TDP MLA

‘నిజాయితీగా రాజకీయాలు చేస్తున్నా’

Updated By ManamThu, 09/06/2018 - 17:27
bandaru satyanarayana murthy

అమరావతి : తన ఆస్తులపై బహిరంగ చర్చకు సిద్ధమని టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి సవాల్ విసిరారు. ఆయన గురువారమిక్కడ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ‘నేను నిజాయితీగా రాజకీయాలు చేస్తున్నా. నా ఆస్తులు ఎక్కడ పెరిగాయో చూపించాలి. విశాఖలో ల్యాండ్ ఫూలింగ్ ఆపాం. వైఎస్ జగన్ పాదయాత్రకు ఆదరణ లేదు.

పాదయాత్రకు ప్రజలు రాకపోవడంతో నిరాశతో ఉన్నారు. ఆయన తండ్రి అవినీతిని మేము శుద్ధి చేస్తున్నాం. ఫార్మా సిటీ వల్ల కలుషితం అవుతుందని జగన్ అసత్యాలు చెబుతున్నాడు. చెరువులు, భూములు కబ్జా చేశానని నాపై ఆరోపణలు చేస్తున్నాడు. అధికార దాహం కోసమే ఆయన పాదయాత్ర చేస్తున్నాడు.’ అని ధ్వజమెత్తారు.మళ్లీ తడబడిన బికామ్‌లో ఫిజిక్స్ ఎమ్మెల్యే..!

Updated By ManamFri, 08/31/2018 - 15:00
  • జగన్‌ను విమర్శించబోయి తప్పులో కాలేసిన జలీల్ ఖాన్..

  • నారా హమారా.. టీడీపీ హమారా కార్యక్రమంలో వ్యాఖ్యలు..

TDP MLA, Jaleel Khan, tongue slip, Nara Hamara TDP hamara, Gunturవిజయవాడ: బికామ్‌లో ఫిజిక్స్ చదివిన ఎమ్మెల్యే అనగానే టక్కున గుర్తుచ్చే పేరు జలీల్ ఖాన్. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేగా ప్రస్తుతం వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా ఆయన మాట్లాడే విధానంతో అందరిని కడుపుబ్బా నవ్విస్తారు. జలీల్ ఖాన్ ఎప్పుడు మీటింగ్‌ల్లో పాల్గొన్న ఆయన మాటల్లో తడబాటుతో తప్పులో కాలేసి చిక్కుల్లో పడుతుంటారు. తాజాగా గుంటూరులో ఏర్పాటు చేసిన ‘టీడీపీ హమారా.. నారా హమారా..’ కార్యక్రమంలో మైనార్టీల సమస్యలపై జలీల్ ఖాన్ మాట్లాడుతూ మరోసారి తప్పులో కాలేశారు. టీడీపీ చేపట్టిన కార్యక్రమాలను ప్రస్తావిస్తూ ప్రసంగం మొదలు పెట్టిన జలీల్ ఖాన్.. కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌సీపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. గతంలో 125 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ ముస్లింలకు చేసింది ఏమి లేదని విమర్శించిన ఆయన.. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించబోయి తడబడ్డారు. ‘రాయలసీమలో ముస్లింలను ఎదగకుండా చూసిన చరిత్ర రాజశేఖర్ రెడ్డి వాళ్ల నాన్న.. జగన్ మోహన్ రెడ్డిది..’ అనడంతో ఒక్కసారిగా నవ్వులు పూశాయి. బికామ్‌లో ఫిజిక్స్ ఉన్నట్టుగానే.. వైఎస్సార్‌కు జగన్ మోహన్ రెడ్డి నాన్న అంటూ మరోసారి హ్యాస్యాన్ని పండించారు.

తుని తరహాలో గొడవకు వైసీపీ పథకం..
అదేవిధంగా శనివారం అమరావతిలో జరిగిన నారా హమారా.. టీడీపీ హమారా కార్యక్రమంలో మాట్లాడుతూ.. తుని ఘటన తరహాలో గొడవ చేసేందుకు వైసీపీ పథకం రచిస్తోందని జలీల్ ఖాన్ మండిపడ్డారు. ప్రత్యర్థి పార్టీల్లో అల్లర్లు చేయడం జగన్‌కే కాదు.. ఆయన తాత, తండ్రీకి అలవాటేనని విమర్శించారు. జగన్ అధికారంలోకి వస్తే ఫ్యాక్షనిజం పెరుగుతుందని జలీల్ ఖాన్ విరుచకపడ్డారు. కాగా, 2004లో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ జెండాపై గెలిచిన జలీల్ ఖాన్.. చంద్రబాబు ఆకర్ష్ మంత్రంతో రాత్రికి రాత్రే టీడీపీ తీర్థం పుచ్చేసుకున్నారు. చంద్రబాబు కేబినెట్‌‌లో మైనార్టీ శాఖ ఖాళీగా ఉండటంపై కన్నేసిన జలీల్ ఖాన్.. రాజీనామా చేయకుండా టీడీపీలోకి జంప్ చేసి ఫిరాయింపు ఎమ్మెల్యేగా పార్టీలో కొనసాగుతున్నారు. జగన్‌కు టీడీపీ ఎమ్మెల్యే సవాల్

