elections

కశ్మీర్‌లో పోటెత్తిన ఓటర్లు

Updated By ManamMon, 10/08/2018 - 22:06

kashmirకశ్మీర్: వేర్పాటువాదుల పిలుపులు.. ఉగ్రవాదుల హెచ్చరికలు.. ఇవేవీ పట్టించకోకుండా జమ్ముకశ్మీర్ ప్రజలు పెద్ద సంఖ్యలో తొలిదశ మునిసిపల్ ఎన్నికల్లో పాల్గొన్నారు. ఈ ఎన్నికలను పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ), సీపీఎం, బీఎస్పీ వంటి పార్టీలు బహిష్కరించినా.. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సోమవారం జమ్ముకశ్మీర్‌లో తొలిదశ మునిసిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జమ్ము, పూంచ్, రాజౌరి, లేహ్, కార్గిల్, లడక్ ప్రాంతాల్లో ఎన్నికలు విజయవంతంగా ముగిశాయని అధికారులు తెలిపారు. వేర్పాటువాదులు, ఉగ్రవాదుల హెచ్చరికలను ప్రజలు పట్టించుకోకుండా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. ఎన్నికలకోసం కనీవినీ ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. 11 జిల్లాల్లోని 321 మునిసిపల్ వార్డులకు తొలిదశలో ఎన్నికలు జరిగాయి. 1,204 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. జమ్ము మునిసిపల్ కార్పొరేషన్‌లో సాయంత్రం 3 గంటలకు 60.6 శాతం, పూంచ్ జిల్లాలోని 26 వార్డుల్లో 70.9 శాతం, లేహ్‌లో 51.6 శాతం పోలింగ్ నమోదయింది. నాంపల్లి కోర్టులో కోడెలకు చుక్కెదురు

Updated By ManamThu, 10/04/2018 - 16:50
Kodela sivaprasada rao Must Attend to Nampally Court

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కోడెల శివప్రసాదరావుకు నాంపల్లి కోర్టులో చుక్కెదురు అయింది. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసులో ఈ నెల 10న కోర్టుకు ఆయన స్వయంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. 2014 ఎన్నికల్లో రూ.11 కోట్ల 50 లక్షలు ఖర్చు పెట్టినట్లు తానే స్వయంగా ఓ టెలివిజన్ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పిన అంశాన్ని పిటిషనర్ ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తెచ్చారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను పిటిషనర్ సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి కోర్టుకు సమర్పించారు.

ఎన్నికల నిబంధన ప్రకారం 171 E, F, G, I ఆఫ్ 200 ఐపీసీ కింద కోర్టు విచారణ చేపట్టింది. అంత పెద్ద మొత్తంలో ఖర్చు ఎందుకు పెట్టారు? ఎక్కడ నుంచి వచ్చింది?. ఎవరు పెట్టారో విచారణ జరపాలని పిటిషనర్ ఈ సందర్భంగా కోర్టును కోరారు. అలాగే కోడెల శివప్రసాదరావుకు అంత పెద్ద మొత్తంలో నగదు ఎక్కడ నుంచి వచ్చిందో ఆదాయపు పన్ను శాఖ అధికారులతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. కాగా ఇదే కేసులో కోడెల శివప్రసాదరావు హైకోర్టులో స్టే పొందారు. అయితే గతనెల 27తో స్టే ముగిసింది. దీంతో ఈ నెల 10న నేరుగా కోర్టుకు హాజరు కావాలని కోడెలను ఆదేశించింది. సీన్ మారుతోంది

Updated By ManamTue, 10/02/2018 - 03:46
 • ఎన్నికల నిర్వహణకు పరిస్థితులు సానుకూలం

 • ప్రతి నియోజక వర్గంలో 13 శాతం పెరిగిన ఓటర్లు

 • భద్రాచలం, అశ్వారావు పేటల్లో మాత్రం తగ్గుదల

 • సీఈవో రజత్ కుమార్ వెల్లడి

EVM-Awarenessహైదరాబాద్: మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు. ఇటీవల ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంతో ప్రతి నియోజక వర్గంలో 13 శాతానికి పైగా కొత్త ఓటర్లు చేరారని వెల్లడించారు. సోమవారం తనను కలిసిన మీడియా ప్రతిని ధులతో రజత్ కుమార్ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రాష్ట్రంలోని 4.16 లక్షల దివ్యంగ ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. కళ్లు లేని వారికి బ్రెయిలీ లిపిలో ఓటరు కార్డులు ఇచ్చేందకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కొత్తగా  ఓటు హక్కు కోసం 19.5 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా , 1.5 లక్షల దరఖాస్తులను తిరస్కరించామన్నారు. ఎన్నికల ఏర్పాట్లలో భాగం గా వంద అదనపు పోలింగ్ దరఖాస్తు చేసుకోగా, 1.5 లక్షల దరఖాస్తులను తిరస్కరించామన్నారు. ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా వంద అదనపు పోలింగ్  కేంద్రాలకు సరిపడ  ఈవీఎం లను అందుబాటులో ఉంచడం జరుగు తుందని తెలియచేశారు. ఈ ఆర్ వో నెట్ చాల వేగంగా పని చేస్తుందని రజత్ కుమార్ తెలిపారు. ఎన్నికల సంఘం పారదర్శకంగా పని చేస్తుందని, ప్రతిపక్షాల నుండి అందుతున్న ఫిర్యాదుల పరిశీలన కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తామని పేర్కొన్నారు. నియోజక వర్గాల వారీగా ఓటరు జాబితాను పరిశీలించడం జరుగు తుందని తెలియచేశారు. శాంతి భద్రతల కోసం కేం ద్ర అన్నికల సంఘం ప్రత్యేకంగా అడీషనల్ డీజీని నియమించింద న్నారు. 1950 నెంబర్‌కు రోజుకు 1400 కాల్స్ వస్తున్నాయని తెలిపారు. ఎన్నికల ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని, జిల్లాలు, నియోజక వర్గాల వారిగా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిం చడం జరుగుతుందన్నారు.దక్షిణపై ఫోకస్

