elections

65 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ తొలిజాబితా

Updated By ManamTue, 11/13/2018 - 06:11

న్యూఢిల్లీ:  కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసే వారి అభ్యర్థిత్వాలను ఎట్టకేలకు తేల్చారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాకు ఎట్టకేలకు ఎఐసీసీ ఆమోదం లభించింది.   సోమవారం అర్థరాత్రి 70 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసింది. 

ఒక్క సీటును కూడా ప్రకటించకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర నిరుత్సాహానికి గురైన విషయం తెలిసిందే. సీట్ల సర్దుబాట్లు కొలిక్కి రాకపోవడంతో కాంగ్రెస్ జాబితా ప్రకటించలేదు. అభ్యర్థుల జాబితాను వెలువరించకపోవడంతో టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులతో పాటు పార్టీ శ్రేణులు సైతం తీవ్ర అసహనానికి గురయ్యాయి. ఈ విషయాన్ని గుర్తించడంతో పాటు పాటు ఈసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో టీపీసీసీపై తీవ్ర ఒత్తిడి పెరిగింది.

ఈ నేపథ్యంలో సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ డాక్టర్ రామచంద్ర కుంతియా, ఎఐసీసీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్ దాస్, టీపీసీసీ అధ్యక్షులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు రెండుసార్లు ఎఐసీసీ  అధ్యక్షులు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. 

సాయంత్రం పార్టీ  అధినేత్రి సోనియాగాంధీ నివాసంలో జరిగిన  కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో జరిగిన కసరత్తులో అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చింది. సామాజిక సమీకరణలు, గెలుపు అవకాశాలు, పార్టీ విధేయత, కూటమిలోని సీపీఐ, టీడీపీ, టీజేఎస్ అభ్యర్థులకు సీట్ల పంపకాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థుల జాబితాకు రాహుల్ గాంధీ ఆమోదం తెలిపారు.

 

 

కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే 70 మంది అభ్యర్థులు వీరే..

1.సిర్పూర్‌ - డాక్టర్‌ పాల్వయ్‌ విహరీష్‌ బాబు 
2. చెన్నూరు - వెంకటేశ్‌ నేత బోర్లకుంట 
3. మంచిర్యాల - కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు 
4. ఆసిఫాబాద్‌ - ఆత్రం సక్కు  
5. ఆదిలాబాద్‌ - సుజాత గండ్రత్‌ 
6. నిర్మల్‌ - అల్లేటి మహేశ్వర్‌రెడ్డి 
7.ముథోల్‌ - రామారావు పటేల్‌ పవార్‌ 
8. ఆర్మూర్‌ - ఆకుల లలిత 
9. బోధన్‌ - సుదర్శన్‌ రెడ్డి  
10. జుక్కల్‌ - గంగారం 
11. బాన్సువాడ - బాలరాజు 
12. కామారెడ్డి - షబ్బీర్‌ అలీ 
13. జగిత్యాల - జీవన్‌రెడ్డి 
14. రామగుండం - రాజ్‌ ఠాకూర్‌ 
15. మంథని - శ్రీధర్‌ బాబు 
16. పెద్దపల్లి - విజయరమణారావు 
17. కరీంనగర్ - ‌పొన్నం ప్రభాకర్‌ 
18. చొప్పదండి - మేడిపల్లి సత్యం 
19. వేములవాడ - ఆది శ్రీనివాస్‌ 
20. మానకొండూర్‌ - ఆరేపల్లి మోహన్‌ 
21. ఆంథోల్‌  - దామోదర రాజనర్సింహా 
22.నర్సాపూర్‌ -  సునీతా లక్ష్మారెడ్డి  
23. జహీరాబాద్‌  - గీతారెడ్డి  
24.సంగారెడ్డి  - జగ్గారెడ్డి  
25.గజ్వేల్‌  - వంటేరు ప్రతాప్‌రెడ్డి  
26.కుత్భుల్లాపూర్‌  - కూన శ్రీశైలం గౌడ్‌ 
27. మహేశ్వరం - సబితా ఇంద్రారెడ్డి  
28.చేవెళ్ల - కేఎస్‌ రత్నం 
29.పరిగి  - రామ్మోహన్‌రెడ్డి  
30.వికారాబాద్‌  - గడ్డం ప్రసాద్‌కుమార్‌ 
31.తాండూరు - రోహిత్‌ రెడ్డి  
32. ముషీరాబాద్‌  - అనిల్‌కుమార్‌ యాదవ్‌ 
33.నాంపల్లి  - ఫిరోజ్‌ఖాన్‌ 
34.గోషామహల్‌  - ముఖేష్‌గౌడ్‌ 
35. చార్మినార్‌  - మహ్మద్‌ గౌస్‌ 
36. చాంద్రాయణ గుట్ట  - ఇసా బినోబైడ్‌ మిస్త్రి 
37.సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ - సర్వే సత్యనారాయణ
38.కొడంగల్‌  - రేవంత్‌ రెడ్డి 
39. జడ్చర్ల  - మల్లురవి  
40.వనపర్తి  - చిన్నారెడ్డి  
41.గద్వాల  - డీకే అరుణ 
42. అలంపూర్‌  - సంపత్‌కుమార్ 
43. నాగర్‌కర్నూల్‌  - నాగం జనార్దన్‌ రెడ్డి  
44.అచ్చంపేట  - వంశీకృష్ణ  
45.కల్వకుర్తి  - వంశీచంద్‌రెడ్డి  
46.నాగార్జున్‌సాగర్‌ -  జానారెడ్డి  
47.హుజూర్‌నగర్‌  - ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి  
48.కోదాడ  - పద్మావతి రెడ్డి 
49. సూర్యాపేట  - దామోదర్‌ రెడ్డి  
50.నల్గొండ  - కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 
51. మునుగోడు  - కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి  
52.భువనగిరి -  అనిల్‌ కుమార్‌ రెడ్డి  
53.నకిరేకల్‌  - చిరుమర్తి లింగయ్య  
54.ఆలేరు  - భిక్షమయ్య గౌడ్‌ 
55. స్టేషన్‌ఘన్‌పూర్ - ‌ సింగపూర్‌ ఇందిర 
56. పాలకుర్తి  - రాఘవరెడ్డి 
57. డోర్నకల్‌  - రామచంద్రునాయక్‌  
58.మహబూబాబాద్‌  - బలరాం నాయక్‌  
59.నర్సంపేట  - దొంతి మాధవరెడ్డి 
60. పరకాల -  కొండా సురేఖ  
61.ములుగు -  సీతక్క  
62.పినపాక  - రేగ కాంతారావు  
63.మధిర  - భట్టివిక్రమార్క  
64.కొత్తగూడెం -  వనమా వెంకటేశ్వరరావు 
65.భద్రాచలం  - పోడెం వీరయ్యఎన్నికలు షురూ!

Updated By ManamMon, 11/12/2018 - 05:39
 • 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నిక

 • 8 మావోయిస్టు ప్రభావిత జిల్లాలు

 • లక్ష మంది సిబ్బందితో భారీ భద్రత

 • 650 కంపెనీల పారామిలటరీ దళాలు..

 • ఇతర రాష్ట్రాల నుంచి 65వేల పోలీసులు

 • సుదూర ప్రాంతాలకు చాపర్లలో తరలింపు

 • తెలంగాణ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్

electionsన్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల సందడి మొదలైపోయింది. అన్నింటికంటే ముందుగా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో తొలిదశ ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం ప్రారంభం కానుంది. 8 మావోయిస్టు ప్రభావిత జిల్లాల పరిధిలోని 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. దీంతోపాటు.. తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ కూడా సోమవారమే విడుదల కానుంది. 

