shriya

‘వీర భోగ వసంత రాయలు’ నుంచి శ్రియ ఫస్ట్‌లుక్

Updated By ManamFri, 07/20/2018 - 14:57

Shriya నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీ విష్ణు, శ్రియ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం ‘వీర భోగ వసంత రాయలు’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి శ్రియ ఫస్ట్‌‌లుక్‌ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. అందులో పొట్టి హెయిర్‌తో కొత్త లుక్‌లో శ్రియ అదరగొడుతోంది. ఈ పాత్రను దర్శకుడు ఇంద్రసేన కొత్తగా రూపొందించాడని, శ్రియ కెరీర్‌‌లో గుర్తుండిపోయే పాత్రలలో ఇది కూడా ఉంటుందని చిత్ర యూనిట్ తెలుపుతోంది. ఇక ఈ మూవీలో నారా రోహిత్ ఒక చేయి లేని వ్యక్తిగా కనిపించనుండగా.. శ్రీ విష్ణు గుండుతో, ఒంటినిండా టాటూలతో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే సుధీర్ కూడా ఓ డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.ప్రధానపాత్రలలో శ్రియ, నిహారిక.. ప్రారంభమైన చిత్రం

Updated By ManamMon, 06/18/2018 - 13:16

niharika శ్రియ, నిహారిక ప్రధాన పాత్రలలో ఓ చిత్రం తెరకెక్కనుంది. కొత్త దర్శకురాలు సుజనా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని రమేష్ కరుతూరితో కలిసి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ నిర్మించనున్నాడు.

ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుక తాజాగా హైదరాబాద్‌లో జరగగా.. ఆ కార్యక్రమానికి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, డైరెక్టర్ క్రిష్, రాజకీయ నాయకుడు గొట్టిముక్కల పద్మా రావ్, నిర్మాతలు రాజీవ్ రెడ్డి, సాయి బాబు తదితరులు ముఖ్య అథితులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ క్లాప్ కొట్టగా, తొలి షాట్‌కు క్రిష్ గౌరవ దర్శకత్వం వహించారు. పద్మారావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఇక ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించడం మరో విశేషం.

  • డైరెక్టర్: సుజనా
  • నిర్మాతలు: జ్ఞాన శేఖర్, రమేష్ కరుతూరి
  • బ్యానర్: క్రియా ఫిలిం కార్పొరేషన్, కాళీ ప్రొడక్షన్స్
  • సినిమాటోగ్రాఫర్:  జ్ఞాన శేఖర్
  • ఆర్ట్: జే. కె.మూర్తి


బాలయ్య మూవీకి ఆసక్తికర టైటిల్..?

Updated By ManamThu, 06/14/2018 - 10:55

balayya క్రిష్ దర్శకత్వంలో‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో నటించనున్న నందమూరి బాలకృష్ణ, ఆ తరువాత వినాయక్ డైరక్షన్‌లో ఓ చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పాడు. సి. కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ప్రస్తుతం దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ కోసం ఓ ఆసక్తికర టైటిల్‌ను అనుకుంటున్నట్లు ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం ‘ఏకే 47’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన శ్రియ, సంగీత దర్శకుడిగా దేవీ శ్రీ ప్రసాద్‌ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది.బాలయ్యతో నాలుగోసారి..

Updated By ManamTue, 05/15/2018 - 18:54

balakrishnaదివంగత ముఖ్యమంత్రి నంద‌మూరి తార‌క రామారావు బయోపిక్‌ను తెరకెక్కించడానికి మరింత సమయం పట్టేలా ఉంది. ఈ నేప‌థ్యంలో నందమూరి బాలకృష్ణ.. వి.వి.వినాయక్ దర్శకత్వంలో త‌న త‌దుప‌రి సినిమా చేయడానికి సిద్ధవువుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు.. ప్ర‌స్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో హీరోయిన్‌గా శ్రియా శరన్‌ను నటింపచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆమె ఎస్ చెప్పిందంటే.. బాలకృష్ణతో శ్రియా శరన్ నటించే నాలుగో చిత్రమిదే అవుతుంది. బాలకృష్ణ, వి.వి.వినాయక్, శ్రియ కాంబినేషన్‌లో ‘చెన్నకేశవరెడ్డి’ సినిమా రూపొందింది. తర్వాత బాలకృష్ణతో 'గౌతమిపుత్ర శాతకర్ణి', 'పైసా వసూల్' చిత్రాల్లో శ్రియ హీరోయిన్‌గా నటించింది.సెవెన్త్ వండ‌ర్స్ ( స్పెష‌ల్ ఆర్టిక‌ల్‌)

