priyanka chopra

ఈసారి మాట నిలబెట్టుకుంటుందా?

Updated By ManamTue, 09/18/2018 - 03:33

imageభారీ కట్టడాలు.. కాస్ట్యూమ్స్‌తో సినిమాలను రూపొందించే దర్శక నిర్మాత సంజయ్ లీలా బన్సాలి. ఇప్పుడు ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో ఓ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ ఏడాది చివరలో సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి. హుస్సేన్ జైద్ ‘మాఫియా క్వీన్ ఆఫ్ ముంబై’ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది.

ఈ చిత్రానికి ‘హీరా మండి’ అనే టైటిల్ పెట్టాలని సంజయ్ భావిస్తున్నారట. అయితే సల్మాన్‌ఖాన్ భరత్ సినిమాలో నటిస్తానని చెప్పి.. చివరి నిమిషంలో ప్రియాంక తప్పుకుని సదరు సినిమా దర్శక నిర్మాతలకు సమస్యలు క్రియేట్ చేసింది. మరిప్పుడు సంజయ్‌ులీలా బన్సాలి ప్రియాంకతో సినిమా చేయాలనుకుంటున్నారు. ఈయనకైనా ప్రియాంక మాట తప్పకుండా సినిమా చేస్తే బావుంటుందని బాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నారు.మా ఇద్దరి మధ్య ప్రేమ ఎలా కలిగిందంటే

Updated By ManamTue, 09/11/2018 - 10:06

Priyanka Chopra, Nick Jonasగత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్న బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా, హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్ ఇటీవలే నిశ్చితార్ధం చేసుకొని తమ బంధాన్ని బలపరుచుకున్నారు. అయితే అసలు వారు ఎలా పరిచయం అయ్యారు..? వారిద్దరి మధ్య ప్రేమ ఎప్పుడు కలిగింది,  అనే విషయాలు పెద్దగా ఎవరికీ తెలీవు. వీటి గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు నిక్ జోనస్.

ప్రియాంక, తను కామన్‌ ఫ్రెండ్స్ ద్వారా మీట్ అయ్యామని.. ఫస్ట్‌ మెసేజ్‌లతో సాగిన తమ బంధం ఆ తరువాత ఫోన్ కాల్స్‌తో ప్రేమ వరకు వచ్చిందని తెలిపాడు. ఇక తాము పర్సనల్‌గా కలవడానికి ఆరు నెలల సమయం పట్టిందని, ఫస్ట్‌ టైమ్ తామిద్దరం మెట్ గాలా ఈవెంట్‌లో కలిశామని పేర్కొన్నాడు. మొదట్లో మేమిద్దరం మంచి స్నేహితులుగానే ఉండేవారిమని, కానీ తమ మధ్య ఏదో ఉందని తమ స్నేహితులు అనుకుండేవారని చెప్పుకొచ్చాడు. అయితే ఐదు నెలల క్రితమే తమ రిలేషన్‌షిప్ పట్ల తాము సీరియస్‌గా ఉన్నామని ఫీల్ అయ్యామని, ఆ తరువాత వెంటనే ఎంగేజ్ అయిపోయామని నిక్ చెప్పాడు. ఇక ఇద్దరికీ కలిపి ప్రిక్ అని పెట్టిన పేరు తనకు నచ్చిందని అన్నారు. ఇదిలా ఉంటే ఈ ఇద్దరి పెళ్లి మాత్రం ఇప్పట్లో ఉండదని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రియాంక చిత్రాలతో బిజీగా ఉంది. దీంతో వీరిద్దరు వివాహం చేసుకోవడానికి మరో రెండేళ్లు పడచ్చు అని వార్తలు వినిపిస్తున్నాయి.ప్రియాంక పెళ్లి ఎక్కడో తెలుసా...!!

