dead

తెలంగాణలో స్వైన్‌ఫ్లూ కలకలం.. ఒకరు మృతి

Updated By ManamSat, 10/13/2018 - 09:23

Swine Fluహైదరాబాద్: తెలంగాణలో మరోసారి స్వైన్‌ఫ్లూ కలకలం రేపుతోంది. ఫ్లూ లక్షణాలతో చాలామంది ఆసుపత్రులలో చేరుతుండగా.. గురువారం గాంధీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఓ మహిళ మృతి చెందింది. మరో తొమ్మిది మందికి చికిత్స అందిస్తుండగా.. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు అన్నారు. అటు ఉస్మానియా ఆసుపత్రిలోనూ స్వైన్‌ఫ్లూ లక్షణాలతో రోగులు చికిత్స తీసుకుంటున్నారు. స్వైన్‌ఫ్లూ రోగులతో గాంధీ ఆసుపత్రిలోని నోడల్ సెంటర్ నిండిపోయింది. సరిపడా బెడ్‌లు కూడా లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ పరిస్థితుల్లో మార్పుల వల్లే స్వైన్‌ఫ్లూ మళ్లీ విజృంభించిందని డాక్టర్లు చెబుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 50కి పైగా స్వైన్‌ఫ్లూ కేసులు నమోదైనట్లు సమాచారం.పట్టాలు తప్పిన రైలు.. ఏడుగురు మృతి

Updated By ManamWed, 10/10/2018 - 09:20

Farakkaలఖ్‌నౌ: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. లక్నో నుంచి అలహాబాద్ వెళుతున్న న్యూఫరక్కా ఎక్స్‌ప్రెస్ రైలు హరచాంద్‌పూర్ రైల్వే స్టేషన్‌కు 50కి.మీ దూరంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. దాదాపు 35మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. మొత్తం ఆరు బోగీలు పట్టాలు తప్పగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమచారం. ఇక ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ సహాయక చర్యలను చేపట్టాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. అత్యవసర సమాచారం కోసం అధికారులు హెల్ప్‌లైన్ నంబర్లు ప్రకటించారు.విషాదం: సంగీత దర్శకుడికి తీవ్ర గాయాలు.. కుమార్తె మృతి

Updated By ManamTue, 09/25/2018 - 15:20

BalaBhaskarప్రముఖ వయోలినిస్ట్, మ్యుజిషియన్ బాలభాస్కర్ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయన ఒకటిన్నరేళ్ల కుమార్తె తేజస్వి బాల అక్కడికక్కడే మరణించగా.. బాలభాస్కర్, ఆయన భార్య లక్ష్మితో సహా డ్రైవర్ తీవ్ర గాయాలపాలయ్యారు. వారిలో బాలభాస్కర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. తిరువనంతపురం శివారు ప్రాంతం పల్లిప్పురమ్ వద్ద మంగళవారం తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. త్రిస్సూర్‌లో ఓ దేవాలయాన్ని దర్శించుకొని తిరిగి వెళ్తుండగా.. వారు ప్రయాణిస్తున్న కారు ఓ చెట్టును ఢీకొని ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కాగా 17ఏళ్ల వయసులో ‘మాంగల్య పల్ల’కు అనే చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా మారిన బాలభాస్కర్.. ఆ తరువాత ‘మోక్షం’, ‘కన్నదిక్కదవతు’ అనే చిత్రాలకు సంగీతం అందించాడు. వయోలినిస్ట్‌గా ఉస్తాద్ జాఖీర్ హుస్సేన్, శివమణి, లూయిస్ బాంక్స్, హరిహరన్, ఫాజల్ ఖురేషి తదితర ప్రముఖులతో కలిసి పనిచేశారు బాలభాస్కర్. డ్రగ్స్ డోస్ ఎక్కువై ప్రముఖ సింగర్ మృతి

Updated By ManamSat, 09/08/2018 - 10:56

Mac Millerప్రముఖ అమెరికన్ ర్యాప్‌ సింగర్‌ మ్యాక్‌ మిల్లర్‌(26) మృతి చెందాడు. లాస్‌ ఏంజెల్స్‌లోని తన నివాసంలో అపస్మారక స్థితిలో ఉన్న అతడిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతను మరణించాడని వైద్యులు పేర్కొన్నారు. డ్రగ్స్‌ ఓవర్‌ డోస్‌ కావడంతో గుండెపోటు వచ్చిందని, దీని వలనే మ్యాక్‌ ప్రాణాలు విడిచాడని వైద్యులు వెల్లడించారు. 