Updated By ManamSat, 09/29/2018 - 07:28
 • ఐదు ఉమ్మడి జిల్లాల సీట్లపై టీఆర్‌ఎస్ స్కెచ్

 • సిట్టింగ్‌లను కాపాడుకునే యత్నంలో నాయకగణం

 • కూటమి ఆట కట్టించేందుకు కేసీఆర్ కంకణం

 • ఊరూవాడా ప్రచారం చేస్తున్న గులాబీ దళం

 • ఆశీర్వాదసభలతో ప్రజల చెంతకు శ్రేణులు

trsహైదరాబాద్:  ముందస్తు ఎన్నికల్లో  సెంచరీ కొట్టేందుకు గులాబీ బాస్ కేసీఆర్ తన రాజకీయ అనుభవం రంగరించి విజయ పథంలో నడిచేందుకు పార్టీ ముఖ్యనేతలతో స్కెచ్ వేస్తున్నారు. ఇప్పటికే గులాబీసైన్యం యుద్ద సామాగ్రి సిద్దం చేసుకుని  విప క్షాలతో తలపడేందుకు కాలు దువ్వుతుంది. కూటమి నేతలు అదిరిపోయేలా  ప్రచార హోరుకు నడుం బిగించారు. ఆశీర్వాద సభల పేరుతో గులాబీ నాయకగణం గ్రామాల్లో  ఇప్పటికే ఊరూవాడా గొప్పగా చెప్పుకునేలా దండుకట్టి దరువు వేస్తున్నారు. ప్రచారంలో తామే ముందున్నామని విపక్ష నేతలకు కంటిమీద కనుకు  లేకుండా చేస్తున్నారు. గడిచిన ఎన్నికల్లో ఉత్తర తెలంగాణే టిఆర్‌ఎస్‌కు అధికార పగ్గాలు అందుకునేలా చేసింది.ఊహించని విధంగా అక్కడ ప్రజలు భారీ మెజార్టీతో కారును పరుగులు పెట్టించారు.కానీ దక్షిణ తెలంగాణలో ఆశించిన దానికంటే చాలా తక్కువ సీట్లు రావడం, ప్రతిపక్ష కాంగ్రెస్,టిడిపి ఎక్కువ సీట్లుతో జీర్ణించుకోలేపోయింది.దీంతో ముఖ్యమంత్రి  కేసీఆర్ దక్షిణ తెలంగాణలో పట్టు సాధించేందుకు  నాలుగేండ్ల పాలనలో ఎక్కువ నిధులు మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు కేటాయించారు.ప్రాజెక్టు నిర్మాణం, ఐటీ పార్కులు, పరిశ్రమలు ఏర్పాటు చేసి రైతుల్లో, నిరుద్యోగుల్లో కొంత ఆశలు కల్పించారు.మళ్లీ టిఆర్‌ఎస్ పార్టీకి అధికారం అందిస్తే మరింత అభివద్ది చేస్తామని ప్రచారంలో  హామీలుస్తున్నారు. అసెంబ్లీ రద్దు చేసే ముందు రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్ నిర్వహించిన  భారీ బహిరంగ సభకూడా ఈ ఐదు జిల్లాను దష్టిలో పెట్టుకుని లక్షలాదిమంది ప్రజలను ఆజిల్లాలను తరలించారు.తరువాత ఉత్తర తెలంగాణలోని కరీంనగర్‌లో ఎన్నికల సభ పేరుతో మొదటి సభ  ఆశీర్వాద సభకు శ్రీకారం చుట్టారు.మళ్లీ రెండో సభ నల్లగొండ నుంచే శంఖారావ పూరించనున్నారు.