Updated By ManamThu, 05/03/2018 - 18:38

7th'రంగ‌స్థ‌లం'.. తెలుగు నాట వ‌సూళ్ళ వ‌ర్షం కురిపిస్తున్న తాజా చిత్రం పేరిది. 1980ల నాటి గ్రామీణ వాతావ‌ర‌ణంతో.. అక్క‌డి రాజ‌కీయాల నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమా.. ద‌ర్శ‌కుడిగా సుకుమార్ ప్ర‌తిభ‌ని మ‌రోసారి చాటింది. అంతేగాకుండా.. ఆయ‌న కెరీర్ బెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా.. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన 7వ చిత్రం. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. గ‌తంలో ప‌లువురు సినీ ప్ర‌ముఖుల ఏడో చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఇలానే సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా.. కెరీర్ బెస్ట్ హిట్‌గా నిల‌వ‌డ‌మో.. ట‌ర్నింగ్ పాయింట్‌గా నిల‌వ‌డ‌మో జ‌రిగిన సంద‌ర్భాలున్నాయి. అలాగే వారి కెరీర్‌లో మంచి విజ‌యాలు అందించ‌డ‌మో జ‌రిగింది.  ఓ సారి ఆ ప్ర‌ముఖుల 7వ సినిమాల‌ వైపు దృష్టి పెడితే..

నంద‌మూరి తార‌క రామారావు
న‌ట సార్వ‌భౌముడు ఎన్టీఆర్ సినీ ప్ర‌స్థానంలోనే కాదు, తెలుగు సినిమా చరిత్ర‌లోనూ 'పాతాళ భైర‌వి'ది చెర‌గ‌ని స్థానం. ఈ సినిమాలో తోట రాముడు పాత్ర‌లో ఆయ‌న చేసిన సంద‌డి అంతా ఇంతా కాదు. కె.వి.రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం అప్ప‌ట్లో సంచ‌ల‌న విజ‌యం సాధించింది. న‌టుడిగా ఈ సినిమా.. ఎన్టీఆర్‌కు ఏడ‌వ చిత్రం.

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు
మ‌హాన‌టుడు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు కెరీర్‌లో 'బాల‌రాజు' చిత్రం ప్ర‌త్యేకం. ఈ సినిమాతో న‌టుడిగా ఏఎన్నార్ స్థాయి మ‌రింత పెరిగింది.  విజ‌య‌వాడ‌లో ఏడాది పాటు ఆడిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వ‌ద్ద ప‌లు రికార్డుల్ని సృష్టించింది. ఈ సినిమా.. త‌న‌ కెరీర్‌లో ఏడ‌వ చిత్రం కావ‌డం విశేషం.

ప‌వ‌న్ క‌ల్యాణ్‌
ప‌వ‌న్ క‌ల్యాణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రాల‌లో 'ఖుషి' ఒక‌టి. ఆడియో ప‌రంగానూ.. సినిమా ప‌రంగానూ అనేక సంచ‌ల‌నాల‌కు కేంద్ర బిందువుగా నిలిచిన ఈ చిత్రం.. ప‌వ‌న్ ఇమేజ్‌ను అమాంతం ఎన్నో రెట్లు పెంచింది.  అలాంటి 'ఖుషి'.. ప‌వ‌న్ కెరీర్‌లో ఏడ‌వ సినిమా కావ‌డం విశేషం.

మ‌హేశ్ బాబు, భూమిక‌, గుణ‌శేఖ‌ర్‌
'ఒక్క‌డు'.. మ‌హేశ్ బాబు కెరీర్‌లో ట‌ర్నింగ్ పాయింట్‌లా నిలిచిన చిత్రం పేరిది. అప్ప‌టివ‌ర‌కు మ‌హేశ్‌కున్న ఇమేజ్‌ను పూర్తిగా మార్చివేయ‌డ‌మే కాకుండా.. రికార్డు స్థాయి వ‌సూళ్ళ‌ను మూట‌గ‌ట్టుకుంది. మ‌హేశ్‌కు స్టార్ డ‌మ్ తీసుకువ‌చ్చిన ఈ సినిమా.. ఆయ‌న కెరీర్‌లో ఏడ‌వ చిత్రం. అలాగే క‌థానాయిక భూమిక‌, ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ కెరీర్‌లోనూ ఇది ఏడో చిత్రం కావ‌డం విశేషం.