భారీ భద్రత
తొలి దశ ఎన్నికలు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుండటంతో ఛత్తీస్‌గఢ్‌లో కనీవినీ ఎరుగని భద్రతా ఏర్పాట్లు చేశారు. బస్తర్ ప్రాంతాన్ని శత్రుదుర్బేధ్యమైన చిన్నపాటి కోటలా రూపొందించారు. సోమవారం తొలిదశలో 18 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఇవన్నీ 8 నక్సల్ ప్రభావిత జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. ఇందుకోసం లక్ష మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. వారిలో కేంద్ర పారామిలటరీ దళాలు కూడా ఉన్నాయని ఛత్తీస్‌గఢ్ ప్రత్యేక డైరెక్టర్ జనరల్ (యాంటీ మావోయిస్టు ఆపరేషన్స్) డీఎం అవస్థి తెలిపారు. గడిచిన 10 రోజుల్లో 300 ఐఈడీలను బస్తర్, రాజ్‌నంద్‌గావ్ ప్రాంతాలలో భద్రతాదళాలు తొలగించాయని ఆయన చెప్పారు.

ఎన్నికలను భగ్నం చేయడానికి మావోయిస్టులు చేసే ప్రయత్నాలన్నింటినీ తాము తిప్పి కొడతామని ధీమా వ్యక్తం చేశారు. సీఆర్పీఎఫ్, బీఎస్‌ఎఫ్, ఐటీబీపీ లాంటి పారామిలటరీ దళాలకు చెందిన 650 కంపెనీలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి 65 వేల మంది పోలీసు సిబ్బందిని కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌కు పంపింది. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న 200 కంపెనీ రాష్ట్ర బలగాలు, పారామిలటరీ దళాలకు ఇవి అదనం. మారుమూల ప్రాంతాలలో ఉన్న పోలింగ్ కేంద్రాలకు 650 బూత్ పార్టీలను హెలికాప్టర్లలో శనివారమే తరలించారు. మిగిలిన వారిని ఆదివారం రోడ్డు మార్గంలో పంపుతారు.

ఇందుకోసం భారత వైమానిక దళంతో పాటు సరిహద్దు భద్రతా దళానికి చెందిన చాపర్లను రంగంలోకి దించారు. ప్రస్తుతానికి నక్సల్ ప్రభావిత ప్రాంతాలకు మొత్తం పోలింగ్ బృందాలన్నింటినీ సురక్షితంగా పంపదమే తమ ప్రథమ కర్తవ్యమని డీఎం అవస్థి తెలిపారు. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించడం, వారందరినీ సురక్షితంగా రాష్ట్ర రాజధానికి తరలించడం లాంటి పనులు చూస్తామన్నారు. 90 మంది సభ్యులున్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర అసెంబ్లీకి ఈనెల 12, 20 తేదీలలో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. డిసెంబరు 11న అన్ని రాష్ట్రాలతో కలిపి ఫలితాలు ప్రకటిస్తారు.సిరా చుక్కతో భవితవ్యం!

Updated By ManamMon, 10/29/2018 - 00:27

imageఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఇద్దరు కలిసి నా ఒకే ప్రశ్న. ఎన్నికలలో ఏమి జరగబోతోంది? ఒకరికొకరు ఏదో సమాధానం చెప్పుకుం టారు. కాసేపు తమ నాయకులను వెనకేసుకు రావడానికి తర్జనభర్జన పడతారు. వాదనలు, వాటికి పోటీవాదనలు ముందుకు వస్తాయి. చివరకు, అప్ప టికే తమ మనసులో ఉన్న అభిప్రాయంతో కొత్త సమా చారాన్ని కలుపుకుంటారు. అందుకే భారతదేశ వ్యవస్థలో ఓటరు ఆలోచన మారాలా..? ఎన్నికలలో ఏదో జరుగబో తోంది అన్న కుతూహలం వెనుక, సమాజం అంతరాల్లో అంతుపట్టని జనాభిప్రాయం పురు డు పోసుకుంటూ ఉన్నది అన్న అనుమానం లేకపోలేదు. అయితే, తటస్థంగా నిలబ డి, ఆ ప్రశ్నలు వేసేవారే ఆ ప్రశ్నకు సమాధానం కాగలరు. మంచిచెడ్డలు లాభనష్టాలు జాగ్రత్తగా చూసి, ఒక నిశ్చయం కల్పించుకోవలసింది ఈ తటస్థులే ఇప్పుడున్న మంచి కొనసాగాలి ఇప్పు డున్న చెడు ఆగిపోవాలి. ఏ ఒక్క పార్టీ బలం పెరగడమో తగ్గడమో కాదు, పార్టీల బలాబలా లను నిర్ణయించేది తామేనన్న ఆత్మవిశ్వాసం ఓటర్లలో పెరగాలి.

తొలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్ల పాలనను సమీక్షించే పనిపూర్తిగా నెరవేరకుండానే, అసెంబ్లీకి ఆఖరి బె ల్లుimage మోగింది. ముగిసిన కాలానికి తోడు ఇంకా గడవవలసి న కాలం ఇంకొంచెం ఉంది కదా అని లెక్కలు వేసుకుం టుండగానే, ఎమ్మెల్యేలు మాజీలయ్యారు. ముఖ్యమంత్రితో సహా మంత్రివర్గం ఆపద్ధర్మం అయిపోయింది. ప్రత్యర్థులకు ఊపిరిసలపనివ్వని వేగంతో మొదటి అడుగులు తానే వేసి దెబ్బకొట్టాడు కేసీఆర్ అని... గిట్టనివారు కూడా మెచ్చుకు న్నారు. తానూ గెలవడం మాత్రమే కాదు, సాధారణ ఎన్నికల నాటికి తనకు చేదోడు కూడా కాగలను అని హామీ ఇచ్చారో ఏమిటో... కేంద్రంలోని వ్యవస్థలన్నీ కేసీఆర్ అభీష్ఠా నికి అనుగుణంగా సానుకూలం అవుతున్నాయి. ముందస్తు ఎన్నికల సమాచారంతో పాటు, 105 మంది అభ్యర్థుల ప్రకటన కూడా చేసి, రణరం గాన్ని ఏకపక్షంగా రచించి ప్రతిపక్షాలకు టిఆర్ ఎస్  సవాల్ విసిరింది. మొత్తంగా అలుముకు న్నట్టు కనిపించిన ఏకపక్ష సానుకూల వాతావరణం, ఎందుకో క్రమంగా సడలిపోతున్నట్టు కనిపి స్తున్నది. ప్రగతి నివేదన సభ ఆశించిన స్థాయిలో జరగ లేదన్న అభిప్రాయం కావచ్చు. వ్యతిరేకతను మూటగట్టు కున్న సిటింగ్ శాసనసభ్యులకు కూడా తిరిగి అభ్యర్థిత్వాలను ఇవ్వడంపై కలిగిన నిరాశకావచ్చు. అవసరమైనంతగా కాదు కానీ, ఊహించిన దానికంటె మెరుగు గానే కాంగ్రెస్ స్పందిస్తుండడం కావచ్చు. పోరు తీవ్రంగానే ఉంటుందన్న ఊహలకు రెక్కలు వచ్చాయి. ఎన్నికల ప్రచా రపు ఆర్భాటం ఒక్కటే కాదు, నాలుగేళ్ల పాలనలోని మంచి చెడ్డలన్నీ చర్చకు వస్తున్న సూచన కనిపిస్తున్నది. కొన్ని అంశాలలో టీఆర్‌ఎస్‌కు తిరుగులేకున్నా, కొన్ని ప్రశ్నలకు మాత్రం ఆ పార్టీ వద్ద సమాధానం లేకపోవడం అధికార పార్టీ శ్రేణులకు కూడా నిరుత్సాహజనకంగా ఉన్నది.
 