దక్షిణ తెలంగాణ ఐదు జిల్లాల పరిధిలో 65 అసెంబ్లీ స్దానాలు ఉన్నాయి. అందులో 2014 ఎన్నికల్లో నల్లగొండ నుంచి 6, మహబూబ్‌నగర్ 7, ఖమ్మం 1, రంగారెడ్డి 4, హైదరాబాద్ 1 స్దానాలు కలిపి కారు 19 సీట్లలో ఉనికి చాటుకుంటుంది. మిగతా స్దానాల్లో కాంగ్రెస్, టిడిపిలు అత్యధిక స్దానాలు తమ  ఖాతాలో వేసుకున్నాయి. ప్రభుత్వం కొలువుదీరిన తరువాత టిడిపి నుంచి విజయం సాధించిన అభ్యర్దులు ఏడాదిలో గులాబీ గూటికి చేరారు. ఎక్కువగా రంగారెడ్డి జిల్లా నుంచే చేరికలు ఊపందుకున్నాయి.రాజేంద్రనగర్ నుంచి ప్రకాశ్‌గౌడ్, మహేశ్వరం తీగల క్రిష్ణరెడ్డి, ఇబ్రహింపట్నం మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, శేరిలింగంపల్లి అరికెపూడి గాంధీ, కూకట్‌పల్లి మాధవరం క్రిష్ణారావు,  కాంగ్రెస్ నుంచి చేవేళ్ల ఎమ్మెల్యే  కాలె యాదయ్య గులాబీ తీర్దం పుచ్చుకున్నారు.హైదరాబాద్ జిల్లా  పరిధిలో 15సీట్లు ఉండగా వాటిలో టిఆర్‌ఎస్ సికింద్రాబాద్ సీటు ఒకటే గెలిచింది.తరువాత  సనత్‌నగర్ శాసనసభ్యులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, కంటోన్మెంట్ నుంచి సాయన్న, జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాధ్ తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు.దీంతో గ్రేటర్ పరిధిలో టిఆర్‌ఎస్ బలం  పెరిగింది. అదేసమయంలో జరిగిన జీ హెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఊహించని విధంగా 99 కార్పొరేటర్ స్దానాలు అవలీలగా దక్కించుకుని మేయర్ పీఠం వశం చేసుకుంది. ఖమ్మం జిల్లాలో ఉన్న 10 సీట్లలో సాధారణ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ కొత్తగూడెం నుంచి జలగం వెంకట్రావు మాత్రమే విజయం సాధించారు. కాంగ్రెస్ 4, వైఎస్‌ఆర్‌సీపి 3, టిడిపి, సిపిఐ ఒక స్దానంలో గెలుపొందారు. తరువాత వైసీపి సభ్యులు ముగ్గురు, కాంగ్రెస్ నుంచి 2 టిఆర్‌ఎస్ కండువా కప్పుకున్నారు. పాలేరు సీటు ఖాళీ కావడంతో అక్కడ జరిగిన బై ఎన్నికల్లో కారు ఖాతా తెరిచి తుమ్మల అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 14 స్దానాలుంటే వాటిలో టిఆర్‌ఎస్ 7, కాంగ్రెస్ 5, టిడిపి 2సీట్లు దక్కించుకుంది. వాటిలో కాంగ్రెస్ నుంచి గెలిచిన చిట్టెం రామ్మోహన్‌రెడ్డి , టిడిపి సభ్యులు రాజేందర్ రెడ్డి కేసిఆర్ పంచనచేరారు.నల్లగొండ జిల్లాలో 12 శాసనసభ స్దానాలుండగా వాటిలో గులాబీ 6సీట్లు, కాంగ్రెస్ 5, సిపిఐ 1 స్దానంలో పాగా వేసింది.ఆజిల్లాలో  హస్తం పార్టీ అభ్యర్ది మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు బాస్కర్‌రావు, వామపక్ష సభ్యులు రవీంద్రనాయక్ కారు పార్టీలో కలిసిపోయారు.కానీ ఐదు జిల్లాల పరిధిలోని మూడు జిల్లాలపై పట్టు సాధించిన,నల్లగొండ, పాలమూరు జిల్లాలో పాగా వేయడం గులాబీకి కష్టతరంగా మారింది.ఈరెండుజిల్లాల నుంచి కాంగ్రెస్ పార్టీ దిగ్గజాలు ఉండటంతో కారు వేగంగా పెంచేలేకపోయారు.కానీ ఈసారి ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఆశీర్వాద సభలు ఏర్పాటు చేసి ప్రజలను తమవైపు తిప్పుకుని పాత 40స్దానాలను కాపాడుకోవడంతో పాటు హుజూర్‌నగర్, కోదాడ, నల్లగొండ, నాగార్జునసాగర్, గద్వాల, వనపర్తి, కొండగల్ ,కల్వకుర్తి స్దానాల్లో విజయబావుటా ఎగురవేసి కాంగ్రెస్ సీనియర్లకు చెక్ పెట్టాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ఎన్నికల ప్రచారమంతా మంత్రి కెటిఆర్ భుజాలపై వేసుకుని సత్తా చాటేందుకు ఎత్తులు వేస్తున్నారు. నల్లగొండలో కారు పాచిక పారేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.అందులో భాగంగా మొదటిసారి జరిగిన జిల్లాల అభ్యర్దుల సమావేశం ఉమ్మడి నల్లగొండ అభ్యర్దులతోనే జరిగింది. 12స్దానాలను గెలిపించుకోని రావాలని మంత్రి జగదీష్‌రెడ్డి ,గుత్తాకు ఆదేశించినట్ల పార్టీ వర్గాలు వెల్లడిసున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలు టిఆర్‌ఎస్ మంచి పట్టుంది. విపక్ష పార్టీల కూడా అక్కడ ఆశించి బలం లేదు.ఆ జిల్లాలో తమకు ఢోకాలేదని భావిస్తున్నారు. ఎన్నికల్లో నేరస్తులు పోటీపై కీలక తీర్పు