ఎన్టీఆర్‌
తాత‌య్య ఎన్టీఆర్‌కు ఏడ‌వ చిత్రం 'పాతాళ భైర‌వి' ఏ విధంగానైతే ట‌ర్నింగ్ పాయింట్‌లా నిలిచిందో.. అలాగే మ‌న‌వ‌డు ఎన్టీఆర్‌కు కూడా అత‌ని ఏడో చిత్రం మంచి బ్రేక్‌ను అందించిన సినిమా కావ‌డం యాదృచ్ఛిక‌మైనా ఓ విశేషంగానే చెప్పుకోవాలి. ఇంత‌కీ ఆ చిత్ర‌మేమిటంటే.. 'సింహాద్రి'. తార‌క్ ద‌శ‌ను, దిశ‌ను మార్చివేసిన ఈ సినిమా.. అప్ప‌ట్లో ఎన్నో సంచ‌ల‌నాల‌కు కేంద్ర బిందువుగా నిలిచింది.

రాజ‌మౌళి
'బాహుబ‌లి' సిరీస్‌తో ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ప్ర‌తిభాపాట‌వాలు ఖండాంత‌రాలు దాటినా.. ఆయ‌న కెరీర్‌ను కీల‌క మలుపు తిప్పిన సినిమా మాత్రం 'మ‌గ‌ధీర' అనే చెప్పాలి.  జాతీయ స్థాయిలో తెలుగు సినిమా కూడా విజువ‌ల్ ఎఫెక్ట్స్ ప‌రంగా ముందుందని చాటి చెప్పిన ఈ చిత్రం.. ద‌ర్శ‌కుడిగా రాజ‌మౌళి స్థాయిని అమాంతం పెంచింది. అలాంటి 'మ‌గ‌ధీర‌'.. రాజ‌మౌళి కెరీర్‌లో ఏడో చిత్రం కావ‌డం విశేషం.

శ్రియ‌
కేవ‌లం గ్లామ‌ర్ పాత్ర‌ల‌కే ప‌రిమితం కాకుండా.. ఆడ‌పాద‌డ‌పా అభిన‌యానికి పాత్ర‌ల్లోనూ క‌నిపించి మెప్పించిన క‌థానాయిక శ్రియ‌. 'సంతోషం'తో తొలి హిట్‌ను అందుకున్న శ్రియ‌.. బిగ్గెస్ట్ హిట్‌ను అందుకుంది మాత్రం చిరంజీవి హీరోగా న‌టించిన 'ఠాగూర్' సినిమాతోనే. న‌టిగా ఆమెకిది ఏడో చిత్రం కావ‌డం విశేషం.

స‌మంత‌
తొలి చిత్రం 'ఏమాయ చేసావె'తోనే విజ‌యం అందుకున్న స‌మంత‌కి.. క‌మ‌ర్షియ‌ల్ హీరోయిన్‌గా మంచి బ్రేక్ ఇచ్చిన చిత్రం మ‌హేశ్ బాబు హీరోగా న‌టించిన‌ 'దూకుడు'నే. తెలుగు, త‌మిళ భాష‌ల్లో అప్ప‌టికే ఆరు సినిమాల్లో న‌టించిన స‌మంత‌కు ఇది ఏడో సినిమా. మిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్‌లో సౌత్ క్వీన్‌గా నిలిచిన స‌మంత‌కు.. ఆ క్ల‌బ్‌లో తొలిసారిగా స్థాన‌మిచ్చిన చిత్రం కూడా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.

శ్రుతి హాస‌న్‌
లోక నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ త‌న‌య‌గా ప‌రిచ‌య‌మైన శ్రుతి హాస‌న్‌కు తెలుగు, హిందీ, త‌మిళ్‌.. ఇలా మూడు భాష‌ల్లో చేసిన మొద‌టి ఆరు సినిమాలు వ‌రుస‌గా ప‌రాజ‌యాల‌నే అందించాయి. ఇలాంటి స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ జోడీగా నటించిన 'గ‌బ్బ‌ర్ సింగ్' చిత్రం.. క‌థానాయిక‌గా ఆమె న‌టించిన ఏడో సినిమాగా విడుద‌లై ఆమెకు క‌మ‌ర్షియ‌ల్‌గా ఘ‌న‌విజ‌యాన్ని అందించింది. దీంతో.. 7 అనేది శ్రుతి ల‌క్కీ నెంబ‌ర్‌గా మారింది. ఇటీవ‌ల ట్విట్ట‌ర్‌లో త‌న ఫాలోవ‌ర్లు 7 మిలియ‌న్లకి చేరుకున్నాక‌.. 7 త‌న ల‌క్కీ నెంబ‌ర్ అంటూ మ‌రోసారి ప్ర‌స్తావించింది శ్రుతి.