image

నాలుగేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి మరే ప్రభుత్వం ఉన్నా జరిగేదా? వెయ్యిరూపాయల పింఛను ఎప్పుడన్నా కళ్ల జూశామా? పెళ్లికి, పురుటికి ప్రభుత్వమే కట్నాలు ఇవ్వడం కనీవినీ ఎరుగుదుమా? అనేక ప్రాజెక్టులు నడిమధ్యలో ఉ న్నాయి. అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించవలసి ఉన్నాయి. వాటికి పూచీ కావాలంటే కేసీఆరే మళ్లీ సీఎంగా ఉండాలి కదా? ఎమ్మెల్యేలదేముంది సార్, బ్యాలెట్ పేపర్ మీద అభ్యర్థుల పేర్లను చూసి ఓటు వేస్తారా ఏమిటి, అక్కడ కారు గుర్తు ఉంటది. వాళ్లకు అందులో కేసీఆర్ బొమ్మ కనిపిస్తది టిఆర్‌ఎస్ అభిమానులు చేస్తున్న ఈ వాదన తీసి పారేయదగ్గది కాదు. నిన్నటిని రేపటిని కలిపి ఆలోచించవల సిన బాధ్యతను ఇప్పుడు ఓటరు తలకెత్తుకుంటున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా అధికారపార్టీ శాసనసభ్యుల అక్రమా ల మీద జనానికి వ్యతిరేకత ఉన్నది. ఆ జనమే కాదు, చం ద్రబాబు మీద ఎంతో అయిష్టం ఉన్న వారు కూడా ఇంకో అవకాశం బాబుకు ఇవ్వాలేమో అనే విచికిత్సలో ఉన్నారు. కొత్త రాష్ట్రం రాజధాని నిర్మాణం, అసంపూర్తి ప్రాజెక్టులు, పెట్టుబడుల సమీకరణ, వంటి కారణాలు చెప్పుకుని, అనుభవజ్ఞుడే ఉండాలేమో ఇంకోసారి కూడా అని వ్యా ఖ్యా నిస్తున్నారు.

 అదేమీ స్థిరపడిపోయిన అభిప్రాయం కాదు కానీ, జనం ఆలోచనా ధోరణికి ఒక సూచిక. కేసీఆర్ వంటి సాహసి, సమర్థుడు, సంకల్పబలం ఉన్న నాయకుడు ఉంటే కానీ, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలు నెరవేరవు అని ఆలోచించే వారు ఒక బలమైన సెక్షనే ఉన్నారు. కేసీఆర్ పాలనలో సాధించిన విజయాలు అంతటి తిరుగులేని ప్రభావాన్ని కలిగిస్తే, ముందుస్తుకు ఎందుకు వెళ్లినట్టు? ఏ అనుమానం తో వెళ్లినట్టు, ఈ తొమ్మిది నెలల ముందస్తు ఏ అదనపు ఫలాలను ఇస్తుందని భావించి నట్టు? ఆశ్చర్యకరంగా ఈ ప్రశ్నకు కేసీఆర్ కనీసం దబాయింపు సమాధానం కూడా చెప్పడం లేదు. ఇంతకూ ముందస్తు ఎందుకు అని ఓ టీఆర్‌ఎస్ చిన్ననేతనో, పెద్దనేతనో అడిగితే, వాళ్లు అదే ప్రశ్న ఎదురు వేస్తున్నారు. ఇదొక్క అంశం చాలు వాళ్ళను ఇబ్బంది పెట్టడానికి, కానీ కాంగ్రెస్ నేతలకు ఆ ధ్యాసే లేదని టీఆర్‌ఎస్ నాయకులు అనుకుంటు న్నారు. నిగూఢమైన, ప్రణాళికాబద్ధం అయిన వ్యవ హార సరళి కేసీఆర్‌ది. దానికి ఆయన గర్వపడతారో లేదో తెలియదు కానీ, ఆయన వీరభక్తులు మాత్రం దాన్ని గొప్ప లక్షణంగా భావిస్తారు. ఎవరెన్ని విమర్శలు చేసినా, సెక్రటేరియట్‌కు వెళ్లకపోవడం. అవకాశం ఉన్నా ఆడవాళ్లకు కేబినెట్‌లోకి ససేమిరా అనడం. ధర్నాచౌక్‌ను, బహిరంగ ప్రదేశాల్లో ఆందోళనలను నిషేధించడం. ఫాంహౌ జ్లో వారాల తరబడి గడపడం. ఇవన్నీ కేసీఆర్ ప్రశంస నీయమైన భక్తులకు చెప్పుకోవడం కష్టంగా మారింది. ఇక వాటిని ఎవరి మాటా వినని గాంభీర్యానికి గుర్తులుగా టీఆర్‌ఎస్ అభిమాన శ్రేణులు పరిగణిస్తాయి. ముందస్తు ప్రక టనను కూడా వాళ్లు ఆ కోవలోనిదిగానే పరిగణిస్తారు. నాలు గేళ్ల కాలంలో మంత్రులకు, శాసనసభ్యులకు ఉండిన వెసు లుబాటు ఎంతో అందరికీ తెలుసు. ఎవరెవరు క్షేత్రస్థాయిలో హద్దుమీరుతున్నారో కేసీఆర్‌కూ తెలుసు. అయినా, ఆయన ధీమాగా ఉన్నారు కాబట్టి, గెలిపించే బాధ్యత కూడా ఆయనదే అని కింది నేతలు అనుకోవడంలో ఆశ్చర్యం ఏముంది?

ఎన్నికలలో నాయకుల తీరు హామీలు ఎన్ని ఇచ్చినా ప్రజల తీర్పు ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. నాయకులు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా... ఓటు వేసే సమయానికి ఓటరు అభివృద్ధి ఫలాలను లెక్కలు వేసుకు న్నాకనే తన నిర్ణయాన్ని ఎంచుకుంటారు. గత ప్రభుత్వాల తో పోల్చితే కొత్తగా  చేసిన సంస్కరణలు ఎన్ని ఉన్నాయనే స్పష్టత ఓటరుకు వచ్చినప్పుడే ఎన్నిక ఒకవైపు ఉంటుంది. కేసీఆర్ వ్యవహార సరళిపై సామాన్య ఓటర్లు విముఖతతో స్పందిస్తారా? గత ప్రభుత్వాల పాలనతో పోలిస్తే, ప్రజలకు అందుతున్న సంక్షేమం నిస్సందేహంగా కేసీఆర్ హయాంలో అధికమే. ఎన్ని వివాదాలున్నా, పెద్దపెద్ద ప్రాజెక్టులలో నీరు పారితే, తెలంగాణ జనానికి కలిగే సంతోషమూ అధికమే. చెప్పినన్ని కాకపోయినా, నిరుద్యోగులలో అసంతృప్తి ఉన్నా, నియామకాలు చెప్పుకోదగ్గ సంఖ్యలో జరగలేదు. నిధుల వ్యవహారం జనం అనుభవంలోకి వచ్చేది కాదు. హైదరా బాద్ కారణంగా వస్తున్న అధిక ఆదాయానికి తోడు బయటి నుంచి ఎడాపెడా అప్పులు కూడా తీసుకున్నారంటున్నారు. దాని పర్యవసానం వెంటనే అనుభవంలోకి రాకపోవచ్చు. వీటన్నిటి కారణంగా పర్వా లేదనిపించే తీరులో ఉన్న పాల నను, ప్రజలు స్వేచ్ఛ తక్కువైందనో, ముఖ్యమంత్రి ప్రజలను కలవడం లేదనో, సంక్షేమం కొన్ని శ్రేణులకు చేర డం లేదనో, గొప్పగా చెప్పుకున్న పథకాలు కొన్ని నత్తనడక నడుస్తున్నాయనో నిరాకరి స్తారా? అసలు ఈ ప్రభుత్వం మీద పెట్టగలిగే విమర్శ ఏమిటో, ప్రధాన ప్రతిపక్షానికి తెలుసు నా? అని ఆలోచన సాగుతున్నది.