Updated By ManamTue, 09/25/2018 - 12:09
 • ఛార్జిషీట్ ఆధారంగా అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించలేం

 • పార్లమెంట్ కఠిన చట్టాలు చేయాలి

 • రాజకీయ అవినీతి ఆర్థిక ఉగ్రవాదంతో సమానం

Supreme court says lawmakers facing criminal charges can contest elections

న్యూఢిల్లీ : ఎన్నికల్లో నేరస్తులు పోటీ చేయడంపై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం కీలక తీర్పునిచ్చింది. క్రిమినల్‌ విచారణ ఎదుర్కొంటున్న చట్టసభ సభ్యులు దోషులుగా తేలక ముందే వారిపై అనర్హత వేటు వేయలేమని స్పష్టం చేసింది. కాగా నేరారోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకులను ఎన్నికల్లో పోటీకి నిషేధం లేదా అనర్హత వేటు అనే అంశంపై దాఖలైన వ్యాజ్యంపై న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టింది.

ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులు నమోదైతే వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ  పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌ ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థతో పాటు భాజపా నేత అశ్వనీ కుమార్‌ ఉపాధ్యాయ్‌ దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.  

కేవలం అభియోగాలు నమోదైతే వారిపై అనర్హత వేటు వేయలేమని...క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న నేతలు ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అన్నది పార్లమెంట్‌కే వదిలేస్తున్నామని, దీనిపై పార్లమెంట్‌ ఓ చట్టం తీసుకురావాలని ధర్మాసనం స్పష్టం చేసింది. దీనిపై జోక్యం చేసుకునే అర్హత సుప్రీంకోర్టుకు లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా వ్యాఖ్యానించారు.  రాజకీయ అవినీతి ఆర్థిక ఉగ్రవాదంతో సమానమని ఆయన అభిప్రాయపడ్డారు.15 రోజుల్లో అంతా సిద్ధం

Updated By ManamThu, 09/13/2018 - 04:55
 • ఎన్నికల కసరత్తు సరైన దిశలోనే సాగుతోంది 

 • కేంద్ర ఉప ఎన్నికల ప్రధానాధికారి ఉమేష్ సిన్హా

 • రాష్ట్రంలో ఎన్నికల బృందం పర్యటన ముగిసింది

 • ఎన్నికల నిర్వహణ, సిబ్బంది, బడ్జెట్‌పై సమీక్ష

 • ఎస్‌ఎంఎస్‌తో ఓటరు వివరాలు తెలుసుకోవచ్చు

 • బీఎల్‌వోలు క్షేత్రస్థాయిలో తిరగాలన్న పార్టీలు

electionsహైదరాబాద్: తెలంగాణలో కేంద్ర ఎన్నికల సం ఘం ప్రతినిధుల బృందం పర్యటన బుధ వారంతో ముగిసింది. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమి షనర్ ఉమేష్ సిన్హా నేతృత్వంలోని ఈ బృందం రెండు రోజులుపాటు రాష్ట్రంలో పలు కీలక సమా వేశాలు నిర్వహించింది. ముఖ్యంగా ఎన్నికల నిర్వహణ కీలకంగా ఉండే ఓటర్ల జాబితాపై వివిధ పార్టీల నేతలతో ముందుగా చర్చించిన బృందం వారివారి అభిప్రాయాలతో పాటు ముందస్తు ఎన్నికలను నిర్వహించడంలో ఆయా పార్టీలకున్న అభ్యంతరాలను కూడా సేకరిం చారు. వివిధ  పార్టీలతో చర్చించిన అనంతరం బుధవారం జలమండలిలో 31 జిల్లాల ఉన్నతా దికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల ఎస్పీలు, ఐజీలు, డీఈవోలు పాల్గొన్నారు. ఆరు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో ప్రధానంగా ముందస్తు ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాపై చర్చించారు. దీంతోపాటు జిల్లాల్లో ఎన్నికల సమయంలో సమస్యాత్మక ప్రాంతాలు, శాంతి భద్రతలపై ఎస్పీలతో సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికల్లో వాడే ఈవీఎంలు, వీవీప్యాట్ల వాడకంపై సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. దీంతోపాటు ఈవీఎంల భద్రత, స్టోరేజీ, రవాణాకు కావాల్సిన ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు. ఓటర్లను ప్రలోభపెట్టే అంశాలపై దృష్టి సారించాలన్నారు. అనంతరం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే. జోషి, డీజీపీ మహేందర్ రెడ్డిలతో భేటీ అయి ఎన్నికల నిర్వహణపై కూలంకషగా చర్చించారు. ఎప్పటికప్పుడు సమీక్షించాలని కోరారు. అనంతరం మీడియాతో ఉమేష్ సిన్హా మాట్లాడారు. సీఈఓతో, పోలీస్ అధికారులు, కలెక్టర్లతో సమావేశం నిర్వహించామని, వారి సంసిద్ధత మీద అంచనా వేశామన్నారు. జిల్లా అధికారులు, సీఎస్, డీజీపీలతో కూడా చర్చించామని తెలిపారు.

