Sajjan Jindal

సజ్జన్‌కు రజతం

Updated By ManamThu, 09/20/2018 - 00:09
  • జూనియర్ వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్

sajjanన్యూఢిల్లీ: స్లోవేకియాలో జరిగిన జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ సజ్జన్ భన్వాల్ రజత పతకం సాధించాడు. దీంతో సజ్జన్ వరుసగా రెండు సార్లు జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన రెజ్లర్‌గా రికార్డులోకెక్కాడు. బుధవారం జరిగిన గ్రీకో రోమన్ (77 కిలోల) ఫైనల్‌లో సజ్జన్ 0-8తో రష్కాకు చెందిన ఇస్లామ్ ఓపివ్ చేతిలో ఓడిపోయి రజత పతకం గెలుపొందాడు. సజ్జన్ ఈ ఏడాది జూలైలో జరిగిన జూనియర్ ఆసియా చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించిన సంగతి తెలిసిందే. గతేడాది ఫిన్‌లాండ్‌లో జరిగిన వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో సజ్జన్ కాంస్య పతకం దక్కించుకున్నాడు. సజ్జన్‌తోపాటు మరో భారత రెజ్లర్ విజయ్ గ్రీకో రోమన్ 55 కిలోల విభాగంలో కాంస్య పతకం గెలుపొందాడు. విజయ్ 8-16తో టర్కీకి చెందిన సియాట్ లిమన్ చేతిలో ఓడిపోయాడు. ‘మోనెట్ ఇస్పాత్‌ను గాడిలో పెడతాం’ 

Updated By ManamTue, 07/24/2018 - 20:48

sajjanjindalముంబై: మోనెట్ ఇస్పాత్ అండ్ ఎనర్జీ కంపెనీకి ఒక ఏడాది కాలంలో దశ తిరిగేట్లు చేసి, మాతృ కంపెనీలో దాన్ని విలీనం చేయాలని జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ఆశిస్తోంది. అయాన్ ఇన్వెస్ట్‌మెంట్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కూటమి రూ. 2,875 కోట్లతో మోనెట్ ఇస్పాత్ అండ్ ఎనర్జీని స్వాధీనపరచుకునేందుకు జాతీయ కంపెనీలా ట్రైబ్యునల్ గత వారం ఆమోదం తెలిపింది. దివాలా తీసిన మోనెట్ ఇస్పాత్ దాని రుణ దాతలకు రూ. 11,000 కోట్లకు పైగా బకాయి పడింది. ఆ సంస్థ 1.5 మిలియన్ టన్నుల ఉత్పాదక సామర్థ్యంతో చత్తీస్‌గఢ్‌లో ఉంది. దాని ఏకైక బిడ్డర్‌గా అయాన్-జేఎస్‌డబ్ల్యూ కన్సార్షియం నిలిచింది. ‘‘తదనంతర కాలంలో మోనెట్ ఇస్పాత్‌ను మేం జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌లో విలీనం చేస్తాం. అది జేఎస్‌డబ్ల్యూ బ్రాండ్‌గా పరిణమిస్తుంది. సాధారణంగా ఒక ఏడాదిలో పరిస్థితులు చక్కదిద్దగలమని మా గతానుభవం సూచిస్తోంది. దీని విషయంలోనూ అదే జరుగుతుందని మేం ఆశిస్తున్నాం’’ అని జేఎస్‌డబ్ల్యూ స్టీల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ జిందాల్ కంపెనీ వార్షిక సర్వ సభ్య సమావేశం సందర్భంగా ఇక్కడ మీడియా ప్రతినిధులతో విడిగా మాట్లాడుతూ చెప్పారు. ఎస్సార్ స్టీల్ స్వాధీనం గురించి అడిగినపుడు, ‘‘ఆ అంశం కోర్టులో ఉంది.  జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ తీర్పు వచ్చే 2-3 వారాల్లో వెలువడుతుందని భావిస్తున్నాం. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది చూస్తాం’’ అని సజ్జన్ జవాబిచ్చారు. స్ట్రెస్సడ్ అసెట్లను కొనడంతో సహా , ఇతర కంపెనీల స్వాధీనాలు, విలీనాల ద్వారా దేశీయ మార్కెట్‌లో విస్తరించాలన్నది జేఎస్‌డబ్ల్యూ స్టీల్ పథకం. ఆ దిశగా అది ఎస్సార్ స్టీల్‌ను కొనేందుకు  నువెుటల్‌తో పొత్తు పెట్టుకుంది. అయితే, నువెుటల్  ప్రమోటర్లలో ఎస్సార్ గ్రూప్ కూడా ఉంది. ఉషా మార్టిన్‌కు చెందిన ప్రత్యేక ఉక్కు తయారీ విభాగాన్ని కైవసం చేసుకునేందుకు కూడా జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ఆసక్తి చూపడంపై వ్యాఖ్యానిస్తూ, దేశీయ ఉక్కు పరిశ్రమ ప్రస్తుతం ఏకీకరణ దశలో ఉందని సజ్జన్ అన్నారు. బహుశా, ఉషా మార్టిన్ కూడా అలా ఏకీకరణకు లోనుకావచ్చునని అన్నారు. దేశీయ మార్కెట్‌లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 2021 నాటికి రూ. 45,000 కోట్ల మూలధన వ్యయానికి ప్రణాళిక వేసుకుంది. అందులో భాగంగా విజయనగర్, దోల్వీ యూనిట్ల సామర్థ్యాలను విస్తరించనున్నారు. డౌన్‌స్ట్రీమ్ వ్యాపారాలను ఆధునికీకరించి, ఉత్పత్తి సామర్థ్యాలను విస్తరించనున్నారు. ఇనుప ఖనిజ, కోకింగ్ బొగ్గు గనుల తవ్వకాలలో ఉనికిని పెంచుకోనున్నట్లు సజ్జన్ తెలిపారు. దేశీయ పరిశ్రమల ప్రయోజనాలను సంరక్షించుకునేందుకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు రానురాను సంరక్షణ వాణిజ్య చర్యలను పెంచుతున్నాయని, భవిష్యత్తులో కూడా ఇదే ధోరణి కొనసాగవచ్చని సజ్జన్ అన్నారు. అంతమాత్రాన అంతర్జాతీయ మార్కెట్లలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ వృద్ధికి వచ్చే ఇబ్బందేమీ లేదని ఆయన చెప్పారు. బొగ్గు, ఇనుప ఖనిజం వంటి ముడి పదార్థాల ధరలను బట్టే ప్రధానంగా ఉక్కు ధర నిర్ణయమవుతుందని, ముడి సరుకల ధరలు స్థిరంగా ఉన్నాయి కనుక, ఉక్కు ధరలు కూడా నిలకడగానే ఉంటాయని సజ్జన్ చెప్పారు.  కార్పొరేట్ పన్నును తగ్గించాల్సింది