టీఆర్‌ఎస్‌కు కేసీఆర్ సరళి పెద్ద సమస్య అయితే, కాంగ్రెస్ పార్టీకి దాని బహు నాయకత్వం సమస్య. తెలం గాణ రాష్ట్ర సాధనలో తమ పార్టీ ఏమిచేసిందో చెప్పుకోవడం కూడా ఆ పార్టీకి కష్టమే అయింది. దాదాపు నాలుగేళ్ల పాటు బీజేపీ భాగస్వామ్య పక్షంగా కొనసాగి, సందర్భం రాగానే, తానే బీజేపీకి ప్రత్యర్థిని అన్నరీతిలో చంద్రబాబు పార్టీ వైఖరిని మార్చగలిగారు. టీఆర్‌ఎస్‌కు బీజేపీకి నడుమ ఏదో అనుబంధం ఉన్నదన్న సాధారణ అభిప్రాయం ఏర్పడిన తరువాత కూడా ఆ అంశం మీద విస్తృత ప్రచారం చేయ డానికి కాంగ్రెస్ సమయం లెక్కిస్తున్నది. అంతర్గత కలహా లు, నాయకత్వం కోసం పోటీలు, వీటి మధ్య ఇప్పుడు కొత్త గా మహాకూటమి ప్రయత్నాలు.. వీటి మధ్య కాంగ్రెస్ తన లో తానే సతమతమవుతున్నది తప్ప, గట్టి వ్యూహరచన చేయలేకపోతున్నది. ఉద్యమదశ దాటిన వెంటనే, రాజకీయ నైతికతను పక్కనబెట్టి ఇతర పార్టీల వారిని చేర్చుకుని, ఉద్య మ సహచరులను పక్కనబెట్టి, ఉద్యమస్ఫూర్తికి భిన్నమ యిన నిర్ణయాలు కూడా తీసుకోగలిగిన కేసీఆర్, అవసరమ నుకుంటే తన స్వరంలో ఉద్యమ తీవ్రతను పలికించగల రు. ఇప్పుడే కాదు, 2014లో కూడా ఉద్యమస్ఫూర్తి ఏ మాత్రం లేకుండా, ఏ సైద్ధాంతికతా లేని నాయకుల గుంపు లాగా వ్యవహరించడం కాంగ్రెస్ బలహీనత. కాంగ్రెస్ కనుక ఒక కట్టు మీద ఉండి, అధికారపక్షం రాజకీయ అనైతికతను, తాము ఆరోపిస్తున్న ఆర్థిక అవినీతిని, ముఖ్యమంత్రి ఏకపక్ష ధోరణిని సమర్థంగా వివరించగలిగితే, ఓటర్ల విచక్షణకు గట్టి పనిపెట్టినట్టవుతుంది. ఇప్పటికయితే, అంతటి పట్టుద ల కనిపించడం లేదు. రానున్న రోజుల్లో పరిస్థితులు వారి మీద ఒత్తిడి తెస్తే మార్పు వస్తుందేమో తెలియదు. ఏమిటి, ఏమి జరగబోతోంది? అన్న కుతూహలం వెనుక, సమా జం అంతరాల్లో మనకు అంతుపట్టని జనాభిప్రాయం రూపు దిద్దుకుంటోందేమోనన్న అనుమానం లేకపోలేదు. అయితే, తటస్థంగా నిలబడి, ఆ ప్రశ్నలు వేసేవారే ఆ ప్రశ్నకు స మాధానం కాగలరు. మంచిచెడ్డలు, లాభనష్టాలు జాగ్రత్తగా చూసి, ఒక నిశ్చయం కల్పించుకోవలసింది ఈ తటస్థులే. ఇప్పుడున్న మంచి కొనసాగాలి. ఇప్పుడున్న చెడు ఆగిపోవా లి. ఏ ఒక్క పార్టీ బలం పెరగడమో తగ్గడమో కాదు, పార్టీల బలాబలాలను నిర్ణయించేది తామేనన్న ఆత్మవిశ్వాసం ఓట ర్లలో పెరగాలి. ప్రజలంటే నేతలకు భయభక్తులు కలగాలి. వివిధ పక్షాల యుద్ధవ్యూహాల మధ్య, ఓటరును గెలిపించే ఫలితం రావాలి. 

రాజకీయం అంటే ఓపెద్ద నాటక రంగస్థలం ఇక్కడ నాయకులు వారి వారి కళా ప్రదర్శనలను ఎవరికీ వారు గొప్పగా చెప్పుకుంటారు. ప్రజలను కీలుబొమ్మలుగా చేసి ఆడుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు. కానీ రాజ్యాంగం ప్రకారం వారే ప్రజల చేతిలో కీలుబొమ్మలు అని మరచి పోతారు. చివరకు నాయకుల కళా ప్రదర్శనకు మార్కులు వేసే న్యాయనిర్ణేతలు మాత్రం ప్రజలే. కేసిఆర్ తానూ రాష్ట్ర రాజకీయాలను వదిలి దేశరాజకీయాల వైపు మొగ్గు చూపు తున్న సమయంలో తనకు ఇతర తెలుగు నాయకుల నుంచి ఒత్తిడి ఎదురు కావొద్దు అని వ్యూహరచనను పక్కగా అమ లు చేస్తున్నారు. తాను జాతీయ రాజకీయాలలోకి వచ్చి సంచలనం సృష్టించాలనుకున్న సందర్భంలోనే, అను కోకుం డా చంద్రబాబు కూడా రావడం కేసీఆర్ కోరుకుని ఉండరు. ఇంతకాలం చంద్రబాబుతో ఉన్న బీజేపీ, ఇప్పుడు తన వెను క ఉన్నదని గిట్టనివారు మాట్లాడుకోవడం కూడా ఆయన ఇష్టపడరు.

 ఎవరి వెనుక ఎవరు ఉన్నా, ఎవరి వెనుక ప్రజ లు ఉంటే వారిదే విజయం అన్నది మంచి మాటే కానీ, ఇన్ని గజకర్ణగోకర్ణ రాజకీయాలలో మంచిచెడ్డలను ఎంచి, రంగస్థలాన్ని ఆక్రమించగలిగే శక్తి, సంకల్పం ప్రజలకు ఉన్నాయా అన్నది ప్రశ్న. ఇక నాయకులను పక్కన బెట్టి.. రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే పరి స్థితులు ప్రజలకు నివేదించడమైనా, వాటి మీద వ్యాఖ్యానించడమైనా నాటక రంగ విమర్శలాగానో, సినిమా విమర్శలాగానో మారిపో యిందని అమెరికాలో మీడియా పండితులు ఆవేదనతో చెబుతుంటారు. ఒక నాయకుడో అతని, ఆమె పార్టీయో అనుసరించే విధానాలేమిటి, వాటి పర్యవసానాలేమిటి? ప్రత్యర్థుల విధానాలతో పోల్చినప్పుడు వాటి మంచిచెడ్డ లేమిటి.. వంటి అంశాలతో రాజకీయాలను విశ్లేషించ డం పాతబడిపోయిందని, రంగస్థల అలంకరణ, ఒక్కొక్కరి నట నావిన్యాసం, నాటకీయమైన సంభాషణలు, ఉత్కంఠతోనో ఉత్సాహంతో నో ప్రేక్షకులను రంజింపజేయడం అంశాల ఆధారంగా వ్యాఖ్యానించడమే అత్యాధుని కమని అమెరికాలోనే కాదు, భారత దేశంలోనూ అనుకుంటున్నారు. కాని అక్కడ అవినీతి నాయకులను తోటి నాయకులే ఎత్తి చెత్తకుప్పలో పడవేస్తే... భారతరాజకీయాలలో వారికి అత్యున్న త స్థానంలో పడకేస్తున్నారు. రాజకీయ రంగ స్థలానికి మంచి చెడ్డలేమీ లేవు. ఉద్వేగాలతో తప్ప ప్రేక్షకుడికి వేదిక మీద జరిగే పరిణామాలతో ప్రమేయమేమీ లేదు. చివరికి ఏమి జరుగనున్నదోనన్న కుతూహలం తప్ప, కథను మలుపు తిప్ప గలిగే కీలకమేదీ జనం దగ్గర లేదని నాయకుల విశ్వాసం.

