Amitabh Bachchan

‘బ్రహ్మాస్త్ర’ మొదటి పార్ట్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్

Updated By ManamTue, 11/13/2018 - 13:04
Brahmastra

అమితాబ్ బచ్చన్, రణ్‌బీర్ కపూర్, అలియా భట్ ప్రధానపాత్రలలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టాలీవుడ్ మన్మధుడు నాగార్జున ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. కాగా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర మొదటి భాగానికి విడుదల తేది ఖరారు అయ్యింది. క్రిస్మస్ కానుకగా వచ్చే ఏడాది డిసెంబర్‌లో ఈ చిత్ర మొదటి భాగం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా.. కరణ్ జోహార్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.‘లాయర్ కోట్’ ఎంత పనిచేసింది?

Updated By ManamFri, 11/02/2018 - 11:40
  • అమితాబ్‌కు లీగల్ నోటీసులు 

Amitabh Bachchan Served Legal Notice by Bar Council of Delhi

న్యూఢిల్లీ : సాధారణంగా వాణిజ్య ప్రకటనల్లో నటించేవారు  టీచర్, డాక్టర్, లాయర్...ఇలా వివిధ వృత్తుల్లో రాణిస్తున్నట్లు చూస్తూనే ఉంటాం. అయితే ఇక నుంచి యాడ్స్‌లో నటించేవాళ్లు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిందే. లేకుంటే బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్‌లా నోటీసులు అందుకోవాల్సిందే. ఇంతకీ అసలు విషయం ఏంటంటే... అమితాబ్ నటించిన ‘ఎవరెస్ట్ మసాలా’ యాడ్‌పై ఢిల్లీ బార్ కౌన్సిల్ సీరియస్ అయింది. 

ఆ యాడ్‌లో ఆయన లాయర్ కోట్ ధరించడాన్ని బార్ కౌన్సిల్ తప్పుబట్టింది. అనుమతి లేకుండా లాయర్ కోట్ వినియోగించడాన్ని ఆక్షేపిస్తూ ...అమితాబ్‌కు లీగల్ నోటీసులు పంపింది. అంతేకాకుండా ఆ యాడ్‌ను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేసింది. అలాగే అమితాబ్‌తో పాటు ఎవరెస్ట్‌ మసాలా, యూట్యూబ్‌, ఓ మీడియా సంస్థకు బార్ కౌన్సిల్ నోటీసులు పంపిస్తూ...పదిరోజుల్లోగా స్పందించాలని సూచించింది. అయితే ఈ నోటీసులుపై అమితాబ్ ఇంకా స్పందించలేదు.మోహన్‌లాల్ కోసం బిగ్‌బీ, ఎన్టీఆర్..?

Updated By ManamFri, 10/26/2018 - 13:27
Mohanla, Amitabh Bachchan, NTR

మలాయళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘ఓడియన్’. సోషియా ఫాంటసీ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. డిసెంబర్ 14న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కాగా మలయాళంలో పాటు ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీలలో విడుదల చేయాలని భావిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ఆయా ఇండస్ట్రీలలో ప్రముఖుల చేత ఈ మూవీకి వాయిస్ ఓవర్ ఇప్పించాలని చిత్ర యూనిట్ భావిస్తుందట. ఇందులో భాగంగా తెలుగులో ఎన్టీఆర్, హిందీలో అమితాబ్, మలయాళంలో మమ్ముట్టి చేత వాయిస్ ఓవర్ చెప్పించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా ఈ చిత్రంలో మోహన్‌లాల్ సరసన మంజువారియర్ నటించగా.. ప్రకాశ్ రాజ్, శరత్ కుమార్, సిద్ధిఖీ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు.‘సైరా’పై రత్నవేలు ట్వీట్

Updated By ManamMon, 10/15/2018 - 14:36

Sye Raa Narasimha Reddyమెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం జార్జియాలో జరుగుతోంది.