రాజకీయ పార్టీలతోనూ చర్చించామని, బీఎల్‌వోలు క్షేత్ర స్థాయిలో తిరగాలని రాజకీయ పార్టీలు కోరాయని పేర్కొన్నారు. ఒక్క ఓటరు కూడా మిస్ అవ్వకూడదని, తొలగించిన పేర్ల మీద విచారణ జరపాలని, ఓటరు నమోదు మీద అనేక రూపాల్లో ప్రచారం చేయాలని పార్టీలు కోరినట్టు పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు వివరించిన సమస్యలు పరిగణనలోకి తీసుకున్నామని తెలిపారు. ఇచ్చిన నమోదుకు 15 రోజుల తరువాత సమీక్ష చేస్తామన్నారు. జిల్లా ఎన్నికల అధికారులు ప్రతీ సమస్య మీద 24 గంటలలోపు స్పందించాలని ఆదేశించారు. ఎస్‌ఎంఎస్ ద్వారా కూడా ఓటర్ నమోదు ప్రచారం చేయాలని కోరామన్నారు. బీఎల్‌వో స్థాయి, ఆ పైన అధికారులు కూడా క్షేత్ర స్థాయిలో తిరగాలి అని సూచించినట్టు తెలిపారు. శాంతి, భద్రతలు విషయం, వీవీ ప్యాట్, బ్యాలెట్‌ల విషయంపై కూడా సమీక్షించామని, బడ్జెట్ అంశం కూడా అంచనా వేసినట్టు తెలిపారు. జిల్లా అధికారులు, రాజకీయ పార్టీల సమీక్ష చేసిన అంశాలపై కేంద్రం ఎన్నికల సంఘానికి నివేదిక అందజేస్తామని తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన భద్రాచలంలోని 7 మండలాల్లో ఎన్నికల నిర్వహణ అంశాన్ని తేల్చాలని అన్ని పార్టీలు కోరాయని, ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తామని తెలిపారు. తెలంగాణలో ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం ముందే నిర్ణయించిందనే వాదనను ఖండించారు. ఇక్కడి పరిస్థితులను, ఎన్నికల సాధ్యాసాధ్యాలపై చర్చించేందుకే తమని రాష్ట్రానికి ఈసీఐ పంపిందని స్పష్టం చేశారు. ఇచ్చిన ఓటర్ జాబితాలో పేరు లేనివారుగానీ ఓటర్ జాబితా నుంచి తొలిగించబడిన వారుగానీ అర్హులై ఉంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. జిల్లాలో ఉండే ఎన్నికల సహాయక బృందాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈఆర్వో సిస్టమ్ సరిగా పనిచేసేవిధంగా ఐటీ శాఖ పర్యవేక్షిస్తుందన్నారు. ఓటర్ల జాబితా అందరికీ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఓటర్ల జాబితాలో తప్పులను సరిదిద్దేందుకు, సవరణ చేసేందుకు గడువును ఇచ్చామని తెలిపారు. ప్రజలందరికీ తెలిసేలా ఓటర్‌ల జాబితాపై విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఓటరు జాబితాపై వెంటనే ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహిస్తారని తెలిపారు. ఎక్కడైనా అభ్యంతరాలు ఉంటే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. సీఈఓ దగ్గర నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు వచ్చే 15 రోజుల్లో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్ల ప్రక్రియ ముమ్మరం చేస్తారని పేర్కొన్నారు. ఎస్‌ఎంఎస్ ద్వారా ఓటరు జాబితాలో పేరు ఉందా లేదా అని కనుక్కునే సౌకర్యం కోసం ఎస్‌ఎంఎస్ అన్‌లైన్ గేట్ వే అనే వెబ్‌సైట్‌ను త్వరలో ప్రారంభించనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ కసరత్తు సరైన దిశలో వెళ్తోందని పేర్కొన్నా రు. ఢిల్లీకి వెళ్లిన వెంటనే కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక అందిస్తామని పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడు అనేది కేంద్ర ఎన్నికల కమిషన్ తేల్చుతుందన్నారు. 