ఓటు నాయకునికి బందీ కావద్దు.. ఓటు కుల, మత ప్రలోభాలకు లొంగవద్దు... ఓటు ప్రజల చేతిలో అస్త్రంగా ఉండాలి. రాజకీయ నాయకుడు ధరించే వస్త్రంగా కాదు. ఎందుకంటే ఓటు నాయకునికి బలం కాదు. భయం కావాలి. ఆలోచిం చు ఒక్క సిరా చుక్కనే నీ భవితవ్యాన్ని మారుస్తుంది. భావితరాలకు అభివృద్ధి ఫలాలను అందిస్తుంది. అందుకే ఓటు తో అవినీతి నాయకులకు ఓటమి పోటును పొడవాలి. ఒక్కరోజు ఒక్క క్షణంలో ఓటరు తీసుకునే నిర్ణయం ఐదు సంవత్సరాల వరకు మార్చలేమని గుర్తించా లి. ఏ ఓటరు తీసుకునే నిర్ణయం అయినా.. ఆ ఒక్కరికే  వర్తించకుండా... ఇతరులపై కూడా ప్రభావం చూపు తోంది. అందుకే ఓటు వ్యక్తి  కోసం కాకుండా వ్యవస్థ బాగుపడాలని ఆలోచించి వేస్తే అభివృద్ధి వైపు మార్పు మొదలవుతుంది. అంతేగాని ఓటు ఏ నాయకునికి గొడుగుకాయకూడదు ఒకవేళ అలా జరిగితే అభివృద్ధి మందగించి దేశ ఆర్ధికవ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. 
 
‘ఎన్నికలు ఇదంతా ఒక ప్రక్రియ. సొంత ఆలోచనలతో ఓటు చేయాలనుకునే వారి మనసులో ఒక నిర్ణయం స్థిరపడే క్రమం అది. గొర్రెదాటుగా ఓటుచేసే వారిని నడిపించే నాయక గొర్రెల మనసుల్లో సైతం జరిగే రాజకీయ మథనం అది. మంచిచెడ్డల విచక్షణ మాత్రమే పనిచేయకుండా ఆర్భాటాలూ వ్యూహ నైపుణ్యాలూ జిత్తులమారి తనాలూ ఓటర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కాని పోలింగ్ తేదీ నాటికి మౌనం గానో బాహాటంగానో జనాభిప్రాయం ఎలా మారు తుందో ఎవరు ఉహించలేరు’.

- అర్జున్ మహేంద్ర 
సామాజిక విశ్లేషకులు వేగం పెంచిన మహాకూటమి

Updated By ManamFri, 10/26/2018 - 02:53
 • ప్రచారం మొదలుపెట్టిన ఆశావహులు.. సొంతంగా ప్రభుత్వ ఏర్పాటు యోచనలో కాంగ్రెస్

electionsహైదరాబాద్: ఎలక్షన్ రన్‌లో మహాకూటమి స్పీడు పెంచింది. సీట్లపై సూత్రప్రాయంగా అన్ని పార్టీలు ఓ అంచనాకు వచ్చాయి. సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించాలనే ఉద్దేశంతో ఉన్న కాంగ్రెస్ అధిక సీట్లలో తామే పోటీ చేయాలన్న దిశలోనే మొదట్నుంచి ప్రయత్నిస్తుంది. ఈ లక్ష్యం మేరకే 90 నుంచి 95 సీట్లలో పోటీ చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. మిగిలిన 25 సీట్లను భాగస్వామ్య పక్షాలకు వదులుకోవాలని నిర్ణయించింది. అయితే ఏయే పార్టీ ఏయే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే అంశంపై మాత్రం సెస్పెన్స్ కొనసాగుతోంది. భాగస్వామ్య పక్షాలకు కేటాయించే 25 సీట్లలో 12 నుంచి 15 స్థానాలను టీడీపీకి కేటాయించినట్టు తెలుస్తోంది. సీపీఐ, టీజేఎస్ నుంచి వచ్చే స్పందనను బట్టి ఒకట్రెండు సీట్ల సంఖ్యలో మార్పులు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. కూటమి ఏర్పాటు నుంచి భాగస్వామ్య పక్షాలు చీలిపోకుండా జాగ్రత్త పడుతున్న టీడీపీ అవసరమైతే సీట్ల త్యాగాలకు కూడా మానసికంగా సంసిద్ధమైంది. అన్నీ అనుకూలిస్తే కూటమి పక్షాలన్నీ రెండు మూడ్రోజుల్లో ఒకే వేదిక నుంచి 60 మందితో తొలి జాబితా ప్రకటించే అవకాశాలున్నాయి. నియోజకవర్గాల ఎంపికలో పట్టుదల కు పోతే కూటమి లక్ష్యం నెరవేరదన్నది నాలుగు పార్టీల భావన. బలము న్న నియోజకవర్గాల్లోనే పోటీ చేయాలని కాంగ్రెస్ మిత్ర పార్టీలకు సూచి స్తోంది. ఇదే సమయంలో గురువారం జరిగే టీజేఎస్ రాష్ట్ర కమిటీ సమావే శం కీలకంగా మారింది. ఈ సమావేశంలో పోటీ చేయాల్సిన సీట్ల సంఖ్య.. ఎంపిక చేసుకోవాల్సిన నియోజకవర్గాలపై టీజేఎస్ నేతలు చర్చించారు.

ప్రచార స్పీడు పెంచిన పార్టీలు..
సీట్ల లెక్కల ముడి విప్పే ప్రయత్నాలు చేస్తూనే.. అటు ప్రచారంలో గు ట్టు చప్పుడు కాకుండా పార్టీలు స్పీడు పెంచుతున్నాయి. నవంబర్ 11న నోటిఫికేషన్ ఉండడంతో ఆలస్యంగానే అభ్యర్థులను ప్రకటించాలనే ఎన్నికల వ్యూహంతో ఉన్నాయి. అభ్యర్థులను అధికారికంగా ప్రకటించకున్నా.. ఆశా వాహులు ప్రచారం స్పీడు పెంచుతున్నారు. టీఆర్‌ఎస్‌కు అంతుచిక్కకుండా ప్రత్యేక వ్యూహంతో అధికార పార్టీని దెబ్బకొట్టాలని మహాకూటమిలో పార్టీలు చూస్తున్నాయి. డిసెంబర్ 12న మహాకూటమి సర్కార్ కొలువుదీరుతుందని నాలుగు పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రతిపాదనకు ఇతర పార్టీలు ఏలా స్పందిస్తాయో చూడాలి. అయితే ఇప్పటికే అన్ని పార్టీలు ఒక అవగాహనకు వచ్చినట్టు సమాచారం.

కాసింత అసంతృపిలో సీపీఐ
ఎవరికి ఎన్ని సీట్లు అన్నదానిపై పూర్తి క్లారిటీ వచ్చినా.. ఎవరు ఎక్కడ పోటీ చేయాలన్నదానిపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని కూటమిలో నేతలు భావిస్తున్నారు. అయితే తమను నాలుగు సీట్ల వరకు పరిమితం చేయాలనే కాంగ్రెస్ తీరుపై సీపీఐ కాస్త అసంతృప్తిగానే ఉంది. కనీసం ఆరు సీట్లిస్తే.. హుస్నాబాద్, బెల్లంపల్లి, మునుగోడు, ఆలేరు, కొత్తగూడెం, వైరా, దేవరకొండ నియోజకవర్గాల్లో బరిలోకి దిగాలని యోచిస్తున్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు.