అక్కడ సినిమా క్లైమాక్స్ యుద్ధ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని సినిమాటోగ్రాఫర్ రత్నవేలు సోషల్ మీడియాలో తెలిపారు. జార్జియాలో నా టీంతో కలిసి సైరా భారీ క్లైమాక్స్ యుద్ధ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నాం అని తెలిపాడు. కాగా ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, నయనతార, విజయ్ సేతుపతి, సుదీప్, తమన్నా, నిహారిక తదితరులు కీలక పాత్రలలో కనిపిస్తుండగా.. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

 మీటూ: ఇబ్బందుల్లో బిగ్‌బీ

Updated By ManamSat, 10/13/2018 - 10:29

Amitabh Bachchanబాలీవుడ్‌లో  మీటూ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తమపై అసభ్యంగా ప్రవర్తించిన దర్శకులు, నిర్మాతలు, నటుల పేర్లను పలువురు బయటపెడుతున్నారు. ఈ క్రమంలో వారికి కొంతమంది మద్ధతు ఇస్తుండగా.. మరికొందరు ఎలాంటి స్పందనను ఇవ్వడం లేదు. కాగా ఈ మీటూ ఉద్యమంలో తాజాగా బాలీవుడ్‌ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ పేరు కూడా వినిపిస్తోంది.

ఇటీవల మీటూపై అమితాబ్ బచ్చన్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. దానికి బాలీవుడ్ హెయిర్ స్టైలిస్ట్ సప్నా భవ్నాని స్పందిస్తూ.. ‘‘ఇది చాలా పెద్ద అబద్ధ:. మీరు నటించిన పింక్ వచ్చి, వెళ్లింది. అలాగే త్వరలోనే మీకున్న సామాజిక వేత్త అనే పేరు కూడా పోతుంది. మీకు సంబంధించిన నిజాలు త్వరలోనే బయటకు వస్తాయి. నా ట్వీట్ చదివిన వెంటనే మీరు గోళ్లు కొరుక్కుంటారని అనుకుంటున్నా. కానీ మీరు కొరుక్కోవడానికి మీ గోళ్లు సరిపోవు’’ అంటూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా ‘‘బచ్చన్ లైంగిక వేధింపులకు సంబంధించి చాలా కథలు విన్నాను. ఆ స్త్రీలంతా బయటకు వస్తారని భావిస్తున్నా. అతడి హిపోక్రసీకి ముగింపు పలకాలి’’ అంటూ ట్వీట్ చేశారు. అయితే సప్నా చేసిన ట్వీట్‌ను చూసిన నెటిజన్లు బిగ్‌బీ గురించి ఎలాంటి ఆరోపణలు బయటపడుతాయో అంటూ మాట్లాడుకుంటున్నారు.

 ‘సైరా’ సెట్‌లో విజయ్ సేతుపతి, సుదీప్

Updated By ManamThu, 10/11/2018 - 11:59

Vijay Sethupathi, Kudeepఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి, కన్నడ సూపర్‌స్టార్ సుదీప్ కీలకపాత్రలలో కనిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ఇద్దరు ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొనగా.. దానికి సంబంధించిన ఓ లుక్ బయటకు వచ్చింది. అందులో విజయ్, సుదీప్ గెటప్ అందరినీ ఆకట్టుకుంటోంది. కాగా ఈ చిత్రంలో విజయ్, నరసింహారెడ్డి నమ్మిన బంటు ఓబయ్య అనే పాత్రలో కనిపిస్తుండగా.. సుదీప్ అవకు రాజగా నటించనున్నాడు. 

ఇక ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ జార్జియాలో జరుగుతోంది. అక్కడ భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ప్రధాన తారాగణం అందులో పాల్గొంది. చిరంజీవి, అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, జగపతిబాబు, విజయ్ సేతుపతి, సుదీప్ తదితర భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.‘గోసాయి వెంకన్న’గా బిగ్‌బీ.. టీజర్ విడుదల

Updated By ManamThu, 10/11/2018 - 08:17
Amitabh Bachchan

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. స్వాతంత్ర్యసమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి గురువు గోసాయి వెంకన్నగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటించారు. ఇవాళ బిగ్‌బీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో అతడికి సంబంధించిన ఫస్ట్‌లుక్ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అందులో పవర్‌ఫుల్ లుక్‌లో వాహ్వా అనిపిస్తున్నాడు అమితాబ్. ఇక ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.అమితాబ్ సైరా లుక్ ఎప్పుడంటే