Updated By ManamWed, 08/22/2018 - 21:41

Priyanka Chopra

ప్రియాంక.. ప్రియాంక ఎవరు చూసినా ఈ ముద్దుగుమ్మ పెళ్లెప్పుడు...? ఎక్కడ చేసుకుంటున్నది? అనే విషయంపై అభిమానులు మొదలుకుని నెటిజన్ల వరకూ అందరూ చర్చించుకుంటున్నారు. నిశ్చితార్థం ఇటీవల అయిపోయింది కానీ పెళ్లెప్పుడనే విషయం మాత్రం తెలియరాలేదు. దీంతో ఆమె అభిమానులు ఎప్పుడు ప్రకటిస్తారా అని వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. అయితే ప్రియాంక్-నిక్‌ల పెళ్లిపై ఎట్టకేలకు చిన్నపాటి క్లారిటీ వచ్చేసింది. సెప్టెంబర్‌ చివర్లో లేదా అక్టోబర్ చివరి నెలలో ప్రియాంక పెళ్లి జరగనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాదు ఇప్పటికే పెళ్లి ఎక్కడ జరపాలి అనే విషయంపై ప్రియాంక-నిక్ కుటుంబాలు చర్చించుకున్నాయని తెలుస్తోంది. అమెరికాలోని హవాయి దీవులంటే నిక్‌కు ఎనలేని ఇష్టమట. అందుకే నిక్ ఇష్టమైన ప్రదేశంలోనే పెళ్లి జరపాలని కుటుంబీకులు అనుకున్నారట. ఈ విషయం ప్రియాంక చెవిన వేయగా ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. దీంతో పెళ్లి అక్కడే జరపాలని ఫిక్స్ చేసుకున్నారని తెలుస్తోంది. 

Priyanka Chopra

ఇప్పటికే అక్కడ వేదిక, గెస్ట్ రూమ్స్ బుక్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అతిథులుగా ఎవర్ని పిలవాలి..? సినీ, రాజకీయ ప్రముఖులను ఎవరెవర్ని పిలవాలి? అనే విషయమై లిస్ట్ తయారు చేసే పనిలో ప్రియాంక ఫ్యామిలీ నిమగ్నమైందని సమాచారం. అక్కడ పెళ్లయిపోయిన తర్వాత ముంబైలో గ్రాండ్‌గా పార్టీ  స్నేహితులు, ఇండస్ట్రీలోని ప్రముఖులకు పార్టీ ఇవ్వాలని భావిస్తున్నారట. కాగా మీడియాకు చాలా దూరంగా పెళ్లి వేడుక నిర్వహించాలని ఈ జంట భావిస్తోందట. వేడుక అనంతరం కొన్ని ఫొటోలు, వీడియోలను అభిమానులను పంచుకోవాలనుకుంటున్నారట. అయితే మీడియా కంట పడకుండా ఎంత మాత్రం సీక్రెట్ పెళ్లి జరుపుతారో చూడాల్సిందే మరి.

Priyanka Chopra And Nick Jonas' Wedding Destination Revealed

మొత్తానికి చూస్తే.. ఈ జంట ప్రేమ మొదలుకుని పెళ్లి వరకూ అన్నీ మూడో కంటికి తెలియకుండానే చేసుకోవాలని భావిస్తున్నప్పటికీ మీడియాలో మాత్రం లీకవుతూనే ఉన్నాయి. ప్రేమలో మునిగి తేలుతున్నప్పుడు హోటళ్లలో, ఎయిర్‌పోర్టులో వీరిరివురు మీడియా కంట పడ్డ సందర్భాలు కోకొల్లలు. అయితే పెళ్లి ఎలా జరుగుతుంది..? కేవలం ఇరు కుటుంబీకుల మధ్యనే వేడుక జరుగుతుందా లేకుంటే బాలీవుడ్ తరలివస్తుందా? అనేది మాత్రం తెలియరాలేదు. కాగా మీడియా, అభిమానులకు దూరంగా పెళ్లి చేసుకోవాలన్నది విరుష్క (విరాట్- అనుష్క) జంటతో ట్రెండ్ మొదలయిన సంగతి తెలిసిందే.

Priyanka Chopra And Nick Jonas' Wedding Destination Revealedనెట్టింట్లో హల్‌చల్ చేస్తున్న ప్రియాంక-నిక్‌ల వీడియో!

Updated By ManamSun, 08/19/2018 - 16:44

Exclusive : Priyanka Chopra and Nick Jonas dancing together in their engagement party

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా అమెరికన్ సింగర్‌ నిక్ జోనస్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన సంగతి తెలిసిందే. ఆ ప్రేమ కాస్త పెళ్లి దాకా వెళ్లింది. ఇటీవల తన కుటుంబ సభ్యులతో ముంబాయ్ వచ్చిన నిక్.. ప్రియాంక కుటుంబీకులతో మాట్లాడి పెద్దలను ఒప్పించారు. మొత్తానికి ప్రియాంక-నిక్‌ల వివాహానికి పెద్దలు ఎలాంటి అడ్డు చెప్పకపోవడంతో నిశ్చితార్థం తంతు మాత్రం ముగిసిపోయింది. అయితే ఇక మిగిలింది పెళ్లి మాత్రమే.