కూటమికి రెండు స్థానాల్లో ఇంటిపార్టీ దెబ్బ..
మహాకూటమిలో కొనసాగుతున్న మరో పార్టీ తెలంగాణ ఇంటి పార్టీ రెండు స్థానాలను ఖచ్చితంగా ఆశిస్తోంది. అయితే ఇంటి పార్టీకి రెండు స్థానాలను ఇచ్చేందుకు కాంగ్రెస్ తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. నల్లగొండ జిల్లాలో చెరుకు సుధాకర్‌కు, లేదా ఆయన భార్య చెరుకు లక్ష్మీకి ఏదో ఒక స్థానాన్ని కేటాయించేందుకు మొగ్గు చూపుతోంది. కానీ ఆ పార్టీ ఉపాధ్యక్షుడు యన్నం శ్రీనివాస్‌రెడ్డి మహబూబ్‌నగర్ టికెట్‌ను ఆశిస్తున్నారు. వీరిద్దరూ బలమైన నాయకులు కావడంతో ఆ నియోజకవర్గాల్లో వీరిని కాదని మహాకూటమి నుంచి ఎవరికీ టికెట్ ఇచ్చినా.. గెలుపు కష్టమే అవుతుంది. నకిరేకల్ నియోజకవర్గానికి సంబంధించి గత ఎన్నికల్లో ఇలాంటి ఫలితమే పునరావృతమైంది.వణుకు పుట్టిస్తున్న సర్వేలు 

Updated By ManamThu, 10/18/2018 - 04:53
 • అధికార, ప్రతిపక్షాల్లోనూ అదే దిగులు

 • ప్రజాభిప్రాయం వెంట పార్టీల పరుగులు

 • ఓటర్ల ఆశలకు తగ్గ వ్యూహ రచనలు, హామీలు

 • పైకి ధీమాలు... లోలోపల భయాలు.. 

 • అయినా గెలుపు మాదేనంటున్న పార్టీలు

electionsహైదరాబాద్: ఎన్నికల సర్వేలు రాజకీయ పార్టీల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. సర్వేల్లో వస్తున్న ప్రజాభిప్రాయాన్ని చూసి రాజకీయ నాయకులు బెంబేలెత్తిపోతున్నారు. ప్రజల నాడి పసికట్టడంలో విఫలమవుతున్నామా? అనే ఆందోళనతో రాజకీయ పక్షాలు తల పట్టుకుంటున్నాయి. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోని పక్షంలో తమ రాజకీయ మనుగడ  ప్రశ్నార్ధకం అవుతుందనే  బెంగతో నాయకులు పరిపరివిధాలుగా, పలువురితో మంతనాలు సాగిస్తున్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో మరో పర్యాయం కూడా పాలించే అవకాశం తమకే లభిస్తుందని టీఆర్‌ఎస్ ధీమా వ్యక్తం చేస్తుంది. కాంగ్రెస్ ఇస్తేనే తెలంగాణ వచ్చిం దని ఢంకా భజాయించి వాదిస్తున్న కాంగ్రెస్ కూడా ఎన్నికల్లో గెలిచి అధికారం చేజిక్కించుకుంటామనే విశ్వాసంతో ఉంది. తెలంగాణ  ముందస్తు ఎన్నికల నేప థ్యంలో ఎప్పటి లాగానే అనేక సంస్ధలు సర్వేలు జరిపాయి. వీటికి తోడు రాజకీయ పార్టీలు కూడా సర్వేలు జరిపించుకుంటున్నాయి. కొన్ని స్వచ్చంద సంస్ధలు  ప్రజల నాడి పరిగట్టేందుకు ప్రయత్నించాయి.

మ్యాజిక్ ఫిగర్‌కు దూరంలో పార్టీలు...
రాజకీయ పార్టీ జరిపించుకున్న సర్వేలు, స్వతంత్ర సంస్ధలు జరిపిన సర్వేలు ఏవీ కూడా ఏ ఒక్క రాజకీయ పార్టీకి ప్రజాభిప్రాయం అనుకూలంగా ఉందని చెప్పలేక పోయాయి. అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్, అధికారం కోసం తహతహలాడుతున్న కాంగ్రెస్ పార్టీలు అధికారానికి చేరువలో ఉన్నా,  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌కు దగ్గరలో లేవని సర్వేలు తేల్చడంతో గుండెలు గుభేలుమంటూండగా, ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు కొత్తకొత్త ఎత్తులు వేస్తున్నాయి. వ్యూహాత్మకంగా కదులుతున్నాయి. ఆచరణ సాధ్యం కాదని గతంలో ప్రకటించిన హామీలు కూడా సాధ్యమేననే ధీమాతో ప్రజలకు హామీలు కురిపిస్తున్నాయి. రైతులు, నిరుద్యోగులు, మహిళలు, వృత్తిదారులను ప్రసన్నం చేసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ ఒకడుగు ముందుకేసి నిరుద్యోగ భృతిని ప్రకటించింది. గతంలో  నిరుద్యోగులను గుర్తించడానికి నిర్వచనమేమిటని ప్రశ్నించిన ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఇంటింటి సర్వే ప్రకారం నిరుద్యోగులను గుర్తించడానికి అవకాశం ఏర్పడినందున భృతిని ప్రకటించడం జరుగుతుందని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా మరో అడుగు ముందుకేసింది. రైతులకు ఒకే సారి రెండు లక్షల రూపాయల రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. ఇదే విధంగా ఖజానాపై భారం గురించి ఆలోచించకుండా రాజకీయ పక్షాలు ఎన్నికల హామీలు గుప్పించడానికి భయపెడుతున్న సర్వేల ఫలితాలే కారణమని అంటున్నారు. ఇటు టీఆర్‌ఎస్ భవన్, అటు గాంధీ భవన్‌లో సర్వేల పైన ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. శాస్త్రీయ సర్వేలలో మంచి అనుభవం ఉన్న ఢిల్లీకి చెందిన  సంస్ధ ఒకటి ఇటీవలి కాలంలో తెలంగాణ ఎన్నికలపై సర్వే జరిపింది. ప్రతి నియోజక వర్గంలో సుమారు 200 శాంపిల్స్‌తో ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. నిపుణుల పర్యవేక్షణలో ఈ సర్వే జరిగిందంటున్నారు. పక్కా  తటస్ధంగా, నిష్పక్షపాతంగా, ప్రొఫెషనల్ టీమ్ సర్వేలో పాల్గొందని తెలిసింది. ఈ సర్వే ఫలితాలను టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పరిశీలించారని అత్యంత విశ్వసనీయ వర్గాలు ధృవీకరించాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌కు టీఆర్‌ఎస్ కాస్త దూరంగా ఉందనే వాస్తవాన్ని కేసీఆర్ ఆధ్యయనం చేశారు. దానికి గల కారణాలను కూడా పరిశీలించారు. తగు వ్యూహాలను రచించే పనిలో పడ్డారు.

మహాకూటమి ప్రకటనైపె టీఆర్‌ఎస్ కలవరం
మహాకూటమి ప్రకటన తర్వాత ప్రత్యామ్నాయ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పెరిగిందనే అంశం కేసీఆర్‌ను కలవరానికి గురి చేసిందంటున్నారు. నిరుద్యోగ యువత టీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉందని గుర్తించారు. రైతుబంధు పథకం కింద ఇచ్చిన డబ్బు వ్యవసాయానికి కాకుండా, కుటుంబ అవసరాలకు వినియోగిస్తున్నారని సర్వే వెల్లడించింది. కేసీఆర్ కొత్త హామీలు ఇవ్వడానికి ఢిల్లీకి చెందిన సర్వే సంస్ధ వెల్లడించిన సమాచారమే ప్రధాన కారణం అంటున్నారు. ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా స్వతంత్రంగా సర్వేలు జరిపించింది, నిష్పక్షపాత సంస్ధలతో  ప్రజాభిప్రాయం సేకరించింది. నియోజక వర్గాల వారీగా జరిపిన సర్వేలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారనే అభిప్రాయం వెలుగులోకి రావడంతో సిద్ధ్దాంతాలు, విధానాలకు అతీతంగా ‘కేసీఆర్‌కు హఠావో - తెలంగాణకు బచావో’ అనే నినాదంతో టీడీపి, సిిపీఐ, టీజేఎస్‌లను కలుపుకొని పోవాలని నిర్ణయించింది. దీంతో ప్రజల్లో కాంగ్రెస్ పట్ల ఆదరణ పెరిగిందని, టీఆర్‌ఎస్ గ్రాఫ్ కొంత ఊగిసలాటలో పడిపోయిందని అంటున్నారు.