Updated By ManamTue, 10/09/2018 - 11:28

Amitabh Bachchanద‌క్షిణాది బాలీవుడ్ బిగ్ బి న‌టిస్తున్న చిత్రం సైరా న‌ర‌సింహా రెడ్డి. మెగాస్టార్ చిరంజీవి 151 వ చిత్రంగా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి పాత్ర‌లో చిరంజీవి క‌నిపించ‌నున్నారు. సురేందర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో చిరు గురువు పాత్ర‌లో అమితాబ్ న‌టిస్తున్నారు. అమితాబ్‌తో పాటు న‌య‌న‌తార‌, విజ‌య్ సేతుప‌తి, కిచ్చాసుదీప్‌, జ‌గ‌ప‌తిబాబు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ధారులు. ఈ చిత్రంలో న‌టీన‌టుల పుట్టిన‌రోజుల సంద‌ర్భంగా వారి లుక్స్‌ను విడుద‌ల చేస్తున్నారు. ఇప్ప‌టికే సుదీప్ లుక్‌ను విడుద‌ల చేశారు. కాగా అక్టోబ‌ర్ 11న బాలీవుడ్ బిగ్ బి పుట్టిన‌రోజు .. ఈ సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 10నే అమితాబ్‌లుక్‌ను విడుద‌ల చేయ‌డానికి చిత్ర యూనిట్ స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. జార్జియాకు చిరు

Updated By ManamMon, 10/08/2018 - 11:40
Chiranjeevi

సై సైరా!.. న‌ర‌సింహారెడ్డి అంటూ పాలెగాడు పాత్ర‌లో మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న సినిమా `సైరా న‌ర‌సింహారెడ్డి`. ఆంగ్లేయుల‌కు ఎదురుతిరిగిన తొలి పాలెగాడు న‌ర‌సింహారెడ్డి. ఆయన గురువు పాత్ర‌లో అమితాబ్ బ‌చ్చ‌న్ న‌టిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా జార్జియాలో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ఇప్ప‌టికే డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి స‌హా జ‌గ‌ప‌తిబాబు, నిహారిక మెయిన్ క్రూ అంతా జార్జియా చేరుకున్నారు. ఇప్పుడు చిరంజీవి జార్జియాకు ప‌య‌న‌మైయ్యారు. మ‌ధ్య‌లో రామ్‌చ‌ర‌ణ్‌తో అజ‌ర్‌బైజాన్‌లో కొన్ని రోజులు గ‌డిపిన చిరు ఈ షెడ్యూల్‌లో యాక్ష‌న్ సీన్స్‌లో న‌టించ‌డానికి సిద్ధ‌మైపోయారు. రామ్‌చ‌ర‌ణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. బిగ్‌బీ మాటలు బాధించాయి.. బాలీవుడ్‌కు గుడ్‌బై

Updated By ManamMon, 10/01/2018 - 14:19

Tanushree Dutta, Amitabhమెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అన్న మాటలు బాధించాయని, బాలీవుడ్ నుంచి వెళ్లిపోతాను అంటూ నటి తనుశ్రీ దత్తా వ్యాఖ్యలు చేసింది. ఇటీవల నటుడు నానా పటేకర్‌ తనను లైంగికంగా వేధించాడు అంటూ తనుశ్రీ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ విషయంలో కొందరు నటీనటులు తనుశ్రీకి మద్దతు పలికారు. అయితే ఇదే విషయంపై అమితాబ్‌ను ప్రశ్నించగా.. నా పేరు తనుశ్రీ కాదు, నేనేం నానా పటేకర్‌ను కాదు. అలాటప్పుడు ఎలా స్పందిస్తాను అంటూ అన్నారు.

దీనిపై తనుశ్రీ స్పందిస్తూ.. ‘‘అమితాబ్ అన్న మాటలు నన్ను చాలా బాధించాయి. సినిమాల్లో ఎన్నో పాత్రలు పోషిస్తారు. ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతారు. కానీ కళ్లెదుట జరుగుతున్న దారుణాల గురించి మాత్రం స్పందించరు. ఇక నేను బాలీవుడ్‌లోకి మళ్లీ తిరిగి రాను. నాకు అమెరికా పౌరసత్వం ఉంది. అక్కడికే వెళ్లిపోతాను. 30, 40 సినిమా అవకాశాలు వచ్చినా వదులుకున్నాను’’ అని వెల్లడించారు.

Related News