ : నందమూరి కుటుంబానికే కూకట్‌పల్లి టికెట్ ఖరారు అయినట్లు సమాచారం. ఇప్పటికే అందుకు సంబంధించి కసరత్తు జరగగా...తాజాగా టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినీ గురువారం విశాఖలోని నోవాటెల్ హోటల్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టికెట్ కేటాయింపుతో పాటు, తాజా పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహకూటమి పొత్తుల్లో భాగంగా కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున నందమూరి సుహాసినీ పేరు తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుహాసినీ... చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే సుహాసినీకి టికెట్ కేటాయింపుపై ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. కూకట్‌పల్లి బరిలో హరికృష్ణ కుమార్తె..?

Updated By ManamWed, 11/14/2018 - 11:27

Hari Krishnaతెలంగాణలో ప్రతిష్టాత్మక అసెంబ్లీ స్థానాల్లో ఒకటైన కూకుట్ పల్లి నియోజకవర్గానికి టీడీపీకే కేటాయించాలని మహాకూటమి నిర్ణయించింది. ఈ నేపథ్యంలో దివంగత హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ఈ ఆఫర్ తొలుత కల్యాణ్ రామ్‌కు ఇచ్చినప్పటికీ, ఆయన నిరాకరించడంతో ఆ ఛాన్స్‌ను తీసుకోవాలని సుహాసినిని కోరారు టీటీడీపీ నేతలు.

ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు, బాబాయ్ బాలకృష్ణలు సవ్యంగా ఆమెతో మాట్లాడినట్లు సమాచారం. కూకట్‌పల్లిలో టీడీపీకి క్షేత్రస్థాయిలో ఎంతో బలముందని, ఆమెను గెలిపించే బాధ్యత తమదని అభయమిచ్చినట్లు సమాచారం. ఈ విషయంలో సుహాసిని ఇంకా తన నిర్ణయాన్ని తెలపనట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ స్థానం నుంచి తానే పోటీ చేస్తానని మాజీ మంత్రి పెద్దిరెడ్డి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డిని బుజ్జగించే పనిలో అధిష్టానం ఉన్నట్లు టాక్. జగన్‌పై మండిపడ్డ ఎమ్మెల్యే అనిత

Updated By ManamWed, 11/14/2018 - 10:23

YS Jagan, Anithaతిరుపతి: జగన్ చేస్తున్న కోడి కత్తి డ్రామాను ఏపీ ప్రజలందరూ గమనిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే అనిత ప్రతిపక్షనేత జగన్‌పై విరుచుకుపడ్డారు. పోలీసు విచారణకు వైఎస్ జగన్‌ సహకరించకుండా చంద్రబాబుపై విమర్శలు చేయడం దారుణమని ఆమె మండిపడ్డారు. ఏడాది కాలంగా జగన్ చేస్తున్న ప్రజా సంకల్పయాత్రకు ఏపీ పోలీసులే రక్షణ కల్పించారని అనిత గుర్తు చేశారు. అయితే ఏపీ పోలీసులపై నమ్మకం లేదని జగన్ చెప్పడం దారుణమని ఆమె అన్నారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. పవిత్రమైన తిరుమలలో రాజకీయాలు మాట్లాడటం దారుణమని చెప్పారు. కొండపై రాజకీయాలు మాట్లాడేవారిపై ఏపీ ప్రభుత్వం, టీటీడీ చర్యలు తీసుకోవాలని అనిత వ్యాఖ్యానించారు.చంద్రబాబుతో నటి మంజు భార్గవి భేటీ

Updated By ManamTue, 11/13/2018 - 20:04
Actress Manju Bhargavi meets ap cm chandrababu naidu

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సినీనటి మంజు భార్గవి కలిశారు.  ఆమె త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఇందుకు సంబంధించి మంజు భార్గవి ...ఏపీ సీఎంతో చర్చించినట్లు తెలుస్తోంది. కాగా మంజు భార్గవి అనగానే గుర్తొచ్చే సినిమా ‘శంకరాభరణం’. ఆ చిత్రం ద్వారా ఆమె తెలుగులో నటిగా మంచి పేరు సంపాదించారు. అంతేకాకుండా శాస్త్రీయ నృత్యకళాకారిణి అయిన ఆమె...ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ప్రదర్శనలు కూడా ఇచ్చారు. చంద్రబాబును కలిసిన కామినేని

Updated By ManamMon, 11/12/2018 - 14:48
kamineni srinivas met chandrababu naidu in amaravati

అమరావతి : మాజీమంత్రి, బీజేపీ సీనియర్ నేత కామినేని శ్రీనివాస్ సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. కాగా ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చేసిన అనంతరం మంత్రులుగా ఉన్న బీజేపీ నేతలు కామినేని, మాణిక్యాలరావు తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 

ఆ తర్వాత నుంచి కామినేని శ్రీనవాస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.అయితే కలిదిండిలో ఓ కళాశాలను ప్రభుత్వ టేకాఫ్ చేస్తూ జీవో ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపేందుకే ముఖ్యమంత్రిని కలిసినట్లు కామినేని శ్రీనివాస్ తెలిపారు. తాను బీజేపీలోనే కొనసాగుతానని, ఓ కళాశాల పనిమీదే చంద్రబాబుతో భేటీ అయినట్లు ఆయన పేర్కొన్నారు.

Related News