Updated By ManamTue, 07/31/2018 - 21:18

varmaతూర్పుగోదావరి: వైఎస్ఆర్‌సిపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిఠాపురంలో పాదయాత్రలో భాగంగా స్థానిక ఎమ్మెల్యేపై పలు ఆరోపణలు చేశారు. జగన్ ఆరోపణలపై టీడీపీ ఎమ్మెల్యే ఎస్వీయస్ఎన్ వర్మ మండిపడ్డారు. శ్రీపాద శ్రీవల్లభ దేవస్థానం, చెరువుల విషయంలో ఒక్క పైసా అవినీతి జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నారు. ఒక వేళ ఆరోపణలు నిరూపించలేకుంటే జగన్ రాజీనామా చేయాలి అని సవాల్ విసిరారు. సెజ్ భూములను తక్కువగా రేట్లకే దోచుకున్నది, పిఠాపురంలో ఇళ్ల పట్టాలు అమ్ముకున్నది మీ అనుచరులు కాదా? అని ఆయన వైసీపీ అధిపతికి సూటి ప్రశ్న సంధించారు.బాలయ్య ఇంటి వద్ద అభిమానుల సందడి

Updated By ManamSun, 06/10/2018 - 13:27

Balakrishna, TDP MLA, Nandamuri balakrishna, Flexies, Jai balaiahహైదరాబాద్‌: అభిమాన హీరో పుట్టినరోజు అంటే వారి అభిమానులకు పండుగ వాతావరణమే. ప్రముఖ సినీనటుడు, నందమూరి నట సింహాం, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్దసంఖ్యలో అభిమానులు ఆయన నివాసానికి తరలివచ్చారు. అర్ధరాత్రి జూబ్లిహిల్స్‌లోని బాలయ్య ఇంటికి చేరుకున్న అభిమానులు ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. బాలయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. జై బాలయ్య అంటూ నినాదాలతో హోరెత్తించారు.2019 తర్వాత బీజేపీ ఉంటుందో.. లేదో?

Updated By ManamTue, 03/06/2018 - 14:46

Will  BJp live In Andhrapradesh 2019 Elections? అమరావతి: విశాఖ రైల్వేజోన్ వ్యవహారమై టీడీపీ ఎమ్మెల్యే గణేష్ చేసిన వినూత్న నిరసన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. దీంతో బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తుండటంతో ఎమ్మెల్యే గణేష్ మీడియాతో మాట్లాడుతూ వివరణ ఇచ్చారు. రైల్వేజోన్‌పై పోరాటానికి మద్దతిస్తామని  ఆయన స్పష్టం చేశారు.

" ధర్నాకు వచ్చిన వారిని రౌడీలు అంటారా?. నిరసన రాజ్యాంగం ఇచ్చిన హక్కు. 2019 తర్వాత బీజేపీ ఉంటుందో లేదో ఎవరికీ తెలియదు. బీజేపీ వైపు వేలెత్తి చూపితే ఏ1 నిందితుడు అంటారా?.  నేను డిఫెన్స్‌లో పనిచేశా.. కేసులు, ప్రాణాలకు భయపడను. ఏ 1 నిందితుడు వైసీపీ అధినేత జగన్‌కు ప్రధాని మోదీ వెంటనే అపాయిట్మెంట్ ఎలా ఇస్తారు..?. కేసులున్న సీకే బాబును బీజేపీ ఎలా చేర్చుకుంది?." అని గణేష్ బీజేపీపై ప్రశ్నల వర్షం కురిపించారు.కేంద్రం తీరుకు నిరసనగా ‘బోడె’ గుండు

Updated By ManamThu, 02/08/2018 - 13:14

TDP MLA Bode Prasad bald for centre oppositionవిజయవాడ: కేంద్రం తీరుకు నిరసనగా వామపక్షాలు ఇచ్చిన బంద్‌‌ దాదాపు విజయవంతమైందని చెప్పుకోవచ్చు. గురువారం తెల్లవారుజాము నుంచి ఏపీ వ్యాప్తంగా వామపక్షాలు, టీడీపీ, వైసీపీ, జనసేన, ప్రజా సంఘాలు నిరసనలు, ఆందోళనతో హోరెత్తించాయి.

విజయవాడలో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రం వైఖరికి నిరసనగా నడిరోడ్డుపై బోడె ప్రసాద్ గుండుకొట్టించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. పార్లమెంట్ సాక్షిగా, కేంద్రం వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. మరోవైపు హామీలు నెరవేర్చకపోతే నిరసనలు, ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని వామపక్షాలు హెచ్చరిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఢిల్లీలో ఏపీకి చెందిన వైసీపీ, టీడీపీ ఎంపీలు నాలుగురోజులుగా నిరసనలతో హోరెత్తిస్తున్న విషయం తెలిసిందే.

వినూత్న నిరసన తెలిపిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వీడియోను ఈ దిగువున వీక్షించండి...

Related News