సీఈవో కార్యాలయంలో కొత్త పొస్టులు..
రాష్ట్ర ప్రధానాధికారి కార్యాలయంలో 16 కొత్త పొస్టులు మంజూరయ్యాయి. ఒక అదనపు సీఈవో, ఒక సంయుక్త సీఈవో, ఒక అసిస్టెంట్ సెక్రెటరీ,మూడు ఏఎస్‌వో సహా ఇతర పది పోస్టులు మంజూరు చేస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. శాసన సభ ఎన్నికల నేపథ్యంలో పోస్టులు మంజూరు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అదనపు సీఈవోగా జ్యోతి బుద్ధ ప్రకాశ్, సంయుక్త సీఈవోగా సత్యవాణిలను నియమించారు.ఎగుమతిదార్లకు ఊరట

Updated By ManamWed, 09/12/2018 - 22:33

tvన్యూఢిల్లీ: మరమ్మతుల నిమిత్తం దిగుమతి అవసరమయ్యే మొబైల్ ఫోన్‌లు, కలర్ టీవీలు, నిర్దిష్ట వైద్య పరికరాల  వంటి కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువుల ఎగుమతికి సంబంధించి ప్రభుత్వం నిబంధనలను సడలించింది. మరమ్మతుల అనంతరం ఈ వస్తువులను తిరిగి ఎగుమతి చేయాలనే షరతుపై సుంకాలు లేకుండా వాటి దిగుమతికి అనుమతి ఇస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది.   ఎగుమతి చేసిన ఎలక్ట్రానిక్ వస్తువులను, వాటిని ఎగుమతి చేసిన ఏడేళ్ళ లోపల, మరమ్మతుల నిమిత్తం ఇప్పుడు దిగుమతి చేసుకోవచ్చు.  అయితే, వాటిని దిగుమతి చేసుకున్న ఏడాది లోపలే తిరిగి ఎగుమతి చేయవలసి ఉంటుంది.  ఇంతకు ముందు, ఎగుమతి చేసిన వస్తువులను తిరిగి దిగుమతి చేసుకునేందుకు వాటిని ఎగుమతి చేసిన మూడేళ్ల లోపు మాత్రమే అనుమతించేవారు. ఆరు నెలల లోపల వాటికి మరమ్మతులు చేసి తిరిగి  ఎగుమతి చేయాల్సి ఉండేది. జిరాక్స్ పరికరాలు, ప్రింటర్లు, మొబైల్ ఫోన్లు, కలర్ టీవీలు, ఎల్‌సీడీ/ఎల్‌ఈడీ ప్యానెల్‌లతో పాటు వైద్య పరికారాలైన ఈసీజీ, ఎంఆర్‌ఐ, అల్ట్రా సౌండ్ వంటి పరికరాలు వంటివి ఈ నోటిఫికేషన్ పరిధిలోకి వస్తాయి.  మరమ్మతుల నిమిత్తం ఆ వస్తువులను దిగుమతి చేసుకున్నవారు వాటికి మరమ్మతులు చేసిన తర్వాత, లేదా చక్కదిద్దిన తర్వాత, దిగుమతి చేసుకున్న ఏడాదిలోపలే వాటిని తిరిగి ఎగుమతి చేయకపోతే వారు కస్టమ్స్ సుంకాలను చెల్లించాల్సి ఉంటుందని సీబీఐసీ పేర్కొంది. ‘‘ఉత్పత్తుల తయారీ, ఎగుమతిదార్లకు ఇది స్వాగతించదగ్గ పరిణామం. ఎగుమతి చేసిన వస్తువులను మరమ్మతులకు దిగుమతి చేసుకుని తిరిగి ఎగుమతి చేసేందుకు దీర్ఘకాలిక సుంక రహిత సమయం దొరుకుతోంది ’’ అని ఈవై ట్యాక్స్ పార్ట్నర్ అభిషేక్ జైన్ అన్నారు.నవంబర్‌లో ఎన్నికలు?

Updated By ManamMon, 09/10/2018 - 23:54
 • నేడు తెలంగాణకు ఎన్నికల కమిటీ 

 • గుర్తింపు పొందిన పార్టీలతో చర్చలు

 • 12న కలెక్టర్లు, ఎస్పీలు, సీఎస్, డీజీపీతో భేటీ

 • ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల

electionsహైదరాబాద్: నవంబర్  రెండో వారంలో రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు సిద్ధమవడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ నిర్వహణపై దృష్టి సారించింది. ఇప్ప టికే కసరత్తు షురూ చేసింది. నాలుగు ఉత్తరాది రాష్ట్రాలతోపాటు తెలంగాణ లోనూ ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే తెలం గాణలో ఎన్నికలకు అవసరమైన ఈవీ ఎంలు, వీవీప్యాట్లు, సిబ్బంది... తదితర వివరాలను అందజేయాలని సీఈసీ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించారు. దీనితో వివరాలు అందించడానికి సోమవారం సీఈఓ రజత్‌కుమార్ కేంద్ర ఎన్నికల ప్రధానాధికారితో భేటీ అయ్యారు. సీఈసీ ఓపీ రావత్‌తో భేటీ అనంతరం రజత్‌కుమార్ మాట్లాడుతూ... సీఈసీతో సుదీర్ఘంగా చర్చించామని, తెలంగాణలో ఎన్నికల నిర్వహణ, సంసిద్ధత వంటి అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించినట్టు తెలిపారు. వివిధ వివరాలతో కూడిన లిఖిత పూర్వక నివేదికను ఈసీకి ఇచ్చినట్టు చెప్పారు. కేంద్ర ఎన్నికల బృందం మంగళవారం రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో ఆ ఏర్పాట్లపైనా చర్చించినట్లు పేర్కొన్నారు. ఢిల్లీలో ఉన్న తెలంగాణ  ఎన్నికల విభాగానికి చెందిన ఉన్నతాధికారులను కూడా కలిశామన్నారు.