వీరితో పాటు.. వెంక‌టేశ్ (శ్రీ‌నివాస క‌ళ్యాణం), రామ్ చ‌ర‌ణ్ (ఎవ‌డు), నాగ‌చైత‌న్య (మ‌నం), అనుష్క (ల‌క్ష్యం), కృష్ణ‌వంశీ (మురారి), పూరీ జ‌గ‌న్నాథ్ (అమ్మ‌ నాన్న ఓ త‌మిళ‌మ్మాయి), వి.వి.వినాయ‌క్ (లక్ష్మీ), ఎ.క‌రుణాక‌ర‌న్ (డార్లింగ్‌), దిల్ రాజు (కొత్త బంగారు లోకం), త్రివిక్ర‌మ్ (స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి) వంటి సినీ ప్ర‌ముఖుల‌కు కూడా వారి వారి ఏడో చిత్రాలు మంచి విజ‌యాలు అందించ‌డం విశేషం. ఏదేమైనా.. మ‌న సినీ ప్ర‌ముఖుల్లో చాలా మందికి ఏడో సినిమాలు 'సెవెన్త్ వండ‌ర్‌'గా నిల‌వ‌డం ప్ర‌త్యేక‌మైన విష‌యంగానే చెప్పుకోవాలి.                                                                                    -మ‌ల్లిక్ పైడివైరల్.. శ్రియ పెళ్లి ఫొటోలు, వీడియో

Updated By ManamTue, 03/20/2018 - 12:20

shriyaఅందాల నటి, కథానాయిక శ్రియ ఈ నెల 12న రష్యాకి చెందిన క్రీడాకారుడు, వ్యాపారవేత్త అయిన ఆండ్రి కొచ్చీవ్‌ను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెద్దల సమక్షంలో జరిగిన ఈ హిందూ సంప్రదాయ వివాహానికి అతి కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. ఈ పెళ్ళికి సినీ పరిశ్రమ నుంచి మనోజ్ బాజ్ పాయ్, షబానా అజ్మీ  అతిథులుగా విచ్చేశారు. వీరందరి సమక్షంలో ఈ జంట ఒక్కటయ్యారు. వీరి వివాహానికి సంబంధించి కొన్ని ఫొటోలతో పాటు పెళ్ళికి సంబంధించిన వీడియో ఒక‌టి ఇప్పుడు బయటకి వచ్చాయి. అవి ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో హల్ చల్ చేస్తున్నాయి. మరెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ ఫొటోలు, వీడియోపై ఓ  లుక్కేసేయండి.ప్రియుడిని పెళ్ళాడిన శ్రియ 

Updated By ManamSat, 03/17/2018 - 17:03

shriyaఅందాల తార‌ శ్రియ.. రష్యాకి చెందిన క్రీడాకారుడు ఆండ్రీ కొశీవ్‌ను పెళ్ళి చేసుకోబోతుందని గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. 17, 18, 19 తేదీల్లో మూడు రోజుల పాటు ఆమె వివాహానికి సంబంధించిన వేడుకలు జ‌రుగుతాయ‌ని ఆ మ‌ధ్య కొన్ని క‌థనాలు వినిపించాయి. అయితే.. మార్చి 12నే ఆమె పెళ్ళి జ‌రిగిన్నట్లు తెలుస్తోంది. ముంబయిలోని శ్రియ ఇంటిలో జ‌రిగిన ఈ వివాహ‌ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్ర‌మే హాజ‌ర‌య్యార‌ని స‌మాచారం. ఈ శుభ‌కార్యానికి చిత్ర పరిశ్రమ నుంచి మనోజ్ బాజ్‌పాయ్ దంపతులు, షబానా అజ్మీ వెళ్లినట్లు తెలుస్తోంది. పెళ్ళికి ముందు జరిగే పార్టీని మార్చి 11న నిర్వహించినట్లు సమాచారం. హిందూ సంప్రదాయం ప్రకారం జ‌రిగిన ఈ పెళ్ళిలో.. శ్రియ గులాబి రంగు చీరలో వ‌ధువుగా మెరిశారని తెలిసింది. వెంకీతో పాటు నారా రోహిత్ లుక్ కూడా..