రైతులు,నిరుద్యోగులు,మహిళలపై గురి
రైతులు, నిరుద్యోగులు, మహిళలు,  వికలాంగులను లక్ష్యంగా చేసుకొని అన్ని రాజకీయ పక్షాలు మేనిఫెస్టోలను రూపొందించుకుంటున్నాయి. తాయిలాలతోనే ఓట్లు పొందాలని పావులు కదుపుతున్నాయి. తిరిగి అధికారంలోకి వస్తాం.. వంద సీట్లకు తక్కువ కాకుండా గెలుస్తాం.. కాంగ్రెస్ గల్లంతు కావడం ఖాయం.. అంటూ ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టీఆర్‌ఎస్ అధినేత కూడా ఇటీవలి కాలంలో ప్రజాభిప్రాయం చూసి ఒకడుగు వెనుకకు వేయడం తప్పలేదని సర్వేలను విశ్లేషిస్తున్న నిపుణులు అభిప్రాయపడుతున్నారు. శాసనసభ రద్దు నాటి పరిస్థితులు - కాంగ్రెస్ సారథ్యంలో కూటమి ఏర్పడిన తర్వాతి పరిస్ధితులను బేరీజు వేస్తున్నారు. ఎన్నికలకు అనే సరికి అంతా ఆలోచిస్తుంటారు.  పార్టీలు, విధానాలు, హామీలు, వాటి అమలుపై రాజకీయ పక్షాల చిత్తశుద్ధిని పరిగణనలోకి తీసుకుంటారు. టీఆర్‌ఎస్ ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించడం, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ ఏకం కావడంతో ఓటర్లు సమాలోచనలో పడ్డారని అంటున్నారు. అందువల్లనే ఇటీవలి సర్వేలలో వెలుగు చూసిన మ్యాజిక్ ఫిగర్ అంశం సర్వత్రా చర్చనీయాంశమైంది.22న రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల బృందం రాక

Updated By ManamWed, 10/17/2018 - 03:12
 • పరిస్థితుల అధ్యయనం, అధికారులతో సమీక్షలు

 • రాజకీయ పార్టీలతో సమావేశం.. మూడు రోజుల పర్యటన

electionsహైదరాబాద్: తెలంగాణలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ నెల 22న కేంద్ర ఎన్నికల సంఘం బృందం  రాష్ట్రానికి రానుంది.  మూడు రోజుల పాటు తెలంగాణలో పర్యటించి ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించనుంది. 22న రాజకీయ పార్టీల ప్రతి నిధులతో సమావేశమవుతుంది. అనంతరం సీఈవో, అధికారులతో పరిస్థితులపై సమీక్ష నిర్వహించనుంది.  23న అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో  సమావేశం జరగనుంది. 24న సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో భేటీ అవుతుంది. 22న  కేంద్ర ఎన్నికల సంఘం బృందం హైదరాబాద్ చేరుకున్న వెంటనే రాజకీయ పార్టీలు, సీఈవో, రాష్ట్ర పోలీసు నోడల్ అధికారులతో భేటీ కాబోతుంది. 23వ తేదీ ఉదయం డీఈవోలు, ఎస్పీలు, డిఐజిలు, ఐజిలతో సమావేశమవుతారు. 24న సీఎస్‌తో పాటు డీజీ (ఐటి) ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో  సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం మీడియాతో మాట్లాడి ఢిల్లీకి బయలుదేరి వెళతారు.22 నుంచి తెలంగాణలో ఈసీ బృందం పర్యటన

Updated By ManamTue, 10/16/2018 - 20:07
Election Commission to visit telangana on Oct 22

హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికలు  జరగనున్న నేపథ్యంలో ఈ నెల 22న కేంద్ర ఎన్నికల  సంఘం బృందం  రాష్ట్రానికి రానుంది. మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించి ఎన్నికల ఏర్పాట్లపై  సమీక్షించనుంది.  22న రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం కానుంది.  అనంతరం సీఈవో, అధికారులతో  సమీక్ష నిర్వహించనుంది.

 23న అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో  సమావేశం జరగనుంది. 24న సీఎ్జస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో భేటీ అవుతుంది. 22న  కేంద్ర ఎన్నికల సంఘం బృందం హైదరాబాద్ చేరుకున్న వెంటనే రాజకీయ పార్టీలు, సీఈవో, రాష్ట్ర పోలీసు నోడల్ అధికారులతో భేటీ కాబోతుంది. 23న ఉదయం డీఈవోలు, ఎస్పీలు, డిఐజిలు, ఐజిలతో భేటీ అవుతుంది. 24న సీఎస్‌తో పాటు డీజీ (ఐటి) ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో  సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం మీడియాతో మాట్లాడి ఢిల్లీకి బయలుదేరి వెళనుంది.2.61 కోట్ల మంది ఓటర్లు?

Updated By ManamWed, 10/10/2018 - 00:10
 • 2014 కంటే సుమారు 20 లక్షలు తగ్గుదల

 • డూప్లికేట్ల తొలగింపు, ఏరివేతలకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్..

 •  ఓటరు జాబితాను ఫైనల్‌జేసిన ఎన్నికల సంఘం.. 

 • 12న హైకోర్టుకు సమర్పించనున్న అధికారులు

electionsహైదరాబాద్: తెలంగాణ ఓటర్ల జాబితా తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఈ నెల 12న జాబితా కోర్టుకు సమర్పించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. డూప్లికేట్ ఓట్లను, రెండుమూడు చోట్ల ఓటును కలిగి ఉండడం, ఓకే ఇంట్లో పరిమితికి మించి ఓట్లుండడం వంటి వాటిని గుర్తించడంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఇలాంటివన్నీ సవరించి ఎన్నికల అధికారులు జాబితాను ఫైనల్ చేశారు. 2014లో తెలంగాణలో ఓటర్ల సంఖ్య 2.81 కోట్లు కాగా  మార్పులు, చేర్పులు, ఏరివేతలు, డూప్లికేట్ల తొలగింపుల అనంతరం ఈ సంఖ్య 2.61 కోట్లకు కుదించుకుపోయింది. 2018  ఓటరు జాబితాలో  కోటీ 32లక్షల 69వేల 695మంది పురుషులు, కోటీ 28లక్షలా 68వేలా 324 మంది స్త్రీలు, 2,439 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. 2014లో పురుషులు కోటీ 43లక్షలా 82వేలా 661 కాగా మహిళలు కోటీ 37 లక్షలా 81వేలా 276 మంది ఉన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారి ఓట్ల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంత కాలం ఆంధ్ర ప్రాంతానికి చెందిన అనేక మంది హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని సొంత ఊరుతో పాటు హైదరాబాద్‌లోనూ ఓటు హక్కును కలిగి ఉన్నారు. వీటిని పరిగణలోకి తీసుకుని సాంకేతిక ఆధారంగా పేర్లను గుర్తించారు. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్లగొండ జిల్లాల పరిధిలోనే సుమారు 20లక్షలా 33వేలా 597 మంది ఓటర్లను గుర్తించారు. వారందరిని ఇంటింటి సర్వేలో కలుసుకొని వారు కోరుకున్న చోట ఓటు హక్కు పొందే ఏర్పాటు చేశారు.  స్వగ్రామంలో రేషన్ కార్డు, శాశ్వత చిరునామా, ఇతర అవసరాల కోసం ఓటరు జాబితాలో పేర్లు కొనసాగిస్తూనే విద్య, ఉపాధి, వ్యాపారం కోసం హైదరాబాద్ వచ్చి స్థిరపడిన వారు ఇక్కడ కూడా ఓటరుగా నమోదయ్యారు. అలాంటి వారిని కూడా ఎన్నికల సంఘం గుర్తించింది. ఇంటింటి సర్వే జరిపి వారు కోరుకున్న చోట ఓటరుగా కొనసాగే అవకాశం కల్పించింది. దీంతో ఓటర్ల సంఖ్య 2.81 కోట్ల నుండి 2.61 కోట్లకు పడిపోయింది. ఇటీవలి కాలంలో కొత్తవారు కూడా ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వారందరి పేర్లు ఈ నెల 12న విడుదల కానున్న తుది జాబితాలో ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇక మీదట ఓటరు జాబితాలో డూప్లికేట్ ఓటుకు అవకాశం ఉండబోదని, ఏదో ఒక చోట మాత్రమే ఓటు హక్కు కలిగి ఉండే అవకాశం ఉంటుందని తెలియచేశారు. రాబోవు కాలంలో ఓటరు బదిలీకి కూడా అవకాశం  మెరగుపడబోతుందని పేర్కొన్నారు.  కోరుకున్న చోటికి తమ ఓటు హక్కును బదిలీ చేయించుకునే వెసులుబాటుపై విసృత ప్రచారం నిర్వహించబోతున్నామని ఉన్నతాధికారులు తెలిపారు.  