నేడు  రానున్న ఎన్నికల కమిటీ..
అయితే కేంద్ర ఎన్నికల సంఘం హైదరాబాద్‌లో పర్యటించేందుకు ఒక ఉన్నతస్థాయి బృందాన్ని పంపిస్తున్న విషయం విదితమే. సీనియర్ డిప్యూటీ సీఈసీ ఉమేష్ సిన్హా నేతృత్వంలోని టీమ్ మంగళవారం నగరానికి చేరుకోనుంది. పర్యటనలో భాగంగా పలువురితో భేటీ అయి రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు గల అవకాశాలను పరిశీలించి, చీఫ్ ఎలక్షన్ కమిషన్‌కు నివేదిక రూపంలో అందించనుంది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌కు చేరుకోనున్న కేంద్ర ఎన్నికల బృందం తాజ్‌కృష్ణ హోటల్‌లో బస చేయనున్నారు. అదేరోజు సాయంత్రం 6.30 గంటల నుంచి 8.30 వరకు తెలంగాణలో గుర్తింపు పొందిన పొలిటికల్ పార్టీలతో భేటీ కానున్నట్టు సమాచారం. గుర్తింపు పొందిన 9 పార్టీల (టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైసీపీ, సీపీఐ, సీపీఎం, ఎంఐఎం, బీఎస్పీ) నాయకులతో సమావేశమయి ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితాపై చర్చించనున్నారు. చర్చలో ఈవీఎం, వీవీప్యాట్లు, బ్యాలెట్ పేపర్స్‌పై అభిప్రాయాలను సేకరించనున్నారు. రాత్రి 8.30 నుంచి 9.30 పోలీస్‌లు, ఆబ్కారీ శాఖ, సీఈఓలతో సమావేశం నిర్వహిస్తారు. 12వ తేదీన జలమండలి కార్యాలయంలో కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో భేటీ అయి జిల్లాల వారీగా ఎన్నికల నిర్వహణ, సిబ్బందికి శిక్షణ, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. అదేరోజు సాయంత్రం 5 గంటల నుంచి 6.30 వరకు సీఎస్, డీజీపీతో సమావేశమయి ఎన్నికల ఏర్పాట్లపై కూలంకషగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడిస్తారు. ఉమేష్ సిన్హా నేతృత్వంలోని బృందం రాష్ట్రంలో సేకరించిన వివరాలతో కూడిన నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి అందిస్తారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేదానిపై సిన్హా రిపోర్టును బట్టే కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుంది. ఇక ఇప్పటికే రాష్ట్రంలో కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లుకు ఎన్నికల నిర్వహణపై అవగహన కల్పించారు ఎన్నికల స్పెషల్ ఆఫీసర్స్. ఎన్నికల నిర్వహణ కోసం రూ. 308 కోట్లను కేటాయించారు. ఎన్నికల నిర్వహణపై కొన్ని పార్టీలు ఈవీఎంలు సరైనవి అంటే...కొన్ని పార్టీలు మాత్రం బ్యాలెట్  పెడితే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత ఎన్నికలు ఎలా నిర్వహించాలన్నది ఈసీఐ నిర్ణయిస్తుంది. ఈసీఐ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం నడుచుకుంటుంది. అయితే నవంబర్ మూడో వారం వరకే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు సమాచారం. మిగిలిన రాష్ట్రాల కంటే నెల ముందే తెలంగాణలో ఎన్నికలు నిర్వహించాలని ఈసీఐ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశాలన్నీ నామమాత్రంగానే నిర్వహిస్తున్నట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ ఎన్నికల నిర్వహణ తేదీలను ముందే నిర్ణయించినట్టు సమాచారం. దీని బట్టి చూస్తే డిసెంబర్ రెండో వారం వరకు తెలంగాణలో కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టబోయేటట్టుంది. 

కలెక్టర్లతో సీఎస్, డీజీపీ వీడియో కాన్ఫరెన్స్..
ఎన్నికల నిర్వహణ అంశంపై నివేదిక ఇచ్చేందుకు కేంద్ర ఎన్నికల బృందం రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే. జోసి, డీజీపీ మహేందర్‌రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ, సిబ్బందికి శిక్షణ, ఈవీఎం, వీవీప్యాట్ల వాడకం వంటి అంశాలపై కలెక్టర్లతో చర్చించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు.

డిప్యూటీ కలెక్టర్లకు అవగాహన..
ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు, తెలంగాణ సీఈవో రజత్‌కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఈవీఎంలు, వీవీప్యాట్ల వాడకంపై అవగాహన కల్చించారు. మంగళవారం డిప్యూటీ కలెక్టర్లకు డిప్యూటీ సీఈవో సత్యవాణి అవగాహన కల్పించారు. ఈవీఎంలు, వీవీప్యాట్ల వాడకం, ప్రజలకు అవగాహన కల్పించడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. 

ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల..
ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల నిబంధనల మేరకు జిల్లాల్లో సమాచార సేకరణ పూర్తయింది. గడువుకు ముందే ఎన్నికలు జరగనున్న తరుణంలో ఓటర్ల జాబితాల సవరణపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఓటర్ల జాబితా ముసాయిదాను తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 2018 మార్చిలో ప్రకటించిన ఓటర్ల జాబితాకు ఎన్నికల సంఘం సవరణ చేపట్టనుంది. అభ్యంతరాలు, వినతుల స్వీకరణకు 15 రోజులపాటు గడువు విధించింది. ఈనెల 25 వరకు అభ్యంతరాలు, వినతులకు అవకాశం ఇచ్చింది. వచ్చే నెల 8వ తేదీ వరకు తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు. 

ఢిల్లీలో సీఈసీ సమావేశంలో చర్చించిన అంశాలు..
రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ కోసం ఎలక్ట్రోరల్ ఏర్పాటు
అవసరమైన ఈవీఎంలను అందుబాటులో ఉంచడం
వీవీప్యాట్ల వినియోగం
ఎన్నికల సిబ్బంది సన్నద్ధత
శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా జాగ్రత్తలు
మౌలిక వసతుల అంశాలపై చర్చ
ఏడు మండలాల ఓటర్ల అంశం
ప్రతి పక్షాలు లెవనెత్తుతోన్న అభ్యంతరాలు,
కోర్టుల నుంచి ఎదురయ్యే చట్టపరమైన అంశాలపై చర్చ

elections12న తెలంగాణలో ఆజాద్ పర్యటన

Updated By ManamFri, 09/07/2018 - 16:11
Uttam Kumar Reddy

హైదరాబాద్ : తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఈ నెల 12న తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్రువీకరించారు. సంగారెడ్డిలో జరిగే మైనార్టీ సభలో ఆజాద్ పాల్గొంటారని ఆయన శుక్రవారమిక్కడ తెలిపారు. ఈనెల 11 నుంచి 18 వరకూ కాంగ్రెస్ జెండా పండుగ నిర్వహిస్తామన్నారు.

అలాగే వార్ రూమ్‌ను మళ్లీ ప్రారంభిస్తున్నామని, పొత్తుల విషయంలో చర్చలు మొదలుపెడుతున్నామని ఉత్తమ్ వెల్లడించారు.  కాగా ఆజాద్ తెలంగాణ పర్యటన గతంలో వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే వైరల్ ఫీవర్ కారణంగా ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.

అభ్యర్థి ఇంటికే బీ ఫారం..
టికెట్ ఆశించే నేతలు ఢిల్లీకి కానీ, గాంధీభవన్‌కుగానీ రావద్దని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. సర్వే ఆధారంగా అభ్యర్థి ఇంటికే బీ ఫారం పంపుతామని తెలిపారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని ఉత్తమ్ పేర్కొన్నారు. అలాగే ఈ నెల 10న జరిగే భారత్ బంద్‌లో అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ కూడా తమతో కలిసి రావాలని ఆయన కోరారు.

పార్టీ వీడిన వాళ్ల గురించి బాధలేదు..
మాజీ స్పీకర్, కాంగ్రెస్ సీనియర్ నేత సురేష్ రెడ్డి పార్టీ వీడటంపై తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ కుంతియా స్పందించారు. పార్టీని వీడిన వారి గురించి బాధపడాల్సిన అవసరం లేదన్నారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మానసిక స్థితి సరిగా లేకే రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు. కాగా సురేష్ రెడ్డి ఈ నెల 12న కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరనున్నారు. సచివాలయానికి రానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రనేనని ఎద్దేవా చేశారు.అవన్నీ ఊహాగానాలే: రజత్ కుమార్

Updated By ManamWed, 09/05/2018 - 16:02
Telangana Election Commission CEO Rajat Kumar Meet

హైదరాబాద్ : డిసెంబర్‌లో ఎన్నికలు జరుగుతాయంటూ వస్తున్న వార్తలపై తనకు ఎలాంటి సమాచారం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ స్పష్టం చేశారు. ఆయన బుధవారం రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం అయ్యారు. అనంతరం రజత్ కుమర్ మాట్లాడుతూ..ఇవాళ్టి తమ భేటీలో ముందస్తు ఎన్నికలపై ఎలాంటి చర్చ జరపలేదన్నారు.ఈవీఎంల సమస్యలపై చర్చించినట్లు తెలిపారు. 

ముందస్తు ఎన్నికలకు సంబంధించి ఊహాగానాలు మాత్రమేనని, అలా అయితే కేంద్ర ఎన్నికల కమిషన్ తమకు గైడ్‌లైన్స్ ఇస్తుందన్నారు. అయితే షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన ఎన్నికలకు తాము ఇప్పటి నుంచి సన్నద్ధం అవుతున్నట్లు రజత్ కుమార్ తెలిపారు. ఇక ఓటర్ల జాబితా సవరణ జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.

Related News