అయితే గత కొద్ది రోజులుగా తీవ్ర డిప్రెషన్‌లో ఉన్న మిల్లర్‌ను వరుస సమస్యలు ఇబ్బంది పెట్టాయి. ప్రియురాలు అరియాన గ్రాండేతో బ్రేకప్‌.. హిట్‌ అండ్‌ రన్‌ కేసులో అరెస్ట్‌ కావడంతో మ్యాక్‌ తీవ్ర డిప్రేషన్‌లోకి వెళ్లాడు. దీనికి తోడు జూన్‌లో తన ప్రియురాలు గ్రాండే అమెరికా కమెడియన్‌ పిటె డెవిడ్సన్‌తో నిశ్చితార్థం చేసుకోవడం మ్యాక్‌ తట్టుకోలేకపోయాడని అతని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కాగా 2012 నుంచి గ్రాండేను ప్రేమిస్తున్న మ్యాక్‌ 2017లో ఆమెతో విడిపోయాడు. వీరిద్దరు కలిసి ఎన్నో ఆల్బమ్స్‌ చేశారు. ప్రముఖ హాలీవుడ్ నటుడు రెనాల్డ్స్ కన్నుమూత

Updated By ManamFri, 09/07/2018 - 10:54

reynoldsప్రముఖ హాలీవుడ్ నటుడు, దర్శకుడు బుర్డ్ రెనాల్డ్స్ ఇకలేరు. గుండెపోటుతో గురువారం ఫ్లోరిడాలో రెనాల్డ్స్ తుదిశ్వాస విడిచినట్లు ఆయన మేనెజర్ ఎరిక్ క్రిట్జెర్ ప్రకటించారు. కాగా 1936లో పుట్టిన రెనాల్డ్స్ ‘గన్‌స్మోక్’, ‘బాక్’ వంటి టెలివిజన్ సిరీస్‌లో పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత ‘డెలివరెన్స్’, ‘బూగీ నైట్స్’, ‘లాంగెస్ట్ యార్డ్’ వంటి హిట్ చిత్రాలలో నటించి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాడు. ఇక  దర్శకుడిగానూ కొన్ని చిత్రాలను తెరకెక్కించారు రెనాల్డ్స్. వీటితో పాటు ఫ్లోరిడాలో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించిన రెనాల్డ్స్.. ‘మై లైఫ్’, ‘ఎనఫ్ అబౌట్ మి’ అనే రెండు ఆటో బయోగ్రఫీలను కూడా రాశారు. లెనాల్డ్స్ మృతిపై పలువురు హాలీవుడ్ ప్రముఖులు తమ సంతాపాన్ని ప్రకటించారు.తమ్ముడు చూడాలనుందన్నారు.. ఇంతలోనే వదిలి వెళ్లారు

Updated By ManamWed, 08/29/2018 - 10:14

Harikrishnaసినీ నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఆయనతో తమ అనుబంధాన్ని చెప్పుకుంటూ పలువురు సినీ ప్రముఖులు హరికృష్ణకు తమ సంతాపాన్ని ప్రకటించారు. 