ప్రతి ఓటరుకు ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ఆధారంగా చేర్పులు, మార్పులు, ఓటరు బదిలీ సులభం అవుతుంది అని తెలిపారు. కారణ మంటూ లేకుండా ఓటరు జాబితా నుండి పేర్లు తొలగించబడవన్నారు. ఇప్పటికే ఓటర్ల  నుండి వస్తున్న ఫిర్యాదులు, ఆర్జీలను పరిశీలించి సవర ణలు కొనసాగిస్తున్నామని తెలిపారు. ఎన్నికల అధికారులు  నియోజక వర్గాల వారిగా ఓటరు జాబితాలను ఇప్పటికే సిద్ధం చేశారు. తుది జాబి తాను 12న హైకోర్టుకు సమర్పించబోతున్నారు. కోర్టు అనుమతితో అధికారికంగా ఓటరు జాబితాను విడుదల చేయడం జరుగుతుంది. ఓటరు జాబితాపై అభ్యంతరాలను అధికారులు పరిశీలించారు. హై కోర్టుకు తమ వివరణను నివేదించారు. కోర్టు తమ నివేదికతో తృప్తి చెందుతుందనే ఆశాభావంతో ఉన్నారు. ఓటరుగా పేరు నమోదు చేసు కోవడానికి, చేర్పులు, మార్పులకు అవకాశం ఉన్నందున ఓటర్లు ఆన్‌లైన్ లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చంటున్నారు. నామినేషన్లు దాఖలు చేయడానికి పది రోజుల ముందు వరకు ఓటరుగా తమ పేర్లను నమో దు చేసుకోవడానికి ప్రజలకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఓటరు నమోదు, అభ్యంతరాల పరిశీలన నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు.  ఉద్ధ్దేశపూర్వకంగా ఓటరు జాబితాలో పేర్లు తొలగించడం జరగదన్నారు. సరికొత్త సాంకేతికత అందుబాటులోకి రావడంతో డూప్లికేట్ ఓటర్లను గుర్తించామని పేర్కొన్నారు. ఒక వ్యక్తి రెండు మూడు చోట్ల ఓటు హక్కు ను కలిగి ఉన్న సంఘటనలు కూడా వెలుగు చూశాయని అధికారులు తెలిపారు. ప్రతి ఓటరుకు ఒక నెంబర్ ఉంటుందని, ఆన్‌లైన్‌లో ఆ నెంబర్ ద్వారా వివరాలు తెలుసుకొనే అవకాశం ఉందంటి వివరించారు.ఒపీనియన్ పోల్స్ నిజమయ్యేనా!

Updated By ManamMon, 10/08/2018 - 22:26
 • గత సర్వేలు ఫలితాలను ప్రతిబింబించాయా?

 • రెండు రాష్ట్రాల్లో సర్వేల తీరు ఎలా?

semi-finalన్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల మూడ్ వచ్చింది. కొన్ని సంస్థలు సర్వేలు నిర్వహించడంలో తలమునకలయ్యాయి. మరికొన్ని సంస్థలు ఇప్పటికే ‘ఇదిగో ఒపీనియన్ పోల్స్’  అంటూ వివరాలను విడుదల చేశాయి. మరి.. 2013లో మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఒపీనియన్ పోల్స్ ఏమన్నాయి.. వాస్తవ ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే...

రాజస్థాన్ (2013 ఎన్నికలప్పుడు ఒపీనియన్ పోల్స్)
సర్వే సంస్థ                        బీజేపీ                      కాంగ్రెస్                   ఇతరులు
హెడ్‌లైన్స్ టుడే-
సీ ఓటర్                             97                          79                        24               
టైమ్స్ నౌ-
ఇండియా టీవీ-
సీ ఓటర్                            118                          64                     18                           
సీఎన్‌ఎన్‌ఐబీఎన్-
ది వీక్-
సీఎస్‌డీఎస్                   115-125                   60 -  68                12-20          
వాస్తవ ఫలితాలు:                  163                        21                     16             

మధ్యప్రదేశ్ (2013 ఎన్నికలప్పుడు ఒపీనియన్‌పోల్స్)
సర్వే సంస్థ                         బీజేపీ               కాంగ్రెస్            బీఎస్పీ        ఇతరులు
ఇండియా టుడే                     143                  78                  -                9
ఏబీపీన్యూస్-
దైనిక్‌భాస్కర్-
నీల్సన్                               155                    65                 -              10
సీఎస్‌డీఎస్-
సీఎన్‌ఎన్-
ది వీక్                               148-160         52-62            3-7          10-18

వాస్తవ ఫలితాలు:                   165                  58              4                 3కశ్మీర్‌లో పోటెత్తిన ఓటర్లు

Updated By ManamMon, 10/08/2018 - 22:06

kashmirకశ్మీర్: వేర్పాటువాదుల పిలుపులు.. ఉగ్రవాదుల హెచ్చరికలు.. ఇవేవీ పట్టించకోకుండా జమ్ముకశ్మీర్ ప్రజలు పెద్ద సంఖ్యలో తొలిదశ మునిసిపల్ ఎన్నికల్లో పాల్గొన్నారు. ఈ ఎన్నికలను పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ), సీపీఎం, బీఎస్పీ వంటి పార్టీలు బహిష్కరించినా.. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సోమవారం జమ్ముకశ్మీర్‌లో తొలిదశ మునిసిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జమ్ము, పూంచ్, రాజౌరి, లేహ్, కార్గిల్, లడక్ ప్రాంతాల్లో ఎన్నికలు విజయవంతంగా ముగిశాయని అధికారులు తెలిపారు. వేర్పాటువాదులు, ఉగ్రవాదుల హెచ్చరికలను ప్రజలు పట్టించుకోకుండా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. ఎన్నికలకోసం కనీవినీ ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. 11 జిల్లాల్లోని 321 మునిసిపల్ వార్డులకు తొలిదశలో ఎన్నికలు జరిగాయి. 1,204 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. జమ్ము మునిసిపల్ కార్పొరేషన్‌లో సాయంత్రం 3 గంటలకు 60.6 శాతం, పూంచ్ జిల్లాలోని 26 వార్డుల్లో 70.9 శాతం, లేహ్‌లో 51.6 శాతం పోలింగ్ నమోదయింది. 

Related News