శనివారం నాడు నిక్-ప్రియాంకల నిశ్చితార్థం గ్రాండ్‌గా జరిగింది. ప్రియాంక స్వగృహంలోని దగ్గరి బంధువులు, కొందరు ముఖ్యమైన సెలబ్రటీల మధ్య ఈ వేడుక జరిగింది. ఈ శుభకార్యం భారతీయ సంప్రదాయంలో జరిగింది. పసుపు రంగు దుస్తుల్లో ప్రియాంక మెరిసిపోగా.. నిక్‌ మాత్రం అమెరికన్ సంప్రదాయం ప్రకారమే కుర్తా పైజామా ధరించాడు. ఇద్దరూ కలిసి వినాయక పూజలో పాల్గొన్నారు. ఈ కార్యానికి సంబంధించిన ఫొటోలను నిక్‌, ప్రియాంక ఇద్దరూ వారి ఇన్‌స్టాగ్రామ్‌ల్లో పోస్ట్ చేశారు. అయితే ఈ కార్యక్రమానికి వచ్చిన ఒకరు ఈ వేడుకను మొత్తం కెమెరాలో బంధించారు. ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

 

A post shared by Priyanka Chopra (@priyankachopra) on

వీడియోలో ఏముందంటే...
వీడియోలో ప్రియాంక చోప్రా స్టెప్పులేస్తూ దుమ్ములేపుతుండగా.. నిక్ ఆమె వైపు వేలు చూపిస్తూ ఎస్.. ఎస్ అంటున్నట్లుగా తల ఊపుతున్నాడు. ప్రియాంక పక్కనున్న మరో నటి కూడా ఆమెతో పాటుగా డ్యాన్స్ చేస్తోంది. ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నిక్, ప్రియాంక అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఎట్టకేలకు ఇద్దరూ ఒక్కటయ్యారు.. అయ్యారు కాదూ సగం పెళ్లి అయినట్లేనని కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ జంటకు బాలీవుడ్‌ తారలంతా వెల్లువలా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రియాంక సోదరి పరిణీతి చోప్రా, సల్మాన్‌ ఖాన్‌ సోదరి అర్పితా ఖాన్‌ శర్మ, నటుడు, నిర్మాత ముస్తక్‌ షైయక్‌ తదితరులు హాజరయ్యారని తెలుస్తోంది.

 

A post shared by Nick Jonas (@nickjonas) on

 ప్రియాంక ఇంట మొదలైన సంబరాలు

Updated By ManamSat, 08/18/2018 - 13:13

Priyanka Chopraబాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇంట్లో సంబరాలు మొదలయ్యాయి. గత నెలలో నిక్ జోనస్‌తో ప్రియాంక ఎంగేజ్‌మెంట్ అవ్వగా.. తాజాగా శనివారం ఇరు కుటుంబాల సమక్షంలో భారతీయ సంప్రదాయాల ప్రకారం మరోసారి నిశ్చితార్థం చేసుకోనున్నారు. ఇందుకోసం నిక్ జోనస్ కుటుంబం ఇప్పటికే ముంబైకి చేరకుంది.

ఇదిలా ఉంటే ఈ రోజు పది గంటల సమయంలో ప్రియాంక ఇంటిలో పూజలు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.  ఈ కార్యక్రమం అనంతరం విందు కార్యక్రమం, సాయంత్రం ఎంగేజ్‌మెంట్ పార్టీ ఉండనుందని తెలిసింది. ఇక సాయంత్రం జరిగే ఎంగేజ్‌మెంట్ పార్టీకి ప్రియాంకకు క్లోజ్‌గా ఉన్న బాలీవుడ్ ప్రముఖులు రానున్నట్లు సమాచారం.కుటుంబంతో ఇండియాకు వస్తున్న నిక్ జోనస్

Updated By ManamThu, 08/16/2018 - 12:08

Priyanka, Nickఅమెరికన్ సింగర్ నిక్ జోనస్ తన కుటంబంతో సహా భారత్‌కు రానున్నారు. ఇటీవల బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ నిశ్చితార్థం జరగగా.. అతడి కుటుంబానికి ప్రియాంక ఫ్యామిలీ ట్రీట్ ఇవ్వనుంది. ఈ క్రమంలో నిక్ జోనస్ ఫ్యామిలీ సభ్యులు ఈ వారాంతంలో భారత్‌కు రానున్నారు. ఇక నిక్, ప్రియాంక ఇరు కుటుంబాల ఫ్యామిలీ సభ్యులు కూడా కలుసుకోవడం ఇదే మొదటిసారి. ఈ విషయాన్ని ఆమె సన్నిహితులు వెల్లడించారు.