Updated By ManamTue, 02/06/2018 - 15:43

Sajjan Jindalముంబయి: భారతీయ కంపెనీలు చెల్లిస్తున్న అధిక పన్ను అంతర్జాతీయంగా అవి ఎక్కువ పోటీ ఇవ్వలేనివిగా తయారు చేస్తోందని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ అన్నారు. కార్పొరేట్ ఆదాయ పన్ను రేటును 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గిస్తామని చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకునే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించి ఉండవలసిందని ఆయన సోమవారం ఇక్కడ బడ్జెట్‌ను విశ్లేషిస్తూ చెప్పారు. అంతర్జాతీయంగా అత్యధిక పన్ను రేట్లు ఉన్న దేశాలలో ఇండియా ఒకటిగా ఉందని భారీ కంపెనీలు హెచ్చు పన్నులు చెల్లిస్తూ, అంతర్జాతీయంగా ఎక్కువ పోటీ ఇవ్వలేకపోతున్నాయని ఆయన అన్నారు. సెక్యూరిటీల లావాదేవీ పన్నును తొలగించకుండా, కాస్ట్ ఇండెక్సేషన్ ప్రయోజనం కల్పించకుండా అమలులోకి తేవాలని భావిస్తున్న దీర్ఘకాల మూలధన లాభ పన్నును ప్రవేశపెట్టే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించుకోవాలని ఆయన కోరారు. ఇది దీర్ఘకాల ఇన్వెస్టర్లకు భారతీయ ఈక్విటీల పట్ల ఉన్న ఆకర్షణీయతను తగ్గిస్తుందని జిందాల్ అన్నారు.

  ఆరోగ్యం, విద్య, సామాజిక భద్రతలకు కేటాయించిన (క్రితంసారికన్నా 13 శాతం ఎక్కువగా) రూ. 1.38 లక్షల కోట్లు , మౌలిక వసతుల అభివృద్ధికి కేటాయించిన (కడపటిసారికన్నా 20 శాతం ఎక్కువగా) రూ. 5.97 లక్షల కోట్లు  భారత పౌరుల జీవన పరిస్థితులను మెరుగుపరచగలవని ఆయన చెప్పారు. మొత్తంమీద, దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించేందుకు గ్రామీణ భారతావనికి బడ్జెట్ భారీగా రూ. 14.34 లక్షల కోట్లు కేటాయించిందని ఆయన అన్నారు. జి.డి.పి వృద్ధిలో నిలకడగా 8 శాతం పైన వృద్ధిని సాధించాలంటే, ఎగుమతులు చాలా ముఖ్యమని, ఎందుకంటే, భారతీయ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ వినిమయంతో నడిచేదిగా లేదని ఆయన అన్నారు. ప్రస్తుతం 3 వేల కోట్ల డాలర్లుగా ఉన్న వ్యవసాయ ఎగుమతులకు, వెయ్యి కోట్ల డాలర్ల ఎగుమతి సామర్థ్యం ఉందని ప్రభుత్వ అంచనా.  వ్యవసాయ ఎగుమతులను సరళీకరించడం ద్వారా అది అందుకు రోడ్ మ్యాప్‌ను సృష్టించింది. 

Related News