‘‘ ‘చాలా రోజులు అయ్యింది తమ్ముడు నిన్ను చూసి, కలవాలి తమ్ముడు’ కొన్ని రోజుల క్రితం నాతో ఈ మాటలు మాట్లాడిన ఆయన ఇప్పుడు దూరంగా వెళ్లిపోయారు. చాలా బాధగా ఉంది. నిన్ను మిస్ అవుతున్నా అన్నయ్య‘‘ అంటూ అక్కినేని నాగార్జున ట్వీట్ చేశారు. హరికృష్ణ హఠాన్మరణం చాలా బాధించిందని, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కుటుంబానికి తమ సంతాపం అంటూ పలువురు ప్రముఖులు తెలిపారు. వారిలో మోహన్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేశ్ బాబు, మంచు మనోజ్, నాని, కాజల్ అగర్వాల్, రామ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, సాయి బెల్లంకొండ, జెనీలియా, రకుల్ ప్రీత్ సింగ్, లక్ష్మీ మంచు,  దేవీ శ్రీ ప్రసాద్, శ్రీనువైట్ల, పూజా హెగ్డే, గౌతమి, శరత్ కుమార్, దర్శకుడు మారుతి, అనసూయ, గోపిచంద్ మలినేని తదితరులు ఉన్నారు.

 అమెరికాలో ఏపీ ఇంజనీర్ అనుమానస్పద మృతి

Updated By ManamSun, 08/19/2018 - 17:33

A.P. engineer found dead in U.S

అమరావతి: అమెరికాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు వారికి జాతి అహకారంతో కొందరు తెల్లోళ్లు పొట్టన పెట్టుకుంటుంటే మరికొందరు అనుమానస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. తాజాగా ఏపీకి చెందిన ఓ యువ ఇంజనీర్ అనుమానస్పదంగా మృతి చెందాడు. వివరాల్లోకెళితే.. అమెరికా మేరీల్యాండ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బోళ్ల వీర వెంకట సత్య సురేష్ గత కొద్దిరోజులుగా గత రెండోళ్లుగా ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

అయితే ఆదివారం సాయంత్రం సురేష్ అనుమానాస్పదంగా మృతి చెందడంతో తోటి మిత్రులు పోలీసులకు, తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం బయటికి పొక్కింది. అమెరికాకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తాడనకున్న బిడ్డ చనిపోయాడన్న విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. వారి ఆర్తనాదాలు మిన్నంటాయి. సురేశ్ మృతదేహాన్ని ఇండియాకు చేర్చాలని ఏపీ ప్రభుత్వాన్ని కుటుంబీకులు కోరుతున్నారు. ఏపీ ప్రభుత్వం అమెరికా అధికారులతో మాట్లాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

suresh అయితే సురేశ్‌ను ఎవరైనా చంపేసి కారులో పడేశారా..? లేక తనకు తానుగా ఆత్మహత్య చేసుకున్నాడా..? అసలేం జరిగిందో తెలియని పరిస్థితి. సురేశ్ మిత్రుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలిస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. వరుసగా ఒకరి తర్వాత ఒకరు అగ్రరాజ్యంలో చనిపోతుండటంతో అమెరికాకు వెళ్లాలంటే తెలుగు ప్రజలు భయంతో వణికిపోతున్నారు.కుటుంబాన్ని చంపి.. పెరట్లో పూడ్చి

Updated By ManamThu, 08/02/2018 - 12:05
Kerala

తిరువనంతపురం: ఢిల్లీ బురారీ ఘటన మరవకముందే అలాంటి మరో ఘటన కేరళలో జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇడుక్కి జిల్లాలోని తొడుపుజ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నాలుగు రోజుల క్రితం ఈ నలుగురు తప్పిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు రాగా.. విచారణ చేస్తున్న పోలీసులకు వారి మృతదేహాలు పెరట్లో దొరికాయి. ఆ మృతదేహాలను ఒకదానిపై మరొకటి పూడ్చిబెట్టారు.