కాగా పెళ్లికి ముందు వధూవధుల కుటుంబాలు కలుసుకునే సంప్రదాయం ప్రియాంక కుటుంబసభ్యులు ఆచరిస్తుండగా.. అందులో భాగంగానే నిక్ జోనస్ ఫ్యామిలీ భారత్‌కు రాబోతుంది. అంతేకాదు సంప్రదాయాలకు విలువనిచ్చే ప్రియాంక, తన వివాహాన్ని కూడా భారత సంప్రదాయానికి అనుగుణంగా చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ పార్టీలో ఇరువురి సన్నిహితులు హాజరుకానున్నట్లు సమాచారం.ఆ పార్టీల వల్లే హాలీవుడ్ ఛాన్స్ వచ్చింది

Updated By ManamFri, 08/10/2018 - 11:57

Priyanka Chopra‘క్వాంటికో’ అనే టెలివిజన్ సిరీస్‌తో హాలీవుడ్‌లో అడుగుపెట్టిన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా, ఆ తరువాత బేవాచ్ సినిమాలో నటించింది. ఇప్పుడు మరికొన్ని హాలీవుడ్ ప్రాజెక్ట్‌లు ఆమె చేతిలో ఉన్నాయి. ఈ సందర్భంగా తన హాలీవుడ్ ప్రయాణం ఎలా మొదలైందన్న విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.

‘‘హాలీవుడ్ ప్రయాణం చాలా భయంకరమైంది. కానీ మంచి అనుభవం. హాలీవుడ్‌ రికార్డు ప్రొడ్యూసర్ జిమ్మీ లొవైన్‌తో కలిసి ఆల్బమ్ చేయాలని నా మేనేజర్ సలహా ఇచ్చాడు. అలా అమెరికాకు వెళ్లాను. అక్కడ కొంతమంది స్నేహితులయ్యారు. ఆ తరువాత అక్కడి ఈవెంట్లు, పార్టీలకు హాజరయ్యేదాన్ని. ఆ పార్టీలకు వచ్చిన వారిలో గ్రామీ అవార్డులు తీసుకున్న వారు కూడా ఉన్నారు. వారు నన్ను అమెరికాలో నువ్వు ఎందుకు పనిచేయకూడదని అడిగారు. అప్పుడే హాలీవు్ గురించి ఆలోచించా.

ఆ తరువాత అమెరికాకు చెందిన కమర్షియల్ బ్రాడ్‌కాస్ట్ టెలివిజన్ నెట్‌వర్క్ వైస్ ప్రెసిడెంట్ నన్ను టీవీ షోలలో నటించమని అడిగారు. అయితే టీవీలో నటించాలంటే కనీసం ఆరేళ్లు పడుతుందని ఆలోచించి వద్దన్నాను. ఆ తరువాత వారు భారత్ వచ్చి, నాకు 26రకాల స్ర్కిప్ట్‌లను వినిపించారు. వాటిలో క్వాంటికోలోని అలెక్స్ పాత్ర ఒకటి. ఆ పాత్ర ఇండో- అమెరికన్ అందుకే అందులో నటించేందుకు ఒప్పుకున్నా. మా నాన్న నా కోసం హాలీవుడ్‌లో ఆఫర్లు ఉంచి వెళ్లలేదు. ఏం చేసినా నా అంతట నేనే చేయాలి. అలా ప్రయత్నిస్తుండగా బేవాచ్‌లో నటించే అవకాశం వచ్చింది’’ అంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక.ప్రియాంకకు షాక్ ఇచ్చిన హాలీవుడ్