Updated By ManamFri, 03/09/2018 - 22:35

nara rohithవిక్ట‌రీ వెంక‌టేశ్ క‌థానాయ‌కుడిగా తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఫిజిక్స్ ప్రొఫెస‌ర్‌గా వెంకీ న‌టిస్తున్న ఈ చిత్రంలో అత‌నికి జోడీగా శ్రియ క‌నిపించ‌నుంది. కాగా, ఈ రోజు (శుక్ర‌వారం) వెంకీ లుక్‌కు సంబంధించిన స్టిల్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. అది అఫీషియ‌ల్‌గా వ‌చ్చిందా లేక లీక్ అయ్యిందా అన్న విష‌యంపై క్లారిటీ రాక‌ముందే.. ఇందులో కీల‌క పాత్ర పోషిస్తున్న నారా రోహిత్ లుక్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇందులో రోహిత్ లుక్ ఇంప్రెసివ్‌గా ఉంద‌నే చెప్పాలి. మొత్త‌మ్మీద‌.. వీరి లుక్స్ మీద శ్ర‌ద్ధ తీసుకున్న తేజ క‌థ‌పైన కూడా శ్ర‌ద్ధ తీసుకుని ఉంటే గ‌నుక‌.. మ‌రో హిట్ త‌న ఖాతాలో ప‌డిన‌ట్టే. 'ఆటా నాదే వేటా నాదే' అనే పేరు ప్ర‌చారంలో ఉన్న ఈ మూవీ ఈ ఏడాది ద్వితీయార్థంలో తెర‌పైకి రానుంది.శ్రియ పెళ్ళిలో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ ఎవ‌రంటే..

Updated By ManamFri, 03/09/2018 - 20:47

shriya, sania meerjaమరి కొద్ది రోజుల్లో అందాల తార‌ శ్రియ పెళ్లి కూతురు కానున్న సంగ‌తి తెలిసిందే. రష్యాకి చెందిన క్రీడాకారుడు, వ్యాపారవేత్త అయిన ఆండ్రి కొస్చీవ్ తో ఈ నెల 17న ఏడడుగులు నడవనుంది ఈ సుందరి. ఉదయపూర్ (రాజస్థాన్)లో సంగీత్, మెహందీతో మొదలై.. హిందూ సంప్రదాయంలో ఈ వివాహం జరుగనుంది. మూడు రోజుల (17 నుంచి 19)పాటు జరిగే ఈ పెళ్లి వేడుక ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయని.. ప్ర‌స్తుతం శ్రియ షాపింగ్ ప‌నుల్లో బిజీగా ఉన్నట్టు ఇప్పటికే ఓ బాలీవుడ్ వెబ్ సైట్ ప్రచారం చేసింది.

ఇదిలా ఉంటే.. ఈ పెళ్లికి ప్రత్యేక ఆకర్షణగా టెన్నిస్ సంచలనం సానియా మీర్జా హాజరు కానుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈమెతో పాటు టాలీవుడ్, బాలీవుడ్ సెల‌బ్రిటీలు కూడా ఈ వివాహ వేడుక‌కు హాజరు కానున్నార‌ని స‌మాచారం. అయితే ఇంతవరకు శ్రియ తన పెళ్లిపై వస్తున్న వార్తల విషయంలో మౌనం వహిస్తోందే త‌ప్ప అటు ఖండించ‌నూ లేదు, ఇటు అంగీక‌రించ‌నూ లేదు. మౌనం అర్ధాంగీకారం అంటారు కదా.. అలా ఈ పెళ్ళి వార్త నిజ‌మేన‌ని ఆమె చెప్ప‌క‌నే చెబుతోందేమో. వెంకీతో పాటు శ్రియ‌కి కూడా..

Updated By ManamFri, 03/02/2018 - 22:56

venki, shriyaసీనియ‌ర్ క‌థానాయ‌కుడు విక్ట‌రీ వెంక‌టేశ్‌.. తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో వెంకీకి జోడీగా శ్రియ న‌టిస్తోంది.  అనూప్ రూబెన్స్ స్వ‌ర‌క‌ర్త‌. ఇదిలా ఉంటే..  మార్చి 12 నుంచి పాత‌బ‌స్తీ ప‌రిస‌ర ప్రాంతాల్లో ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంద‌ని స‌మాచారం. ఇందులో యువ క‌థానాయ‌కుడు నారా రోహిత్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తుండ‌గా.. అత‌ని సర‌స‌న ఈషా రెబ్బా క‌నిపించ‌నుందని తెలిసింది. కాగా, ఈ సినిమా న‌టుడిగా వెంకీకి 72వ చిత్రం కావ‌డం గ‌మ‌నార్హం. అంతేగాకుండా.. న‌టి శ్రియకి కూడా ఇది 72వ సినిమా కావ‌డం వార్త‌ల్లో నిలుస్తోంది. 'సుభాష్ చంద్ర‌బోస్‌', 'తుల‌సి' (ప్ర‌త్యేక గీతం), 'గోపాల గోపాల' త‌రువాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న నాల్గ‌వ చిత్ర‌మిది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా తెర‌పైకి రానుంది.

Related News