ఇక ఇంట్లో అక్కడక్కడా రక్తపు మరకలు ఉండగా.. వారి శరీరాలపై బలమైన గాయాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలం నుంచి కత్తి, సుత్తెను స్వాధీనం చేసుకున్న పోలీసులు, మృతదేహాలను పోస్ట్‌మార్టానికి తరలించారు. మృతుల్లో కె.కృష్ణన్, ఆయన భార్య సుశీల, కుమార్తె అర్ష, కుమారుడు అర్జున్ ఉన్నారు. మరోవైపు వీరి మరణంపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరి మరణం వెనుక చేతబడి కారణమా..? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే వారు ఎవ్వరితోనూ ఎక్కువగా మాట్లాడేవారు కాదని, కృష్ణన్‌కు రబ్బరు ప్లాంట్ ఉండగా.. ఆయన తాంత్రిక పూజలు చేస్తాడనే అనుమానాలు ఉన్నాయని ఇరుగు పొరుగు వాళ్లు పోలీసులకు తెలిపారు. ఈ క్రమంలో ఎవరైనా గిట్టని వాళ్లు ఈ దుర్మర్గానికి తలపడి ఉండవచ్చని  పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Updated By ManamSat, 07/21/2018 - 17:53

Road Accident at hayatnagar

హైదరాబాద్: భాగ్యనగరం శివారులోని హయత్ నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకెళితే.. తనకు అడ్డు వచ్చిన కారు ఓనర్‌తో లారీ డ్రైవర్ వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో రోడ్డు దాటుకుంటూ వెళ్తున్న మహిళలను చూసుకోకుండా వారిపై నుంచి లారీ డ్రైవర్ వాహనంతో దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో తల్లీకూతుళ్లయిన భారతమ్మ, మల్లమ్మ మృతి చెందారు . తల్లిని బస్సు ఎక్కించేందుకు వెళ్తుండగా ఈ ఘోర ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై మహిళిద్దరూ లారీ కింద పడిపోయినా.. చుట్టుపక్కల వారు స్పందించకపోవడం గమనార్హం. 

మానవత్వం మంటగలిసిందనడానికి ఈ ఒక్క ఘటన చాలు.ఓ టూవీలర్ వాహనదారుడు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరా ఫుటేజీని సేకరించిన పోలీసులు లారీని గుర్తించామని చెబుతున్నారు. త్వరలోనే లారీ డ్రైవర్‌ను పట్టుకుంటామని పోలీసులు మీడియాకువివరించారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Road Accident at hayatnagarపెళ్లికి ముందు కలుసుకున్నారని చంపేశారు!

Updated By ManamFri, 01/05/2018 - 17:46

loversకరాచీ: పాకిస్తాన్‌లో జరిగిన జంట పరువు హత్యలు కలకలం రేపాయి. పెళ్లికి ముందు కలిసి మాట్లాడుకున్నారని యువతిని, ఆమె బావను చంపేశారు. సింధు ప్రావిన్స్‌లో ఈ ఘటన జరిగింది. ఘోట్కీ పట్టణానికి దగ్గర్లోని నయివాహి గ్రామంలో నివాసముండే నజీరా, తన బావ షాహిద్‌ ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ కలిసి ఎవరికీ తెలియకుండా ఒక దగ్గర కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వీరిద్దరూ కలిసి మాట్లాడుకోవడం నజీరా అంకుల్ చూశాడు. ఇంటి పరువు తీస్తున్నావంటూ యువతిపై తుపాకితో కాల్పులు జరిపాడు. యువకుడిని కూడా కాల్చాడు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నజీరా, షాహిద్‌కు ఇటీవలే నిశ్చితార్థమైనట్లు స్థానికులు తెలిపారు. ఇంతలోనే ఇలా జరగడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. పోలీసులు ఘటనకు కారణమైన నజీరా అంకుల్‌ను, మరొకరిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పాకిస్తాన్‌లో ఇలాంటి పరువు హత్యలు కొత్తేమీ కాదు. గత నెలలో రావల్పిండిలో కూడా ఇదే తరహా ఘటన ఒకటి జరిగింది. పెద్దలకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారని సోదరిని, ఆమె భర్తను ఓ యువకుడు హత్య చేశాడు.

Related News