Updated By ManamFri, 08/10/2018 - 02:21

imageబాలీవుడ్ నుంచి హాలీవుడ్ వెళ్ళి నటిగా బిజీ అయిపోయిన ప్రియాంక చోప్రా ఈమధ్య వార్తల్లో ఎక్కువగా కనిపిస్తోంది. హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్‌తో ఎంగేజ్‌మెంట్ కోసమే సల్మాన్‌ఖాన్ హీరోగా నటిస్తున్న ‘భరత్’ చిత్రం నుంచి తప్పుకుందని ప్రచారం జరిగింది. తాజాగా సోనాలీ బోస్ ‘ద స్కై ఈజ్ పింక్’ సినిమా షూటింగ్ మొదలు పెట్టారు పిగ్గీ చాప్స్. అయితే హాలీవుడ్ మూవీ ‘కౌబాయ్ నింజా వికింగ్’లో నటించడం కోసమే ప్రియాంక భరత్ సినిమాను వదులుకున్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం కౌబాయ్ నింజా వికింగ్ సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి ప్రియాంకకు షాక్ ఇచ్చారు నిర్మాతలు.

హాలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ కథనం ప్రకారం ‘కౌబాయ్ నింజా వికింగ్’ సినిమా ఇప్పట్లో సెట్స్‌పైకి వెళ్ళే సూచనలు కనిపించడం లేదు. ప్రస్తుతానికి డైరెక్టర్ మిచెల్ మెక్‌లారెన్ స్క్రిప్టు డెవలప్ చేసే పనిలో ఉన్నారు. అయితే ఈ సినిమాలో క్రిస్ ప్రాట్‌తో ప్రియాంక కూడా నటిస్తారు. హాలీవుడ్ సినిమాలో నటించేందుకు ‘భరత్’ చిత్రాన్ని ప్రియాంక వదులుకోవడంతో ఆ అవకాశం కత్రినా కైఫ్‌కు దక్కింది. 
 

image

 ప్రియాంకకు హాలీవుడ్ నిర్మాతల షాక్

Updated By ManamWed, 08/08/2018 - 13:35

Priyanka Chopraప్రియాంక చోప్రాకు హాలీవుడ్ నిర్మాతలు షాక్ ఇచ్చారు. ‘కౌబాయ్‌ నింజా వికింగ్‌’ అనే చిత్రంలో నటించేందుకు ప్రియాంక డేట్లు ఇవ్వగా.. తాజాగా ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. దీంతో ప్రియాంకకు షాక్ తగిలినట్లైంది.

ఈ విషయంపై మాట్లాడిన చిత్ర నిర్మాతలు.. ‘‘ప్రస్తుతానికైతే డైరెక్టర్‌ మిచెల్‌ మెక్‌లారెన్‌ స్క్రిప్టు డెవలప్‌ చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమాలో క్రిస్‌ ప్రాట్‌తో ప్రియాంక కూడా నటిస్తారు. కానీ ఈ ప్రాజెక్టు ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందనేది కచ్చితంగా చెప్పలేము అంటూ పేర్కొన్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం ప్రియాంక, సల్మాన్ ఖాన్ భరత్‌ను తప్పుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లేసరికి లేట్ అవ్వడంతో ప్రియాంకకు పెద్ద షాక్ తగిలినట్లైంది.క్రికెట్ ప్లేయర్‌గా తాప్సీ..

Updated By ManamFri, 08/03/2018 - 20:07

Taapsee Pannu, Mithali Raj biopic, Priyanka Chopra`సుర్మ` సినిమాలో హాకీ ప్లేయర్‌గా నటించిన తాప్సీ పన్ను.. త్వరలోనే మరో క్రీడాకారిణి పాత్రలో మెరవనుంది. ప్రస్తుతం ఇండియన్ సినిమాల్లో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తుంది. అందులో భాగంగా సినీ, రాజకీయ, క్రీడలకు సంబంధించిన ప్రముఖుల జీవిత చరిత్రలు సినిమాలుగా రూపొందుతున్నాయి. ఇప్పుడు మహిళా భారత క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కిస్తారట.

అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయట. నిజానికి మిథాలీరాజ్ గతంలో తన బయోపిక్‌లో ప్రియాంక చోప్రా నటిస్తే బావుంటుందని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ప్రియాంక చోప్రా హాలీవుడ్ సినిమాలతో బిజీ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో దర్శక నిర్మాతలు తాప్సీతో మిథాలీ బయోపిక్‌ను రూపొందించాలనుకుంటున్నారు. త్వరలోనే మరికొన్ని వివరాలు తెలుస్తాయి. 

Related News